సాక్షి, రాజంపేట: రాజంపేట కేంద్రంగా సాగుతున్న బ్రౌన్‌షుగర్ ముఠాకు సంబంధించి వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలంలోని టీడీపీకి చెందిన పోలి పంచాయతీ ఉపసర్పంచ్ లింగుట ప్రసాద్‌నాయుడు పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన అధికార పార్టీ వర్గాలను కలవరపాటుకు గురిచేసింది. పట్టుబడిన ప్రసాద్‌నాయుడును రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్‌ఐ రాజగోపాల్ విలేకర్లకు తెలియచేశారు.
గత నెల 17న రాజంపేట పట్టణ పోలీసులు బ్రౌన్‌షుగర్ అమ్మకాలు చేస్తున్న ముఠాను డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 8మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇందులో పుల్లంపేటకు చెందిన జయసింహ అలియాస్ జయకాంత్, రాజంపేట మండలం పోలికి చెందిన ప్రసాద్‌నాయుడు, పట్టణంలోని ఉస్మాన్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌లు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు.
పోలీసులు నిఘా వేసి ముఠాలో ఒకరైన ప్రసాద్‌నాయుడును పట్టుకుని విచారణ చేపట్టారు. లింగుట ప్రసాద్‌నాయుడు పోలి గ్రామపంచాయతీలో ఎమ్మెల్యేకి అనుచరుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ బ్రౌన్‌షుగర్ ముఠా కేసులో పట్టుబడటంతో తెలుగుతమ్ముళ్లను ఆందోళన గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment