
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ : నకిలీ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. చిన్నపిల్లలకు ఇచ్చే టెటానస్ వ్యాక్సిన్‌ని ఈ ముఠా రీసైకిల్ చేస్తున్నట్లు బయటపడింది. కాలం చెల్లిన వ్యాక్సిన్‌ని తీసుకొచ్చి కొత్తవ్యాక్సిన్‌గా లేబుల్స్ అంటించి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. కొత్తడేట్‌తో తయారు చేస్తూ నకిలీ వ్యాక్సిన్ ప్రభుత్వానికే విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
అంబర్ పేటలో వ్యాక్సిన్ తయారు చేస్తున్న కర్మాగారంలో అధికారులు సోదాలు నిర్వహించారు. లక్షల సంఖ్యలో నకిలీ వ్యాక్సిన్ బాటిల్స్‌ను సీజ్ చేశారు. యజమానితోపాటు పలువురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.