న్యూఢిల్లీ: పుట్టిన వెంటనే నవజాత శిశువులకు ఇచ్చే బాసిల్లస్ కాల్‌మెట్టే గుయారిన్ (బీసీజీ) టీకా కరోనాపై పోరులో కీలకం కానుందని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. క్షయ వ్యాధి నివారణకు ఇచ్చే బీసీజీ టీకాతోపాటు సార్వత్రిక టీకా కార్యక్రమాలు లేని దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త గొజాలో ఓటాజూ తెలిపారు. అమెరికాలో సుమారు 1.90 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా ఇటలీలో ఈ సంఖ్య 1.05 లక్షలుగా ఉంది. అమెరికాలో నాలుగు వేల మంది, ఇటలీలో 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. (‘తబ్లిగి జమాత్’తో పెరిగిన కేసులు )
Comments
Please login to add a commentAdd a comment