2500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం | Hyderabad Crime Police Held Red Sandal Smuggling Gang And Seized 2500 Kg Wood | Sakshi
Sakshi News home page

ముఠా అరెస్టు: 2500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం

Published Thu, Nov 7 2019 3:50 PM | Last Updated on Thu, Nov 7 2019 8:04 PM

Hyderabad Crime Police Held Red Sandal Smuggling Gang And Seized 2500 Kg Wood - Sakshi

సాక్షి, హైదరబాద్‌:  అంతర్‌రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లింగ్‌ దొంగల ముఠాను హైదరాబాద్‌ సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు క్రైం డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌ అంజనీ కూమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎర్రచందనాన్ని కడప జిల్లా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తుండగా ఈ ముఠాలోని నలుగురిని అరెస్టు చేశామని.. వారి నుంచి 2500 ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా దీని విలువ దేశ మార్కెట్‌లో దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ముఠాకి గ్యాంగ్‌ లీడరైన రాధాకృష్ణతో పాటు చంద్ర, చిన్నయ్య, రాం సేవక్‌ కుమార్‌లను అరెస్టు చేశామని, ఈ ముఠాలోని మెయిన్‌ సప్లయర్‌ శివ కుమార్‌ పరారీలో ఉన్నట్లు కమిషనర్‌ వెల్లడించారు.

కాగా ఈ ముఠా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాలో స్మగ్లింగ్‌ చేస్తుందని, రాధాకృష్ణకు మొదట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుండేవాడని, వ్యాపారంలో నష్టం రావడంతో కలప స్మగ్లింగ్‌ను ప్రారంభించినట్లు కమిషనర్‌ తెలిపారు. ఈ ముఠా లంకమండల రిజర్వ్‌ ఫారెస్టు సుద్దపహలో కేజీకి రూ.400 వందల చొప్పున అమ్ముతుందని, నిందితుల నుంచి కోటి రూపాయల విలువ చేసే 2500 కేజీల కలపతో పాటు 5 సెల్‌ఫోన్‌లను, హోండా సిటి  కారులను స్వాధీనం చేసుకున్నామని, త్వరలోనే పరారీలో ఉన్న సప్లయర్‌ శివను పట్టుకుంటామని కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement