విజిలెన్స్‌ దాడి: భారీ ఎత్తున రెమిడిసివర్‌ ఇంజక్షన్‌లు.. | Vigilance Department Attack On Remdesivir Rocket Gang In Nellore | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ దాడి: భారీ ఎత్తున రెమిడిసివర్‌ ఇంజక్షన్‌లు..

Published Tue, Apr 20 2021 8:26 PM | Last Updated on Tue, Apr 20 2021 9:06 PM

Vigilance Department Attack On Remdesivir Rocket Gang In Nellore - Sakshi

నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిధిలోని పొగతోటలో రెమిడిసివర్‌ ఇంజక్షన్‌లను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను విజిలెన్స్‌ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఒక హాస్పిటల్‌కు అనుబంధంగా ఉ‍న్న ల్యాబ్‌ కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు. వీరిని ఎలాగైనా పట్టుకోవాలని భావించిన అధికారులు సోషల్‌ మీడియా వేదికగా ఇంజక్షన్‌ కావాలని అడ్వర్టెజ్‌ మెంట్‌ ఇచ్చారు. అయితే దీనికి సదరు ముఠా స్పందించింది.

ఆ ముఠా సదరు వ్యక్తికి, ఒక్కొక్క​ ఇంజక్షన్‌ను రూ. 25 వేల చోప్పున.. మూడు బాక్సులకు నాలుగున్నర లక్షలకు అమ్మేలా డీల్‌ కుదుర్చుకుంది. అయితే, అప్పటికే ఈ విషయం తెలిసి మాటువేసి  ఉన్న విజిలెన్స్‌ అధికారులు వారిపై దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో భారీ మొత్తంలో రెమిడిసివర్‌ ఇంజక్షన్‌ను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement