vigilence ride
-
ఆలయాల్లో దందాలపై ఏపీ సర్కార్ కొరడా
సాక్షి, విజయవాడ: ఆలయాల్లో టికెట్లు, ప్రసాదాలపై అధిక ధరలతో భక్తులను దోచుకుంటున్న దందాలకు సంబంధించి పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సర్కార్ సీరియస్ అయ్యింది. అధిక ధరలకు కళ్లెం వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. టీటీడీలో అనుసరిస్తున్న పద్ధతులే ఇకపై అన్ని ఆలయాల్లోనూ పాటించాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. అన్ని ఆలయాల్లో విజిలెన్స్ తరహా స్క్వాడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వీలైనంత మేర ఎలక్ట్రానిక్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయింది. -
ఏపీలోని ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్ దాడులు
-
విజిలెన్స్ దాడి: భారీ ఎత్తున రెమిడిసివర్ ఇంజక్షన్లు..
నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిధిలోని పొగతోటలో రెమిడిసివర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను విజిలెన్స్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఒక హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న ల్యాబ్ కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు. వీరిని ఎలాగైనా పట్టుకోవాలని భావించిన అధికారులు సోషల్ మీడియా వేదికగా ఇంజక్షన్ కావాలని అడ్వర్టెజ్ మెంట్ ఇచ్చారు. అయితే దీనికి సదరు ముఠా స్పందించింది. ఆ ముఠా సదరు వ్యక్తికి, ఒక్కొక్క ఇంజక్షన్‌ను రూ. 25 వేల చోప్పున.. మూడు బాక్సులకు నాలుగున్నర లక్షలకు అమ్మేలా డీల్ కుదుర్చుకుంది. అయితే, అప్పటికే ఈ విషయం తెలిసి మాటువేసి ఉన్న విజిలెన్స్ అధికారులు వారిపై దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో భారీ మొత్తంలో రెమిడిసివర్ ఇంజక్షన్‌ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అంగన్వాడీ కార్యకర్తపై క్రిమినల్ కేసు
రాజమహేంద్రవరం : అంగన్వాడీ కార్యకర్తపై క్రిమినల్ కేసు నమోదైంది. విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు కథనం ప్రకారం.. శంఖవరం గ్రామంలో ఈ నెల 6వ తేదీన విజిలెన్స్ అధికారులు అంగన్ వాడీ కేంద్రం నంబర్ 03ను (ఎస్సీ పేట లో ఉన్న) తనిఖీ చేసి కేంద్రంలో పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు సరఫరా చేసిన సరుకులు జూలై నెలకు సంబంధించినవి ఏమీ లేకపోవడం గుర్తించారు. అంగన్ వాడీ కార్యకర్త మేడిద లక్ష్మి సరుకులను ఈ నెల 4వ తేదీన తీసుకొని పీఎఫ్ షాపులో ఉంచామని తెలిపారు. పీఎఫ్ షాపులో తనిఖీ చేసిన అధికారులు అక్కడ అంగన్ వాడీ కేంద్రానికి సంబంధించిన సరుకులు లేకపోవడం, నాలుగో తేదీన లక్ష్మి అంగన్ వాడీ కేంద్రానికి సరుకులు తీసుకువెళ్లినట్టు విచారణలో తేలడంలో ఆమె ఇంటిని తనిఖీ చేయగా 82 కోడిగుడ్లు, 25 కిలోల పీడీఎస్ బియ్యం, చోడిపిండి 22 ప్యాకెట్లు గుర్తించారు. శంఖవరం మండలం అంగన్వాడీ సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్లో లక్ష్మిపై సెక్షన్ ఐపీసీ 406, 7 ఈసీఏ (ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన నిత్యావసర వస్తువులు దుర్వినియోగం) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ అంగన్ వాడీ కేంద్రానికి జూలైæ నెలకు సంబంధించిన మొత్తం సరుకులు బియ్యం 130 కేజీలు, పప్పు 29 కేజీలు, ఆయిల్ ఆరు ప్యాకెట్లు, శనగలు 7.5 కేజీలు, ఉప్పు 2 ప్యాకెట్లు, ఉండాల్సి ఉండగా మేడిద లక్ష్మి ఇంటి వద్ద తక్కువగా ఉండడం గమనించారు. విచారణలో లక్ష్మి సరుకులు బయట మార్కెట్లో అమ్ముతున్నారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపిస్తామని విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలిపారు. -
విజిలెన్స్ తనిఖీలు.. గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
నల్గొండ(చింతపల్లి): నల్గొండ జిల్లా చింతపల్లి పట్టణంలోని మాల వెంకటేశ్వరనగర్‌లో కిరాణా షాపులపై ఆదివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు రూ.50 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి రమేశ్ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. -
అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అధికారులు
గోరెంట్ల(అనంతపురం జిల్లా): అనధికారికంగా గ్రానైట్ తవ్వకాలకు పాల్పడుతున్న క్వారీపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. అనంతపురం జిల్లా గోరెంట్ల మండలంలోని కమ్మలవాండ్లపల్లి గుట్ట వద్ద ఈ దాడులు శుక్రవారం జరిగాయి. అనధికారికంగా గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో క్వారీపై దాడి చేసి అధికారులు దానిని సీజ్ చేశారు. ఇటాచీ, క్రైన్, కంప్రెసర్లను స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.