Jr NTR Fans Buy Entire Theatre For RRR Movie: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్‌ల మానియే కనిపిస్తుంది. మార్చి 11న రాధేశ్యామ్, మార్చి 25న ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెరికాలో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టికెట్ల బుకింగ్ ప్రారంభమై రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈమూవీ కోసం ఇటూ మెగా ఫ్యాన్స్ అటూ నందమూరి ఫ్యాన్స్ ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా బజ్ నెలకొంది.
చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంకా ఆర్‌ఆర్‌ఆర్ విడుదలకు రెండు వారాలపైనే సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే ఈ మూవీ టికెట్స్ ఓ రేంజ్‌లో సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఏకంగా థియేటర్ మొత్తాన్నే కొన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది అమెరికాలో చోటుచేసుకోవడంతో మరింత ఆసక్తిని సంతరించుకుంది. ఫ్లోరిడాలోని ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రీమియర్ చూసేందుకు ఏకంగా ఓ థియేటర్ అంతా బుక్ చేసుకున్నారట.
చదవండి: జ్యోతిష్యాన్ని నమ్మను కానీ.. బాహుబలి విజయం తర్వాత
ఫ్లోరిడాలోని సినిమార్క్ టిన్‌సెల్‌టౌన్‌లో సాయంత్రం 6 గంటల షో కోసం అన్ని ప్రీమియర్ టికెట్స్ బుక్ చేసుకొని ఎన్టీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అసలే భారీ సినిమా, పైగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒకే థియేటర్‌లో కూర్చొని ప్రీమియర్ చూస్తుంటే ఇక ఆ హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కాగా దర్శక ధీరుడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో తారక్ కొమురంభీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కాగా.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, శ్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment