
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో వస్తువుల ఎంఆర్‌పీ, పరిమాణం పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ శుక్రవారం ఆదే శాలు జారీ చేశారు. వినియోగదారుల నుంచి ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేస్తే సంస్థలపై కేసులు నమోదు చేసి, అధిక మొత్తం లో జరిమానాలు విధిస్తామ న్నారు.
ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు పంపారు. 23, 24 తేదీల్లో జిల్లాలో తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్లు మల్టీప్లెక్స్, సినిమాహాళ్ల యజమానులతో సమావేశమవ్వాలని ఆదేశించారు. తినుబండారాలు, శీతల పానీయాలు, ప్యాకింగ్ చేయని ఇతర ఉత్పత్తులధర, పరిమాణం తెలుపుతూ డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి విక్రయానికి వినియోగదారులకు బిల్లు ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 24 వరకు ధర, పరిమాణానికి సంబంధించి స్టిక్కర్ అంటించేందుకు అనుమతించామని, సెప్టెంబర్ 1 నుంచి కచ్చితంగా ధరలను ముద్రించుకోవాలన్నారు. అధిక ధరలు వసూ లు చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1967, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.