
జనగామ జిల్లా : దొంగ నోట్లను చలామణీ చేస్తోన్న ముగ్గురిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 28వ తేదీన జనగామలో దొంగ నోట్లతో దందా చేస్తుండగా సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒక లక్ష రూపాయల నకిలీ నోట్లు, రెండు కార్లు, ఒక స్కానర్, నోట్ల తయారీ కాగితాలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురిని రిమాండుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జనగామ డీసీపీ ఎం మల్లారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment