
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్‌కు చెందిన చెంద్రశేఖర్ కుమారుడు ఈశ్వర్ ఆనంద్(19), మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు.
శనివారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న రాజ్‌దూత్ ఆపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తుపై నుంచి కిందకు దుకాడు. తీవ్ర గాయాలైన ఆనంద్‌ను చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే రాజ్‌దూత్ అపార్ట్‌మెంట్‌లో లేడీస్ హస్టల్ ఉందని, దానిపైకి ఎందుకు వెళ్లాడన్న దానిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.