black market
-
ఫ్యాన్స్ ముసుగులో యథేచ్చగా బ్లాక్ మార్కెట్!!
నరసరావుపేట టౌన్: సగటు మానవుడి వినోదం సినిమా. అభిమాన హిరో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంటాడు. కుటుంబ సమేతంగా వెళ్లి చూద్దామనుకుంటాడు. కాని బెనిఫిట్ షో, అదనపు షోల పేరుతో ధరల దోపిడీ చేస్తుంటారు. సినిమా చూసే పరిస్థితి ఉండేది కాదు. ఇదీ ఒకప్పటి మాట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ ధరలకు కళ్లేం వేశారు. అయితే థియేటర్ నిర్వాహకులు శుక్రవారం అక్రమాలకు తెరదీశారు. థియేటర్ల వద్ద యథేచ్ఛగా బహిరంగా టికెట్లు అమ్మిస్తూ సొమ్ము చోటుచేసుకున్నారు. మూడు బ్లాక్ టికెట్లు.. ఆరు షోలు శుక్రవారం విడుదలైన యువ హిరో సినిమా నాలుగు షోలకు బదులు ఐదు షోలు వేశారు. టికెట్లన్ని ఆన్లైన్లో విక్రయించాల్సి ఉండగా టికెట్ రూ.300 నుంచి రూ.500 వరకు బ్లాక్‌లో విక్రయించారు. నిబంధలనకు విరుద్ధంగా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. అధిక ధరకు విక్రయిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమాలు ప్రదర్శించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. థియేటర్లలో తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు టికెట్లు, తినుబండారాలు విక్రయించినట్టు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. –రమణానాయక్, తహసీల్దార్ ఫ్యాన్స్ ముసుగులో బ్లాక్ మార్కెట్ థియేటర్ల వద్ద యథేచ్ఛగా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. నిర్వాహకులను ప్రశ్నిస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లకు టికెట్లు విక్రయించినట్టుగా చెబుతున్నారు. అధిక ధరలపై అధికారులు దృష్టి సారించి బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలి. –షేక్ ఫారూక్, ప్రేక్షకుడు జేబుకు చిల్లు ఫ్యామిలీతో సినిమాకు వెళితే రూ.2వేలు ఖర్చు అవుతోంది. అధిక ధరలకు టికెట్ కొనాల్సి వస్తుంది. దీంతో పాటు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్‌లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలు సినిమాకు వెళ్లాలి అంటేనే భయం వేస్తోంది. –షేక్‌గౌస్, ప్రేక్షకుడు చదవండి: గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా.. -
బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి, 28 అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీ కుమార్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్‌లో ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఈ ముఠా.. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.35 వేల నుంచి రూ.50 వేల చొప్పున అమ్ముతున్నారు. మొదటి గ్యాంగ్‌లో ఐదుగురిని, రెండో గ్యాంగ్‌లో నలుగురిని అరెస్ట్ చేశామని.. మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. బ్లాక్మార్కెట్లో ఇంజెక్షన్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. చదవండి: ఏమిటి జోకర్ యాప్స్.. బహుపరాక్ ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం.. -
బ్లాక్ మార్కెట్లో బ్లాక్ ఫంగస్ ఔషధం
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడ్డ కొంతమందిలో బయటపడుతున్న బ్లాక్ ఫంగస్ వ్యాధి ‘నల్ల దళారీ’లకు కొత్త వ్యాపారంగా మారింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే యాంఫైట్ 50 ఎంజీ ఇంజెక్షన్లనూ అదేబాట పట్టిస్తున్నారు. ఇలా బ్లాక్ మార్కెట్లో మందులు విక్రయిస్తున్న ఓ నలుగురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదు యాంఫైట్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. పీర్జాది గూడకు చెందిన నరిమెల్ల యాదయ్య మెడిసిన్స్ సప్లయర్‌గా, బండ్లగూడకు చెందిన పి.సతీశ్, కోఠికి చెందిన సాయికుమార్లు మెడికల్ షాపుల్లో, మణికొండకు చెందిన బి.రాజశేఖర్‌రెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నారు. ఇటీవల బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో దీనికి వాడే ఇంజెక్షన్లకు డిమాండ్ రావడంతో యాంఫైట్ ఇంజెక్షన్లను అక్రమంగా సేకరించారు. ఒక్కొక్కటి రూ.7,858 ఖరీదు చేసే వాటిని రూ.50 వేలకు అమ్మడానికి సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు వలపన్ని నలుగురినీ పట్టుకుని అరెస్టు చేశారు. -
బ్లాక్‌మార్కెట్‌పై సీఎం సీరియస్: హోంమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలా.. వద్దా అనే విషయంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో కరోనా సెకండ్ వేవ్, నైట్ కర్ఫ్యూ, ఔషధాల బ్లాక్‌మార్కెట్, రంజాన్ ప్రార్థనలు తదితర విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా మొదటివేవ్లో పోలీసుశాఖ సమర్థంగా పనిచేసిందని, ప్రస్తుతం సెకండ్‌వేవ్‌లోనూ మరింత మెరుగ్గా పనిచేస్తోందని కితాబిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు, వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, రెమిడెసివిర్ తదితర ఇంజెక్షన్లతో సహా ఇతర అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు. కొందరు ప్రజలు భయంతోనో లేదా ముందుజాగ్రత్తతోనే ఆక్సిజన్ సిలిండర్లు కొని ఇంట్లో పెట్టుకుంటున్నారని.. దీంతో సిలిండర్ల కొరత ఏర్పడే ప్రమాదముందని, అనవసరంగా కొన్న మందులు కూడా పాడైపోతాయని చెప్పారు. అదే సమయంలో కొందరు ఆక్సిజన్, రెమిడెసివిర్, ఇతర అత్యవసర మందులను నల్ల బజారులో విక్రయిస్తున్నారని, వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రాణాలు కాపాడే ఔషధాలను నల్లబజారులో విక్రయిస్తుండటంపై సీఎం సీరియస్‌గా ఉన్నారని మహమూద్ అలీ చెప్పారు. ప్రజలంతా తప్పకుండా భౌతికదూరం పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, రాచకొండ కమిషనర్ మహేశ్ భాగవత్ పాల్గొన్నారు. కాగా, సమీక్ష సమావేశం అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. ఈనెల 30వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది కదా? లాక్డౌన్ పెడతారా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. రాష్ట్రంలోని పరిస్థితులపై త్వరలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. వాస్తవానికి సీఎంకు లాక్డౌన్ పెట్టడం ఇష్టం లేదని చెప్పారు. కాగా, రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఇలాగే జాగ్రత్తలు పాటిస్తే మరో 3–4 వారాల్లో వైరస్ అదుపులోకి వస్తుందని.. అలాంటప్పుడు లాక్డౌన్ పెట్టాలనే ఆలోచనే ఉండదని పేర్కొన్నారు. -
కరోనా వ్యాక్సిన్ బ్లాక్ దందాకు చెక్: ముఠా అరెస్ట్
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర రూపంలో దాడి చేస్తుండగా ఇదే అవకాశంగా భావించి కొందరు దుండగులు కరోనా వ్యాక్సిన్‌ను అక్రమంగా విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఒక్కో వ్యాక్సిన్ రూ.40 వేల నుంచి లక్షకు పైగా విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటుండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమంగా వ్యాక్సిన్ విక్రయిస్తున్న వారిని హైదరాబాద్ పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెమిడిసివీర్ ఇంజెక్షన్లు బ్లాక్‌లో అమ్ముతున్న ఆరుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రెమిడిసివిర్ 6 ఇంజెక్షన్లు, నగదు రూ.5,52,000, ఒక యాక్టివా, 6 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్ చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు -
లాక్డౌన్ : మద్యం బ్లాక్ దందా..
సాక్షి, నిజామాబాద్: లాక్డౌన్ పీరియడ్‌లో మద్యం వ్యాపారుల దోపిడీకి అంతులేకుండా పోయింది. మద్యం ప్రియుల బలహీనతను సొమ్ముగా మార్చుకుంటున్నారు. వైన్స్ షాపులు, బార్లలోని మొత్తం స్టాక్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. ఎమ్మారీ్పకి నాలుగింతల రేట్లకు మద్యం బాటిళ్లను అమ్ముతున్నారు. మద్యం తాగటం బలహీనతగా మారిన కొందరు గత్యంతరం లేని స్థితిలో కొనుగోలు చేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. వారం రోజులుగా ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు గుట్టుచప్పుడు సాగుతున్నాయి. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యం మారింది. ఇప్పుడిది అంతటా హాట్ టాపిక్‌గా మారింది. అడ్డుకోవాల్సిన వారే అండగా.. మద్యం బ్లాక్ మార్కెట్లో అమ్ముడవుతుంటే మరోవైపు ఎక్సైజ్‌శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. మద్యం అక్రమంగా విక్రయిస్తే పట్టుకొని కేసులు నమోదు చేయాల్సిన వారే అక్కమార్కులకు అండగా ఉంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజృంభిస్తున్న కల్తీకల్లు.... మరో వైపు కల్తీకల్లు విజృంభిస్తోంది. నగరంలో, జిల్లాలో కల్లు డిపోలు , కల్లు దుకాణాలు ఎక్కడికక్కడ మూతపడిన విషయం తెలిసిందే. అయితే కల్లు విషయంలో సైతం రూ.10 నుండి 20 లోపు ఉండే సీసా ధర ఇప్పుడు ఏకంగా రూ.50 పైనే విక్రయాలు జరుపుతున్నారు. మా దృష్టికి వస్తే లైసెన్స్ రద్దు చేస్తాం జిల్లాలో , నిజామాబాద్ నగరంలో ఎక్కడైన సరే అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపడం నేరం. దీనిపైన ఎవరైన మాకు కచ్చితమైన సమాచారంతో ఫిర్యాదు చేస్తే సంబంధిత మద్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని లైసెన్స్‌ను రద్దుచేయడం చేస్తాం. ఈ విషయంపై మూడు టీమ్‌లు సిద్ధం చేస్తున్నాం. ఎవరు కూడా అక్రమంగా మద్యం , కల్తీకల్లు విక్రయించవద్దు. – డాక్టర్ నవీన్‌చంద్ర, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
జియో సిమ్ల బ్లాక్ మార్కెట్‌కు తెరతీసిందెవరు?
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : మూడు నెలల పాటు అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్, ఉచిత డేటా వంటి సంచలనమైన ఆఫర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో సిమ్‌లను దక్కించుకునేందుకు వినియోగదారులు పడరాని పాట్లు పడుతుంటే, సర్వర్ ఫెయిల్యూర్ వంటి కుంటి సాకులతో జియో సిమ్‌లను కస్టమర్లకు అందిచడంలో రిలయన్స్ స్టోర్లు జాప్యం చేస్తున్నాయని వెల్లడవుతోంది. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెరతీశారని తెలుస్తోంది. ఒక్క సిమ్‌కు రూ.200 నుంచి రూ. 400ల వరకు చార్జ్ చేస్తున్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల రిలయన్స్ స్టోర్స్‌లో జియో సిమ్‌లు కొనుక్కోవాలని అలుపు సొలుపు లేకుండా వేచిచూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోందట. సర్వర్ పనిచేయకపోవడంతో వారు ఖాళీ చేతులతో ఇంటి బాట పట్టాల్సి వస్తోంది. ఓపిక నశించిన కస్టమర్లు సర్వరు ఎలా పనిచేయడం లేదో చూపించడంటూ రిలయన్స్ స్టోర్స్ ఉద్యోగులను గట్టిగా ప్రశ్నిస్తున్నారు కూడా. అయితే స్థానిక షాపులో మాత్రం రూ.300కు ఈ సిమ్‌లు లభ్యం మవుతుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇతర దుకాణాల వారు వెంటనే యాక్టివేట్ కూడా చేసి ఇస్తున్నారని తిలక్ నగర్‌కు చెందిన ఓ కస్టమర్ చెప్పారు. మరి సర్వర్లు పనిచేయనప్పుడు వారు ఎలా యాక్టివేట్ చేస్తున్నారని ప్రశ్నించిన ఆ కస్టమర్‌కు స్టోర్ ఆపరేటర్ చిర్రెత్తుకొచ్చే సమాధానం చెప్పారని తెలిసింది. అక్కడ దొరికితే మరి ఇక్కడేం చేస్తున్నారు, వెళ్లి కొనుక్కోడంటూ ఉచిత సలహా ఇచ్చాడని కస్టమర్ వాపోయారు. సాగర్‌పుర్, సదార్ బజార్ వంటి ప్రాంతాల్లో రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ స్టోర్లలో ఇలాంటి పరిస్థితే నెలకొందని కస్టమర్లు వెల్లడిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటలకొద్దీ క్యూలో నిల్చున్న రిలయన్స్ స్టోర్ సర్వర్లు మాత్రం పనిచేయడం లేదని, తమకు సిమ్‌లు లభ్యం కావడం లేదంటున్నారు. రిలయన్స్ స్టోర్సే వారి స్వలాభాలకు స్థానిక టెలికాం షాపులకు రిలయన్స్ జియో సిమ్‌లను విక్రయిస్తున్నారని, ఇక్కడ సర్వర్లు పనిచేయడం లేదంటూ కుంటి సాకులు చెబుతున్నట్టు ఆరోపిస్తున్నారు. అయితే స్థానిక టెలికాం దుకాణాలు సైతం వారికి జియో సిమ్‌లు ఎక్కడ లభ్యమయ్యాయో మాత్రం వెల్లడించలేదంట. బిజినెస్ సీక్రెట్స్ బయటికి చెప్పకూడదని వారు చెబుతున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్‌కు రిలయన్స్ స్టోర్లే తెరతీసాయంటూ కస్టమర్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.