Nalgonda: Constable injured while holding 'Drunk & Drive' Test at Miryalaguda - Sakshi
Sakshi News home page

మిర్యాడగూడలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. కానిస్టేబుల్‌ను కారుతో ఈడ్చుకెళ్లిన మందు బాబులు.. గాయాలు

Published Tue, Apr 25 2023 10:19 AM | Last Updated on Tue, Apr 25 2023 10:51 AM

Nalgonda: Constable injured While Drunk And Drive Test Miryalaguda - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నల్లగొండ:  మిర్యాలగూడలో గత రాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. డ్రంక్‌ డ్రైవ్‌ సందర్భంగా.. పోలీసుల మీదకు కారును పోనిచ్చారు. ఈ క్రమంలో కారును ఆపేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. 

తప్పతాగిన కొందరు మిర్యాలగూడ హనుమాన్‌ పేట ఫ్లైఓవర్‌ వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షల సందర్భంగా హల్‌ చల్‌ చేశారు. పోలీసులు చెబుతున్నా వినకుండా ముందుకు కారును పోనిచ్చారు. కానిస్టేబుల్ లింగారెడ్డిని 50 మీటర్ల దూరం ఈడ్చుకుపోయారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు.

గాయాల పాలైన కానిస్టేబుల్‌ లింగారెడ్డి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన వన్‌టౌన్‌ పోలీసులు.. పరారైన వాళ్ల కోసం గాలింపు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement