janagam district
-
ఆత్మీయ సమావేశాలకు సమాచారం లేదు: కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: నియోజకవర్గంలో జరుగుతున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాలకు ఆహ్వానం గానీ, అందుకు సంబంధించిన సమాచారం గానీ తనకు అందలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. ఎన్నికల సమయంలో, పార్టీ బహిరంగ సభల సమయంలో నా సహాయం కోసం వస్తున్నారే తప్ప ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవాలని అధిష్టానం సూచించిందని...అయితే స్థానిక నాయకత్వం సీఎం కేసీఆర్ ఆదేశాలను ఖాతరుచేయకుండా తనకు సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి రాజయ్య గెలుపు కోసం సొంత ఖర్చులతో కష్టపడి పనిచేశామని, ఆయన ఎన్నికల్లో సహకరించాలని కోరగా సీఎం ఆదేశాలకు కట్టుబడి నిజాయితీగా పనిచేశానని గుర్తు చేశారు. అదేవిధంగా 2015, 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం పనిచేశామని తెలిపారు. కడియంను ఆహ్వానిస్తా: ఎమ్మెల్యే రాజయ్య చిల్పూరు: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే 14 ఆత్మీయ సమావేశాల్లో భాగంగా సోమవారం శివునిపల్లిలో జరిగే సమావేశానికి కడియం శ్రీహరిని ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య వెల్లడించారు. పలువురు కడియం శ్రీహరిని ఆహ్వానించలేదని అనుకుంటున్నారని అందులో వాస్తవం లేదన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండల పరిధి వెంకటాద్రిపేటలో దుర్గామాత, మహిళా కమ్యూనిటీ భవన నిర్మాణ పనుల శంకుస్థాపనకు హాజరైన రాజయ్య మాట్లాడుతూ...కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఒక్కో నియోజకవర్గానికి ఎమ్మెల్సీలను ఇన్‌చార్జ్‌లుగా నియమించారని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి కోటిరెడ్డిని, కడియంను నల్లగొండకు నియమించారని, మొదట ధర్మసాగర్లో జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. -
Warangal Politics: కారు స్పీడుకు బ్రేకులు పడతాయా?
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా సాగినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో కారు జోరుకు బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సగం సీట్లలో పాగా వేసేందుకు విపక్షాలు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. రాబోయే కాలానికి కాబోయే లీడర్స్ మేమేనంటూ ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. చదవండి: గాల్లోకి మంత్రి కాల్పులు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు పోరాటాల పురిటి గడ్డ వరంగల్ జిల్లాలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ గులాబీ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు, 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక్క ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగిలినవన్నీ గులాబీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి గులాబీ గూటికి చేరారు. తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏకపక్షంగా వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి పరిషత్‌లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్వహించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలో ఐదారు అసెంబ్లీ స్థానాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నట్లు తేలింది. దీంతో గులాబీ పార్టీలో గుబులు, విపక్షాల్లో జోష్ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో పట్టు కోల్పోకుండా టీఆర్ఎస్.. బలపడేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టడంతోపాటు.. ఎదుటి శిబిరంలో కాస్త ప్రజాదరణ ఉన్న నేతను.. తమవైపు లాగేందుకు చిత్ర విచిత్ర వ్యూహాలు రచిస్తున్నారు అన్ని పార్టీల నేతలు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ నాయకుల్లో కొందరు జిల్లా అంతటా పర్యటించారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన చరిత్ర ఉండటంతో.. మరోసారి ఆ స్థాయిలో ఆ స్థాయిలో సీట్లు సాధించాలని చూస్తున్నారు కమలనాథులు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకులతో రహస్య మంతనాలు జరుపుతూ.. వారికి కాషాయ తీర్థం ఇచ్చేందుకు తెగ శ్రమిస్తున్నారు. ఆయా నాయకుల హోదాల మేరకు రాష్ట్రస్థాయి నేతలు సైతం టచ్‌లోకి వెళ్తున్నారట. అయితే అనుకున్నంత వేగంగా చేరికలు లేకపోవడంతో బీజేపీ శిబిరాన్ని డైలమాలో పడేస్తోంది. బీజేపీ ఎత్తుగడలు తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు విరుగుడు మంత్రం వేస్తున్నారు. బీజేపీ వాళ్లనే టీఆర్ఎస్లోకి లాగే ప్రయత్నాలు ప్రారంభించారు. చిన్న స్థాయి నేతలకు వల వేస్తే లాభం లేదనుకున్నారో ఏమో.. గతంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీల్లో ఫుల్ టైమర్స్‌గా పనిచేసి.. ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్‌గా ఉన్న కరుడుగట్టిన నేతలకే గురి పెట్టారు. జీవితాంతం బీజేపీలోనే ఉంటారు.. కండువా మార్చబోరని అనుకుంటున్న వారిని లాగితే.. పార్టీ శ్రేణులు డీలా పడతాయనే ఉద్దేశంతో గట్టిగానే గాలం వేస్తున్నారట. ఇలా వరంగల్ అర్బన్ ప్రాంతానికి చెందిన కొందరిని ఆకర్షించారు. వరంగల్ అర్బన్‌లో బలపడాలని చూస్తున్న బీజేపీకి తాజా వలసలు ఇబ్బందే అనే చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ నగర అధ్యక్షునితో పాటు, ఒక కార్పొరేటర్‌కు గులాబీ కండువా కప్పేశారు. పైగా ఇది అంతం కాదు.. ఆరంభమేనని చెప్పుకొస్తున్నారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ నుంచి అసంతృప్తులు ఎవరూ కమలం శిబిరం వైపు చూడకుండా వ్యూహరచన చేశారు అధికార పార్టీ నేతలు. అయితే బీజేపీ నుంచి ఒకరిద్దరు నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని కమలనాథులు ప్రకటనలు ఇస్తున్నారు. ఇప్పటికే కారులో ఎక్కువమంది ఎక్కేశారని.. అందులో ఉన్నవారికి ఊపిరి సలపడం లేదని.. త్వరలోనే దిగిపోయేవాళ్లు క్యూ కట్టినా ఆశ్చర్యపోనక్కరలేదని చెబుతున్నారు. వెళ్లిన దారినే తిరిగొచ్చేస్తారని ధీమాగా ఉన్నారు బీజేపీ నేతలు. ఇక వరంగల్ రైతు డిక్లరేషన్ సభతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ రచ్చబండతో గ్రామస్థాయిలో బలపడే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ కృషితో పార్టీ బలం కాస్త పెరుగుతున్నా..దానికి ఆదిలోనే గండికొట్టేలా కమలం, కారు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ బలం కాస్త పెరుగుతున్నట్లనిపిస్తున్నా..గ్రూప్ రాజకీయాలే ఆ పార్టీ కొంపముంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగితే కచ్చితంగా మూడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉన్న ములుగుతో పాటు అభ్యర్థులను బట్టి నర్సంపేట, భూపాలపల్లిలో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
గుడి నిర్వహణకు వృత్తి పన్ను
సాక్షి,హైదరాబాద్: ఊళ్లలో దేవాలయాలు నిర్మించినప్పుడు వాటి నిర్వహణ ఖర్చులకు కూడా కులవృత్తుల వారిపై పన్ను విధించేవారని తెలిపే కాకతీయుల శాసనం ఒకటి వెలుగు చూసింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సాల్వాపూరు గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు దేవరం రమేశ్ శర్మ, సామలేటి మహేశ్‌లు కాకతీయకాలం నాటి ఈ శాసనాన్ని గుర్తించారు. ప్రతాపరుద్రుడు పాలించిన కాలం నాటిదిగా చెబుతున్నారు. 1290–91 విరోధినామ సంవత్సరంలో ఈ శాసనాన్ని వేయించినట్టుగా ఉంది. నాలుగు వైపులా శాసనం చెక్కిన రాయి ఆ దేవాలయంలో ఉంది. నూనె గానుగలను నిర్వహించే గానుగలవాండ్లు, నేతవృత్తి నిర్వహించే సేనివారు దేవాలయ నిర్వహణకు పన్ను చెల్లించాలని ఆ శాసనంలో ఉంది. గానుగల వారు గానుగ ఒక్కింటికి, సేనివారు మగ్గం ఒక్కింటికి అడ్డుగ (అర్థరూపాయి) చొప్పున చెల్లించాలని ఆ శాసనం చెప్తోంది. అయితే గోడలోకి ఏర్పాటు చేయించినందున శాసనం అన్ని వైపులా చూసే వీలు లేకుండా ఉందని, మొత్తం చూస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని, వెలుగుచూసినంతవరకు శాసనపాఠాన్ని పరిష్కరించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. -
జనగామ జిల్లా కేంద్రలో ఉద్రిక్త పరిస్థితులు
-
సూపర్ లగ్జరీ బస్సు దగ్ధం
స్టేషన్ ఘన్పూర్: హన్మకొండ నుంచి ఉప్పల్‌కు వెళ్తున్న వరంగల్–1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సూపర్ లగ్జరీ బస్సు హన్మకొండ నుంచి ఉప్పల్‌కు మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఫ్లైఓవర్ ఎక్కిన బస్సు నెమ్మదిగా వెళ్తుంటే డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. అప్పటికే బస్సు వెనుక వైపు ఉండే ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు వస్తున్నాయి. వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు పొగ వాసన రావడంతో డ్రైవర్‌కు ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించాడు. అప్పటికే బస్సులో మంటలు వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే బస్సు పూర్తిగా కాలిపోయింది. వాటర్ ట్యాంకర్ తెప్పించి స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే క్యాబిన్, సీట్లు, ఇంజన్ పూర్తిగా కాలిపోయాయి. అదే సమయంలో రాఘవాపూర్‌కు చెందిన తోట శ్రీకాంత్ బైక్ బస్సు పక్కనే ఉండటంతో పాక్షికంగా దగ్ధమైంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగిన దాదాపు గంట తర్వాత పాలకుర్తి ఫైర్ ఇంజన్ ప్రమాదస్థలానికి చేరుకుంది. అనంతరం జనగామ నుంచి మరో ఫైర్ ఇంజన్ వచ్చింది. ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. -
జనంగాంలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
మరో అవకాశమివ్వండి: ఎర్రబెల్లి దయాకర్‌రావ
సాక్షి, రాయపర్తి: మరోసారి అవకాశమివ్వండి.. మంత్రినై వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని టీఆర్ఎస్ పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. మండలంలోని తిర్మలాయపల్లి, కొండూరు, కొలన్‌పల్లి, కేశవా పురం, గన్నారం, కాట్రపల్లి, బురహాన్‌పల్లి, మొరిపిరాల, గన్నారం గ్రామాల్లో దయాకర్‌రావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి దయాకర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని రెండేళ్లలో టీఆర్ఎస్లో చేరాక అభివృద్ధి చేశానన్నారు. తల్లిదండ్రులతోపాటు పిల్లలు సైతం తన గెలుపునకు కృషి చేశారని, యువతకు కోచింగ్ సెంటర్లను పెట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. లేదంటే రూ.10 లక్షల సబ్సిడీ రుణాలను అందించి వారు ఆర్థికాభివృద్దిని సాధించేలా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రముఖ గాయని మధుప్రియ దయాకర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాటల ద్వారా వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జినుగు అనిమిరెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ నర్సింహానాయక్, సురేందర్‌రావు, ఎంపీపీ విజయ, జెడ్పీటీసీ సభ్యురాలు యాకమ్మ, రంగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికను బావిలోకి తీసుకెళ్లి.. బాలికపై...
జఫర్‌గఢ్(స్టేషన్‌ఘన్‌పూర్): ఇంటి ముందు నిల్చున్న ఓ బాలికను పక్కింటి యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో పడేసి, అతడు కూడా అందులో దూకి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. స్థానికులు చేరుకుని అతడిపై దాడికి యత్నించగా గ్రామంలో ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బాలిక హన్మకొండలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులు కావడంతో రెండు రోజు ల క్రితమే ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు శనివారం వ్యవసాయ పనులకు వెళ్లారు. బాలిక మధ్యాహ్నం ఇంటి ముందు నిల్చొని ఉంది. గమనించిన పక్కింటి యువకుడు కేశోజు రాజేష్‌చారి(23) వచ్చి ఆమెను బలవంతంగా ఎత్తుకుని రోడ్డు అవతలకు వెళ్తుండగా పెద్ద పెట్టున కేకలు వేసింది. విన్న స్థానికులు వస్తుండగా రాజేష్‌చారి ఆ బాలికను సమీపంలోని పాడుబడిన బావిలో పడేశాడు. అతడు కూడా బావిలో దూకాడు. బాలిక తలకు, కాళ్లకు గాయాలైనప్పటికీ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బావి వద్దకు చేరుకున్న స్థానికులు పైనుంచి అతడిని బెదిరించి బాలికను తాళ్ల సాయంతో పైకి లాగారు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్, సీఐ కరుణాసాగర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై గ్రామస్తులు దాడికి యత్నించగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఫైరింజిన్‌ను కూడా తెప్పించారు. నిందితుడిని ఆస్పత్రికి తరలించే క్రమంలో గ్రామస్తులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. కాగా నిందితుడు రాజేష్‌చారి ఇంటర్మీడియట్ చదువు ఆపేసి గ్రామంలోని ఇసుక డంపుల వద్ద రోజువారీ కూలిగా పనిచేస్తున్నాడు. అతడితోపాటు కుటుంబ సభ్యులు తరుచూ గొడవ పడేవారని, ఇతరులతో కూడా గొడవలకు దిగేవారని స్థానికులు తెలిపారు. రాజేష్‌చారిపై కేసు నమోదు ఉప్పుగల్లు గ్రామంలో బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి బావిలో పడేసి అత్యాచార యత్నానికి పాల్పడటంతోపాటు చంపేందుకు యత్నించాడనే ఫిర్యాదు మేరకు నిందితుడు కేశోజు రాజేష్‌చారిపై కేసు నమోదైనట్లు ఎస్సై వెంకటకృష్ణ శనివారం రాత్రి తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయగా నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి 376, 366, 307 సెక్షన్ల కింద ఫోక్సో యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు
జనగామ: జనగామ జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్ వ్యాగన్ పాయింట్ లైన్‌పై గూడ్స్‌రైలు పట్టాలు తప్పిన సంఘటన శనివారం తెల్లవారు జామున 2గంటలకు జరిగింది. జనగామలో బియ్యం లోడ్ చేసుకుని వెళ్లే క్రమంలో బోగీలు పట్టాలు తప్పి భారీ శబ్దం రావడంతో గార్డు అప్రమత్తం కాగా పెనుప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి... జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ప్రధాన లైన్ పక్కనే వ్యాగన్ పాయింట్ కోసం ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. రెండు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేసి, గూడ్స్‌రైలులో బియ్యం తరలిస్తుంటారు. రైస్ మిల్లర్స్తోపాటు ప్రభుత్వం ఎగుమతి చేసే సివిల్ సప్లయ్ బియ్యాన్ని ఈమార్గంలో తీసుకువెళ్తుంటారు. ఈక్రమంలో శుక్రవారం 42 బోగీలతో ఉన్న గూడ్స్‌రైలు జనగామకు చేరుకుంది. బోగీలను రెండుగా వేరు చేసి (21 బోగీలు) రాత్రి వరకు బియ్యం లోడ్ చేశారు. గూడ్స్ బోగీల్లో లోడ్ చేసిన స్టాక్ వివరాల ప్రకారం సరి చూసుకుని, అధికారులు సీల్ చేశారు. రెండో లైన్‌పై ఉన్న 21 బోగీలను తీసుకుని.. మొదటి ట్రాక్‌పై ఉన్న మిగతా వాటిని కలుపుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐదు బోగీలతో ఇంజన్ ప్రధాన లైన్ పైకి వెళ్లగానే పెద్ద శబ్దం రావడంతో గార్డు అప్రమత్తమయ్యారు. వెంటనే బ్రేక్ అప్లైయ్ చేయడంతో గూడ్స్‌రైలు అక్కడే ఆగింది. అప్పటికే మూడు బోగీలు పట్టాలు తప్పి ముందుకు వెళ్లడంతో పట్టాలకు మధ్యలో ఉండే కాంక్రీట్ స్లీపర్లు పూర్తిగా విరిగిపోయాయి. హుటాహుటిన చేరుకున్న రైల్వే ఉన్నతాధికారులు గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయాన్ని తెలుసుకున్న సౌత్ సెంట్రల్ ఉన్నతాధికారులు హుటాహుటిన జనగామ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఎయిర్ మిషన్లు, ట్రాక్స్ మెకానిక్, సాంకేతిక నిపుణులు, సిబ్బందిని రప్పించారు. తెల్లవారుజాము 3 గంటలకు పనులు ప్రారంభించారు. పట్టాలు తప్పి, గూడ్స్‌రైలు దూసుకురావడంతో విరిగిపోయిన కాంక్రీట్ స్లీపర్ స్థానంలో కొత్తగా వేసి, ఎయిర్ ప్రెషర్‌తో ఏడు గంటల పాటు కష్టపడి బోగీ చక్రాలను పట్టాల పైకి ఎక్కించారు. ఎలా జరిగింది? ప్రధాన లైన్‌పై ఉన్న శ్రద్ధ.. వ్యాగన్ పాయింట్ ట్రాక్‌పై లేదని తెలుస్తోంది. రబీ, ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఇక్కడి నుంచి మన రాష్ట్రంతో పక్క రాష్ట్రాలకు బియ్యం తరలిస్తుంటారు. ఇందుకోసం రెండు లైన్లు ఉండగా.. వీటి నిర్వహణపై పర్యవేక్షణ అంతంత మాత్రమేనని ప్రచారం జరుగుతోంది. 42 బోగీల గూడ్స్‌రైలు బియ్యం లోడ్‌తో వెళ్తున్న క్రమంలో పట్టాలు తప్పడం సౌత్‌సెంట్రల్ రైల్వే అధికారులను కలవరపాటుకు గురిచేసింది. ఇటీవల అడపదడపా కురుస్తున్న వర్షాలతో పట్టాలు కొంతమేర కిందకు కుంగినట్లు పలువురు రైల్వే అధికారులు చర్చించుకోవడం కనిపించింది. ఐదు బోగీలతో ప్రధాన లైన్ మీదకు వెళ్లిన ఇంజన్... ఇంకొంచెం ముందుకు వెళ్తే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి ఉండేది. ఉత్తర, దక్షిణ భారత దేశాలకు ప్రధాన రవాణా మార్గమైన జనగామ మీదుగా అనేక రైళ్లు నడుస్తుంటాయి. కాగా పట్టాలు తప్పిన విషయమై సౌత్‌సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు క్లారిటీగా చెప్పడం లేదు. విచారణకు ఆదేశం జనగామ వ్యాగన్ పాయింట్ ట్రాక్‌పై గూడ్స్‌రైలు పట్టాలు తప్పిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. నిత్యం ట్రాక్ నిర్వహణపై పర్యవేక్షణ చేస్తున్న క్రమంలో ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇక్కడి అధికారలుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్ని బోగీలు పట్టాలు తప్పాయి? ప్రమాదానికి గల కారణం, బాధ్యులు ఎవరనే దానిపై సమగ్రమైన నివేదికలను అందించాలని కోరినట్లు తెలుస్తోంది. -
జనగామలో పార్ధీ గ్యాంగ్?
జనగామ : నరహంతక పార్ధీ ముఠా జనగామలో సంచరిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది రఘునాథపల్లి మండలంలో ఓ కుటుంబంపై విరుచుకుపడి నలుగురిని పొట్టన బెట్టుకున్న పార్ధీ ముఠా సభ్యుల కదలికలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో ఓ యువకుడు సృష్టించిన హల్చల్తో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. ఐరన్ రాడ్, కారం పొడితో ఏకంగా పోలీసులపై దాడికి పాల్పడే ప్రయత్నం చేయడంతో పార్ధీ ముఠాగా భావిస్తున్నారు. ఓ ఇంట్లోని బాత్రూంలో తలదాచుకున్న వ్యక్తిని స్థానికుల సాయంతో పోలీసులు రెండు గంటలపాటు కష్టపడి అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఇంటర్‌సెప్టర్ పోలీసుల వాహనం గస్తీ తిరుగుతోంది. హైదరాబాద్ హైవే.. ఓవా హోటల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఐరన్ రాడ్‌తో సాయినగర్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను గమనించిన వ్యక్తి పారిపోతూ సాయినగర్‌లో నివాసముంటున్న మెకానికల్ చంద్రయ్య ఇంట్లోకి దూరి, బాత్రూంలో తలదాచుకున్నాడు. వెంటనే ఇంటర్‌సెప్టర్ పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ ముష్క శ్రీనివాస్, ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాత్™Œరూంలో ఉన్న వ్యక్తి లోపల గడియ పెట్టుకోవడంతో పోలీసులు శతవిధాలుగా ప్రయత్నించారు. బాత్రూం లోపలి నుంచి ఐరన్ రాడ్‌తో పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. సీఐ, ఎస్సైలు రెండు కర్రల సాయంతో వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేశారు. రెండు గంటల తర్వాత తలదాచుకున్న వ్యక్తి బయటకు వచ్చి పోలీసుల కళ్లలో కారం చల్లుతూ పారిపోయేందుకు యత్నించాడు. ఈ దాడిలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పారిపోతున్న వ్యక్తిని పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. రైల్వేస్టేషన్ ఏరియాల్లో అప్రమత్తం రైల్వే లైన్ ఉన్న ఏరియాలనే దొంగలు ఎంచుకుంటున్నారు. దోచుకున్న సొత్తుతో దొంగలు రైలు ఎక్కుతూ దర్జాగా పారి పోతున్నారు. గతంలో పార్ధీముఠా సభ్యులు రైల్వే స్టేషన్ ఉన్న రఘునాథపల్లి మండలంలో దిగి ఓ కుటుంబాన్ని పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్ ఏరియాలో గస్తీ పెంచారు. ఈ సందర్భంగా జనగామ ఏసీపీ బాపురెడ్డి మాట్లాడుతూ తాము అదుపులోకి తీసుకున్న వ్యక్తి పార్ధీ ముఠాకు చెందిన వాడు కాదని, విచారణ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఆ ముఠా పనేనా? పోలీసులకు పట్టుబడిన వ్యక్తి ఒకరేనా లేక గ్యాంగ్‌గా వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వచ్చే ముందు బాత్రూం నుంచే హిందీలో మాట్లాడుతూ సిమ్‌కార్డు విరగొట్టాడని స్థానికులు చెబు తున్నారు. ఫోన్ చేసింది ఎవరికి.. సిమ్ విరగ్గొట్టాల్సిన అవసరం ఏమిటనే అనుమానాలను నివృత్తి చేసుకుంటే.. కచ్చితంగా పార్ధీ ముఠా దిగవచ్చనే ప్రచారం జరుగుతోంది. పట్టుబడిన వ్యక్తి నుంచి పోలీసులు సెల్‌ఫోన్‌తోపాటు అస్సాం రాష్ట్రానికి చెందిన ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లి, అక్కడి నుంచి వరంగల్ కమిషనరేట్‌లోని సీసీఎస్‌కు తరలించారు. పోలీసుల అదుపులో ఉన్న అస్సాం యువకుడు -
దొంగనోట్ల ముఠా అరెస్ట్
జనగామ జిల్లా : దొంగ నోట్లను చలామణీ చేస్తోన్న ముగ్గురిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 28వ తేదీన జనగామలో దొంగ నోట్లతో దందా చేస్తుండగా సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒక లక్ష రూపాయల నకిలీ నోట్లు, రెండు కార్లు, ఒక స్కానర్, నోట్ల తయారీ కాగితాలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురిని రిమాండుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జనగామ డీసీపీ ఎం మల్లారెడ్డి తెలిపారు. -
జనగామ జిల్లా ఏర్పడుతుందని నమ్ముతున్నా
జనగామ : ‘జనగామ జిల్లా చేయాలని సీ ఎం కేసీఆర్‌కూ ఉంది.. ఎన్నికల సమయం లో ఇచ్చిన మాట తప్పకూడదని భావిస్తున్నారు..’ అని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లా సాధన కోసం కొనసాగుతున్న రిలే దీక్షల శిబిరాన్ని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యా దగిరిరెడ్డితో కలిసి దయాకర్‌రావు సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లా చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరిన సమయంలో మొదట్లో ప్రజలు సుముఖంగా లేరనే అభిప్రాయం వ్యక్తం చేశారని, మహబూబాబాద్ లాంటి చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్నందున జనగామను కూడా ఆలోచించాలని కోరినట్లు చెప్పారు. జనగామ జిల్లా చేస్తే పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాలకు తోడు అదనంగా రాయపర్తి, తొర్రూరు మండలాల ప్రజలకు ఇష్టం లేకున్నా, ఎలాంటి అభ్యం తరం లేదని సీఎంతో అబద్ధం ఆడాల్సి వచ్చిందన్నారు. స్టేష¯ŒSఘ¯ŒSపూర్లోని మండలాలను సైతం జనగామలో కలిపేందుకు ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ముగ్గురు ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వరెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి జనగామ జిల్లా ఏర్పాటుకు ఏకాభిప్రాయంతో సీఎం వద్దకు వెళ్తామన్నారు. సీఎం ఆలోచనలో మార్పు కనిపిస్తోందని, జిల్లా ఏర్పడుతుందనే పూర్తి విశ్వాçÜం తనకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్స¯ŒS గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, డాక్టర్లు లక్షి్మనారాయణ, రాజమౌళి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, గౌరవాధ్యక్షులు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, బొట్ల శ్రీనివాస్, సంపత్, సతీష్, కనకారెడ్డి పాల్గొన్నారు. -
నేడు జనగామ జనగర్జన
అనుమతి ఇచ్చిన హైకోర్టు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ కోదండరాం, చుక్కా రామయ్య, సీపీఎం, సీపీఐ నాయకుల రాక ఏర్పాట్లు పూర్తిచేసిన జేఏసీ జనగామ : జనగామ జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం జనగర్జన సభ జరగనుంది. సభ నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇంతకుముందు జనగర్జన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు కొన్ని షరతులు విధిస్తూ సభకు అనుమతి ఇచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించుకోవాలని సూచించింది. సభ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో సోమవారం జేఏసీ నాయకులు జనగామలో బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, మద్దూరు, చేర్యాల, లింగాలఘనపురం, రఘునాథపల్లి, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్లతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సభకు జనాన్ని తరలించేందుకు జేఏసీ సన్నాహాలు పూర్తి చేసింది. సభను విజయవంతం చేయడం ద్వారా జనగామ జిల్లా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలియ జేసేందుకు నాయకులు శ్రమిస్తున్నారు. గర్జనకు తరలిరండి : జేఏసీ చైర్మన్ మంగళవారం జనగామ పట్టణంలోని ప్రిస్టన్ మైదానంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే జనగామ జిల్లా జనగర్జన సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ జనగర్జన సభకు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, విద్యావేత్త చుక్కా రామయ్య, సీపీఎం శాసన సభాపక్ష నేత సున్నం రాజయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు హాజరు కానున్నారని చెప్పారు. ఉదయం 9 గంటలకు నెహ్రూ పార్కు నుంచి కళాకారుల విన్యాసాలు, ఒగ్గు కళాకారుల డప్పుచప్పుళ్లతో ర్యాలీగా ప్రిస్టన్ మైదానం అమరవీరుల ప్రాంగణంలోకి చేరుకుంటామన్నారు. ఏర్పాట్లు పూర్తి ప్రిస్టన్ మైదానం(అమరవీరుల)లో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, నాయకులు మేడ శ్రీనివాస్, ఆకుల సతీష్, ఆకుల వేణుగోపాల్, డాక్టర్లు లక్ష్మినారాయణ నాయక్, రాజమౌళి, పజ్జూరి గోపయ్య, పోకల లింగయ్య, బొట్ల చిన శ్రీను, దస్తగిరి, మంగళ్లపల్లి రాజు, తిప్పారపు విజయ్, మాజీద్‌లు పనులను పర్యవేక్షించారు. కోర్టు తీర్పు సభకు అనుకూలంగా రాగానే పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా మైదానంలోని వేదిక వెనకాల వాహనాలను పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చిన ప్రజలకు తాగునీటిని అందించేందుకు 50వేల వాటర్ ప్యాకెట్లను సిద్దం చేశారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులకు ప్రజలను తరలించే బాధ్యతను అప్పగించారు. సభను భారీ స్థాయిలో నిర్వహించేలా జేఏసీ కసరత్తు చేస్తోంది. -
జిల్లా ఏర్పాటు ఖాయం
జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు విషయం లో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నా రు. ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జేఏసీ నాయకులతో కలిసి గురువారం డి ప్యూటీ సీఎం మహమూద్ అలీని కలిశా రు. జనగామ జిల్లాకు ఉన్న అర్హతలు, పూర్తి నివేదికను ఆయనకు సమర్పించా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హన్మకొండ వద్దనే డిమాండ్ పెరుగుతుండడంతో జనగామకు అవకాశాలు మెరుగుపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో మా జీ ఎమ్మెల్యే సీహెచ్ రాజరెడ్డి, జేఏసీ నాయకులు డాక్టర్ రాజమౌళి, పోకల లింగయ్య, పజ్జూరి గోప య్య, పసుల ఏబేలు తదితరులు ఉన్నారు. -
‘జనగామ’ కోసం కదం తొక్కిన జనం
జేఏసీ నాయకులను లాక్కెళ్లిన పోలీసులు ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వేణు, జేఏసీ నేత మాజీద్‌కు గాయాలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట టీఎన్జీవో నాయకుల నిరసన జనగామ : జనగామ జిల్లా ఆకాంక్ష, అక్రమ అరెస్టులకు నిరసనగా శనివారం తలపెట్టిన బంద్‌లో వేలాదిగా తరలివచ్చిన జనం కదం తొక్కారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మహిళా పోలీసులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే జేఏసీ, విద్యార్థిసంఘ నాయకులతో నిండిపోయిన దీక్షా శిబిరం వద్దకు లింగాలఘణపురం, బచ్చన్నపేట, నర్మెట మం డలం నుంచి ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. హైదరాబాద్, వరంగల్, సిద్ధిపేట, విజయవాడ హైవేలపై బైఠాయించి రాస్తారోకో మొదలు పెట్టారు. పది నిమిషాల పాటు ఓపికగా ఉన్న పోలీసులు.. నాయకులను అరెస్టు చేసేందుకు సిద్ధం కావడంతో మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు జక్కుల వేణుమాధవ్, కౌన్సిలర్ మేడ శ్రీను, జేఏసీ నాయకులు మాజీద్, మంగళ్లపల్లి రాజు, శ్రావణ్‌ను బలవంతంగా లాక్కెళ్లి డీసీఎంలో పడేశారు. ఈ క్రమం లో వేణుమాధవ్, మాజీద్‌కు తీవ్రగాయాలు కావడంతో పోలీసులు స్వయంగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో రెచ్చిపోయిన ఉద్యమకారులు మరోసారి జాతీయ రహదారిని దిగ్బంధించారు. అప్పటికే కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలను పంపించే క్రమంలో వాటిని మళ్లీ అడ్డుకున్నారు. మహిళ లు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసుల కు తలనొప్పిగా మారింది. రంగంలోకి దిగిన మహిళా పోలీసులు రెండు గంటల పాటు అతికష్టం మీద మహిళలను పంపించేశారు. లింగాలఘణపురం మండలం టోల వద్దకు తీసుకువెళ్లి స్వయంగా వారిని ఎక్కించి వెళ్లిపోయే వరకు ఉన్నారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో సీఐ తిరుపతి పర్యవేక్షణలో వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్, ఏటూరునాగారం సబ్‌డివిన్‌లోని పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలతో బందోబస్తు కొన సాగిస్తున్నారు. రెవెన్యూ, హెడ్‌పోస్టఫీస్, బ్యాంకుల ఎదుట నిరసన తెలిపిన నాయకులకు టీఎన్జీవో నాయకులు మద్దతు పలికారు. అంతకు ముందు జనగామలో విద్యార్థి సంఘం నేతలు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ము నిసిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, సిద్ధిరాములు, నాగరాజు పాల్గొన్నారు. -
జనగామ జిల్లా లేనట్లే
ప్రతిపాదనల ప్రకారమే ముసాయిదా వేగంగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ భవనాలు, మౌలిక వసతుల కల్పనపై యంత్రాంగం దృష్టి సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియపై స్పష్టత వచ్చింది. వరంగల్ జిల్లాను మూడు జిల్లాలుగా పునర్విభజించాలని జిల్లా యంత్రాంగం గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారమే జిల్లాల పునర్విభజన ముసాయిదా సిద్ధమవుతోందని విశ్వనీయ సమాచారం. వరంగల్, ప్రొఫెసర్ జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ పేర్లతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఉద్యోగులు, సిబ్బంది కేటాయింపులపై ప్రభుత్వానికి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను జిల్లా యంత్రాంగం మరోసారి పరిశీలిస్తోంది. కొత్త జిల్లాల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భవనాలు, ఇతర మౌలికవసతుల కల్పన ప్రక్రియ వేగవంతమైంది. జిల్లాల పునర్విభజనపై జూన్‌లో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 29న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పునర్విభజనపై ప్రతిపాదనలు చేశారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ జిల్లా నేతలకు పునర్విభజనకు సంబంధించిన మ్యాప్‌లను అందజేశారు. జనగామను జిల్లాగా చేసే ప్రతిపాదనలు గతంలో లేకపోవడంతో ముసాయిదాలోనూ ఇదేతీరుగా ఉండనుందని సమాచారం. ఈ నెల 22న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా విడుదల చేయనుంది. అక్టోబరు 11 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన కార్యక్రమాలు మొదలుకానున్నాయి. జిల్లా యంత్రాంగం, జిల్లా నేతలు ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, కమలాపురం, భీమదేవరపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట మండలాలు వరంగల్ జిల్లాలో కలవనున్నాయి. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, ఇల్లందు మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇల్లందు మండలం విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తుది ప్రతిపాదనలు ఖరారు కావాల్సి ఉంది. జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం, దేవరుప్పుల మండలాలను యాదాద్రి జిల్లాలో... చేర్యాల, మద్దూరు మండలాలను సిద్ధిపేటలో కలపడం ఖాయమైంది. మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మల్హర్రావు, మహదేవపూర్ మండలాలు భూపాలపల్లి జిల్లాలో ఉండనున్నాయి. జిల్లాల పునర్విభజనపై ప్రస్తుత ప్రతిపాదనలు... వరంగల్ జిల్లా : వరంగల్, హన్మకొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, హసన్‌పర్తి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, శాయంపేట, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి, రాయపర్తి, రఘునాథపల్లి, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట. ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, మహాముత్తారం, మల్హర్రావు, కాటారం, మహదేవపూర్. మానుకోట జిల్లా : మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, డోర్నకల్, నర్సింహులపేట, మరిపెడ, కురవి, తొర్రూరు, కొడకండ్ల, కొత్తగూడ, గార్ల, బయ్యారం, ఇల్లందు. -
కుట్రలు బహిర్గతం
జనగామ జిల్లాను అడ్డుకుంటున్నారు కలెక్టర్ నివేదిక తప్పుల తడక మాది రెండు వారాల ఉద్యమమేనట.. కడియం శ్రీహరి సాక్షిగా ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ ఎక్కడ? జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి జనగామ : జనగామ జిల్లా కాకుండా అడ్డుకుంటున్న కుట్రలు సమాచార హక్కు చట్టం ద్వారా బట్ట బయలయ్యాయని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రతిపాదనపై ఆర్టీఏ చట్టం ద్వారా వివరాలు కావాలని కలెక్టర్‌ను కోరగా, 92 పేజీల నివేదిక ఇచ్చారని తెలిపారు. అయితే, అదంతా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాక్షిగా ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య లేఖలతో పాటు మండల, గ్రామ పంచాయతీల తీర్మాన కాపీలను జూన్ 16న కలెక్టర్ వాకాటి కరుణకు అందజేశామని వివరించారు. ఇప్పుడు సమాచార హక్కు చట్టంతో అందరి కుట్రలు వెలుగు చూశాయన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఎగిసి పడుతున్న జిల్లా ఉద్యమం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లిందని స్వయాన ఎమ్మెల్యే ఒప్పుకుంటే, రెండు వారాలుగా ఉద్యమం జరుగుతోందని కలెక్టర్ నివేదికలో పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కష్టకాలంలో మొరపెట్టుకోవాల్సిన అధికారే అన్యాయం చేస్తుంటే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని దశమంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేర్యాల, మద్దూరు మండలాలను సిద్దిపేట జిల్లాలో, బచ్చన్నపేట, నర్మెట, జనగామ రూరల్, దేవరుప్పుల, లింగాలఘణపురం మండలాలను యాదాద్రి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపించిన కలెక్టర్.. జనగామ మున్సిపాలిటీని ఎక్కడ కలుపుతారో పేర్కొనకపోవడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. జిల్లాను అడ్డుకుంటున్న అదృశ్య శక్తులు... జనగామ జిల్లా ఏర్పాటును అడ్డుకునేందుకు బలమైన అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని ఈ నివేదిక చూస్తే అర్థమవుతోందని దశమంతరెడ్డి అన్నారు. చేర్యాల, మద్దూరు మండలాలను సిద్దిపేటలో, మిగతా మండలాలను యాదాద్రిలో కలపాలని ఎవరు ప్రతిపాదించారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కాకుంటే ఎమ్మెల్యే, ఎంపీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. తప్పుల తడకగా ఉన్న ఈ నివేదికలను సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సీసీఎల్ దృష్టికి తీసుకుపోతామని, కొత్త ప్రతిపాదన పంపించాలని కోరుతామని అన్నారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ఉద్యమాన్ని అణచి వేయాలని చూస్తున్నారని, మరో 48 గంటల్లో ఎత్తివేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జేఏసీ నాయకులు డాక్టర్ రాజమౌళి, ఆకుల వేణు, మేడ శ్రీనివాస్, మంగళ్లపల్లి రాజు, ఆకుల సతీష్, పోకల లింగయ్య, ధర్మపురి శ్రీనివాస్, పిట్టల సత్యం, మాజీద్, తీగల సిద్దూగౌడ్, పిట్టల సురేష్, చిన్నం నర్సింహులు, రెడ్డి రత్నాకర్ రెడ్డి, వీరస్వామి, ఉడుగుల రమేష్, కిరణ్ ఉన్నారు. -
ఒత్తిడిలో ముత్తిరెడ్డి!
జనగామలో ఆగని జిల్లా సాధన పోరు ఎమ్మెల్యేకు ప్రతికూలంగా పరిణామాలు జిల్లా విషయంలో ఎంపీతో విభేదాలు జేఏసీ నిరసనలతో ఉక్కిరిబిక్కిరి నియోజకవర్గం చీలికతో మరింత ఇబ్బందులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా సాధన ఐక్యకార్యాచరణ సమితి(జేఏసీ) కొనసాగిస్తున్న ఉద్యమ కార్యక్రమాలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి రాజకీయంగా ప్రతికూలంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనగామ జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమాలతో ఈ ప్రాంతంలో తమకు ఇబ్బందులు పెరుగుతున్నాయని టీఆర్ఎస్ ముఖ్యనేతలు సైతం అంగీకరిస్తున్నారు. ఇదే విషయంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మధ్య విభేదాలు తీవ్రమైన సంఘటనను గుర్తుచేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య అంతరం పెరిగి పార్టీకి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగానే... జనగామ జిల్లా ఏర్పాటు ఖాయమనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమైంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సైతం ఇదే విషయాన్ని పలుసార్లు, పలు వేదికలపై ప్రకటించారు. జనగామ జిల్లా సాధన కోసం స్థానికంగా ఐక్యకార్యాచరణ సమితి(జేఏసీ) ఏర్పాటైంది. జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో 116 రోజుల పాటు దీక్షలను చేస్తూ వచ్చింది. జనగామ జిల్లా ఏర్పాటవుతుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలూ లేవని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దీక్ష శిబిరం వద్ద ప్రకటించారు. జేఏసీ దీక్ష విరమించాలని కోరారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఊపందుకోవడంతో పరిస్థితి మారిపోయింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనల్లో జనగామను చేర్చలేదు. దీంతో జిల్లా సాధన కోసం ఉద్యమాలు తీవ్రమయ్యాయి. నిరసనలు, మానవహారాలు, రాస్తారోకోలు, బంద్‌లు జరుగుతూ వచ్చాయి. జేఏసీకి తోడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే గొంతు వినిపించడం మొదలుపెట్టాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఒత్తిడి పెరిగింది. ఈ దశలో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జిల్లా సాధన కోసం జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి తీవ్రమైంది. లాఠీచార్జీలు, అరెస్టులతో జనగామ దద్దరిల్లిపోయింది. ఈ సంఘటన తర్వాత ఉద్యమం కొంత స్తబ్ధుగా ఉంది. అప్పుడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డిరెడ్డి పలు మండలాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం బెయిల్‌పై వచ్చిన జేఏసీ నేతలు మళ్లీ ఉద్యమం మొదలుపెట్టారు. ప్రతిరోజూ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి అధికారిక కార్యక్రమాలు మళ్లీ తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కారక్రమాన్ని గత వారం జనగామలో భారీ స్థాయిలో నిర్వహించినా ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. గతంలో ప్రతిరోజూ నియోజకవర్గంలో పర్యటించే ఎమ్మెల్యే ఇప్పుడు ఆ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడంలేదని జనగామ సెగ్మెంట్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గం ముక్కలు... జిల్లాల పునర్విభజన అంశం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి రెండు రకాలుగా ఇబ్బందులు పెంచుతోంది. జనగామ కేంద్రంగా జిల్లా ఏర్పాటు అంశంపై ఇప్పటికీ అస్పష్టత కొనసాగుతుండడంతో స్థానికంగా ఎమ్మెల్యేపై ప్రతికూలత మొదలైందనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు జిల్లాల పునర్విభజనలో జనగామ నియోజకవర్గం మూడు ముక్కలు అవుతోంది. జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించిన ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం... ఈ ఐదు మండలాలు మూడు జిల్లాల్లో ఉండనున్నాయి. జనగామ, బచ్చన్నపేట మండలాలు యాదాద్రి జిల్లాలో... చేర్యాల, బచ్చన్నపేట మండలాలు సిద్ధిపేట జిల్లాలో... నర్మెట మండలం వరంగల్ జిల్లాలో కలపాలని ప్రభుత్వం ప్రతిపాదనల్లో పేర్కొన్నది. అసెంబ్లీ సెగ్మెంట్ మూడు జిల్లాల్లో ఉంటే... ఎమ్మెల్యేకు రాజకీయపరంగా పట్టు తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది. వేర్వేరు జిల్లాల్లో ఉండే ద్వితీయ శ్రేణి నేతలను ఇప్పటిలా సమన్వయం చేయడం ఆయనకు ఇబ్బందిగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.