vaccin
-
ఓపీ చూసి.. మందులు రాసి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నా, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాల్సినంత తీవ్రత ఏమీలేదని వైద్యనిపుణు లు అంటున్నారు. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు బాధితులకు మాదిరిగా ఓపీ(ఔట్ పేషెంట్) చూసి మందులు రాసి ఇంటికి పంపిస్తున్నారు. ఇళ్లల్లోనే ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే సరిపోతుం దని వైద్యులు చెబుతున్నారు. కానీ, కొందరు ప్రముఖులు, సినీనటులు మాత్రం ఆసుపత్రి ఐసోలేషన్ లో ఉండటానికి ఇష్టపడుతున్నారని అంటున్నారు. ఇదేస్థాయిలో సెకండ్‌వేవ్ ఉన్నప్పుడు?: ప్రస్తు తం తెలంగాణలో నమోదైన కేసులతో దాదాపు సమానంగా సెకండ్ వేవ్‌లో గతేడాది ఏప్రిల్‌లో 13న 3,052 కేసులున్నాయి. అప్పుడు యాక్టివ్ కేసు లు 24,131కాగా, 16,118 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. అంటే 67% మంది ఐసోలేషన్ లో ఉంటే, 33% మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. ఆసుపత్రిలో చేరిన ప్రతి నలుగురిలో ముగ్గురు ఆక్సిజన్, ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు క్రియా శీలక కేసులు 22 వేలకుపైగా ఉన్నా, అందులో 10% మంది మాత్రమే ఆసుపత్రిలో ఉన్నారు. మిగిలిన 90% మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అప్పట్లో రోజూ కోవిడ్ రోగుల కోసం 300 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా, ఇప్పుడు కేవలం 30 టన్నులు మాత్రమే అవసరమవుతుంది. సెకండ్ వేవ్‌లో దేశంలో 18 లక్షల క్రియాశీలక కేసులు రావడానికి 36 రోజులు పడితే, ప్రస్తుత థర్డ్‌వేవ్‌లో అన్ని కేసులు రావడానికి 18 రోజులు మాత్రమే పట్టింది. అంటే వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. ♦ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం డెల్టా తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్లో తీవ్రమైన కోవిడ్ వచ్చే అవకాశం 83 శాతం తక్కువ. ♦ డెల్టా కంటే ఒమిక్రాన్‌లో కరోనా వైరస్ లోడ్ గొంతులో 70 రెట్లు అధికం. గొంతులో ఒమిక్రాన్ పునరుత్పత్తి జరుగుతుండగా, డెల్టా వేరియంట్ తన సంతతిని ఊపిరితిత్తుల్లో పెంచుకునేది. అందువల్ల అప్పుడు కేసులు చాలా తీవ్రమయ్యేవి. ♦ ఊపిరితిత్తుల్లోకి వైరస్ చేరిక డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌లో పదిశాతం మాత్రమే ♦ యూకేలో ఒమిక్రాన్‌కు ముందు నమోదైన కరోనా కేసుల్లో రెండు శాతమే రీఇన్ఫెక్షన్ ఉండగా, ఇప్పుడు ఐదు రెట్లు పెరిగింది. ♦వ్యాక్సిన్ వేసుకున్నా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. వ్యాక్సిన్ అనంతర ఇన్ఫెక్షన్లు యూకేలో 84 శాతం ఉన్నాయి. వారంతా రెండుడోసులు తీసుకున్నవారే. ఢిల్లీలో 68 శాతం ఒమిక్రాన్ కేసులకు చెందినవారంతా రెండుడోసులు తీసుకున్నవారే. అందులో వారిలో 61 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు. ♦ ఢిల్లీ ప్రభుత్వ విశ్లేషణ ప్రకారం... ఒమిక్రాన్‌తో చనిపోయినవారిలో 92 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే. వైరస్ వ్యాప్తిని టీకా ఆపలేకపోయినా... మరణాలను ఆపుతుంది. -
ఆశల దీపాలు వెలిగిద్దాం
వెలుతురు కావాలి జీవితాల్లో. చీకటిని దూరంగా నెట్టేయాలి. చేదు జ్ఞాపకాలని చెరిపేయాలి. వేదనను తరిమికొట్టాలి. కోవిడ్ కాలంలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పరోక్షంగా సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఎందరో ఆప్తులు రోజుల తరబడి ఆస్పత్రుల్లో ఉండి దక్కుతారా లేదా అని ప్రాణాలు ఉగ్గబట్టేలా చేశారు. కోవిడ్ బారిన పడి విజేతలైన వారందరికీ ఇది ఆనందమయ దీపావళి. అందుకే దీనిని అద్భుతమైన జ్ఞాపకంగా మలుచుకోవాలి. సంబరాల వెన్నముద్దల్ని వెలిగించాలి. హ్యాపీ దీపావళి. ఆ రోజులు ఇక వద్దనే వద్దు. అలాంటి రోజులు ఇక మీదట ఎవరికీ వద్దు. అలా అనుకుని సంకల్పం చేసుకుని ప్రతి ముంగిలిలో ఒక దీపం వెలిగించాలి ఈ పండక్కు. ఆ భయం ఇక ఎవరికీ రాకూడదు. టెస్ట్‌ల కోసం బారులు తీరిన ఎదురు చూపులు ఎదురు పడకూడదు. ల్యాబ్‌లకు పరిగెత్తి పోవడాలు.. సిటి స్కాన్లను అదురుతున్న గుండెలతో పరిశీలించడాలు... ఆస్పత్రి బిల్లులకై హైరానాలు... దొరకని మందుల కోసం కార్చిన కన్నీళ్లు... పునరావృత్తం కాకూడదని ఆశిస్తూ ఆకాశచువ్వలను ఎగరేయాలి ఈ దీపావళికి. క్రిమి తెచ్చిన చీకటిని దేశమంతా దీపాలతో నింపి ఓడించాలి. అవును. గోరంత దీపమే కొండంత వెలుగు. చిగురంత ఆశ జగమంత వెలుగు. మళ్లీ మళ్లీ చూడాలి దీపావళి కోవిడ్‌ని ఎదిరించి విజేతలైన వారు ఇవాళ కోట్లలో ఉన్నారు. అలా విజేతలు కావడానికి కోవిడ్‌ని ఓడించడానికి వారు పెద్ద యుద్ధమే చేశారు. కొందరు అతి సులువుగా గెలిచారు. మరికొందరు చాలా కష్టపడి విజయహాసం చేయగలిగారు. కోవిడ్ నుంచి బయటపడినా ఎన్నో చికాకుల్లో ఉన్నవారు నేడు ఉన్నారు. చోటా మోటా ఆరోగ్య సమస్యలు వారిని వేధిస్తున్నాయి. ఈ దీపావళి నాడు అలాంటి మన కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు తప్పనిసరిగా ఉత్సాహభరితమైన దీపావళి శుభాకాంక్షలు చెప్పాలి. ఈ దీపావళిని చూశాం... మున్ముందు మరిన్ని దీపావళులను మనందరం చూస్తాం... ఒక దశను దాటాం... అంతిమ విజయాన్ని కూడా చూస్తాం అని ధైర్య వచనాలతో శుభాకాంక్షలు చెప్పాలి. కానుకలు ఇచ్చి వారిని ఉత్సాహ పరచాలి. కోవిడ్ సమయంలో ప్రత్యక్ష సహాయం చేయలేకపోవచ్చు. కాని ఇప్పుడు ఒకరికి ఒకరున్నాం అని చెప్పగలగాలి. వారి కోసం మిఠాయి డబ్బాలతో పాటు, కొత్త వస్త్రాలతో పాటు, కొద్ది పాటి భరోసాను ఇస్తే అది నిజమైన దీపావళి. సమూహ దీపావళి. సందర్భ దీపావళి. వేక్సిన్ దీపావళి నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి సంహరించాడు. ఆయుధాలు లేకుండా దుష్ట సంహారం జరగదు. స్త్రీ పురుషులు కలవకుండా కొన్ని చెడులు నాశనం కావు. ఇప్పుడు ప్రతి ఇంటి భార్యాభర్తలు బాధ్యతగా ఉండి వేక్సిన్ అనే ఆయుధంతో కోవిడ్‌పై కుటుంబానికి విజయాన్ని సిద్ధింప చేయాలి. నిజమైన వెలుతురు ఇంటికి రావాలంటే నిజమైన వెలుతురు కింద మనం ఉన్నామని ధైర్యం కలగాలంటే కుటుంబంలోని అందరూ వేక్సిన్ వేసుకున్నారా లేదా అని ఈ పండగ సందర్భంగా చెక్ చేసుకోవాలి. ఒక్క డోస్ కూడా వేసుకోని వారిని వెంటనే కదిల్చి తీసుకెళ్లాలి. రెండోడోస్ అక్కర్లేదనుకుని పాలుమారిన వారిని ఒక్క డోస్‌తో నరకాసురుడు సగమే చస్తాడని చెప్పి పూర్తి చేయించాలి. రెండు డోస్‌ల వేక్సిన్ వేయించుకున్నాక కలిగే సురక్ష భావనలో ఈ దీపావళి జరుపుకుంటే ఆ కళ వేరు. ఆ కాంతి వేరు. బాలల దీపావళి పిల్లలు చిచ్చుబుడ్లు. భలే వెలుగుతారు. వారు నవ్వితే వెలుతురు పూలు పూస్తాయి. అలాంటి బాలలకు ఇంకా పూర్తి రక్షణ దొరకలేదు. వేక్సిన్ కనుచూపు మేరలో ఉంది. మరోవైపు స్కూళ్ల వారు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ సందర్భంలో ప్రమాదకరమైన టపాకాయలకు వారిని దూరం పెట్టినట్టుగా కోవిడ్ నుంచి దూరం పెట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ వారికి పదే పదే చెప్పాలి. వారి కోసం జాగ్రత్తలు పదే పదే పాటించాలి. నిజానికి వారు అలసిపోయి ఉన్నారు. విసిగిపోయి ఉన్నారు. దీపావళి వారి పండగ. వారికి ఈ సమయంలో ఆటవిడుపు ఇచ్చి వారితో సమయం గడపాలి. బంధువుల్లో, తెలిసినవారిలో ఎవరైనా పిల్లలు దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల్లో ఎవరినో ఒకరిని కోల్పోయి ఉంటే అలాంటి పిల్లల్లో తప్పక ఆశను నింపాలి. వారికి కావల్సిన కానుకలిచ్చి సంతోష పెట్టాలి. వారి చేతుల్లో తప్పక ఒక దీపావళి టపాసు పెట్టాలి. సమాజ దీపావళి కోవిడ్ ఇంకా ముగిసిపోలేదు. ఆ పాము తోక ముడిచిందో లేదో తెలియదు. మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుకుంటే మన వెలుతురు సమాజ వెలుతురు కలిసి స్వస్థ కాంతి అవుతుంది. కోవిడ్ జాగ్రత్తలు మరి కొన్నాళ్లు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించి మన ద్వారా ముప్పు పెరగకుండా ఉండాలని సంకల్పం చెప్పుకుంటూ దివ్వెను వెలిగించాలి. అంతే కాదు... ఈ సందర్భంలో రకరకాల చిక్కుల్లో ఉన్నవారికి చేతనైన సహాయం చేయడం అవసరం అని భావించాలి. చేయాలి. దీపావళి అంటే ఒక దివ్వె నుంచి ఇంకో దివ్వె వెలగడం. మనిషిగా మనం సాటి వారి కోసం కొంచెమైనా వెలుగు ఇవ్వగలిగితే అదే ఈ కాలంలో మానవీయ దీపావళి. కోవిడ్ ఇంకా ముగిసిపోలేదు. ఆ పాము తోక ముడిచిందో లేదో తెలియదు. మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుకుంటే మన వెలుతురు సమాజ వెలుతురు కలిసి స్వస్థ కాంతి అవుతుంది. కోవిడ్ జాగ్రత్తలు మరి కొన్నాళ్లు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించి మన ద్వారా ముప్పు పెరగకుండా ఉండాలని సంకల్పం చెప్పుకుంటూ దివ్వెను వెలిగించాలి. -
సెప్టెంబర్ చివరి నాటికి జైకోవ్–డీ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: సెప్టెంబర్ మాసం మధ్య సమయానికి లేదా నెల పూర్తయ్యేలోపు జైకోవ్–డీ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని జైడస్ క్యాడిలా తెలిపింది. వ్యాక్సిన్ ధరను రానున్న రెండు వారాల్లోగా వెల్లడిస్తామని జైడస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ షర్విల్ పటేల్ చెప్పారు. మూడు డోసుల నీడిల్–ఫ్రీ జైకోవ్–డీ వ్యాక్సిన్‌కు కేంద్రం అత్యవసర అనుమతులు ఇవ్వడం తెల్సిందే. 12–18 ఏళ్ల మధ్య వారికి అందుబాటులోకి రానున్న మొదటి టీకా ఇదే. సెప్టెంబర్ చివరినాటికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని సంస్థ వెల్లడించింది. అక్టోబర్ నాటికి కోటి డోసులను, జనవరి నాటికి 4–5 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగలమని ఆశిస్తున్నట్లు పేర్కొంది. దేశం వెలుపల కూడా పలు కంపెనీలతో కలసి భారీగా ఉత్పత్తి చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచంలోనే మొదటి డీఎన్ఏ వ్యాక్సిన్‌గా జైకోవ్–డీ పేరొందిన సంగతి తెలిసిందే. సంవత్సరానికి 10–12 కోట్ల డోసులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. -
రెండో డోస్ టీకా వేయించుకోని 3.86 కోట్ల మంది
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల రెండో డోస్‌ను నిర్ణీత సమయంలో వేయించుకోని వారు 3.86 కోట్ల మంది ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం వరకు దేశంలో 44,22,85,854 మంది కోవిడ్ టీకా మొదటి డోస్ తీసుకోగా, 12,59,07,443 మంది రెండో డోస్ వేయించుకున్నట్లు వివరించింది. కోవిడ్‌ను సమర్థంగా అడ్డుకునేందుకు మొదటి డోస్ తీసుకున్న తర్వాత కోవిషీల్డ్ టీకా అయితే 84–112 రోజుల్లో, కోవాగ్జిన్ 28–42 రోజుల మధ్య రెండో డోస్ తీసుకోవాలి. ఆగస్టు 17వ తేదీ నాటికి దేశంలో కోవిషీల్డ్ టీకా మొదటి డోస్ తీసుకుని, రెండో డోస్‌ను ప్రభుత్వం సూచించిన సమయంలో తీసుకోని వారు కోవిడ్ పోర్టల్ వివరాలను బట్టి 3,40,72,993 మంది ఉన్నట్లు తెలిపింది. కోవాగ్జిన్ మొదటి డోస్ వేయించుకుని, సకాలంలో రెండో డోస్ వేయించుకోని వారు 46,78,406 మంది ఉన్నారు. రెండో డోస్‌ను ఎప్పుడు వేయించుకోవాలో సూచించామనీ, అయితే, సకాలంలో రెండో డోస్ తీసుకోని వారు మళ్లీ రెండు డోస్‌లు తీసుకోవాలా అనే విషయంలో తామెలాంటి సూచనలు చేయలేదని పేర్కొంది. -
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి..!
-
మహిళే మొదట వ్యాక్సిన్‌కి చేయూత
షీ జెంగ్లీ.. కరోనాను కనిపెట్టిన మహిళ. శైలజ.. కరోనా నుంచి అలెర్ట్ చేసిన మహిళ. జెన్నిఫర్.. వ్యాక్సిన్‌కు ప్రయోగమైన మహిళ. కరోనా మొదలు నుంచి.. తుదికి చేరుతున్న ప్రతి దశలోనూ మహిళ! ఇప్పుడు ప్రతి దేశంలోనూ.. వ్యాక్సిన్‌కి చేయూత అవుతున్నదీ మహిళే! రెండువేల పందొమ్మిది డిసెంబరులో కోవిడ్–19 వస్తే, రెండువేల ఇరవై డిసెంబర్‌కి కోవిడ్–19 వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ రావడం అంటే మానవాళి పునర్జన్మించడమే. ఆ జన్మకు తొలి పొత్తిలి పట్టిన మహిళ మార్గరెట్ కీనన్! 90 ఏళ్ల బ్రిటిష్ బామ్మ గారు ఆమె. బ్రిటన్‌లోనే కాదు, ప్రపంచంలోనే తొలిసారి వ్యాక్సిన్‌కి చెయ్యి పట్టిన తొలి మహిళ మార్గరెట్. అందరికన్నా ముందు టీకా వేయించుకుని డిసెంబర్ తొలివారంలోనే లోకానికి నూతన çసంవత్సరాన్ని తీసుకొచ్చారు మార్గరెట్. ఆ తర్వాత మిగతా దేశాల్లోనూ వ్యాక్సిన్లు సిద్ధమయ్యాయి. యు.ఎస్., స్విట్లర్జాండ్, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, రష్యా దేశాలు తాము కనిపెట్టిన వ్యాక్సిన్‌ను తమ పౌరులకు ఇచ్చాయి. ఈ దేశాలన్నిటిలోనూ తొలి వ్యాక్సిన్ షాట్‌ను తీసుకున్నది మహిళలే కావడం యావత్ ప్రపంచం మహిళలకు తలవొంచి నమస్కరించవలసిన మరొక సందర్భం. కోవిడ్–19 వ్యాక్సిన్‌ను కనిపెట్టే తొలి రోజుల్లో ప్రయోగాలు జరిగిందీ మహిళల మీదే, కనిపెట్టాక ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటున్నదీ మహిళలే. టీకాను ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించింది మహిళావని. అందుకే వారికి నమస్కరించాలి. మార్గరెట్ : బ్రిటన్ మార్గరెట్ కీనన్ తీసుకున్నది ఫైజర్–బయోన్టెక్ వ్యాక్సిన్. తన తొంభయ్యవ పుట్టినరోజుకు వారం ముందు ఆమె వ్యాక్సిన్‌కు నిస్సంకోచంగా భుజమిచ్చారు. ప్రపంచ ప్రజలకు అభయం ఇవ్వడమే అది. మధ్య ఇంగ్లండ్‌లోని కోవెంట్రీ నగరంలో ఉంటారు ఆమె. బంగారు ఆభరణాల దుకాణంలో కొన్నేళ్ల క్రితం వరకు సహాయకురాలుగా పని చేశారు. కూతురు. కొడుకు. నలుగురు మనవలు, మనవరాళ్లు. నిన్న కొత్త సంవత్సరాన్ని పిల్లలతో, తన స్నేహితులతో సంతోషంగా గడిపారు. డిసెంబర్లో వ్యాక్సిన్ తొలి షాట్ తీసుకున్న 21 రోజుల తర్వాత గత వారం రెండో ‘బూస్టర్ జాబ్’ చేయించుకున్నారు మార్గరెట్. శాండ్రా : ఆమెరికా ఆమెరికా తన తొలి వ్యాక్సిన్‌ని శాండ్రా శారా లిండ్సేకు ఇచ్చింది. శాండ్రా క్రిటికల్ కేర్ నర్సు. జమైకా–అమెరికా సంతతి యువతి. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఉన్న ‘లాంగ్ ఐలాండ్ జెవిష్ మెడికల్ సెంటర్’లో వైద్య సేవికగా పని చేశారు. కొత్త వ్యాక్సిన్ అంటే అందర్లో భయం ఉంటుంది. ఆ భయం పోగొట్టడానికే శాండ్రా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆమె తీసుకున్నదీ ఫైజర్ వ్యాక్సిన్నే. పేరు తెలియనివ్వని మహిళ : స్విట్జర్లాండ్ ఫొటోలో మీరు చూస్తున్నది పేరు తెలియనివ్వని ఆ మహిళనే. వయసు 90 ఏళ్లు. స్విట్జర్లాండ్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న తొలి సిటిజెన్. స్విస్ మిలిటరీ దాదాపుగా పది లక్షల డోస్‌లను దేశమంతటా పంపిణీ చేసింది. ఆ డోస్‌లు మొదట లాసెర్న్, అప్పెన్జెల్ ఇన్నర్ రోడ్స్ ప్రాంతాలకు సరఫరా అయ్యాయి. ఆ ప్రాంతంలోని నర్సింగ్, కేర్ హోమ్‌లో ఉండేవారికి వ్యాక్సిన్ వేసేందుకు వెళ్లిన వైద్య కార్యకర్తలకు ఈ పేరు తెలియనివ్వని మహిళ చిరునవ్వుతో ఎదురెళ్లి మరీ చెయ్యిపట్టారు. ఎడిత్ క్వాయ్జెల్లా : జర్మనీ ఎడిత్ వయసు 101 ఏళ్లు. ఆరోగ్యంగా ఉన్నారు. జర్మనీలో అందరికన్నా ముందుగా ఆమే ఉత్సాహంగా వ్యాక్సిన్ తీసుకున్నారు! అదీ ఫైజర్ వాళ్లదే. బెర్లిన్‌లోని వృద్ధుల ఆరోగ్య సంరక్షణాలయంలో ఉంటున్నారు ఎడిత్. డిసెంబర్ 26 అందులోని నలభై మంది వ్యాక్సిన్‌కు ముందుకొస్తే వారందరికన్నా ముందు వేయించుకున్నది ఎడిత్తే. శాక్సోనీ అన్హాల్ట్లోని హార్జ్ పర్వత ప్రాంత సమీపంలో ఉన్న హల్బెర్ట్స్టాడ్ ఆమె జన్మస్థలం. పది లక్షలకు పైగా వాక్సిన్ డోస్‌లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న జర్మనీ ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించడంలో మొదట వృద్ధులకు ప్రాధాన్యం ఇస్తోంది. గున్–బ్రిట్ జాన్సన్: స్వీడన్ స్వీడన్లో తొలి డోస్ అందుకున్నవారు గున్ బ్రిట్. ఆమె వయసు 91 ఏళ్లు. రాజధాని స్టాక్హోమ్కి, గోథెన్బర్గ్ నగరానికి మధ్య ఉండే ఎమ్జోల్బీ పట్టణంలోని ఒక వృద్ధాశ్రమంలో ఉంటారు బ్రిట్. ‘‘నాక్కాస్త గొప్పగానే ఉంది. మానవ ప్రయత్నాల మీద నాకసలు సందేహమే రాదు. చక్కగా వ్యాక్సిన్ వేయించుకున్నాను కనుక చక్కగా పనిచేస్తుంది’’ అంటున్నారు. అధికారులు ఆమెకు వ్యాక్సిన్ వేసిన తర్వాత చెప్పారట.. స్వీడన్లో కోవిడ్ వ్యాక్సిన్ మొదట తనకే వేసినట్లు! ‘‘ఆశ్చర్యపోయాను’ అని నవ్వుతున్నారు. ఇప్పుడామె తన మనవళ్లు, ముని మనవళ్లను కరోనా బెరుకు లేకుండా కలుసుకో గలుతున్నారట. 2021 జూన్ నాటికి దేశంలోని వృద్ధులందరికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే సంకల్ప బలంతో ఉంది స్వీడన్ ప్రభుత్వం. మ్యారిసెట్: ఫ్రాన్స్ పారిస్ శివార్లలోని సెవ్రాన్ పట్టణంలో ఉన్న రీనీ–మారెట్ ఆసుపత్రిలో తొలి వ్యాక్సిన్‌ను 78 ఏళ్ల మ్యారిసెట్ తీసుకున్నారు. ‘‘నేను కదిలిపోయాను తెలుసా..!’ అని ఉద్వేగంతో అంటున్నారు మ్యారిసెట్. ఫ్రాన్స్‌లో మొదట సెవ్రాన్, డిజాన్ ప్రాంతాలలో వ్యాక్సిన్ వేసే కార్యక్రమం మొదలైంది. అందరిలో మొదట మ్యారిసెట్కే వ్యాక్సిన్ అందింది. అందుకే ఆమెకంత భావోద్వేగం. ఈ ప్రారంభ వేడుకను (వేడుకే గా మరి) ట్వీట్ చేస్తూ.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రాన్ ‘వైరస్‌ను ఎదుర్కొడానికి మనకు అందివచ్చిన కొత్త ఆయుధం.. వ్యాక్సిన్’ అని సంతోషం వ్యక్తం చేశారు. యానీ లించ్: ఐర్లాండ్ ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో దేశవ్యాప్త వ్యాక్సినేషన్ కార్యక్రమం 79 ఏళ్ల యానీ లించ్‌తో మొదలైంది. పదిమంది మనవల బామ్మగారు యానీ. కరోనా భయంతో ఇన్నాళ్లూ ఆమె వారికి ఎక్కడ అంటిస్తానోనని దూరంగా ఉన్నారు. సెయింట్ జేమ్స్ ఆసుపత్రిలో తన కుటుంబ సభ్యులు వెంట రాగా సంబరంగా వ్యాక్సిన్ వేయించుకున్నారు యానీ. ‘‘ఐర్లండ్‌లో తొలి డోస్‌ను వేయించుకున్న వ్యక్తిగా నా పేరు చరిత్రలో నిలిచిపోతుందంటే సంతోషమే కదా..’’ అంటున్నారు. వాస్తవానికి ఆమె తన మనవల్ని దగ్గరకు తీసుకోవడం కోసమే వ్యాక్సిన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారట. రష్యాలో తొలి వ్యాక్సిన్ పుతిన్ కుమార్తె వేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఏ కుమార్‌తో వెల్లడి కాలేదు. పుతిన్‌కి ఎకతెరీనా పుతీనా, మారియా పుతీనా అనే కుమార్తెలు ఉన్నారు. ప్రయోగాల దశలో కూడా పుతిన్ కుమార్తె వాక్సిన్ పని తీరు తెలుసుకోవడం కోసం సహకరించారని అన్నారు కానీ ఇద్దరిలో ఎవరన్నది నేటికీ బయటికి పొక్కలేదు. వేయించుకున్నవారికి కొంచెం జ్వరం వచ్చిందనైతే మాత్రం పుతిన్ మాటల్లోనే తెలిసింది. -
ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అమెరికా ఓకే
వాషింగ్టన్ : అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య నిపుణుల ప్రత్యేక సలహా మండలి సిఫారసు చేసింది. ఈ వ్యాక్సిన్ వినియోగానికి ఇవ్వాల్సిన అనుమతులపై ఎనిమిది గంటల సేపు చర్చించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్స్ (ఎఫ్‌డీఏ), వ్యాక్సిన్స్ అండ్ రిలేటెడ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ అడ్వయిజరీ కమిటీ (వీఆర్‌బీపీఏసీ) 17–4 ఓట్లతో వ్యాక్సిన్ వినియోగానికి ఆమోద ముద్ర వేసింది. ఫైజర్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై ఆందోళనలున్న నేపథ్యంలో అత్యవసర వినియోగానికి అనుమతుల్లో జాప్యం జరుగుతుందన్న ప్రచారానికి ఎఫ్‌డీఏ తెర దించింది. లాంఛనంగా ఎఫ్‌డీఏ ఆమోదం పొందాక వచ్చే వారం నుంచి అమెరికాలో భారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు. -
45,000 శిఖరంపైకి సెన్సెక్స్
ముంబై: ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశ నిర్ణయాలు మార్కెట్‌ను మెప్పించాయి. మూడోసారి వడ్డీరేట్లను మార్చకపోవడంతో పాటు జీడీపీ వృద్ధి అంచనాలను సవరించడంతో శుక్రవారమూ సూచీల రికార్డు ర్యాలీ కొనసాగింది. సెనెక్స్ 447 పాయింట్ల లాభంతో తొలిసారి 45వేల పైన 45,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 13,259 వద్ద ముగిసింది. వచ్చే ఏడాది మొదట్లోనే కోవిడ్–19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాని మోదీ ప్రకటనతో మార్కెట్ సెంటిమెంట్ మరింత మెరుగుపడింది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించేందుకు ఆర్బీఐ మొగ్గుచూపడంతో బ్యాంకింగ్, రియల్టీ, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. వృద్ధి అంచనాలను సవరించడంతో ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు ర్యాలీ చేశాయి. వ్యాక్సిన్‌పై సానుకూల వార్తలతో ఫార్మా షేర్లు రాణించాయి. బంధన్ బ్యాంక్, ఎస్బీఐ, ఆర్బీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 4.50 శాతం నుంచి 2 శాతం లాభపడ్డాయి. బీఎస్ఈ బ్యాంక్ ఇండెక్స్ 2శాతం లాభంతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 515 పాయింట్లు ఎగసి 45,148 వద్ద, నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 13,280 వద్ద వద్ద ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీ అంశం తెరపైకి రావడంతో పాటు ఫైజర్, బయోటెక్‌లు రూపొందించిన కోవిడ్–19 వ్యాక్సిన్‌కు బ్రిటన్ ఆమోదం తెలపడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. నిఫ్టీకి వారం మొత్తం లాభాలే... ఈ వారం మొత్తం నిఫ్టీకి లాభాలొచ్చాయి. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం సెలవుతో నాలుగురోజులు జరిగిన ట్రేడింగ్‌లో నిఫ్టీ మొత్తం 289 పాయింట్లను ఆర్జించింది. ఇదేవారంలో ఒకరోజు నష్టంతో ముగిసిన సెనెక్స్ మొత్తం 930 పాయింట్లు లాభపడింది. ఆల్ట్రాటెక్ సిమెంట్ 4శాతం జంప్... అల్ట్రాటెక్ సిమెంట్ షేరు శుక్రవారం బీఎస్ఈలో 4% లాభంతో ముగిసింది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే రూ.5,477 కోట్ల వ్యయ ప్రణాళికకు బోర్డు అనుమతి లభించినట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 6.25 శాతం పెరిగి రూ.5,198 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4 శాతం లాభంతో రూ.5,093 వద్ద స్థిరపడింది. రూ.1.25 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద... సూచీల రికార్డు పర్వం కొనసాగడంతో ఇన్వెస్టర్లు భారీ లాభాల్ని మూటగట్టుకున్నారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే రూ. 1.25 లక్షల కోట్లు ఎగసి రూ.179.49 లక్షల కోట్లకు చేరుకుంది. -
ప్రపంచానికి పెను సవాలు.. కరోనా
న్యూఢిల్లీ/రియాద్: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదుర్కొటున్న అతిపెద్ద సవాలు కరోనా వైరస్ అని ప్రధాని మోదీ జీ20 సదస్సులో వ్యాఖ్యానించారు. సౌదీ వేదికగా శనివారం జరిగిన ఈ సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. మానవ చరిత్రను మలుపు తిప్పే ఘటన కరోనా అని చెబుతూ, కరోనానంతర కాలంలో రెండు విషయాలు ప్రధానమైనవన్నారు. మొదటగా ఎక్కడినుంచైనా పని చేయడం (వర్క్ ఫ్రం ఎనీవేర్) ఇప్పుడు కొత్త విధానంగా మారిందన్నారు. ఈ సందర్భంగా జీ20 వర్చువల్ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. రెండవదిగా.. నాలుగు అంశాలపై ప్రపంచం దృష్టి సారించాలని చెప్పారు. నైపుణ్యాలను భారీగా సృష్టించడం, సమాజంలోని అన్ని వర్గాల వారికి సాంకేతికత చేరేలా చూడటం, ప్రభుత్వ విధానాల్లో పాదర్శకత, పర్యావరణ పరిరక్షణ వంటి వాటిని అనుసరించాలని అన్నారు. కొత్త ప్రపంచ నిర్మాణానికి ఈ జీ20 సదస్సు పునాది కావాలని ఆకాంక్షించారు. మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి పారదర్శకత సాయపడుతుందని అన్నారు. అనంతరం కరోనా నుంచి కోలుకొని ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడంపై పలువురు నేతలతో చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్ చేశారు. చర్చల ద్వారా పరిష్కారం: జిన్‌పింగ్ పరస్పర గౌరవం, సమానత్వం, ప్రయోజనాల ప్రాతిపదికన అన్ని దేశాలతో శాంతియుత సంబంధాలకు సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. జీ 20 సదస్సులో శుక్రవారం ఆయన ప్రసంగించారు. చర్చల ద్వారా భిన్నాభిప్రాయాలను తొలగించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేయాల్సి ఉందన్నారు. కోవిడ్‌ను తరిమికొట్టేందుకు అన్ని దేశాలు ఐక్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీ సమర్ధవంతంగా జరిగేందుకు వనరులను ఉపయోగించుకొనేలా ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహకరించాలని కోరారు. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ప్రపంచానికి తోడ్పడతామని చెప్పారు. కరోనా నేపథ్యంలో పేద దేశాలకు చైనా నిధులిచ్చేందుకు వీలుగా నిబంధనలను సవరిస్తున్నామన్నారు. సౌదీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో అమెరికా, చైనా, భారత్, టర్కీ, ఫ్రాన్స్, యూకే, బ్రెజిల్ వంటి పలు దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సును తొలిసారి నిర్వహించనున్న అరబ్ దేశంగా సౌదీ నిలవనుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం ట్రంప్ పాల్గొం టున్న అంతర్జాతీయ సదస్సు కూడా ఇదే. -
కొనసాగుతున్న రికార్డులు..
ముంబై: ఫార్మా, మెటల్, ఆటో షేర్ల ర్యాలీతో సూచీలు ఎనిమిదోరోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు పెరిగి 43,594 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లను ఆర్జించి 12,749 వద్ద స్థిరపడ్డాయి. దీంతో సూచీల రికార్డుల పర్వం మూడోరోజూ కొనసాగినట్లయింది. దేశంలో పది కీలక రంగాల్లో ఉత్పత్తిని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్రం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం(పీఎల్ఐ)కు ఆమోదం తెలపడంతో సంబంధిత రంగాల్లో విస్తృతంగా కొనుగోళ్లు జరిగాయి. అలాగే ఫైజర్ కంపెనీ రూపొందించిన కోవిడ్ –19 వ్యాక్సిన్ విజయవంతం ఆశలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 431 పాయింట్లు పెరిగి 43, 708 వద్ద, నిఫ్టీ 139 పాయింట్ల 12,770 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఇంట్రాడేలో అమ్మకాలు... లాభాలతో మొదలైన మార్కెట్లో తొలి గంటలో కొనుగోళ్లు కొనసాగాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిచూపారు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ట్రేడర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్, ఇంధన, మీడియా రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా మిడ్‌సెషన్ కల్లా సెన్సెక్స్ ఇంట్రాడే(43,708) నుంచి ఏకంగా 738 పాయింట్ల కోల్పోగా, నిఫ్టీ డే హై నుంచి 200 పాయింట్లు పడింది. 4 శాతం నష్టపోయిన రిలయన్స్... ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు బుధవారం 4 శాతం నష్టపోయి రూ. 1979 వద్ద స్థిరపడింది. ఎమ్ఎస్సీఐ ఇండెక్స్ రివ్యూలో రిలయన్స్ షేరుకు వెయిటేజీ తగ్గించడంతో అమ్మకాలు తలెత్తాయి. గ్లాండ్ ఫార్మా ఐపీఓకు 2 రెట్ల స్పందన హైదరాబాద్: గ్లాండ్ ఫార్మా ఐపీఓ చివరిరోజు ముగిసేసరికి 2.05 రెట్లు్ల ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఇష్యూలో భాగంగా కంపెనీ జారీ చేసిన మొత్తం 3.50 కోట్ల షేర్లకు గానూ 6.21 కోట్ల బిడ్లు ధాఖలయ్యాయి. ఇందులో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల (క్యూఐబీ) విభాగం 6.40 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్ఐఐ)విభాగం 51 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 24 శాతం సబ్‌స్క్రైబ్ అయినట్లు ఎన్ఎస్ఈ గణాంకాలు తెలిపాయి. రూ.6,480 కోట్ల సమీకరణ లక్ష్యంగా ఐపీఓకు వచ్చిన ఇష్యూ ఈ నవంబర్ 9 న ప్రారంభమైంది. -
మా వ్యాక్సిన్‌తో 90శాతం ఫలితాలు..
న్యూయార్క్: కరోనాను ఎదుర్కోవడానికి అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, యూరోప్‌కు చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని ఆ కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా చెప్పారు. తమ ఫలితాలు తెలిసిన నేటి రోజు సైన్సుకూ, మానవాళికి చాలా మంచి రోజు అని అభిప్రాయపడ్డారు. మూడో దశ ప్రయోగం వల్ల తమ వ్యాక్సిన్ కరోనాను అడ్డుకుంటోందని తెలుస్తోందని చెప్పారు. ప్రపంచానికి అత్యవసరమైన కరోనా వ్యాక్సిన్ త్వరలోనే తమ నుంచి వచ్చే వకాశం ఉందని తెలిపారు. బయోఎన్‌టెక్ సీఈఓ ఉగుర్ సాహిన్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో దాడి చేస్తున్న నేపథ్యంలో ఈ ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పారు. ఫైజల్, బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జూలై 27న ప్రారంభమైంది. మొత్తం 38,955 మందికి నవంబర్ 8 నాటికి వ్యాక్సిన్ ఇచ్చారు. రెండో, మూడో దశ ప్రయోగాల్లో వచ్చిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించినట్లు తెలిపాయి. అయితే, పరిశీలన పూర్తయ్యే నాటికి ఈ డేటా మారే అవకాశం ఉందని ఫైజర్ కంపెనీ ఉపాధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఈ యేడాది చివరి నాటికి టీకా వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఫైజర్ భారత్‌కు వచ్చేనా ? తాజా పరిణామంతో ఫైజర్ టీకాను భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ జాతీయ నిపుణుల బృందం ఫైజర్ ప్రతినిదులను కలసి చర్చించినట్లు సమాచారం. భారత్‌లో దీన్ని డెలివరీ చేయించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ఈ బృందం పరిశీలిస్తోంది. 45 వేల కేసులు.. భారత్‌లో గత 24 గంటల్లో 45,903 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కు చేరుకుంది. గత 24 గంటల్లో 490 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 1,26,611. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 79,17,373కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 5,09,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన 9 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమీక్ష జరిపారు. అమెరికాలో ఆగమేఘాలపై టీకా తయారీ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ట్రంప్ అధికారంలోంచి దిగిపోయేందుకు ముందుగానే ఓ అద్భుతాన్ని సృష్టించనున్నారా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఎఫ్‌డీఏ అనుమతి రాకమునుపే కోట్లాది కోవిడ్–19 టీకాలు ఫ్యాక్టరీల్లో సిద్ధమైపోతున్నాయి. ‘‘ఆపరేషన్ వార్ప్ స్పీడ్’’ కోవిడ్ టీకా తయారీని వేగవంతం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరు ఇది. అమెరికన్ పౌరులు 30 కోట్ల మందికి టీకా అందించే లక్ష్యంతో మొదలైన ఆపరేషన్ వార్ప్ స్పీడ్‌కు నేతృత్వం వహించింది ఓ ఆర్మీ జనరల్. ఈ ఏడాది మేలోనే రిటైర్ కావాల్సిన ఓ ఆర్మీ జనరల్! పేరు గస్ పెర్నా. టీకా తయారీకి సంబంధించిన వీడియోలు సీబీఎస్ టీవీ ప్రసారం చేయడంతో ఇప్పుడు గస్ పెర్నా పేరు మారుమోగిపోతోంది. -
తగ్గుతున్న కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ/లండన్: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 50 వేల లోపే నమోదవుతోంది. గత 24 గంటల్లో 43,893 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,90,322కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 508 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,20,010కు చేరుకుందని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 72,59,509కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,10,803గా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు 90.85శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.50గా ఉంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా సోకింది. తొలి టీకాలు అంతంతమాత్రమే కరోనా వైరస్ నియంత్రణ కోసం అభివృద్ధి చేస్తున్న తొలి తరం వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో అందరికీ పనిచేసే అవకాశాలు తక్కువేనని కోవిడ్ వ్యాక్సిన్లపై యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ అధ్యక్షుడు కేట్ బింగమ్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌పై అతిగా ఆశలు పెంచుకోవడం కంటే.. నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నివారించడం చాలా ముఖ్యమని తెలిపారు. వ్యాక్సిన్ తయారీ, సేకరణ, పంపిణీ వంటి అంశాలపై కేట్ ద లాన్సెట్ కోసం రాసిన కథనంలో ఈ విషయాలను పేర్కొన్నారు. తొలి తరం వ్యాక్సిన్ల సమర్థతపై సందేహాలు ఉన్న నేపథ్యంలో అవి వ్యాధిని నియంత్రించకపోయినా లక్షణాలు తగ్గిస్తుందని, అందరికీ అన్నివేళలా పనిచేయదు అన్న వాస్తవానికి సిద్ధమై ఉండాలని అన్నారు. అరవై ఐదేళ్ల పైబడ్డ వృద్ధుల్లోనూ రోగ నిరోధక వ్యవస్థ స్పందనను కలుగ చేసే టీకాలపై తాము దృష్టి కేంద్రీకరించామని, కోవిడ్ కారణంగా మరణించిన వారిలో మూడొంతుల మంది ఈ వయసు వారేనని ఆమె పేర్కొన్నారు. సనోఫి, గ్లాక్సో స్మిత్ క్లైన్ ఔషధ తయారీ సంస్థలు 20 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను కోవాక్స్ ఫెసిలిటీకి అందించడానికి అంగీకరించాయి. కోవాక్స్ ఫెసిలిటీ అన్ని దేశాలకూ సమానంగా కరోనా వ్యాక్సిన్లను అందించే వ్యవస్థ. సనోఫి, జీఎస్కె ప్రయోగాలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఈ సంవత్సరం చివరినాటికి మూడో దశ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఆ కంపెనీలు తెలిపాయి. పేద దేశాల్లో మరణాలు తక్కువ పుణే: అన్ని వసతులు ఉన్న ధనిక దేశాలతో పోల్చుకుంటే, తక్కువ పరిశుభ్రత, తక్కువ పారిశుద్ధ్యం, సురక్షిత నీటి సరఫరాలేని దేశాల్లోనే కోవిడ్ 19 మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు భారతీయ పరిశోధకులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ (ఎన్‌సీసీఎస్), చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్లకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దీన్ని మెడ్రిక్సివ్ అనే జర్నల్‌లో ప్రచురిం చారు. వీరు 106 దేశాల్లో జనాభా సంఖ్య, ప్రస్తుతం ఉన్న వ్యాధులు, బీసీజీ వ్యాక్సి నేషన్, పారిశుద్ధ్యం, ప్రతి పది లక్షలకు కోవిడ్ మరణాలు లాంటి 25 నుంచి 30 ప్రమా ణాలను పరిగణనలోనికి తీసుకొని ఈ అధ్యయనం చేశారు. ధనిక దేశాల్లో కోవిడ్ బారిన పడేవారి సంఖ్య తక్కువాదాయ దేశాలకంటే ఎక్కువగా ఉందన్నారు. -
కోవిడ్-19 : వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యం గురించిన డేటా అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. సండే సంవాద్‌లో తన ఫాలోయర్లతో ప్రతి వారం జరిపే సంప్రదింపుల్లో భాగంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం పలు వ్యాక్సిన్లు తొలి, మలి, మూడవ దశ పరీక్షలు జరిపే దశలో ఉన్నాయని, ఈ పరీక్షల ఫలితాలు వ్యాక్సిన్ వ్యూహాన్ని నిర్ధారించడంలో ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు. వైరస్ సోకే ముప్పున్న వ్యక్తులతో పాటు వైరస్ కారణంగా మరణించే అవకాశాలు అధికంగా ఉన్న గ్రూపులకు ముందుగా వ్యాక్సిన్ అందిస్తామని మంత్రి తెలిపారు. చదవండి : 70 శాతం మందికి వ్యాక్సిన్ అందేది అప్పుడే! వ్యాక్సిన్ల అందుబాటు ఆధారంగా పలు కోవిడ్-19 వ్యాక్సిన్లను సమీకరించే సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. సీఎస్ఐఆర్-ఐజీఐబీ అభివృద్ధి చేసిన ఫెలుదా పేపర్ స్ర్టిప్ పరీక్షను మరికొద్ది వారాల్లో దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామని చెప్పారు. కోవిడ్-19ను గుర్తించడంలో దీనికి 98 శాతం కచ్చితత్వం ఉన్నట్టు ప్రయోగ పరీక్షల్లో వెల్లడైందని తెలిపారు. ఇక రానున్న పండగ సీజన్లో ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడరాదని, ఇది వైరస్ వ్యాప్తిని పెంచుతుందని మంత్రి హెచ్చరించారు. -
నిర్ణయాధికారం లేకుండా ఇంకా ఎన్నాళ్లు ?
ఐక్యరాజ్య సమితి: ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌ను ఐక్యరాజ్యసమితి (యూఎన్) భద్రతా మండలిలో నిర్ణయాధికారానికి దూరంగా ఇంకా ఎన్నాళ్లు ఉంచుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. సమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని గట్టిగా నొక్కి చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కోసం భారత్ వైపు చూస్తున్నాయని, అందరి అవసరాలు తీర్చే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన సర్వప్రతినిధి సభలో ముందుగా రికార్డు చేసిన వీడియో ద్వారా మోదీ తన ప్రసంగాన్ని వినిపించారు. మారిపోతున్న పరిస్థితులకు అనుగుణంగా యూఎన్‌లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. ‘‘ఐక్యరాజ్య సమితిలో నిర్ణయాధికారం కోసం భారత్ ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలి ? ప్రపంచ జనాభాలో 18 శాతం కంటే ఎక్కువగా ఉన్న అతి పెద్ద దేశానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేస్తున్న దేశానికి భద్రతామండలిలో నిర్ణయాధికారాన్ని కల్పించరా ? ’’అని మోదీ నిలదీశారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా గండి కొడుతున్న విషయం తెలిసిందే. తాత్కాలిక సభ్య దేశంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు భారత్ కొనసాగనుంది. ఇదే సమయంలో మోదీ ఈ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి పరిస్థితులు వేరు. ఈ నాటి ప్రపంచ దేశాల పరిస్థితులు వేరు. సమస్యలు, వాటికి పరిష్కారాలు అన్నీ వేర్వేరుగా ఉన్నాయి. చాలా దీర్ఘకాలంగా సంస్కరణల కోసం వేచి చూస్తున్నాం’’అని ప్రధాని చెప్పారు. మారాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మారకపోతే, ఆ తర్వాత మార్పు వచ్చినా అది బలహీనంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం గత 75 ఏళ్ల కాలంలో ప్రపంచ దేశాల్లో ఎన్నో ఉగ్రవాదుల దాడులు జరిగాయని, రక్తపుటేరులు ప్రవహించాయన్న ప్రధాని దానిని దీటుగా ఎదుర్కోవాలంటే యూఎన్‌లో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం, ఆయుధాల సరఫరా, డ్రగ్స్, మనీ లాండరింగ్ వంటి వాటికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి తన గళాన్ని గట్టిగా వినిపించాలని, శాంతి భద్రతలు, సయోధ్య అంశాలకు మద్దతు పలకాలన్నారు. ప్రపంచ శాంతి స్థాపన కోసం ఇప్పటివరకు భారత్ 50 వరకు శాంతి మిషన్లను ప్రపంచం నలుమూలలకి పంపించిందని, జగతి సంక్షేమమే భారత్ ఆకాంక్ష అని మోదీ అన్నారు. కరోనాపై పోరాటంలో ఐరాస పాత్ర ఏది ? గత తొమ్మిది నెలల నుంచి ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూ ఉంటే, కలసికట్టుగా పోరాడేందుకు ఐక్యరాజ్య సమితి చేస్తున్న ప్రయత్నాలేంటని మోదీ ప్రశ్నించారు. కరోనాపై యూఎన్ నుంచి గట్టి ప్రతిస్పందన కూడా కరువైందని అన్నారు. కరోనా కష్ట కాలంలో భారత్‌లో ఫార్మా రంగం అద్భుతమైన పనితీరుని ప్రదర్శించిందని, 150కి పైగా దేశాలకు వివిధ రకాలైన ఔషధాలను సరఫరా చేశామన్నారు. ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో అతి పెద్ద దేశమైన భారత్ అందరి అవసరాలు తీర్చేలా కరోనా టీకా డోసుల్ని ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలను సంక్షోభం నుంచి బయటపడేయగలదని హామీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్‌పై భారత్ మూడో దశ ప్రయోగాల్లో ఉందని తెలిపారు. -
రష్యా వ్యాక్సిన్- డాక్టర్ రెడ్డీస్ చేతికి
కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ స్పుత్నిక్-Vపై దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టేందుకు డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ ఆర్డీఐఎఫ్ తాజాగా పేర్కొంది. తద్వారా దేశీయంగా డాక్టర్ రెడ్డీస్ మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇవి విజయవంతమైతే నవంబర్ తొలి వారానికల్లా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే వీలుంటుందని అభిప్రాయపడింది. తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 10 కోట్ల డోసేజీలను డాక్టర్ రెడ్డీస్‌కు సరఫరా చేయనున్నట్లు తెలియజేసింది. ఈ వివరాలను ఆంగ్ల మీడియా వెల్లడించింది. సురక్షితం ఎడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన స్పుత్నిక్-V వ్యాక్సిన్ సురక్షితమైనదని డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం సందర్భంగా ఆర్డీఐఎఫ్ సీఈవో కైరిల్ దిమిత్రేవ్ పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్లను తయారు చేసేందుకు మరో నాలుగు దేశీ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకునేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విభిన్న వ్యాక్సిన్లపై ఆసక్తి చూపడం ద్వారా వివిధ దేశాలు, సంస్థలు.. ప్రజలను సంరక్షించుకునేందుకు కట్టుబాటును ప్రదర్శిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మానవ ఎడినోవైరల్ వెక్టర్స్ ద్వారా రూపొందించిన తమ వ్యాక్సిన్‌ను 40,000 మందిపై ప్రయోగించి చూశామని, 250 క్లినికల్ డేటాలను విశ్లేషించామని వివరించారు. తద్వారా ఇది సురక్షితమని తేలడమేకాకుండా దీర్ఘకాలంలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలనూ చూపలేదని స్పష్టం చేశారు. రష్యాలో తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలు సఫలమయ్యాయని.. దేశీ ప్రమాణాల ప్రకారం మూడో దశ పరీక్షలకు డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. (కరోనా భారత్: 50 లక్షలు దాటిన కేసులు) -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు భారత్‌లో బ్రేక్
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు మన దేశంలోనూ ఆగాయి. ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనెకా తిరిగి ప్రయోగాలు చేపట్టేవరకు తామూ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉండగా టీకా డోసు ఇచ్చిన ఒక వాలంటీర్‌కి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టుగా వెల్లడించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలేవరకూ భారత్‌లో రెండు, మూడో దశలకు ఇచ్చిన అనుమతుల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) డాక్టర్ వి.జి. సొమానీ సీరమ్ ఇన్స్టిట్యూట్కి షోకాజ్ నోటీసులు పంపింది. ఆ నోటీసులు అందుకున్న తర్వాతే ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా సీరమ్ వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలకు బ్రేక్ పడినప్పటికీ ముందుగా అనుకున్నట్టుగానే ఈ ఏడాది చివరికి టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కాల్ సోరియెట్ చెప్పారు. టీకా భద్రతపై సమీక్షను వేగవంతంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరికి, లేదంటే వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కరోనాకు చైనా నాజల్ స్ప్రే వ్యాక్సిన్ బీజింగ్: కరోనాను నిలువరించడానికి నాజల్ స్ప్రే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కి చైనా అనుమతించింది. తొలి దశ క్లినికల్ ట్రయల్ నవంబర్‌లో ప్రారంభం కావొచ్చని చైనా తెలిపింది. చైనాకి చెందిన నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ తరహా వ్యాక్సిన్‌ని ఆమోదించడం ఇదే తొలిసారి. -
నిమ్స్‌లో కోవాగ్జిన్ ఫేజ్–2 ట్రయల్స్ షురూ
సాక్షి, లక్టీకాపూల్: నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో కొనసాగుతున్న కోవాగ్జిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఫేజ్–2 టీకా ప్రయోగం మొదలైంది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశంలోనే ఫార్మా దిగ్గజమైన భారత్ బయోటెక్ ఫార్మాసూటికల్ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకా ప్రయోగానికి దేశంలోని 12 ఆస్పత్రులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో నిమ్స్ ఆస్పత్రి కూడా ఒకటి కావడం విదితమే. ఆయా ఆస్పత్రిలన్నీ క్లినికల్ ట్రయల్స్ ఫేజ్–1ను విజయవంతం చేశాయి. టీకా తీసుకున్న వలంటీర్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ క్రమంలో ఫేజ్–2 ట్రయల్స్‌లో దేశవ్యాప్తంగా 380 మందికి టీకా ప్రయోగం చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఫేజ్–2 టీకాలు వేయడం ఆరంభించారు. నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్ పర్యవేక్షణలో నోడల్ అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 12 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చారు. వీళ్లందరిని నాలుగు గంటల అబ్జర్వేషన్ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. అదే విధంగా బుధవారం మరో 15 మందికి టీకా ప్రయోగం చేసేందుకు వైద్య బృందం సిద్ధమైంది. ఈ ప్రక్రియ మూడు రోజుల పాటు ఈ కొనసాగించేందుకు సన్నాహాలు చేపట్టినట్టు సమాచారం. కాగా ఈ టీకా ప్రయోగం ప్రక్రియలో భాగంగా ఆదివారం దాదాపుగా 80 మంది వాలంటీర్లకు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. -
40 లక్షలకు చేరువలో..
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం తాజాగా 83,341 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39,36,747కు చేరుకుంది. రెండు రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 66,659 మంది కోలుకోగా, మరో 1,096 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 68,472కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 8 రోజుల నుంచి దేశంలో వరుసగా రోజుకు 60 వేలకు పైగా కోలుకుంటున్నారని తెలిపింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 29,70,492కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,31,124గా ఉంది. రికవరీ రేటు 77.15 శాతానికి పెరిగిందని కేంద్రం తెలిపింది. జూన్ తర్వాతే వ్యాక్సిన్ జెనీవా/మాస్కో : వచ్చే ఏడాది జూన్ వరకు కరోనా వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకివచ్చే అవకాశాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. అన్ని ప్రయోగాలను దాటుకొని వ్యాక్సిన్ ఎంత సమర్థంగా ఎంత సురక్షితంగా పని చేస్తుందో తేలడానికి సమయం పడుతుందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ చెప్పారు. ఇప్పటివరకు తుది దశ ప్రయోగాల్లో ఉన్న వ్యాక్సిన్లన్నీ సమర్థవంతంగా పని చేస్తాయని నిర్ధారణ కాలేదని జెనీవాలో అన్నారు. డబ్ల్యూహెచ్‌వో అంచనాల ప్రకారం ఈ టీకాలేవీ 50% కూడా సురక్షితం కాదని మార్గరెట్ చెప్పారు. రెండు నెలల్లోనే మానవ ప్రయోగాలు పూర్తి చేసి వ్యాక్సిన్‌కు రష్యా అనుమతులు మంజూరు చేయడం, అమెరికా కూడా నవంబర్‌కి వ్యాక్సిన్ సిద్ధంగా చేస్తామని వెల్లడించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యా వ్యాక్సిన్ సురక్షితమే.. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ సురక్షితమేనని లాన్సెట్ జర్నల్ ఓ పరిశోధనను వెలువరించింది. మొత్తం 76 మందిపై జరిపిన ట్రయల్స్ వివరాలను వెల్లడించింది. ఈ ట్రయల్స్‌లో తీవ్రమైన సైడ్ ఎఫెక్టులేమీ కనపడలేదని తెలిపింది. -
బంగారం కొండ దిగుతోంది..!
న్యూఢిల్లీ: నిన్నమొన్నటిదాకా సరికొత్త శిఖరాలతో వెలుగులు విరజిమ్మిన బంగారం... ఇప్పుడు కొండ దిగుతోంది!! ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు తొలిసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్న వార్తలతో పుత్తడి ఒక్కసారిగా నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశంలో పసిడి ధర పతనం అవుతోంది. దేశీయ స్పాట్ ప్రధాన మార్కెట్– న్యూఢిల్లీలో శుక్రవారం (ఆగస్టు 7వ తేదీ) 10 గ్రాములు స్వచ్చత ధర రికార్డు స్థాయిలో రూ.57,008 చూస్తే, బుధవారం నాటికి రూ.52,946కు దిగివచ్చింది. అంటే కేవలం మూడు రోజుల్లో రూ.4,062 తగ్గిందన్నమాట. మూడు రోజులుగా పసిడి ప్రతిరోజూ ఇక్కడ రూ.1,200కుపైగా తగ్గుతూ వచ్చింది. ఇక వెండి ధర కూడా భారీగా పతనం అవుతుండడం గమనార్హం. 7వ తేదీన ఇక్కడి స్పాట్ మార్కెట్లో రికార్డు స్థాయిలో రూ.77,840కి చేరిన కేజీ వెండి ధర బుధవారానికి రూ.67,584కు చేరింది. మూడు రోజుల్లో వెండి రూ.10,256కు తగ్గింది. దేశ వ్యాప్తంగా పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలో కూడా పసిడి, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. 7వ తేదీ వరకూ వరుసగా 16 రోజులు ఏరోజుకారోజు దేశీయంగా పసిడి ధరలు పెరుగుతూ వచ్చిన విషయం గమనార్హం. ఇక ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 9.30 గంటలు) దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి 10 గ్రాముల ధర రూ.52,292 వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ శుక్రవారం రికార్డు స్థాయిలో ధర రూ.55,850 చేరిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఈక్విటీ మార్కెట్ పెరుగుదల ధోరణి నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ (ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో) దాదాపు స్థిరంగా ఉంది. బుధవారం ధర 74.83 వద్ద ఉంది. రూపాయికి ఇప్పటివరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). పరుగుకు రష్యా ‘వ్యాక్సిన్’ బ్రేకులు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభణ, కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో బంగారం అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) గత శుక్రవారం (7వ తేదీ) ఒక దశలో చరిత్రాత్మక రికార్డుస్థాయి 2,078 డాలర్లకు చేరింది. తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత కేవలం 10 రోజుల్లోనే పసిడి ఈ స్థాయికి చేరడం గమనార్హం. అయితే ఈ స్థాయి వద్ద భారీ లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు దిగారు. దీనితో శుక్రవారం (7వ తేదీ) ట్రేడింగ్ చివర గంటల నుంచీ పసిడి పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది. దీనికితోడు కరోనా వ్యాక్సిన్ విడుదల చేసినట్లు స్వయంగా దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం పసిడి ధరకు మరింత ప్రతికూలం అయ్యాయి. బుధవారం ఈ వార్త రాసే 9.30 గంటల సమయానికి చరిత్రాత్మక గరిష్ట స్థాయిల నుంచి (2,078 డాలర్ల) చూస్తే, ధర 128 డాలర్లు పతనమై, 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 202 డాలర్లు పడిపోయి ఏకంగా 1,876 డాలర్లు చూడ్డం గమనార్హం. అయితే ఈ స్థాయిని చూసిన కేవలం కొద్ది గంటల్లోనే ధర కీలక నిరోధ స్థాయి (1,911 డాలర్లు)ని మళ్లీ దాటి, మంగళవారం ముగింపుకన్నా 12 డాలర్ల లాభంతో 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
రష్యా వ్యాక్సిన్ విడుదల రేపే?
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కరోనా నియంత్రణకు ఓ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది! గమ్ కోవిడ్ వ్యాక్ లయో పేరుతో రష్యా తయారు చేసిన ఈ టీకాపై పలువురికి సందేహాలు ఉన్నప్పటికీ దాని వివరాలు ఒక్కటొక్కటిగా వెల్లడవుతున్నాయి. ముందుగా అనుకున్నట్టుగానే తాము ఆగస్టు 12న.. అంటే బుధవారం కరోనా టీకాను విడుదల చేస్తున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ నిర్ధారించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ టీకాను ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ వారంలోనే వ్యాక్సిన్‌ను నమోదు చేసే ప్రక్రియ పూర్తవుతుందని ఆ శాఖ స్పష్టం చేసింది. ఆ తరువాత మూడు రోజులకు ఈ టీకా అందరికీ అందుబాటులోకి వచ్చినట్లే. రష్యాలోని గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలు ఈ టీకా తయారు చేశాయి. టీకా వేసుకున్న తరువాత 21వ రోజుకు వైరస్‌ను అడ్డుకునేలా రోగనిరోధక వ్యవస్థ బలోపేతమైందని, రెండో డోస్‌తో ఇది రెట్టింపు సామర్థ్యం సంతరించుకుందని సమాచారం. ఈ టీకాను అడినోవైరస్ భాగాలతో చేసినట్లుగా స్పుత్నిక్ వార్తా సంస్థ తెలిపింది. (కరోనా సీజనల్ వైరస్ కాదు: డబ్ల్యూహెచ్‌వో) వచ్చే నెల వాణిజ్య ఉత్పత్తి రష్యా తయారు చేసిన టీకా నమోదు ఈ వారంలో జరగనుండగా.. వచ్చే నెలలో వాణిజ్యస్థాయి ఉత్పత్తి జరగనుంది. ముందుగా వైద్య సిబ్బందికి, ఉపాధ్యాయులకు టీకా ఇస్తామని, నవంబర్ నాటికి అందరికీ టీకా అందుతుందని రష్యా ఆరోగ్య శాఖ చెబుతోంది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యా టీకా ప్రకటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. సురక్షితమైన, సమర్థమైన టీకా అభివృద్ధికి తాము సూచించిన మార్గదర్శకాలను పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అమెరికాకు చెందిన కరోనా టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథొనీ ఫాసీ.. ‘చైనా, రష్యా అందరికీ వ్యాక్సిన్ అందించే ముందు తగిన పరీక్షలు నిర్వహించాయనే ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. (అక్కడ 100 రోజులుగా ఒక్క కేసు లేదు) -
పొగాకు నుంచి కోవిడ్ వ్యాక్సిన్?
లండన్: పొగాకు నుంచి కరోనా వ్యాక్సిన్ రానుందా అంటే అవుననే చెబుతోంది బ్రిటిష్ అమెరికన్ పొగాకు సంస్థ లూసీ స్ట్రైక్స్ సిగరెట్స్. ఆ కంపెనీకి చెందిన కెంటకీ బయో ప్రాసెసింగ్ తయారు చేస్తున్న వాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పింది. పొగాకు ఆకుల నుంచి సంగ్రహించిన ప్రొటీన్‌తో వ్యాక్సిన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. దీనికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి రావాల్సి ఉందని చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కింగ్ స్లే వీటన్ చెప్పారు. కోవిడ్ జెనెటిక్ సీక్వెన్స్‌ను పరిశీలించాక దాన్ని పొగాకులోని ప్రొటీన్లతో అణచివేయవచ్చని ఈ దిశగా ప్రయోగాలు చేపట్టబోతున్నట్లు స్ట్రైక్స్ సిగరెట్స్ సంస్థ ఇటీవలే తెలిపింది. ఆరు వారాల్లోనే ఈ వాక్సిన్ తయారు చేయవచ్చని అప్పట్లో తెలిపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తిదారులు కూడా ఈ తరహా ప్రయోగాలు మొదలు పెట్టారు. -
ఆగస్ట్ 10లోపు కరోనా వ్యాక్సిన్!
మాస్కో : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న తరుణంలో వ్యాక్సిన్ తయారీకి శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తామే ముందుగా వ్యాక్సిన్‌ను కనిపెట్టి, మార్కెట్లోకి విడుదల చేయాలని అమెరికా, చైనా, భారత్, రష్యా దేశాలు తీవ్ర పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు రష్యా శుభవార్తను అందించింది. తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను ఆగస్ట్ 10లోపు విడుదల చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశామని ప్రకటించింది. తొలుత వైరస్ బారినపడిన వైద్యులకు సరఫరా చేసి, ఆ తరువాత ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గురువారం ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సెషనోవ్ వర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ తుది ప్రయోగాలను పూర్తి చేసుకునే దశలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రష్యాలోని సెషనోవ్ వర్సిటీ తయారు చేసిన టీకా ప్రపంచంలోనే తొలి కరోనా నిరోధక టీకా అన్న వార్తలు ఇటీవల కాలంలో వెలువడ్డ విషయం తెలిసిందే. (చైనా గ్రీన్ సిగ్నల్: వ్యాక్సిన్ తయారీలో పోటీ) మరోవైపు కరోనా కేసుల సంఖ్య ఒకవైపు పెరిగిపోతున్నప్పటికీ.. ఈ వ్యాధి కట్టడికి అత్యంత కీలకమైన వ్యాక్సిన్ విషయంలో ఆశలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకవైపు అమెరికన్ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ మానవ ప్రయోగాలు ప్రారంభమవ్వగా.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకా కూడా కీలకమైన మూడో దశకు దగ్గరగా ఉండటంతో ఈ ఏడాది లోపు ఏదో ఒకటి కోవిడ్–19 నుంచి విముక్తి కల్పించవచ్చునన్న ఆశలు బలపడుతున్నాయి. ఇక భారత్ బయోటెక్ రూపొందిస్తున్న టీకా సైతం ఆగస్ట్ మూడో వారంలో సిద్ధమైయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్ అంచనా వేస్తోంది. -
అగ్ర దేశాల దౌత్య యుద్ధం
వాషింగ్టన్/బీజింగ్: అమెరికా, చైనా మధ్య విభేదాలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనర ల్ను మూసివేయాలంటూ ట్రంప్ సర్కార్ ఆదేశిం చడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో అగ్గి రాజుకుంది. హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం కాన్సులేట్‌ను మూసివేయాల్సిందిగా చైనాని ఆదేశించింది. అమెరికా మేధో సంపత్తిని, ప్రైవేటు సమాచారాన్ని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గా ఓర్టాగస్ మంగళవారం విలేకరులకు తెలిపారు. అయితే చైనా ఏ తరహా గూఢచర్యానికి దిగిందో ఆమె స్పష్టంగా వెల్లడించలేదు. దెబ్బకి దెబ్బ తీస్తాం: చైనా అమెరికా నిర్ణయం అత్యంత దారుణమైనదని, అన్యాయమైనదని చైనా విరుచుకుపడింది.. అమెరికా తన తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రతీకార చర్యలు తప్పవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్‌హెచ్చరించారు. కాన్సులేట్ జనరల్‌లో మంటలు అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని చైనా కాన్సులేట్ జనరల్‌లో మంటలు చెలరేగాయి. కార్యాలయం ఆవరణలో చైనా ప్రతినిధులు డాక్యుమెంట్లు తగులబెట్టడంతో మంటలు చెలరేగినట్టు పోలీసులు వెల్లడించారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో కాన్సులేట్‌ని మూసివేయాలని ఆదేశాలు జారీ అయిన కాసేపటికే కాన్సులేట్‌లో మంటలు రేగాయి. కొన్ని కంటైనర్లు, డస్ట్ బిన్స్‌లో డాక్యుమెంట్లు వేసి తగులబెట్టడంతో మంటలు చెలరేగిన వీడియోలు సోషల్‌మీడియాలో షేర్ అయ్యాయి. మంటలు ఆర్పడానికి వెళ్లే అగ్నిమాపక సిబ్బందికి కాన్సులేట్ అధికారులు అనుమతినివ్వలేదని పోలీసులు తెలిపారు. ఎందుకీ మూసివేత! అమెరికా, చైనా మధ్య కోవిడ్ వ్యాక్సిన్ అధ్యయనాల హ్యాకింగ్ చిచ్చు కాన్సులేట్ మూసివేతకు ఆదేశాల వరకు వెళ్లినట్టుగా అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన అధ్యయన వివరాలను తస్కరించారంటూ అమెరికా న్యాయశాఖ ఇద్దరు చైనా జాతీయుల్ని వేలెత్తి చూపిన రోజే హ్యూస్టన్‌లో కాన్సులేట్ మూసివేతకు ఆదేశాలు వెలువడ్డాయి. ఆ ఇద్దరు వ్యక్తులు అమెరికాలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ అధ్యయనాలను తస్కరించడానికి ప్రయత్నించారని అమెరికా ఆరోపిస్తోంది. -
వ్యాక్సిన్ హోప్- మార్కెట్లు గెలాప్
ప్రపంచదేశాలకు అనారోగ్య సమస్యలు సృష్టిస్తున్న కోవిడ్-19 కట్టడికి త్వరలో వ్యాక్సిన్ వెలువడగలదన్న అంచనాలతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. సమయం గడిచేకొద్దీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 511 పాయింట్లు జంప్‌చేసింది. 38,000 పాయింట్ల సమీపంలో 37,930 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 37,990 వరకూఎగసింది. ఇక నిఫ్టీ 11,180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 140 పాయింట్లు జమ చేసుకుని 11,162 వద్ద స్థిరపడింది. వెరసి ఇంట్రాడే గరిష్టాలవద్దే మార్కెట్లు నిలవడం గమనార్హం! కారణమేవిటంటే? బ్రిటిష్ యూనివర్శిటీ ఆక్స్ఫర్డ్ సహకారంతో ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని పెంచుతున్న వార్తలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది. దీంతో సోమవారం యూఎస్ మార్కెట్లు లాభపడగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా, యూరోపియన్ మార్కెట్లు 0.5-2 శాతం మధ్య ఎగశాయి. ఇది దేశీయంగానూ ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. రియల్టీ జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంక్స్‌తో కూడిన బ్యాంక్ నిఫ్టీ, రియల్టీ రంగాలు 2 శాతం చొప్పున పుంజుకోగా.. ఆటో 1.6 శాతం ఎగసింది. అయితే ఫార్మా 1.3 శాతం, ఎఫ్ఎంసీజీ 0.7 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో పవర్‌గ్రిడ్, ఐవోసీ, బీపీసీఎల్, ఐషర్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, మారుతీ, గెయిల్, కొటక్ బ్యాంక్, టాటా మోటార్స్ 6.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫ్రాటెల్, సిప్లా, ఎయిర్టెల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్ఎం 4-1 శాతం మధ్య డీలాపడ్డాయి. పిరమల్ జూమ్ డెరివేటివ్స్ కౌంటర్లలో పిరమల్ 10 శాతం దూసుకెళ్లగా.. అంబుజా సిమెంట్, ఎస్కార్ట్స్, ఎస్బీఐ లైఫ్ 5-4.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఐడియా 7.7 శాతం పతనంకాగా.. హావెల్స్, టాటా కన్జూమర్, ఇంద్రప్రస్థ, ఎంఅండ్ఎం ఫైనాన్స్, పిడిలైట్, అరబిందో ఫార్మా, క్యాడిలా హెల్త్‌కేర్ 3.4-2.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.25 శాతం నీరసించగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అదే స్థాయిలో పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1442 లాభపడితే.. 1244 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1710 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 697 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 209 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నలుమూలల్లో మూడు కొత్త వ్యాక్సిన్లు
కరోనా కేసులు.. మరణాల సంఖ్యలతో పత్రికలు నిండిపోతున్న నేపథ్యంలో ఎట్టకేలకు కొన్ని శుభవార్తలూ వినిపించడం మొదలైంది. ఒకవైపు కోవిడ్–19 నివారణకు భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన టీకా మానవ ప్రయోగాలకు సిద్ధమవుతుంటే.. ప్రపంచం నలుమూలల్లో కనీసం మూడు నాలుగు కొత్త వ్యాక్సిన్లు ఆశాజనక ఫలితాలు చూపుతున్నాయి. కోవిడ్–19ను జయించగలమన్న ధీమాను కల్పిస్తున్నాయి. అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఫైజర్, చైనాలోని కాన్‌సైనో, ఆస్ట్రేలియాలోని వ్యాక్సైన్‌లు కీలకమైన దశలు దాటుకుని వేగంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా సాగుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ : ఫైజర్ కంపెనీ బీఎన్టీ162బీ1 పేరుతో అభివృద్ధి చేస్తున్న టీకా ప్రయోగాల ప్రాథమిక ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. కోవిడ్ బారినపడి కోలుకున్న వారి రక్తంతో పోల్చినప్పుడు ఈ కొత్త టీకా వాడిన వారిలో ఎక్కువ మోతాదులో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తోంది. మెసెంజర్ ఆర్ఎన్ఏను మానవ శరీర కణాల్లోకి జొప్పించడం ద్వారా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీల ఉత్పత్తి జరిగేలా చూడటం ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు చూపడటం లేదని, రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తోందని స్పష్టమైంది. ఫైజర్ 18 – 55 మధ్య వయస్కులు 45 మందికి ఈ కొత్త టీకాను అందించింది. వీరిలో అత్యధికులకు మూడు వారాల వ్యవధిలో రెండు డోసులు, మిగిలిన వారికి ఉత్తుత్తి టీకా ఇచ్చారు. రెండవ డోసు తీసుకున్న వారిలో చాలామందికి జ్వరం మాత్రం వచ్చిందని ఆన్లైన్ వెబ్సైట్ ఒకదాంట్లో ప్రచురితమైన వివరాలు తెలుపుతున్నాయి. అయితే ఇది ఊహించిందేనని నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో అమెరికన్ కంపెనీ మోడెర్నా, బ్రిటిష్–స్వీడన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాలు ఇప్పటికే మూడవ దశ మానవ ప్రయోగాలకు సిద్ధమవుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. (5 రోజుల్లోనే మరో లక్ష) వ్యాక్సిన్ అవసరమే ఉండకపోవచ్చు: ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్త ప్రాణాంతక మహమ్మారి కరోనా నిరోధానికి టీకా అభివృద్ధి చేసేందుకు ప్రపంచం మొత్తమ్మీద పలు ప్రయత్నాలు జరుగుతుండగా దీని అవసరమే ఉండకపోవచ్చునని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త సునేత్ర గుప్త అంటున్నారు. కొంతకాలం తరువాత జలుబు మాదిరిగానే కోవిడ్–19 కారక కరోనా కూడా సాధారణ జీవితంలో భాగమైపోతుందని ఆమె ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆరోగ్యంగా ఉన్న సాధారణ ప్రజలు కరోనా వైరస్ గురించి పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదని, వయసు ఎక్కువగా ఉన్నవారు, గుండెజబ్బు వంటి ఇతర జబ్బులు ఉన్న వారు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి వారిని కాపాడుకునేందుకు టీకా అవసరం కావచ్చుగానీ.. మిగిలిన వారికి టీకాతో పని ఉండకపోవచ్చునని చెప్పారు. కరోనా వైరస్ ఉధృతి క్రమేపీ తగ్గుముఖం పట్టి కొంతకాలం తరువాత జలుబు మాదిరిగా అప్పుడప్పుడూ పలుకరించేదిగా మారతుందన్నది తన అంచనా అని తెలిపారు. లాక్డౌన్ వంటి చర్యలు వైరస్‌ను కట్టడి చేసేందుకు తాత్కాలికంగా ఉపయోగపడవచ్చుగానీ.. దీర్ఘకాలంలో మాత్రం కాదని స్పష్టం చేశారు. మిలటరీ వాడకానికి ఓకే... చైనీస్ కంపెనీ... కాన్‌సైనో బయలాజిక్స్ బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా నిరోధక టీకా కూడా విస్తృత ప్రయోగాల దిశగా సాగుతోంది. చైనాలో మొత్తం ఎనిమిది టీకా ప్రయోగాలు జరుగుతుండగా కాన్‌సైనో ‘ఏడీ5’పేరుతో సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ తొలి దశ ప్రయోగాల్లో మంచి ఫలితాలు చూపినట్లు తెలుస్తోంది. రెండో దశ ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉండగా.. చైనా ప్రభుత్వం ఏడాదిపాటు దీన్ని మిలటరీ వర్గాల వారికి అందించేందుకు ఓకే చెప్పడం విశేషం. తొలిదశ ప్రయోగాల్లో భాగంగా ఏడీ5ను ఆరోగ్యంగా ఉన్న 108 మందికి అందించారు. మూడు మోతాదుల్లో ఒకే డోసు టీకా ఇవ్వడం గమనార్హం. ఆపై 28 రోజుల తరువాత వీరిలో యాంటీబాడీలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అత్యధిక మోతాదులో టీకా అందుకున్న వారిలో మూడొంతుల మందిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి కాగా, తక్కువ, మధ్యమస్థాయిలో టీకా అందుకున్న వారిలో సగం మందిలో మంచి ఫలితాలు కనిపించాయి. రోగ నిరోధక వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన టీ–సెల్స్‌ను ప్రేరేపించడంలోనూ ఈ టీకా విజయం సాధించినట్లు సమాచారం. జలుబును కలగజేసే అడినవైరస్‌ను బలహీనపరచి కరోనా వైరస్ తాలూకూ కొమ్ములను ఉత్పత్తి చేసే జన్యుపదార్థాన్ని జొప్పించడం ఈ టీకా ప్రత్యేకత. ఈ కొమ్ములను గుర్తించే రోగ నిరోధక వ్యవస్థ చైతన్యవంతమై యాంటీబాడీలను ఉత్పత్తి చేసి వైరస్‌పై దాడి చేస్తుందన్నమాట. చైనాకు చెందిన మరో కంపెనీ బయోఎన్‌టెక్ కరోనా వైరస్ నిరోధానికి అభివృద్ధి చేసిన రెండు టీకాల మూడో దశ మానవ ప్రయోగాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్నాయి. సైనోవాక్ బ్రెజిల్లో మూడో దశ ప్రయోగాలకు సిద్ధమవుతుండటం గమనార్హం.