
సాక్షి, విజయవాడ: ఆలయాల్లో టికెట్లు, ప్రసాదాలపై అధిక ధరలతో భక్తులను దోచుకుంటున్న దందాలకు సంబంధించి పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సర్కార్ సీరియస్ అయ్యింది. అధిక ధరలకు కళ్లెం వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
టీటీడీలో అనుసరిస్తున్న పద్ధతులే ఇకపై అన్ని ఆలయాల్లోనూ పాటించాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. అన్ని ఆలయాల్లో విజిలెన్స్ తరహా స్క్వాడ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు వీలైనంత మేర ఎలక్ట్రానిక్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయింది.