ధియేటర్
నరసరావుపేట టౌన్: సగటు మానవుడి వినోదం సినిమా. అభిమాన హిరో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంటాడు. కుటుంబ సమేతంగా వెళ్లి చూద్దామనుకుంటాడు. కాని బెనిఫిట్ షో, అదనపు షోల పేరుతో ధరల దోపిడీ చేస్తుంటారు. సినిమా చూసే పరిస్థితి ఉండేది కాదు. ఇదీ ఒకప్పటి మాట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టికెట్ ధరలకు కళ్లేం వేశారు. అయితే థియేటర్ నిర్వాహకులు శుక్రవారం అక్రమాలకు తెరదీశారు. థియేటర్ల వద్ద యథేచ్ఛగా బహిరంగా టికెట్లు అమ్మిస్తూ సొమ్ము చోటుచేసుకున్నారు.
మూడు బ్లాక్ టికెట్లు.. ఆరు షోలు
శుక్రవారం విడుదలైన యువ హిరో సినిమా నాలుగు షోలకు బదులు ఐదు షోలు వేశారు. టికెట్లన్ని ఆన్‌లైన్‌లో విక్రయించాల్సి ఉండగా టికెట్ రూ.300 నుంచి రూ.500 వరకు బ్లాక్‌లో విక్రయించారు. నిబంధలనకు విరుద్ధంగా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి.
అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమాలు ప్రదర్శించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. థియేటర్లలో తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు టికెట్లు, తినుబండారాలు విక్రయించినట్టు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
–రమణానాయక్, తహసీల్దార్
ఫ్యాన్స్ ముసుగులో బ్లాక్ మార్కెట్
థియేటర్ల వద్ద యథేచ్ఛగా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. నిర్వాహకులను ప్రశ్నిస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లకు టికెట్లు విక్రయించినట్టుగా చెబుతున్నారు. అధిక ధరలపై అధికారులు దృష్టి సారించి బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలి.
–షేక్ ఫారూక్, ప్రేక్షకుడు
జేబుకు చిల్లు
ఫ్యామిలీతో సినిమాకు వెళితే రూ.2వేలు ఖర్చు అవుతోంది. అధిక ధరలకు టికెట్ కొనాల్సి వస్తుంది. దీంతో పాటు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్‌లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలు సినిమాకు వెళ్లాలి అంటేనే భయం వేస్తోంది.
–షేక్‌గౌస్, ప్రేక్షకుడు
చదవండి: గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా..
Comments
Please login to add a commentAdd a comment