rocket busted
-
ప్రపంచంలోనే భారీ రాకెట్ ప్రయోగం విఫలం..
సాక్షి, హైదరాబాద్: ఎలన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైంది. మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ రూపొందించిన అతిపెద్ద రాకెట్ నింగిలోకి ఎగిసిన కాసేపటికే.. పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా, స్పేస్ఎక్స్ స్టార్‌షిప్.. భారీ ఖర్చుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత శక్తివంతంగా నిర్మించిన రాకెట్. దీన్ని.. అంతరిక్షంలోకి వ్యోమగాములు, సరకు రవాణా కోసం రూపొందించారు. 400 అడుగులు పొడువున్న భారీ వ్యోమనౌక దాదాపు 250 టన్నుల బరువును మోయగలదు. 100 మందిని అంతరిక్షయానానికి తీసుకెళ్లగలదు. చంద్రుడు, అంగారకుడిపై యాత్రలకు వీలుగా దీన్ని రూపొందించారు. నాసా చంద్రుడి ప్రయోగాలకు పోటీగా.. మస్క్ దీనిని తెరపైకి తెచ్చాడనే చర్చ జోరుగా నడిచింది కూడా. ఈ రాకెట్ టెక్సాస్‌లోని బోకా చికాలోని ప్రైవేట్ స్పేస్ఎక్స్ స్పేస్‌పోర్ట్ అయిన స్టార్‌బేస్ నుండి ప్రయోగించబడింది. ఈ సందర్బంగా విఫలం కావడంతో పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్బంగా రాకెట్ విఫలం కావడంపై స్పేస్ఎక్స్ స్పందించింది. ట్విట్టర్ వేదికగా.. భారీ రాకెట్ భాగాలు విడిపోయే క్రమంలో పేలిపోయినట్టు తెలిపింది. రాకెట్ విఫలమైనట్టు పేర్కొంది. This is the moment SpaceX's Starship - the biggest and most powerful rocket ever built - launched, and then failed before completing its full test. No people or satellites were aboard. https://t.co/DpnSfSGuZn pic.twitter.com/GEYKokG2B7 — The Associated Press (@AP) April 20, 2023 Congrats @SpaceX team on an exciting test launch of Starship! Learned a lot for next test launch in a few months. pic.twitter.com/gswdFut1dK — Elon Musk (@elonmusk) April 20, 2023 -
చైనా ఎంత పనిచేసింది.. పలు దేశాల్లో విమానాశ్రయాలు బంద్!
డ్రాగన్ కంట్రీ చైనాకు చెందిన భారీ రాకెట్ శిథిలాలు నియంత్రణ కోల్పోయి భూమిపైకి వేగంగా దూసుకొస్తున్నాయి. కాగా, చైనా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ (సీజెడ్-5బీ) అక్టోబర్ 31న నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం, నియంత్రణ కోల్పోవడంతో రాకెట్ శిథిలాలు భూమిపై పడనున్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్‌లోని పలు విమానాశ్రయాలను మూసివేశారు. వివరాల ప్రకారం.. అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్‌కు 20 టన్నుల బరువున్న మెంగ్టియన్ లాబొరేటరీ క్యాబిన్ మాడ్యూల్‌ను లాంగ్ మార్చ్ 5బీ ద్వారా పంపించారు. ఈ క్రమంలో లాంగ్ మార్చ్ నియంత్రణ కోల్పోవడంతో రాకెట్ శిథిలాలు.. అట్లాంటిక్ మహా సముద్రంలో కూలవచ్చని యూరోపియన్ యూనియన్ స్పేస్ సర్వైలెన్స్ అండ్ ట్రాకింగ్ సర్వీస్ అంచనా వేసింది. ఇందులో భాగంగానే ఉత్తర స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ ఇటలీలో కూడా రాకెట్ శిథిలాలు కూలే ముప్పు ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో అప్రమత్తమైన స్పెయిన్.. దేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేసింది. దీంతో, టార్రాగోనా, ఇబిజా, రియస్‌లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, ఫ్రాన్స్‌లోని మార్సెయిల్ విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. విమానాల బంద్ కావడంతో యూరప్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రాకెట్‌లోని కొన్ని భాగాలు శుక్రవారం, మరి కొన్ని భాగాలు శనివారం భూమిపై పడే అవకాశం ఉంది. Parece que esto iba en serio, fijaros como se ha vaciado el espacio aéreo en la trayectoria de reentrada del #CZ5B. Reflexión: ¿Nadie pondrá límites y exigirá a las agencias espaciales desorbitar estas fases monstruosas de cohete (éste de 17,5 Tm!) de manera controlada? pic.twitter.com/oHzBp6KefN — Dr. Josep M. Trigo ⭐🎗#PlanetaryDefense #DART HERA (@Josep_Trigo) November 4, 2022 -
నకిలీ సర్టిఫికెట్ ముఠా గుట్టురట్టు
సాక్షి, ముంబై: భారత ఆర్థిక రాజధాని ముంబైలో నకిలీ సర్టిఫికేట్లు, డిగ్రీ పట్టాలను తయారు చేస్తున్న రాకెట్ బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బోరివలి ప్రాంతంలోని ఒక భవనంపై ఆకస్మికంగా దాడిచేశారు. దాడిచేసిన ప్రదేశంలో అనేక యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లు, డిగ్రీపట్టాలు కుప్పలుగా ఉండటాన్ని కనుగొన్నారు. ఈ క్రమంలో.. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ స్థానిక న్యాయస్థానం ఎదుట హజరుపర్చారు. వీరిని విచారించిన న్యాయస్థానం నిందితులకు ఈనెల 27 వరకు పోలీసు కస్టడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ముంబై డీసీపీ సంగ్రామ్ నిషాందర్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ప్రియుడి కిడ్నీ దానం.. ట్విస్ట్ ఏంటంటే -
స్పా ముసుగులో వ్యభిచారం: ఏడుగురి రిమాండ్
కేపీహెచ్‌బీకాలనీ: స్పా ముసుగులో వ్యభిచా రం నిర్వహిస్తున్న నిర్వాహకులను కేపీహెచ్‌బీ పోలీస్‌లు రిమాండ్‌కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నెంబర్–1లోని ఆర్ఏ స్పా అండ్ మసాజ్ పేరుతో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం కేంద్రంపై దాడిచేసి నిర్వాహకుడు సయ్యద్ అక్బర్ అలీతో ఆయనకు సహకరిస్తున్న మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు పట్టుబడిన ముగ్గురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. చదవండి: బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ Cyber Crime: అమెరికా వెళ్లాకే పెళ్లి అని, 22 లక్షలు కొట్టేశాడు! -
Nizamabad: గుప్పుమంటున్న గంజాయి!
సాక్షి, బాల్కొండ(నిజామాబాద్): గంజాయి మత్తులో యువత పెడదోవ పడుతున్నారు. గంజాయికి బానిసలుగా మారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. తాజాగా మెండోరా మండలం బుస్సాపూర్‌లో గంజాయి మత్తులో జోగుతున్న ఓ యువకుడు అకారణంగా రోడ్డుపై వెళుతున్న వృద్ధుడిపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడిచేయడంతో మృతి చెందాడు. బాల్కొండలో కొందరు యువకులు గంజాయికి మైకంలో బైక్‌ల చోరీకి పాల్పడిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంత జరుగుతున్నా గ్రామాల్లో గంజాయిని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోకపోవడం విచారకరం. గంజాయితో ఛిద్రమైన జీవితం మెండోరా మండలం బుస్సాపూర్‌కు చెందిన సోమ నవీన్ గంజాయికి బానిసై గంజాయి తాగిన మైకంలో దాడికి పాల్పడి వృద్ధుడి మరణానికి కారణమై కటకటాల పాలయ్యాడు. చదువు కోవడానికి అబ్రా డ్ వెళ్లాల్సిన యువకుడు గంజాయి వలన జీవితాన్ని ఛిద్రం చేసుకున్నాడు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి గారబంగా పెంచింది. కానీ ప్రస్తుతం కొడుకు ప్రవర్తను చూసి ఆ తల్లే తన కొడుకుని చంపండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గంజాయి మత్తులో అనేక ఘటనలు గంజాయి మత్తులో జోగుతున్న యువకులు ఆ మైకంలో ఏం చేస్తున్నామో కూడా గుర్తించలేని స్థితిలో ఇతరుల ప్రాణాలను సైతం హరిస్తున్నారు. హాసాకొత్తూర్‌కు చెందిన గిరిజన యువకుడు సిద్ధార్థను గంజాయి మత్తులోనే హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య తదనంతరం ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం పోలీసులకు ప్రజలు ఎదురు తిరగడం జరిగింది. మెండోరా పోలీసు స్టేషన్ పరిధిలో ఒక యువకుడిపై కొందరు యువకులు గంజాయి సేవించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. చివరకు రాజీపడి కేసు నుంచి తప్పించుకున్నారు. మోర్తాడ్‌లో ఒక యువకుడు గంజాయి మత్తులో బైక్‌ను వేగంగా నడిపి ఒక కూలీ మరణానికి కారణమయ్యాడు. కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ లో యువకులు గ్రూపులుగా విడిపోయి ఘర్షణలకు పాల్పడిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నా యి. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో దందా జోరుగా సాగుతుంది. నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రధానంగా పోచంపాడ్ గంజాయి వ్యాపారులకు అడ్డాగా ఉందనే వార్త బలంగా వినిపిస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి గంజాయి విక్రయాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. చదవండి: తువ్వాలులో జీఏవైరు పెట్టి మెడకు బిగించి హత్య -
విజిలెన్స్ దాడి: భారీ ఎత్తున రెమిడిసివర్ ఇంజక్షన్లు..
నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిధిలోని పొగతోటలో రెమిడిసివర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను విజిలెన్స్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఒక హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న ల్యాబ్ కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు. వీరిని ఎలాగైనా పట్టుకోవాలని భావించిన అధికారులు సోషల్ మీడియా వేదికగా ఇంజక్షన్ కావాలని అడ్వర్టెజ్ మెంట్ ఇచ్చారు. అయితే దీనికి సదరు ముఠా స్పందించింది. ఆ ముఠా సదరు వ్యక్తికి, ఒక్కొక్క ఇంజక్షన్‌ను రూ. 25 వేల చోప్పున.. మూడు బాక్సులకు నాలుగున్నర లక్షలకు అమ్మేలా డీల్ కుదుర్చుకుంది. అయితే, అప్పటికే ఈ విషయం తెలిసి మాటువేసి ఉన్న విజిలెన్స్ అధికారులు వారిపై దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో భారీ మొత్తంలో రెమిడిసివర్ ఇంజక్షన్‌ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు : ఎక్కడ దాచారంటే..
సాక్షి, ముంబై: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కేటుగాళ్లు ఆరితేరిపోతున్నారు. డ్రగ్స్ వ్యాపారాన్ని, దొంగ రవాణాను అడ్డుకునేందుకు నిఘా వర్గం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ దానికి పై ఎత్తులు వేస్తూ మాఫియా ముఠా చెలరేగిపోతోంది. రకరకాల మార్గాల్లో మత్తు పదార్థాలను సునాయాసంగా దేశంలోకి పారిస్తూ, కోట్లరూపాయల దండుకుంటోంది. తాజాగా హెరాయిన్‌ను తరలించేందుకు ముఠా పన్నిన పన్నాగం చూసి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులే షాకయ్యారు. మత్తు పదార్థాలను మహిళల గౌన్లకు కుట్టిన బటన్లలో దాచి పెట్టి మరీ ఇంటిలిజెన్స్ అధికారుల కన్ను గప్పాలని ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చివరకు అధికారులకు చిక్కారు. ఈ సందర్భంగా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా రాకెట్‌ను డీఆర్ఐ అధికారులు ఛేదించారు. మహిళల గౌన్లకు అమర్చిన బటన్స్‌లో హెరాయిన్ దాచి కొరియర్ ద్వారా దేశంలోకి తరలిస్తున్న ముఠాను గుర్తించిన అధికారులు 396 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.దక్షిణాఫ్రికా నుండి ముంబైకి కొరియర్ ద్వారా దీన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు వెల్లడించారు. Directorate of Revenue Intelligence (DRI) busted an inter-continental racket of drug smuggling and seized 396 grams of Heroin ingeniously concealed in buttons sewn into women’s gowns sent in a courier consignment from South Africa to Mumbai: DRI pic.twitter.com/JgMuGIphi8 — ANI (@ANI) November 28, 2020 -
నకిలీ బ్లడ్ బ్యాంక్ రాకెట్: ఐదుగురు అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రయివేటు బ్లడ్ బ్యాంక్ యజమానులు చేస్తున్న కల్తీ రక్తం విక్రయాల రాకెట్‌ను ఛేదించారు. రాష్ట్రంలోని పలు బ్లడ్ బ్యాంకులు కల్తీ చేసిన రక్తాన్ని అంటగట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గురువారం రాత్రి నిర్వహించిన దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. పక్కా సమాచారంతో రెండు ప్రయివేటు బ్లడ్ బ్యాంకుల్లో నిఖీలు చేపట్టిన అధికారులు అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మారువేషంలో అనేక ఆస్పత్రులు రక్త బ్యాంకులకు వెళ్లిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ రాకెట్‌ను ఛేదించింది. పరిశీలన కోసం కొన్ని కీలక పత్రాలు, లెడ్జర్ ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. రిక్షా డ్రైవర్లు, ఇతర రోజువారీ కూలీలకు వెయ్యి, రెండువేల రూపాయలు చెల్లించి రక్తం తీసుకుంటారు. దీనికి కెమికల్, నీళ్లు కలిపి కల్తీ రక్తాన్ని యధేచ్చగా తయారు చేస్తారు. ఇలా ఒక ప్యాకెట్‌కు రెండు ప్యాకెట్ల చొప్పున తయారు చేసి విక్రయిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి రషీద్‌అలీ, రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్, మహమ్మద్ నసీమ్, పంజక్ కుమార్, రజనీష్‌నిగం లను అరెస్ట్ చేశామని ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. గత ఆరునెలలుగా ఈ దందా నడుస్తున్నట్టు గుర్తించామన్నారు. గత ఆరు నెలల కాలంలో దాదాపు వెయ్యి యూనిట్ల నకిలీ, కల్తీ రక్తం మార్కెట్లోకి తరలిపోయిందని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ రక్తాన్ని విక్రయించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. అంతేకాదు ఇందులో కొంత మంది డాక్టర్లు, నర్సులుకు కూడా భాగస్వామం ఉందని అధికారులు తెలిపారు. దీంతోపాటు ఇతర బ్లడ్‌బ్యాంకుల వ్యవహరాన్ని కూడా పరిశీలి స్తున్నట్టు చెప్పారు. -
బ్రౌన్‌షుగర్ ముఠాలో టీడీపీ ఉపసర్పంచ్!
సాక్షి, రాజంపేట: రాజంపేట కేంద్రంగా సాగుతున్న బ్రౌన్‌షుగర్ ముఠాకు సంబంధించి వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలంలోని టీడీపీకి చెందిన పోలి పంచాయతీ ఉపసర్పంచ్ లింగుట ప్రసాద్‌నాయుడు పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన అధికార పార్టీ వర్గాలను కలవరపాటుకు గురిచేసింది. పట్టుబడిన ప్రసాద్‌నాయుడును రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్ఐ రాజగోపాల్ విలేకర్లకు తెలియచేశారు. గత నెల 17న రాజంపేట పట్టణ పోలీసులు బ్రౌన్‌షుగర్ అమ్మకాలు చేస్తున్న ముఠాను డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 8మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇందులో పుల్లంపేటకు చెందిన జయసింహ అలియాస్ జయకాంత్, రాజంపేట మండలం పోలికి చెందిన ప్రసాద్‌నాయుడు, పట్టణంలోని ఉస్మాన్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌లు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. పోలీసులు నిఘా వేసి ముఠాలో ఒకరైన ప్రసాద్‌నాయుడును పట్టుకుని విచారణ చేపట్టారు. లింగుట ప్రసాద్‌నాయుడు పోలి గ్రామపంచాయతీలో ఎమ్మెల్యేకి అనుచరుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ బ్రౌన్‌షుగర్ ముఠా కేసులో పట్టుబడటంతో తెలుగుతమ్ముళ్లను ఆందోళన గురిచేసింది. -
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ నగర శివార్లలో ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో జరిగింది. నిజాంపేటలో కొందరు ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు ఎస్వోటీ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్థావరంపై దాడి చేసి ఇద్దరు బూకీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.6.85 లక్షలు, ఒక కారు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.