
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో ప్యాకేజ్డ్ వస్తువులపై వినియోగదారుల నుంచి ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేస్తే ఆ సంస్థలపై కేసులు నమోదు చేస్తామని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు.
మంగళవారం పౌరసరఫరాల భవన్‌లో సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అకున్ సబర్వాల్‌తో సమావేశ మయ్యారు. ప్రతి దానిపై బరువు, పరిమాణం కచ్చితంగా కనిపించాలని సూచించారు. బోర్డుపై కూడా స్పష్టంగా ధరలు కనిపించేలా ఉండాలని, వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి కచ్చితంగా బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేస్తే 1967, వాట్సప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.