![Gang Held For Selling Anti Black Fungus Injections In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/17/cp.jpg.webp?itok=pFxN-dM0)
సాక్షి, హైదరాబాద్: బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి, 28 అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీ కుమార్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్‌ఆర్ నగర్, బంజారాహిల్స్‌లో ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఈ ముఠా.. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.35 వేల నుంచి రూ.50 వేల చొప్పున అమ్ముతున్నారు. మొదటి గ్యాంగ్‌లో ఐదుగురిని, రెండో గ్యాంగ్‌లో నలుగురిని అరెస్ట్ చేశామని.. మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. బ్లాక్‌మార్కెట్‌లో ఇంజెక్షన్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు.
చదవండి: ఏమిటి జోకర్ యాప్స్.. బహుపరాక్
ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం..
Comments
Please login to add a commentAdd a comment