సాక్షి, నల్గొండ: పోలీసుల పేరుతో నకిలి పేస్‌బుక్ ఖాతాలతో ఘరాన మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాకు నల్గొండ పోలీసులకు చెక్ పెట్టారు. రాజస్థాన్ కేంద్రంగా ఫేస్ బుక్ నకిలీ ఖాతాలతో దందా సాగిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు వారి వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, 8 సెల్‌ఫోన్‌లు, ఒక ల్యాప్ టాప్, 30 సిమ్ కార్డు, ఆధార్ కార్డులతో పాటుపలు డాకుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముఠా సభ్యులంతా రాజస్థాన్‌లోని భరత్ పూర్ జిల్లా కేత్వాడ గ్రామానికి చెందివారుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా పోలీసు అధికారుల ఖాతాలే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు చెప్పారు.
అధికారుల పేర్లతో ఫేస్‌బుక్ ఖాతాను క్రియోట్ చేసి పలువురికి డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేస్తూ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ, ఏపీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులతో పాటు.. బ్యాంక్, రైల్వే, సీఆర్‌పీఎఫ్ అధికారుల పేరుతో ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించి రిక్వెస్ట్ పెట్టినట్లు చెప్పారు. అంతేగాక ఈ ముఠా ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్ అప్లికేషన్ అడ్డాగా చేసుకుని ఆర్మీ పేరుతో కూడా సైబర్ నేరాలకు పాల్పడ్డారని, నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ పేరిట కూడా నకిలీ ఫేస్ బుక్ ఖాతాను సృష్టించి పలువురికి డబ్బులు పంపించాలంటూ రిక్వెస్ట్ పంపినట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment