మరో అవకాశమివ్వండి: ఎర్రబెల్లి దయాకర్‌రావ | Give One Chance To TRS Party In Palakurthi | Sakshi
Sakshi News home page

మరో అవకాశమివ్వండి: ఎర్రబెల్లి దయాకర్‌రావు

Published Sun, Dec 2 2018 3:34 PM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

Give One Chance To TRS Party In Palakurthi - Sakshi

సాక్షి, రాయపర్తి: మరోసారి అవకాశమివ్వండి.. మంత్రినై వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని టీఆర్‌ఎస్‌ పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. మండలంలోని తిర్మలాయపల్లి, కొండూరు, కొలన్‌పల్లి, కేశవా పురం, గన్నారం, కాట్రపల్లి, బురహాన్‌పల్లి, మొరిపిరాల, గన్నారం గ్రామాల్లో దయాకర్‌రావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి దయాకర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి  చేయలేకపోయానని రెండేళ్లలో టీఆర్‌ఎస్‌లో చేరాక అభివృద్ధి చేశానన్నారు.

తల్లిదండ్రులతోపాటు పిల్లలు సైతం తన గెలుపునకు కృషి చేశారని, యువతకు కోచింగ్‌ సెంటర్లను పెట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. లేదంటే రూ.10 లక్షల సబ్సిడీ రుణాలను అందించి వారు ఆర్థికాభివృద్దిని సాధించేలా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రముఖ గాయని మధుప్రియ దయాకర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాటల ద్వారా వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జినుగు అనిమిరెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్‌ నర్సింహానాయక్, సురేందర్‌రావు, ఎంపీపీ విజయ, జెడ్పీటీసీ సభ్యురాలు  యాకమ్మ, రంగు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement