సాక్షి, హైదరాబాద్: రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్న యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకా పోలీసులపై దాడికి యత్నించిన పోకిరీని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువతి బంజారాహిల్స్లోని తన సోదరుని ఇంటికి ఈ నెల 3న వచ్చింది. శనివారం రాత్రి తిరిగి తన సొంత గ్రామానికి వెళ్లేందుకు అమీర్‌పేట బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి చూస్తోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించగా నా పేరు మహేష్ నాతో రావాలంటూ ఆమెపై దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహేష్‌ని నిలువరించే ప్రయత్నం చేయగా వారిపై తిరగబడి దాడికి యత్నించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment