
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ సనత్‌నగర్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అమీర్‌పేట్ కనక దుర్గ ఆలయం నుంచి ఫతేనగర్ ఫ్లై ఓవర్ వరకు ఉన్న వైట్ ట్యాపింగ్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే అమీర్‌పేటలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.