విజయనగరం టౌన్: గర్భసంచి అమ్మకాలకు సంబంధించిన ముఠాలో కీలక నిందితురాలు జ్యోతిని, ఆమెతో పాటూ మరో వ్యక్తిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గర్భసంచిని ఇస్తే మనిషికి రూ.8 లక్షల వరకూ ఇస్తానంటూ సుమారు ఎనిమిది మంది మహిళలను మభ్యపెట్టి, వారి నుంచి పరీక్షల నిమిత్తం రూ. 3లక్షలకు పైగా వసూలు చేసిన కిలేడీపై బాధితుల పిర్యాదు మేరకు కొద్దిరోజుల కిందట టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా ఆదివారం రాత్రి ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ గర్భసంచి అమ్మకాల ముఠా వెనుక ఎవరెవరూ ఉన్నారు. రాజకీయ నాయకులు ప్రమేయమేమైనా ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment