high charges
-
ఆటో డ్రైవర్లకు రూ.3.36 లక్షల జరిమానాలు
కర్ణాటక: ఆటో డ్రైవర్లపై పదే పదే ఫిర్యాదులు వినిపిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యచరణ చేపట్టారు. ఈనెల 14నుంచి 23వరకు మొత్తం 670 కేసులు నమోదు చేసి వారినుంచి రూ.3.36 లక్షల జరిమానా వసూలు చేశారు. అధిక చార్జీల వసూళ్లకు సంబంధించి ఈశాన్య ఉప విభాగంలో 141 మంది డ్రైవర్లపై కేసు నమోదు చేసి రూ.72వేలు, ఉత్తర ఉప విభాగంలో 213 మందిపై కేసులు నమోదు చేసి రూ.1.06లక్షల జరిమానా వసూలు చేశారు. అదేవిధంగా ప్రయాణికులు చెప్పిన చోటుకు రాని డ్రైవర్లకు కూడా జరిమానా విధించారు. 95 మందిపై కేసులు నమోదు చేసి రూ.47,500, ఉత్తర ఉప విభాగంలో 221 మందిపై కేసులు నమోదు చేసి రూ.1.10 లక్షల జరిమానా విధించారు. -
కస్టమర్‌కు షాకిచ్చిన ఉబర్..
ఇటీవల ఢిల్లీలో ఓ కస్టమర్‌కు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ షాక్ ఇచ్చింది. 21 కిలోమీటర్ల రైడ్‌కి రూ.1,500 లకుపైగా వసూలు చేసింది. కస్టమర్ ఫిర్యాదు చేయడంతో తప్పిదం గ్రహించిన కంపెనీ అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించింది. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్! ఈ బ్యాంకులో వడ్డీరేట్లు పెరిగాయ్.. టైమ్స్‌నౌ కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిత్తరంజన్ పార్క్ వద్ద ఉన్న తన నివాసానికి ఓ మహిళ రైడ్ బుక్ చేసుకున్నారు. ఆమె ప్రయాణం పూర్తయి గమ్య స్థానం చేరుకోగానే ఉబర్ యాప్‌లో చూపిన ప్రారంభ మొత్తం నుంచి రూ.1,525కి మారింది. ఆ మొత్తాన్ని చెల్లించేసిన ఆమె తర్వాత కంపెనీని సంప్రదించి దీనిపై ఫిర్యాదు చేశారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌లో లోపం వల్లే ఇలా ఎక్కువ మొత్తంలో బిల్లు వచ్చిందని ఉబర్ ప్రతినిధి ఆమెకు తెలిపారు. ఆమె సరిహద్దు దాటనప్పటికీ ఉత్తరప్రదేశ్ అంతర్రాష్ట్ర ఛార్జీ వసూలు చేసినట్లు తేలింది. బిల్లులో మున్సిపల్ కార్పొరేషన్ పన్ను కూడా రెండుసార్లు చేరింది. దీంతో ఇంత మొత్తంలో బిల్లు వచ్చింది. బిల్లింగ్‌లో లోపాన్ని గుర్తించిన కంపెనీ బాధితురాలికి డబ్బును తిరిగి చెల్లించింది. ఉబెర్ క్యాష్ వాలెట్లో రూ.900 రీఫండ్ చేసింది. ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్! మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లకు ప్రయాణించేవారి కోసం ఉబర్ తమ సేవల్ని మెరుగుపర్చింది. ఉబర్ రిజర్, పికప్ డైరెక్షన్స్, వాకింగ్ ఈటీఏస్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఉబర్‌లో కస్టమర్లు ఇప్పుడు 90 రోజుల ముందుగానే రైడ్ బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. -
సంక్రాంతి పండగ షాకిచ్చిన విద్యుత్ సంస్థ.. ఏసీడీ డ్యూ పేరుతో..
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని విద్యుత్ వినియోగారులకు ఆ సంస్థ సంక్రాతి పండగ షాకిచ్చింది. ఈ నెలలో ఏసీడీ డ్యూ పేరుతో కొత్త రకం వసూళ్లకు పూనుకుంది. బిల్లులు చూసి వినియోగదారులు షాకవుతున్నారు. ఇదేం బాదుడంటూ ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి నెల వచ్చే సాధారణ బిల్లుతో పాటు అదనపు బిల్లు రావడంతో మొదట్లో అర్థం కాక వదిలేశారు. బిల్లులు కట్టేందుకు వెళ్లిన వినియోగదారులకు సిబ్బంది ఏసీడీ డ్యూ చెల్లించాలని చెప్పడంతో ఖంగుతింటున్నారు. కొంత మందికి రూ. వందల్లో ఏసీడీ బిల్లు రాగా, మరి కొందరికి రూ. వేలల్లో బిల్లులు వచ్చాయి. దీంతో కొత్త రకం చార్జీలు ఎందుకు చెల్లించాలని వినియోగదారులు సిబ్బందిని ప్రశి్నస్తున్నారు. ముందుగా వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన ట్రాన్స్‌కో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడంతో బిల్లులు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్లో వినియోగించిన విద్యుత్ బిల్లును జనవరిలో విద్యుత్ వినియోగదారులకు అందించారు. అందులో ఏసీడీ డ్యూపేరుతో బిల్లుతో పాటు అదనపు బిల్లును వేశారు. గత సంవత్సరం వినియోగదారుల నుంచి అభివృద్ధి చార్జీల పేరుతో అదనంగా వసూలు చేసిన విద్యుత్ పంపిణీ సంస్థ ఈ యోడు మరో పిడుగు వేసింది. ఏసీడీ డ్యూ అంటే.. ఏసీడీ (అడిషనల్ కన్జమ్షన్ డిపాటిజ్) పేరు బిల్లుల్లో చేరడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. వినియోగంతో సంబంధం లేకుండా వేలల్లో బిల్లులు రావడంతో లబోదిబోమంటున్నారు. జిల్లాలో 4 లక్షల 80 వేల వరకు గృహావసరాల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వినియోగదారు వినియోగించిన యూనిట్లతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా తేడాలేకుండా వినియోగదారైతే చాలు అన్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. గత సంవత్సరం గృహావసరాల వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, వ్యాపార సముదాయాలకు రూ. 1 చొప్పున పెంచారు. దీంతో పాటు కస్టమర్, డెవలప్మెంట్ చార్జీలు వసూలు చేశారు. తాజాగా సంస్థ ఏసీడీ పేరుతో మరో రకం బాదుడుతో వినియోగారులు విలవిల్లాడుతునారు. అడ్జస్ట్ చేస్తాం.. తర్వాత విడతల వారీగా నెలవారి యూనిట్లలో వచ్చే బిల్లుల్లో తగ్గించడం జరుగుతుంది. వినియోగదారులు సంవత్సరం పాటు వినియోగించిన యూ నిట్లను యావరేజ్‌గా తీసుకుని ఈ నెల బిల్లులో వేయడం జరిగింది. ప్రతి నెలా చెల్లించే బిల్లులో అడ్జస్ట్ చేస్తాం –రాపెల్లి రవీందర్, ఎస్ఈ -
ఆలయాల్లో దందాలపై ఏపీ సర్కార్ కొరడా
సాక్షి, విజయవాడ: ఆలయాల్లో టికెట్లు, ప్రసాదాలపై అధిక ధరలతో భక్తులను దోచుకుంటున్న దందాలకు సంబంధించి పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సర్కార్ సీరియస్ అయ్యింది. అధిక ధరలకు కళ్లెం వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. టీటీడీలో అనుసరిస్తున్న పద్ధతులే ఇకపై అన్ని ఆలయాల్లోనూ పాటించాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. అన్ని ఆలయాల్లో విజిలెన్స్ తరహా స్క్వాడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వీలైనంత మేర ఎలక్ట్రానిక్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయింది. -
ఏపీలో పలు థియేటర్లు సీజ్.. కొనసాగుతున్న తనిఖీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను బుధవారం సీజ్ చేశారు. నూజివీడు, అవనిగడ్డ, గుడివాడలో తనిఖీలు చేపట్టారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ టిక్కెట్ల ధరలు, ఫుడ్ స్టాల్స్‌లో ధరలపై అధికారులు ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కృష్ణాజిల్లాలో 12 థియేటర్లు సీజ్ చేశామని తెలిపారు. లైసెన్సులు రెన్యూవల్ చేయని థియేటర్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. తనిఖీలు రెగ్యులర్‌గా కొనసాగుతాయన్నారు. బెనిఫిట్ షోలకు తప్పకుండా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేస్తారన్నారు. పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లలో తిను బండరాలు, పార్కింగ్ విషయంలో దోపిడీ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జాయింట్ కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. -
అధిక చార్జీలపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయని దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం విచారించింది. కొందరు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరలకే పలు ఆస్పత్రులకు భూమి కేటాయించిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రాయితీ ధరలకే భూమి పొందిన అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని ఆరోపించాడు. (చదవండి: కిడ్నాప్ కథ సుఖాంతం) దీంతో షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించక పోతే మృతదేహాలను కూడా అప్పగించడం లేదని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని, భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశ్రాంత ఉద్యోగి ఓ.ఎం. దేవర ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. (‘శవాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోండి’ ) -
కరోనా రోగులపై చార్జీల బాదుడు : షాక్
సాక్షి, ముంబై: దొరికిందే చాన్స్ అన్నట్టుగా కోవిడ్-19 రోగులనుంచి అధిక చార్జీలను వసూలు చేస్తున్న ఆసుపత్రికి థానే మున్సిపల్ కార్పొరేషన్ భలే షాక్ ఇచ్చింది. భారీగా చార్జీలు వసూలు చేశారంటూ ఒక ప్రైవేటు ఆసుపత్రి లైసెన్సును రద్దు చేసింది. (చెవుల్లో కూడా కరోనా వైరస్) కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరిన రోగులనుంచి అధికంగా చార్జీలు వసూలు చేశారన్న ఆరోపణలతో మహారాష్ట్ర, థానే నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లైసెన్స్‌ను శనివారం నిలిపివేసింది. అలాగే కోవిడ్-19 సెంటర్‌ను కూడా రద్దు చేసింది. థానే మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆడిట్ కమిటీ నివేదిక మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 ఆస్పత్రుల ద్వారా 27 లక్షల రూపాయల మేర అదనపు చార్జీలను వసూలు చేసినట్టు ఆడిట్ కమిటి నివేదించింది. దీని ఆధారంగా ఘోడ్‌బందర్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లైసెన్స్‌ను నెల పాటు నిలిపివేసినట్లు మున్సిపల్ అధికారి తెలిపారు. జూలై 12 వరకు ఇక్కడ చికిత్స పొందుతున్న 797మంది రోగులనుంచి 56 బిల్లుల్లో 6,08,900 రూపాయలను అదనంగా వసూలు చేసిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో చేరిన రోగుల చికిత్సను పర్యవేక్షించడానికి, వారికి చార్జీల భారం లేకుండా నియంత్రించేందుకు ఇద్దరు అధికారులను నియమించామన్నారు. మరోవైపు అసుపత్రులపై నిఘా కొనసాగుతుందనీ, మిగిలిన ఆసుపత్రులపై కూడా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సందీప్ మాలావి ప్రకటించారు. -
వినియోగదారులను మోసం చేస్తే కేసు: అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో ప్యాకేజ్డ్ వస్తువులపై వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తే ఆ సంస్థలపై కేసులు నమోదు చేస్తామని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. మంగళవారం పౌరసరఫరాల భవన్లో సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అకున్ సబర్వాల్‌తో సమావేశ మయ్యారు. ప్రతి దానిపై బరువు, పరిమాణం కచ్చితంగా కనిపించాలని సూచించారు. బోర్డుపై కూడా స్పష్టంగా ధరలు కనిపించేలా ఉండాలని, వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి కచ్చితంగా బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేస్తే 1967, వాట్సప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
అంత్యోదయ రైళ్లలో 15% అధిక చార్జీలు!
న్యూఢిల్లీ: ప్రత్యేకంగా సాధారణ తరగతి రైలు ప్రయాణికుల కోసం త్వరలో ప్రవేశపెట్టనున్న అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చార్జీలు..ప్రస్తుత జనరల్ క్లాస్ చార్జీల కన్నా దాదాపు 15 శాతం ఎక్కువగా ఉండొచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక సదుపాయాలతో, అన్నీ జనరల్ బోగీలతో ఈ రైళ్లను త్వరలో రైల్వే శాఖ పట్టాలెక్కించనుంది. ఈ రకం రైళ్లు ప్రస్తుతానికి రెండు సిద్ధమయ్యాయి. ఒక రైలును ఈ నెలలోనే ముంబై–టాటానగర్‌ల మధ్య ప్రారంభించనుండగా, రెండో రైలును కూడా త్వరలోనే ఎర్నాకులం–హౌరా మధ్య నడిపిస్తారు. -
మెట్రో మోత..
సాక్షి, చెన్నై : మెట్రో చార్జీల కన్నా, పార్కింగ్ మోత అధికమైంది. గంట గంటకు రేటు పెరుగుతుండడంతో మెట్రో రైల్వేస్టేషన్లలో పార్కింగ్ చేయాలంటే వాహనదారుల జేబుకు చిల్లు పడినట్టే. రైల్వే చార్జీల కన్నా, పార్కింగ్ చార్జీలు ఎక్కువగా ఉండడంతో, ఆ రైలు ఎక్కేందుకు వెనకడుగు వేసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. రాజధాని నగరం చెన్నైలో ట్రాఫిక్ కష్టాల నుంచి వాహన దారుల్ని గట్టెక్కించే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. విమానాశ్రయం నుంచి అన్నా సాలై మీదుగా సెంట్రల్ వరకు ఓ మార్గం, తిరువొత్తియూరు విమ్కో నగర్ నుంచి ఎగ్మూరు, కోయంబేడులను కలుపుతూ సెయింట్థామస్ మౌంట్ వరకు మరో మార్గం అన్నట్టు ఈ పనులు సాగాయి. కోయంబేడు నుంచి ఆలందూరు వరకు తొలి విడతగా పనులు ముగించి గత ఏడాది రైలును పట్టాలు ఎక్కించారు. గత వారం విమానాశ్రయం నుంచి చిన్న మలై వరకు పనులు ముగించి సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ మార్గాల్లో రైలు చార్జీలు ఓ స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు ఓ రేటు అన్నట్టుగా ఉంది. విమానాశ్రయం నుంచి కోయంబేడు, చిన్నమలైలకు రూ.50 చొప్పున చార్జీలను వసూళు చేస్తున్నారు. మధ్యలో వచ్చే స్టేషన్లకు ఒకటి తర్వాత మరొకటి చొప్పున రూ.10, రూ.20, రూ.30, రూ.40 చొప్పున చార్జీలను వసూళ్లు చేస్తున్నారు. కోయంబేడు-ఆలందరూ, చిన్నమలై-విమానాశ్రయం మార్గాల్లో పదకొండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్లలోనూ పార్కింగ్ సౌకర్యం కల్పించి ఉన్నారు. అయితే, ఈ పార్కింగ్ చార్జీలు రైల్వే చార్జీల కన్నా ఎక్కువే అన్నట్టుగా మోత మోగుతుండడంతో వాహనదారులు బెంబెలెత్తుతున్నారు. కోయంబేడు నుంచి విమానాశ్రయం వైపుగా లేదా, అక్కడి నుంచి చిన్నమలై వైపుగా పయనం సాగించే వాళ్లు ఆయా రైల్వే స్టేషన్లలోని పార్కింగ్‌లను ఉపయోగించుకుంటారు. అయితే, ఇక్కడ చార్జీలు గంట గంటకు పెరుగుతుండడం వాహన దారులకు మరింత భారంగా మారింది. పార్కింగ్ మోత : మెట్రో స్టేషన్లలో పార్కింగ్ పది నిమిషాల నుంచి రెండు గంటల వరకు ద్విచక్ర వాహనాలకు రూ.25, నాలుగు చక్రాల వాహనాలకు రూ.150 చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ఆ తర్వాత గంట గంటకు చార్జీలు పెరుగుతుంటాయి. ఆ మేరకు ఒక గంటకు రూ.25 చొప్పున ద్విచక్ర వాహనాలకు, రూ.150 చొప్పున నాలుగు చక్రాల వాహనాలకు చార్జీలు పెరుగుతూనే ఉంటాయి. ఇక, నెలసరి చార్జీలు అయితే, ద్విచక్ర వాహనాలకు రూ.వెయ్యి, కార్లకు రూ.ఏడు వేలు. ఈ మోత చెన్నై నగరంలోని అతి పెద్ద మాల్స్‌లో సాగుతున్న పార్కింగ్ దోపిడీలను తలపించే విధంగా సాగుతుండడంతో వాహన చోదకులు బెంబేలెత్తుతున్నారు. ఇక, మెట్రో ఎక్కడం కన్నా, తమ వాహనాల్లోనే ముందుకు సాగవచ్చన్న భావన వారిలో కలుగుతోంది. కోయంబేడు నుంచి విమానాశ్రయానికి మెట్రోలో ఇద్దరు వెళ్లి రావాలంటే రూ.రెండు వందలు అవుతుంది. పార్కింగ్‌కు రూ.25. ఆ తర్వాత జరిగే ఆలస్యం మేరకు గంట గంటకు మోత మోగుద్ది. ఈ లెక్కల్ని బేరీజు వేసుకుంటే, మొత్తం సుమారు రూ.250 నుంచి రూ.300 వరకు ఖర్చు అవుతుందని చెప్పవచ్చు. అదే కోయంబేడు నుంచి విమానాశ్రయానికి వెళ్లాలంటే, రూ.50కి పెట్రోల్ కొట్టిస్తే చాలు దూసుకెళ్లొచ్చు. ఈ దృష్ట్యా, పార్కింగ్ మోత, రైల్వే చార్జీల్ని పరిగణలోకి తీసుకుని ఎక్కువ శాతం మంది మెట్రో కన్నా, వాహనమే మిన్నా అన్నట్టుగా ద్విచక్ర వాహనాల్లో దూసుకెళ్తోండడం గమనార్హం. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్‌లోనే 24 గంటల పార్కింగ్‌కు రూ.30, చెన్నై ఎలక్ట్రిక్ ైరె ల్వే స్టేషన్లలో పన్నెండు గంటలకు రూ10 నుంచి రూ. 20 వరకు వసూళు చేస్తుంటే, మెట్రోలో మాత్రం పార్కింగ్ మోత అధికంగా ఉండడం గమనార్హం. -
‘శిద్ధా’ ప్రకటనలు శుద్ధ దండగ
‘‘ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తప్పవు. ఆర్టీసీలో వసూలు చేస్తున్న ఛార్జీలనే ప్రైవేటు ఆపరేటర్లు వసూలు చేయాలని చెప్పాం. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీపై రవాణా శాఖ అధికారులతో ఆకస్మిక దాడులు జరిపించి బస్సు పర్మిట్లు రద్దు చేస్తాం.’’ - మూడు రోజుల క్రితం రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పిన మాటలివి. గతేడాది పండగ సీజన్లలోనూ ప్రైవేటు దోపిడీపై మంత్రి ఈ తరహా ప్రకటనలు చేసినా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు బేఖాతరు చేశారు. ఈ ఏడాదీ అంతే. దీంతో మంత్రి శిద్ధా రాఘవరావు ప్రకటనలన్నీ శుద్ధ దండగని తేలిపోయింది. * యథేచ్ఛగా దోచుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు * నిర్భయంగా ఆన్లైన్లో అధిక ధరలతో టిక్కెట్లు * ఒక్కరిపైనా దాడులు చేయని రవాణాశాఖ * ఇరువురు ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు * మంత్రి ఆదేశాలు బేఖాతరు.. సంక్రాంతి ప్రయాణం భారం సాక్షి, హైదరాబాద్: ఏపీ నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేందుకు హైదరాబాద్ వచ్చిన మధ్యతరగతి వర్గాలు దాచుకున్న డబ్బంతా కరిగించేసింది ఈ సంక్రాంతి ప్రయాణం. హైదరాబాద్ నుంచి ఏపీలోని ఏ ప్రాంతానికి వెళదామన్నా రూ.వేలల్లోనే ఛార్జీలు ఉండటం.. ప్రభుత్వం తమ ప్రయాణానికి తగ్గట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కట్లు తప్పలేదు. సొంతూరులో పండగ చేసుకునే సెంటిమెంట్‌కు ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకున్నాయి. ఈ నెల 18 వరకు ప్రైవేటు ఆపరేటర్ల దూకుడు తగ్గేట్లుగా లేదు. ప్రయాణికుల అవసరాలను గరిష్టంగా దోపిడీ చేస్తూ ప్రైవేటు ఆపరేటర్లు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్లో టిక్కెట్లు ధరలు పెట్టి మరీ బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సుల్ని తిప్పుతున్నా చోద్యం చూస్తున్న ప్రభుత్వం ఈ దోపిడీకి వత్తాసు పలుకుతోంది. రూ.వేలు పెట్టి టిక్కెట్లు కొని సొంత ఊళ్లకు చేరినవారు తిరిగి ఎలా చేరుకోవాలోనని మథనపడుతున్నారు. కడప, కర్నూలు, విశాఖలకు రూ.2 నుంచి రూ.3 వేల వరకు టిక్కెట్లు రేట్లు పెట్టి ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల జేబులు కొల్లగొట్టారు. మళ్లీ తిరుగు ప్రయాణంలోనూ ప్రైవేటు ఆపరేటర్లు ఇదే తరహా బాదుడుకి సిద్ధం కావడం గమనార్హం. ప్రైవేటు ఆపరేటర్లు అధిక శాతం అధికారపార్టీకి చెందినవారే కావడంతో ప్రభుత్వం కూడా యధోచితంగా సహకరిస్తోంది. రవాణా శాఖ ఈ పది రోజుల్లో రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్‌పై ఒక్క కేసైనా నమోదు కూడా చేయలేదంటే ఆపరేటర్లకు ఎంతటి సహకారం ఉందో తెలుసుకోవచ్చు. ముందస్తు ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం ఏపీ ప్రభుత్వం సంక్రాంతి ప్రయాణానికి ముందస్తు ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందింది. ఆర్టీసీ ఈ సీజన్లో 2,700 బస్సుల్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఆ మేరకు నడపడంలో విఫలమైంది. ఆన్లైన్ రిజర్వేషన్లో సాంకేతిక లోపాలు తలెత్తి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు. సిటీ బస్సుల్ని ప్రత్యేక బస్సులుగా నడపడం, అందులోనూ ప్రత్యేకమైన బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రైల్వేతో సంప్రదించి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కోరలేదు. రైల్వే కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. సరిపడా బోగీలు లేక కాలుమోపే పరిస్థితి కానరాక ఊళ్లకు చేరడానికి నానా తంటాలు పడ్డారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జంటనగరాల్లో తిరిగే సిటీ బస్సులను కూడా సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రా ప్రాంతానికి నడిపేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి అదనపు బస్సులు నడపాల్సిందిగా తెలంగాణ సర్కారును కనీసం కోరలేదు. ఇద్దరు ఉన్నతాధికారులకు భారీ ముడుపులు అడ్డగోలుగా ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు తిప్పుతున్నా.. అందిన కాడికి దోచుకుంటున్నా.. రవాణా శాఖ చేష్టలుడిగి చూడటం వెనుక రూ.కోట్లు చేతులు మారిన ట్లు ఆరోపణలున్నాయి. రవాణా శాఖలో ఇరువురు ఉన్నతాధికారులకు ప్రైవేటు ఆపరేటర్లు భారీగా ముట్టజెప్పడంతోనే ప్రైవేటు బస్సుల జోలికెళ్లవద్దని రవాణా వర్గాలకు అంతర్గత ఆదేశాలు జారీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు షిర్డీలో ఘోర ప్రమాదానికి గురై పదుల సంఖ్యలో మరణించినప్పుడు రవాణా శాఖ ప్రైవేటు ట్రావెల్స్‌పై వరుస దాడులు నిర్వహించి కట్టడి చేసింది. అప్పట్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డెక్కాలంటే భయపడే పరిస్థితి నెల కొంది. ఇప్పుడు మాత్రం రవాణా అధికారులు తామేం చేయలేమని చెప్పడం పరిశీలనాంశం. ఇటీవలే మంత్రి శిద్ధా రాఘవరావు రవాణా శాఖ అధికారులతో సమావేశమై కఠిన చర్యలు చేపట్టాలని సూచించినా ట్రావెల్స్ దోపిడీకి అడ్డుకట్ట పడలేదు. భారీగా పెంచిన టిక్కెట్ల ధరలను నిర్భయంగా ఆన్లైన్లో ఉంచారు. అయితే వెయిటింగ్ లిస్ట్ అని పేర్కొని ఆన్లైన్లో ఉంచిన రేట్ల కంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడం గమనార్హం. -
ప్రైవేటు దోపిడీ
ఒంగోలు క్రైం : ఆర్టీసీ సమ్మె..ప్రైవేటు ఆపరేటర్లకు వరంలా మారింది. జిల్లా నుంచి వివిధ నగరాలకు ప్రయాణిస్తున్న వారి నుంచి అధిక చార్జీల రూపంలో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేపట్టడంతో ప్రైవేటు ఆపరేటర్లకు అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేసేందుకు మంచి అవకాశం దక్కింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ప్రైవేటు ఆపరేటర్లు వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె రూపంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు కనకవర్షం కురిపిస్తున్నారు. గతంలో ఉన్న చార్జీల స్థానంలో నూరు శాతం ఎక్కువ చేసి రెట్టింపు మొత్తంలో వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. జిల్లా నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు పలు నగరాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. అదే అదనుగా చేసుకుని ప్రయాణికుల అవసరాన్ని ఆసరా చేసుకుని ముక్కుపిండి చార్జీలు వసూలు చేస్తున్నారు. గతంలో ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రూ.300 నుంచి రూ.350 వసూలు చేసేవారు. అయితే ఇటీవల ట్రాన్స్‌పోర్టు డ్యూటీని పెంచడంతో రూ.350 ఉన్న బస్స చార్జీని రూ.450 నుంచి రూ.500 చేశారు. తాజాగా సమ్మె నేపథ్యంలో రూ.800 నుంచి రూ.1100 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లా నుంచి, జిల్లా మీదుగా 40 నుంచి 60 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వివిధ నగరాలకు ప్రయాణీకులను చేరవేస్తున్నాయి. అదే విధంగా ఒంగోలు నుంచి విశాఖపట్నంకు గతంలో రూ.700 నుంచి రూ.800 వరకు వసూలు చేసేవారు. అలాంటిది ప్రస్తుతం రూ.1,100 నుంచి రూ.1,400 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే బస్సుల్లో సీట్లు ఖాళీ లేవని చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తప్పనిసరై వారు అడిగినంత చెల్లిస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు సొంత జిల్లా అయినప్పటికీ ప్రైవేట్ ఆపరేటర్ల అక్రమ వసూళ్లకు ముక్కుతాడు వేసే పరిస్థితి లేకుండా పోయిందంటే ప్రైవేట్ ఆపరేటర్ల దందాలు ఏ స్థాయిలో ఉన్నాయో అట్టే అర్థమవుతోంది. -
ప్రయాణం... ప్రయాస
-
అందినకాడికి దండుకోవడమే..
పింప్రి, న్యూస్‌లైన్ : అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌ల్లోనూ దండుకొంటున్నారు. రోగుల నుండి అత్యధికంగా చార్జీలను వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఫిట్‌నెస్‌లేని వాహనాలను వినియోగిస్తున్నా రు. కొన్ని అంబులెన్సుల్లో కనీస సౌకర్యాలు లేవు. సామాజిక, రాజకీయ పార్టీలనుండి అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేసి అంబులెన్స్ ప్రారంభిస్తున్న వారి ఆగడాలను అరికట్టే దిక్కులేకుండా పోయింది. ఇష్టమొచ్చినట్లు రోగుల బంధువుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆపదలో ఉన్న రోగులు, బంధువులుకూ ఇబ్బం దులు తప్పడం లేదు. తనిఖీలు నిల్ ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల అంబులెన్సులల్లో వైద్య సదుపాయాలను ఆయా ఆస్పత్రిలే తనిఖీల ను చేస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్న అం బులెన్సులను ఎవరూ తనిఖీ చేయడం లేదు. ఒక్కో అంబులెన్సులో ఒక్కో ధరను వసూలు చేస్తున్నా యి. పుణే నగరంలో ప్రస్తుతం నడుస్తున్న అంబులెన్సులను పరిశీలిస్తే.. సంస్థల ద్వారా 288 అంబులెన్సులు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా- 326, కేంద్ర ప్రభుత్వం ద్వారా-11, శిక్షణ సంస్థల ద్వారా-8, స్వయం సేవా సంస్థల ద్వారా 110, స్థానిక సంస్థల ద్వారా-32, ఇతరులు-2 మొత్తం నగరంలో 1351 అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి. సౌకర్యాలు ఉండేవి..ఉండనివి.. అంబులెన్సులు రెండు రకాలుగా వర్గీకరించారు. మొదటిది బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వీటిలో ప్రత్యేక సదుపాయాలు ఉండవు. ఇవి కేవలం రోగులను తరలించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. రెండో రకం అంబులెన్సులల్లో సిలిండర్ , స్ట్రెక్చర్, ఈసీజీ మిషన్, సిరంజ్‌పంప్, డెఫ్రి బ్రిలేటర్ (హృదయ సంబంధించిన యం త్రం) బ్లడ్ ప్రెషర్ మిషన్, వెంటి లేటర్ సెక్షన్ మిషన్, నెబులైజర్, మాస్కులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, నర్సు, డాక్టర్లు, టెక్నీషియన్ ఉంటారని ససూన్ ఆస్పత్రి వైద్య పర్యవేక్షులు డాక్టర్ డి.బి.కులకర్ణి పేర్కొన్నారు. ఆర్టీవో పరిశీలనకు దూరం ఆర్టీవో ద్వారా అంబులెన్సుల వాహనంలో అన్ని మిషన్ విడిభాగాలను పరిశీలిస్తారు. భద్రతా పరం గా ఈ వాహ నం ఫిట్నెస్ను పరిశీలించి సర్టిఫికెట్‌ను ఆర్టీవో జారీ చేస్తుంది. ఇలా ప్రతి ఏడాది పరిశీ లి స్తోంది. ఇందుకు ప్రతి అంబులెన్స్ నుండి రూ.300 రుసుం వసూలు ఆర్టీవో అధికారులు వసూలు చేస్తా రు. ప్రస్తుతం నగరంలో సేవలందిస్తున్న 1,351 అంబులెన్సులకు 561 అంబులెన్సు లు ఆర్టీవో వద్ద తనిఖీలు జరపనే లేదు. 2012 తర్వాత ఒక్కసారి కూడా వీటిని పరిశీలించిన దాఖ లాలు లేవు. అంబులెన్సుల పనితీరును పరిశీలించడం తమ పని కాదని పుణే కార్పొరేషన్ ఆరోగ్య విభాగాధికారి డాక్టర్ ఎస్.టి.పరదేశీ తెలిపారు. ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి : ఆర్టీవో ఈ విషయమై ఆర్టీవో అధికారి జితేంద్ర పాటిల్ మాట్లాడుతూ..ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోం, స్వయం సేవా సంస్థల ద్వారా మొత్తం 1,351 అంబులెన్సులు నడుస్తున్నాయన్నా రు. ఇందులో 790 అంబులెన్సులు ఫిట్నెస్ పరీక్ష లు చేయించుకున్నాయని, కొత్త అంబులెన్సులను ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి, పాత అంబులెన్సులను ప్రతి సంవత్సరం తప్పక పరిశీలించాల్సి ఉందన్నారు. ఫిట్నెస్ పరీక్షలు తప్పకుండా జరుపుకోవాలని, లేకుంటే ఆ వాహనాన్ని అన్ ఫిట్ వాహనాలుగా ప్రకటిస్తామని తెలిపారు.