Ameerpeta
-
అమీర్‌పేట: బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి..
సాక్షి, అమీర్‌పేట: బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చేలోగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఇంట్లో దొంగలు పడి కిలో బంగారు అభరణాలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ రాజీవ్‌నగర్‌లో గురువారం చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సాయినివాస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 301లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు లక్ష్మి కుమారి నివాసం ఉంటోంది. ప్రకాశం జిల్లాలో బంధువు చనిపోవడంతో మంగళవారం కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. గురువారం తిరిగి వచ్చేసరికి ఫ్లాట్ మెయిన్ డోర్ తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బెడ్రూమ్లోని బీరువా తెరిచి ఉండటంతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన కిలో బంగారు అభరణాలు,ఫ్లాట్ విక్రయించగా వచ్చిన రూ. 22 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: లైంగిక నేరం: మహిళకు 100 కొరడా దెబ్బల శిక్ష! -
అమీర్‌పేట: భర్తకు బెయిల్ ఇప్పిస్తానని.. ఓయో లాడ్జికి రప్పించి
Ameerpet: జైలులో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి కత్తితో మహిళను బెదిరించి లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాలానగర్‌కు చెందిన మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. బాలానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఎం.డి.జహంగీర్ ఆమె భర్తతో స్నేహం ఉండటంతో తరచూ ఇంటికి వచ్చేవాడు. గత ఏడాది గంజాయి కేసులో ఆమె భర్త జైలుకు వెళ్లాడు. చదవండి: కన్నతల్లి దాష్టీకం.. కొడవలితో నరికి చిన్నారి హత్య ఆ సమయంలో ఇంటికి వచ్చిన జహంగీర్ నీ భర్తకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయవాదిని కూడా తానే ఏర్పాటు చేస్తానని చెప్పాడు. లాయర్‌తో మాట్లాడాలని ఎస్ఆర్నగర్లోని ఎస్వీఆర్ ఓయో లాడ్జికి రప్పించి ఆమెను కత్తితో బెదిరించి లైంగిక పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే నీ కుమారుడితో పాటు భర్తను చంపుతానని బెదిరించాడు. గత కొద్ది రోజులుగా జహంగీర్ లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో బాధితు రాలు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎస్‌ఆర్‌నగర్‌కు బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: మరో మహిళతో సఖ్యత.. భారీ స్కెచ్.. డామిట్ కథ అడ్డం తిరిగింది.. -
బిర్యానీ ఇవ్వలేదని కరెంట్ కట్
అమీర్‌పేట: కరెంటు బిల్లులు చెల్లించినా బిర్యానీ ఇవ్వడం లేదన్న కోపంతో హోటల్‌కు కరెంటు సరఫరాను నిలిపివేశారని బల్కంపేటలో గల క్రిస్టల్ బావర్చి హోటల్ నిర్వా హకుడు ఆరోపించారు. హోటల్‌కు సంబంధించి మూడు కరెంటు మీటర్లు ఉన్నాయి. ఒక మీటరుకు రూ. 39,566, రెండో మీటర్‌కు రూ. 4,529, మూడో మీటర్‌కు రూ. 9,682ల కరెంటు బిల్లు వచ్చింది. పై రెండు మీటర్లకు సంబంధించి బిల్లులు 25న చెల్లించగా మూడో మీటర్ బిల్లును 29న చెల్లించామని హోటల్ నిర్వాహకుడు సైయ్యద్ హస్మతుల్లా ఖాద్రి తెలిపారు. ఉదయం కరెంటు సిబ్బంది సుధీర్‌కుమార్, రాజు, జీఎన్ రావులు హోటల్‌కు వచ్చి బిల్లులు చెల్లించని కారణంగా కరెంటును కట్ చేస్తున్నామని తెలిపారు. ఫోన్ పే ద్వారా రెండు బిల్లులు చెల్లించామని, ఓ బిల్లు ఈ రోజే చెల్లించామని, ఫోన్లో చెల్లించినట్లు ఉన్న స్క్రీన్ షాట్‌ను కూడా చూపించారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా మూడు మీటర్లకు కరెంటును కట్ చేశారు. హోటల్ యజమాని వచ్చే వరకైనా ఆగాలని హోటల్ సిబ్బంది నవీద్ వేడుకోగా మీ సార్... వచ్చేదాక ఆగాలా అంటూ కరెంటు కట్ చేసి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఒక మీటర్‌కు ఆలస్యమైతే మూడు మీటర్లకూ కట్ చేస్తారా.. మూడో మీటర్ ఒక్క దానికి బిల్లు చెల్లింపు ఆలస్యం జరిగితే మూడు మీటర్లకు విద్యుత్ సరఫరా ఎలా నిలిపివేస్తారని యజమాని ఖాద్రి వాపోయాడు. ఉదయం నుంచి కరెంటు లేకపోవడంతో ఆహార పదార్థాలు అన్ని పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ( చదవండి: కరోనా బాధితులకు గుడ్ న్యూస్: ఫోన్ కొడితే.. ఇంటి వద్దకే.. ) -
వదినపై ముగ్గురు మరుదులు అత్యాచారం
సాక్షి, అమీర్‌పేట: భర్త సమక్షంలోనే అతని సోదరులు అత్యాచారం చేశారని ఓ మహిళ కోర్టును ఆశ్రయిందింది. వారిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఎస్ఆర్నగర్ పోలీసులను ఆదేశించడంతో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బోరబండ ఇంద్రానగర్‌లో నివాసముంటున్న నర్సింహ మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. దీంతోపాటు తన సోదరులతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు. మరుదులైన కృష్ణ, శ్రీనివాస్, మునీందర్‌లు కూడా వేధించారు. 2017లో భార్యను నిర్భందించి సోదరుల చేత లైంగిక దాడికి సహకరించాడు. బాధితురాలు కోర్టును ఆశ్రయించగా మంగళవారం కేసు నమోదు చేశామన్నారు. -
అమీర్‌పేట బస్టాండ్ వద్ద పోకిరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్న యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకా పోలీసులపై దాడికి యత్నించిన పోకిరీని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువతి బంజారాహిల్స్‌లోని తన సోదరుని ఇంటికి ఈ నెల 3న వచ్చింది. శనివారం రాత్రి తిరిగి తన సొంత గ్రామానికి వెళ్లేందుకు అమీర్‌పేట బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి చూస్తోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించగా నా పేరు మహేష్ నాతో రావాలంటూ ఆమెపై దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహేష్‌ని నిలువరించే ప్రయత్నం చేయగా వారిపై తిరగబడి దాడికి యత్నించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. -
'తెలంగాణలోను పార్టీనీ బలోపేతం చేస్తాం'
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అమీర్‌పేటలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిస్కరించి కేక్‌ను కట్‌చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నాడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కుమ్మక్కై వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఏపీ వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసి వారి సమస్యలను పరిష్కరించడమే ఎజెండాగా మేనిఫెస్టో రూపొందించారు. అనంతరం జరిగిన ఎన్నికలలో పార్టీ అఖండ విజయం సాధించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని, త్వరలో ఇక్కడ కూడా మంచి రోజులు వస్తాయని వెల్లడించారు. -
సీబీఐ పేరుతో జ్యోతిష్యుడికి టోకరా
సాక్షి, హైదరాబాద్: సీబీఐ అధికారులమంటూ 25 తులాల బంగారు ఆభరణాలతో పరారయిన సంఘటన అమీర్‌పేటలో చోటు చేసుకుంది. వివరాలు.. జగదీష్ అనే జ్యోతిష్యుడు అమీర్‌పేట అన్నపూర్ణ బ్లాక్‌లో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆరుగురు వ్యక్తులు సీబీఐ అధికారులమంటూ జగదీష్ కార్యాలయంలో ప్రవేశించారు. తనిఖీల పేరుతో సోదాలు జరిపి 25 తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యారు. మోసపోయానని తెలుసుకున్న జగదీష్ ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. -
ప్రజల సహకారంతో మెరుగైన సేవలు
హైదరాబాద్: ప్రభుత్వంతోపాటు అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే హైదరాబాద్‌లో అమెరికా దౌత్య కార్యాలయం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా అన్నారు. నగరంలో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమీర్ పేట మెట్రోరైలు స్టేషన్లో బుధవారం ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలసి ఆమె ప్రదర్శనను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి రాష్ట్రంలో పర్యటించిన ఫొటోలు ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచాయని అన్నారు. ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 2006 సంవత్సరంలో నగర పర్యటనకు వచ్చిన జార్జిబుష్ హైదరాబాద్‌లో దౌత్య కార్యాలయ ఏర్పాటుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఫొటో ప్రదర్శన రెండు రోజుల పాటు ఉంటుందని తెలిపారు. -
0.0 ఈ ప్రపంచం మనుషుల కోసమే కాదు...
ప్రదేశం: అమీర్‌పేట్, హైదరాబాద్దృశ్యం: ఒకాయన ఇరానీ చాయ్ తాగుతూ సెల్ఫోన్లో మాట్లాడుతున్నాడు...\ ‘‘హలో లింగమూర్తి, ఎలా ఉన్నావు? బాగానే ఉండి ఉంటావులే. అది సరేగానీ ఏమిటీ విశేషాలు? నా బొంద, విశేషాలేముంటాయి... రోజూ తినడం తొంగోవ్వడమే కదా నీ పని, అది సరే, హెల్త్ ఎలా ఉంది, నా బొంద, అది ఎక్కడ బాగుంటుంది, నీకు మందు సిగరెట్లు లేనిది గడవదాయే! పిల్లాడు బాగా చదువుతున్నాడా, నా బొంద, వాడెక్కడ చదువుతాడు...అన్నీ నీ పోలికలే వాడికి, పొట్ట చీల్చిన అక్షరం ముక్క కనిపించదు. అరే మరిచిపోయాను. మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. నా బొంద, మీదో తొక్కలో ఫ్రెండ్షిప్, ఎవడైనా ఆపదలో ఉంటే ఒక్కడూ కనిపించడు. మీ మామగారు ఎలా ఉన్నారు? దిట్టంగా ఉండి ఉంటాడులే. పనా పాటా! పొద్దున్నంత పేకాడడం, రాత్రయితే మందుకొట్టడమే కదా ఆయన పని...’’ కొద్దిసేపటి తరువాత... ‘ఠాప్’ అని పెద్దగా సౌండ్ వినిపించింది. సెల్‌ఫోన్ గాల్లోకి ఎగిరిపోయింది! ప్రదేశం: ఏలూరు రోడ్, విజయవాడ దృశ్యం: ఒక సెలూన్లో గెడ్డం చేయించుకుంటున్న నాగభూషణం సెల్ఫోన్లో మాట్లాడుతున్నాడు... ‘‘మనకు కొన్ని అలవాట్లుంటాయి నాగేçశ్వర్రావు. అవి మంచివనుకో, చెడ్డ వనుకో. కానీ అలవాటు అలవాటే కదా. సెలూన్లో గెడ్డం గీసుకుంటున్నప్పుడు సైలెంట్‌గా కూర్చోవాలి. నీకు తెలుసుకదా నాగేశ్వర్రావు... నేను సైలెంట్‌గా కూర్చోలేను. గెడ్డం చేయించుకుంటున్నప్పుడు కూడా సెల్ఫోన్లో ఎవరో ఒకరితో మాట్లాడుతుంటాను. నీకు తెలుసు కదా నాగేశ్వర్రావు... మాట్లాడుతున్నప్పుడు రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాను. బాడీని రకరకాలుగా కదిలిస్తుంటాను. అలా కదిలించినప్పుడల్లా ముఖం మీద కత్తిగాట్లు పడుతుంటాయి. సెలూన్ నుంచి నేను వెళ్లేది హాస్పిటల్‌కే. అయినా నేను ఈ పాడు అలవాటును మానుకోలేకపోతున్నాను నాగేశ్వర్రావు. చంద్రబింబంలాంటి ముఖం నీది అనే వాళ్లు గర్ల్‌ఫ్రెండ్స్. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా నాగేస్వర్రావు... చంద్రబింబం మాటేమిటోగానీ ఇప్పుడు నా ముఖం మీద కత్తి గాటు లేని ఏరియా లేదంటే నమ్ము...’’ కొద్ది సేపటి తరువాత... ‘ఠాప్’ అని సౌండ్ వినిపించింది. సెల్‌ఫోన్ గాల్లోకి ఎగిరిపోయింది! ప్రదేశం: నేషనల్ హైవే 18 (కర్నూల్–చిత్తూరు) దృశ్యం: ‘‘హలో ప్రసాదు. నేను డ్రైవింగ్‌లో ఉన్నాను. ఏమిటి విశేషాలు? ఆ... ఎప్పుడు? ఎలా? ఛాఛాఛా... డ్రైవ్ చేస్తూ సెల్ఫోన్లో మాట్లాడుతుంటే యాక్సిడెంట్ కాకుండా గాడిద గుడ్డవుతుందా! చేతులు కాలాక ఆయింట్మెంట్ రాసుకొని ఏంలాభం! అవును... అవును... నేనే డ్రైవింగ్ చేస్తున్నాను. హ్హా హ్హా హ్హా.... నాకేమవుతుంది. డ్రైవింగ్‌లో నేను చాలా స్ట్రాంగ్. సెల్‌ఫోన్ సెల్‌ఫోనే... డ్రైవింగ్ డ్రైవింగే! నాకేమీ కాదు ప్రసాదూ... నేను అనేది వేరే వాళ్ల గురించి. ఇంకేంటి విశేషాలు...’’ఠా....ప్ సెల్‌ఫోన్ మాయం! స్థలం: హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్.దృశ్యం: డాక్టర్ మాణిక్చంద్బాషా గుండె ఆపరేషన్ చేస్తూ ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడుతున్నాడు...‘‘ఏరా పండు ఎలా ఉన్నావ్! ఇన్ని రోజుల తరువాత గుర్తొచ్చానా? అయినా మేమెందుకు గుర్తుంటాం లెండీ మీకు! ఒకప్పటి పండు కాదు కదా మీరు... ఆ గుండురావుగాడి చెల్లిని చేసుకున్న తరువాత మీలెవలే మారిపోయింది.మాలాంటి వాళ్లు మీ విలువైన కంటికి ఎలా కనబడతారు.సెలవా!!నాకు సెలవనేదే లేదు.పనే నాకు విశ్రాంతి. అంతెందుకు ఇప్పుడు కూడా నేను ఒకరికి గుండె ఆపరేషన్ చేస్తున్నాను. పనిలో పడి స్నేహాన్ని మరిచిపోయే క్యారెక్టర్ కాదు నాది. అందుకే గుండె ఆపరేషన్ చేస్తూ కూడా నీలాంటిమిత్రులతో సెల్ఫోన్లో మాట్లాడుతుంటాను.ఇలా చేయడం వల్ల పని తాలూకు అలసట మన మీద ఉండదు.అదెలా? అంటావా.సెల్ఫోన్లో మాట్లాడుతూ స్పీడ్‌గా డ్రైవింగ్ చేయగా లేనిది, సెల్ఫోన్లో మాట్లాడుతూ స్లోగా గుండె ఆపరేషన్ చేయలేమా! అలా ఎన్ని ఆపరేషన్లు చేశానో....’’కొద్దిసేపటి తరువాత...డాక్టర్ మాణిక్చంద్బాషా సెల్‌ఫోన్ ఎవరో లాగేసినట్టు మాయమైపోయింది.‘ఇచట’, ‘అచట’ అనే తేడా లేకుండా సెల్ఫోన్లు మాయమవుతున్నాయి. ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు.పోలీసులు రంగంలోకి దిగారు. వారితో పాటు సైంటిస్టులు కూడా దిగారు. రాజ్యాంగ సంక్షోభంలాగా సెల్‌ఫోన్ సంక్షోభం తలెత్తింది. కొనే వాళ్లు లేక సెల్‌ఫోన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. టవర్లు బేల ముఖం వేశాయి. సెల్‌ఫోన్ సంక్షోభంపై ఒక కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ వాళ్లు రకరకాల కోణాల్లో సమస్యను విశ్లేషించారు. ఎన్నో పుస్తకాలు తిరగేశారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. సెల్‌ఫోన్ రహిత సమాజం ఏర్పడింది. ‘‘చాలా టఫ్ క్వశ్చన్ అడుగుతున్నాను విక్రమార్కా. సెల్‌ఫోన్ సంక్షోభం ఎందుకు తలెత్తింది?’’ విక్రమార్కుడి కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు బేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు:‘‘బేతాళామనిషి తన సౌకర్యం, సుఖం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఈ భూగ్రహం తనది మాత్రమే అనుకుంటున్నాడు. సెల్‌ఫోన్ టవర్ల వల్ల పక్షుల జనాభా తగ్గిపోతుంది. ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ పక్షుల పాలిట యమపాశంగా తయారైంది. అందుకే మిగిలిన జీవరాసులతో కలిసి పక్షులు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఎంతో శ్రమించి ‘ఎలిమినేట్–0.0’ అనే సరికొత్త పరికరాన్ని తయారుచేశాయి. ఇది పనిచేస్తున్నంత కాలం ఎక్కడి సెల్ఫోన్లు అక్కడ మాయమైపోతూనే ఉంటాయి.’’ – యాకుబ్ పాషా -
ఎల్బీనగర్ అమీర్‌పేట మెటో మార్గానికి అంతాసిద్ధం
-
అమీర్‌పేట్ టు ఎల్బీనగర్..
సాక్షి, హైదరాబాద్ : అమీర్‌పేట్–ఎల్బీనగర్ మధ్య మెట్రో రైలు పరుగులు తీసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులో(26 లేదా 27వ తేదీన) ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 16 కిలోమీటర్ల దూరం ఉన్న ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అవసరమైన సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, ట్రాక్షన్ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తయ్యాయి. ఈ రూట్లో రైళ్లకు 18 రకాల సామర్థ్య పరీక్షలను వరుసగా నిర్వహిస్తున్నారు. ఈ మార్గానికి సంబంధించి త్వరలో రైల్వే శాఖ పరిధిలోని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ సైతం అందనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ మార్గంలో మెట్రోను ప్రారంభించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్) సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వ వర్గాలు కచ్చితమైన ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ మార్గంలో నిత్యం సుమారు 75 వేల మంది రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు అంచనా. అక్టోబర్‌లో అమీర్‌పేట్ హైటెక్‌సిటీ మరోవైపు అమీర్‌పేట్–హైటెక్‌సిటీ(13 కి.మీ.) మార్గంలో అక్టోబర్‌లో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. సైబర్టవర్స్ వద్ద మెట్రో రివర్సల్ ట్రాక్‌కు రీడిజైన్ చేయనుండటంతో పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఇక జేబీఎస్–ఎంజీబీఎస్(10 కి.మీ.) మార్గంలో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని చెప్పారు. ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్(30 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. నిత్యం 75–80 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండోదశకు వడివడిగా అడుగులు.. మెట్రో రెండోదశ ప్రాజెక్టు(61.5 కి.మీ.) దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రెండోదశలో ప్రధానంగా ప్రస్తుత మూడు మెట్రో కారిడార్ల నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీని పెంచే అంశంపైనే ప్రధానంగా సర్కారు దృష్టి సారించింది. రెండోదశపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సమగ్ర అధ్యయనం జరిపి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు (30 కి.మీ.)మార్గాన్ని తొలివిడతగా చేపట్టనున్నారు. ఎల్బీనగర్–నాగోల్(5.5 కి.మీ.), బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్(26 కి.మీ.) మార్గాల్లోనూ రెండో దశలో చేపట్టనున్నట్లు తెలిసింది. ఇందుకు సుమారు రూ.10 వేల కోట్లు అంచనా వ్యయంగా ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ(డీపీఆర్)లో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. ఆగస్టులో డీపీఆర్ సిద్ధంకానుంది. ఈ నివేదికతో రెండోదశ మెట్రో అలైన్‌మెంట్‌పై స్పష్టత రానుంది. మెట్రో తొలివిడత ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన విషయం విదితమే. రెండోవిడతకు మాత్రం 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా సమకూర్చడం, మరో 60 శాతం నిధులను జైకా వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. పాతనగరానికి మెట్రో కష్టమే.. ఎంజీబీఎస్–ఫలక్‌నుమా(5.5 కి.మీ.) మార్గంలో మెట్రోకు బాలారిష్టాలు తప్పడం లేదు. ఈ మార్గం లో సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, బాధితులకు పరిహారం చెల్లింపు అంశం జఠిలంగా మారుతోంది. పరిహారం చెల్లింపునకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భారీ మొత్తంలో పరిహారం చెల్లింపు ఎలా జరుపుతుందన్న దానిపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నిర్మాణ సంస్థ సైతం ఇదే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. -
నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్
అమీర్‌పేట : ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ వీరస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. మేడ్చల్‌కు చెందిన రమేష్‌బాబు, నాగేష్ అమీర్‌పేట, మధురానగర్‌లో కన్సల్టెన్సీల పేరుతో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. రెండు కార్యాలయాలకు భరత్ అనే వ్యక్తి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నాడు. ప్రము ఖ కంపెనీలకు చెందిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్న వీరు నకిలీ సర్టిఫికెట్లు అంటగట్టి నిరుద్యోగుల నుండి లక్షల్లో డబ్బులు దండుకునేవారు. దీనిపై సమాచారం అందడంతో పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి అమీర్‌పేట, మధురానగర్ లోని కార్యాలయాలపై దాడులు నిర్వహించి నిందితులు రమేష్‌బాబు, నగేష్, భరత్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి ఫాం 16, వివిధ కంపెనీలకు చెందిన సర్టిఫికెట్లు, స్టాంపు లు ఐడీ కార్డులతో పాటు రూ.6500 నగదు,12 సీపీయూలు, 9 మానీటర్లు, 5 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
అమీర్‌పేట అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ సనత్‌నగర్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అమీర్‌పేట్ కనక దుర్గ ఆలయం నుంచి ఫతేనగర్ ఫ్లై ఓవర్ వరకు ఉన్న వైట్ ట్యాపింగ్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే అమీర్‌పేటలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
నగరంలో మళ్లీ జడివాన
సాక్షి, హైదరాబాద్: వరుసగా కురుస్తోన్న కుండపోత వర్షాలతో రాష్ట్ర రాజధాని నగరం మళ్లీ అస్తవ్యస్తమైంది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన జడివానతో జనజీవనం స్తంభించింది. రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా శ్రీనగర్‌కాలనీలో 6.4 సెం.మీ., అమీర్‌పేటలో 5.4 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం పూర్తిగా నీటమునిగింది. దీంతో శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టేడియంలోకి వరదనీరు చేరడంతో ఇప్పటికే మ్యాచ్‌ను వీక్షించేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది అభిమానులు నిరాశ చెందుతున్నారు. నగరవాసికి ట్రాఫిక్ కష్టాలు.. ఇక ఖైరతాబాద్, సనత్‌నగర్, కూకట్పల్లి, మియాపూర్, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, రామంతాపూర్, ఉప్పల్, బేగంపేట్, బోయిన్పల్లి, పార్శీగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకటి, రెండు కిలోమీటర్ల దూరం వెళ్లడానికి కూడా గంటల సమయం పట్టడంతో నగరవాసులకు నరకం కనిపించింది. పలు రహదారులు చెరువులను తలపించాయి. మహానగరం పరిధిలో 1,500 కి.మీ మేర విస్తరించిన నాలాలు, 119 చెరువులు ఉప్పొంగుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 60 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. నగరానికి ఆనుకుని ఉన్న జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోనూ ఐదు అడుగుల మేర నీటిమట్టాలు పెరిగినట్లు జలమండలి అధికారులు తెలిపారు. మరోవైపు జగిత్యాలలోనూ భారీ వర్షం కురిసింది. నాలాలో మృతదేహం అమీర్‌పేట మైత్రివనం నాలాలో గురువారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద రాత్రి వరదనీటిలో మృతదేహం తేలియాడుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
లేడీస్ హస్టల్ నుంచి దూకి అబ్బాయి ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్‌కు చెందిన చెంద్రశేఖర్ కుమారుడు ఈశ్వర్ ఆనంద్(19), మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న రాజ్‌దూత్ ఆపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తుపై నుంచి కిందకు దుకాడు. తీవ్ర గాయాలైన ఆనంద్‌ను చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే రాజ్‌దూత్ అపార్ట్మెంట్లో లేడీస్ హస్టల్ ఉందని, దానిపైకి ఎందుకు వెళ్లాడన్న దానిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
అందరికీ నాణ్యమైన విద్య అందాలి
-
అందరికీ నాణ్యమైన విద్య అందాలి
అమీర్‌పేట: ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరముందని ప్రముఖ క్రికెటర్, ప్రాజెక్ట్ 511 బ్రాండ్ అంబాసిడర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. అమీర్‌పేట్ మ్యారీగోల్డ్ హోటల్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ రౌండ్ టేబుల్–8 (హెచ్ఆర్టీ) సంస్థ ప్రాజెక్ట్ 511 పేరుతో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే చాలా పాఠశాలల్లో సామగ్రి అందజేశామని చెప్పారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించినప్పుడే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ... దాన్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో అక్టోబర్ 9న నిర్వహించనున్న ‘ఫుడ్ ఫర్ ఛేంజ్’ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే నిధులను ప్రాజెక్ట్ 511కు వెచ్చించనున్నట్లు చెప్పారు. ‘ఫుడ్ ఫర్ ఛేంజ్’ కోసం 64 డిషెస్, 242 వంటకాలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెచ్ఆర్టీ–8 సంస్థ చైర్మన్లు నామాల శ్రీనివాసన్, హతిక్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా ఆచూకీ దొరకని చిట్టీల రాణి
-
లారీలో పారిపోయిన చిట్టీలరాణి
-
సామాన్లతో సహా.. లారీలో పారిపోయిన చిట్టీలరాణి
హైదరాబాద్: టీవీ ఆర్టిస్ట్‌లను నిలువునా ముంచిన బత్తుల విజయరాణి తన ఇంటి సామాన్లను సైతం సర్ధుకుని లారీలో పారిపోయినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది. ఎల్లారెడ్డిగూడలో ఉన్న అద్దె ఇంటిని ఈ నెల 10వ తేదీనే ఖాళీ చేసిందని అక్కడికి వెళ్లిన పోలీసులకు ఇంటి యజమాని తెలిపారు. సామాన్లను తరలించిన లారీ ఎక్కడ నుంచి తెచ్చారో కనిపెడితే ఆమె చిక్కినట్లేనని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మరో నిందితురాలు మధులత కుమారుడు శ్రీను ఆమె వద్ద వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆమె దగ్గరి కుటుంబ సభ్యులు అందరి ఇళ్లను పోలీసులు గాలించినా అందరి ఇళ్లకు తాళాలు కనిపించాయి. పథకం ప్రకారమే కొడుకు, కోడలుతో పాటు చెల్లెలు, ఇతర బంధువులను ఇతర ప్రాంతాలకు తరలించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే ఆమె పథక రచన చేసినట్లు తెలుస్తుందని ఓ అధికారి తెలిపారు. శ్రీనగర్ కాలనీ, అమీర్‌పేటలో ఆమె నిర్వహిస్తున్న మూడు మెస్‌లను కూడా ఖాళీ చేసిందని పోలీసుల విచారణలో తేలింది. -
విజయరాణిపై కేసు నమోదు చేస్తాం