పోలీసుల అదుపులో నిందితులు
అమీర్‌పేట : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. సబ్ ఇన్స్‌పెక్టర్ వీరస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. మేడ్చల్‌కు చెందిన రమేష్‌బాబు, నాగేష్ అమీర్‌పేట, మధురానగర్‌లో కన్సల్టెన్సీల పేరుతో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. రెండు కార్యాలయాలకు భరత్ అనే వ్యక్తి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రము ఖ కంపెనీలకు చెందిన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లను ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్న వీరు నకిలీ సర్టిఫికెట్లు అంటగట్టి నిరుద్యోగుల నుండి లక్షల్లో డబ్బులు దండుకునేవారు. దీనిపై సమాచారం అందడంతో పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్‌పెక్టర్ భాస్కర్‌రెడ్డి అమీర్‌పేట, మధురానగర్ లోని కార్యాలయాలపై దాడులు నిర్వహించి నిందితులు రమేష్‌బాబు, నగేష్, భరత్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి ఫాం 16, వివిధ కంపెనీలకు చెందిన సర్టిఫికెట్లు, స్టాంపు లు ఐడీ కార్డులతో పాటు రూ.6500 నగదు,12 సీపీయూలు, 9 మానీటర్లు, 5 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్, 2 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment