నకిలీ సర్టిఫికెట్ ముఠా గుట్టురట్టు | Maharashtra: Police Busted Fake Certificate Gang In Mumbai | Sakshi
Sakshi News home page

Mumbai: నకిలీ సర్టిఫికెట్ ముఠా గుట్టురట్టు

Published Thu, Jan 20 2022 5:58 PM | Last Updated on Thu, Jan 20 2022 5:58 PM

Maharashtra: Police Busted Fake Certificate Gang In Mumbai - Sakshi

సాక్షి, ముంబై: భారత ఆర్థిక రాజధాని ముంబైలో నకిలీ సర్టిఫికేట్​లు, డిగ్రీ పట్టాలను తయారు చేస్తున్న రాకెట్​ బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముంబై  క్రైమ్ ​బ్రాంచ్​ పోలీసులు బోరివలి ప్రాంతంలోని ఒక భవనంపై ఆకస్మికంగా దాడిచేశారు.  దాడిచేసిన ప్రదేశంలో  అనేక యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్​లు, డిగ్రీపట్టాలు కుప్పలుగా ఉండటాన్ని కనుగొన్నారు. ఈ క్రమంలో.. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులిద్దరినీ స్థానిక న్యాయస్థానం ఎదుట హజరుపర్చారు. వీరిని విచారించిన న్యాయస్థానం నిందితులకు ఈనెల 27 వరకు పోలీసు కస్టడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ముంబై డీసీపీ సంగ్రామ్​ నిషాందర్​ ఒక ప్రకటనలో తెలిపారు. 

చదవండి: ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ప్రియుడి కిడ్నీ దానం.. ట్విస్ట్​ ఏంటంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement