న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులతోపాటు యాక్టివ్ కేసులు సంఖ్య కూడా పెరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా కరోనా మహమ్మారి కేసుల్లో స్వల్ప ఊరట లభించింది. కిందటి రోజుతో పోలిస్తే 2 వేల కేసులు తక్కువ నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో 6,594 మంది కోవిడ్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,36,695కు చేరాయి. యాక్టిక్ కేసుల సంఖ్య 50,548కు పెరిగింది. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా వస్తుండటంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దీని ప్రకారం గత 24 గంటల్లో 3,21,873 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పాజిటివిటీ రేటు 2.32 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,26,61,370 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.67%గా ఉంది.
చదవండి: కరోనా డేంజర్ బెల్స్.. ‘ఫోర్త్ వేవ్’ మొదలైందా?
Comments
Please login to add a commentAdd a comment