Multiplexes
-
మోసం చేస్తున్న మల్టీప్లెక్స్‌లు.. తెలుగు ప్రేక్షకులంటే ఎందుకంత చిన్నచూపు
-
మాల్స్‌లో పార్కింగ్ ఫీజుపై స్పందించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమంటూ విజయవాడకు చెందిన చందన మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ చార్జీల వసూలుకు ఆస్కారం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపించారు. మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారుల నుంచి విచక్షణారహితంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. ఎలాంటి పార్కింగ్ ఫీజులు వసూలు చేయరాదని హైకోర్టు గతంలో స్పష్టమైన తీర్పుని చ్చిందని తెలిపారు. ఈ తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో 35 జారీ చేసిందన్నారు. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తరఫున హాజరవుతున్న న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. జీవో 35 స్థానంలో జీవో 13 తీసుకురావడం జరిగిందన్నారు. ఆ జీవోను కోర్టు ముందుంచారు. దానిని పరిశీలించిన ధర్మాసనం.. జీవో 13 సినిమా టికెట్లకు సంబంధించిందని, అందులో పార్కింగ్ ఫీజుల ప్రస్తావన లేదని తెలిపింది. -
Ayodhya Ram mandir: కార్పొరేట్ల జై శ్రీరామ్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర ప్రారంభ వేడుకల్లో కార్పొరేట్ సంస్థలు కూడా సందడిగా పాల్గొంటున్నాయి. కార్యక్రమాన్ని మలీ్టప్లెక్సుల్లో లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలుకుని లాభాల్లో కొంత వాటాను అయోధ్యలో ప్రసాద వితరణ కోసం విరాళాలు ఇవ్వడం వరకు వివిధ రకాలుగా పాలు పంచుకుంటున్నాయి. వినియోగ ఉత్పత్తులను తయారు చేసే పలు కంపెనీలు పెద్ద సంఖ్యలో హోర్డింగ్‌లు, గేట్ బ్రాండింగ్, షాప్ బోర్డులు, కియోస్‌్కలు మొదలైనవి ఏర్పాటు చేసి, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నేడు (జనవరి 22న) రామ మందిర ప్రారంభ వేడుకలను 70 నగరాల్లోని 160 స్క్రీన్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మలీ్టప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. జనవరి 17 నుంచి జనవరి 31 వరకు తమ ఉత్పత్తుల విక్రయాలపై వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా ఇవ్వనున్నట్లు డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. భక్తుల రాకతో అయోధ్యలో నిత్యావసరాలకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో తమ ఉత్పత్తుల సరఫరాను డాబర్ మరింతగా పెంచింది. వెయ్యేళ్లైనా చెక్కుచెదరని నిర్మాణం: ఎల్అండ్టీ శ్రీ రామ మందిరాన్ని వెయ్యేళ్లైనా చెక్కు చెదరనంత పటిష్టంగా నిర్మించామని దిగ్గజ నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో సీఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఈ విషయంలో కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తదితర వర్గాలు అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదొక ఆలయంగా మాత్రమే కాకుండా ఇంజినీరింగ్ అద్భుతంగా కూడా నిలి్చపోతుందని కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ ఎంవీ సతీష్ పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ► ఐటీసీలో భాగమైన మంగళదీప్ అగరబత్తీ బ్రాండ్ ఆరు నెలల పాటు ధూపాన్ని విరాళంగా అందించింది. అలాగే ‘రామ్ కీ ఫేడీ’ వద్ద రెండు అగరబత్తీ స్టాండ్లను ఏర్పాటు చేసింది. నదీ ఘాట్లలో పూజా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పూజారులకు వేదికలను, మార్కెట్లో నీడకు గొడుగులు మొదలైనవి నెలకొలి్పంది. భారీ భక్త సందోహాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రధాన ఆలయం దగ్గర 300 బ్యారికేడ్లు, ఆలయ ముఖ ద్వారం దగ్గర 100 పైచిలుకు బాకేడ్లను కూడా ఐటీసీ అందిస్తోంది. ► అయోధ్యలో ఎలక్ట్రిక్ ఆటోల సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తెలిపింది. త్వరలో ఉబెర్‌గో, ఇంటర్సిటీ ఉబెర్ సేవలను కూడా అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. ► రామ మందిరంలో లైటింగ్ ఉత్పత్తుల సరఫరా, ఇన్స్టాలేషన్ పనులను నిర్వహించడం తమకు గర్వకారణమని హ్యావెల్స్ తెలిపింది. ► తాము భారత్‌లో ఎన్నో ప్రాజెక్టులు చేసినప్పటికీ రామ మందిరం వాటన్నింటిలోకెల్లా విశిష్టమైనదని యూఏఈకి చెందిన ఆర్ఏకే సెరామిక్స్ అభివరి్ణంచింది. కొత్త ఆభరణాల కలెక్షన్లు.. సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ‘సియారామ్’ పేరిట, కల్యాణ్ జ్యుయలర్స్ ‘నిమహ్’ పేరిట హెరిటేజ్ జ్యుయలరీ కలెక్షన్‌ను ఆవిష్కరించాయి. మందిర వైభవాన్ని, సీతారాముల పట్టాభిõÙక ఘట్టాన్ని అవిష్కృతం చేసేలా డిజైన్లను తీర్చిదిద్దినట్లు సెన్కో గోల్డ్ ఎండీ సేన్ తెలిపారు. సుసంపన్న వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్స్‌తో నిమహ్ కలెక్షన్‌ను రూపొందించినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణరామన్ పేర్కొన్నారు. -
దేశవ్యాప్తంగా పెరుగుతున్న హోం థియేటర్ ట్రెండ్
భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్ సౌండ్ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టిప్లెక్స్‌లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్‌ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్ ట్రెండ్ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. – సాక్షి, హైదరాబాద్ మార్కెట్లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచి్చన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచి్చన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మారుతుంది. పెరిగిన డిమాండ్.. మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్‌లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. ఓటీటీల రాకతో...: దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియేటర్ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లోనూ ఓటీటీల్లో కంటెంట్ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్‌ను 25 శాతం, వెబ్ సిరీస్‌లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట. ఖర్చు ఎంతంటే..: మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉన్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్లతో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయి. హోం థియేటర్ కోసం ఇళ్లలో స్క్రీన్ తప్పనిసరి కాదు. కానీ థియేటర్ ఫీల్ కావాలంటే మాత్రం స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది. మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్ అయిన టైడల్ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్షల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్ కోసం వాడే మెటీరియల్నుబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యం కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్‌ను మించి హోం థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
ఇంట్లోనే థియేటర్!
సాక్షి, హైదరాబాద్: భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్ సౌండ్ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టీప్లెక్స్‌లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్‌ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్ ట్రెండ్ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. అడ్డంకులు లేని అనుభూతి.. మార్కెట్లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచ్చిన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మారుతుంది. పెరిగిన డిమాండ్.. మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్‌లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. ఓటీటీల రాకతో... దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియేటర్ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లోనూ ఓటీటీల్లో కంటెంట్ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్‌ను 25 శాతం, వెబ్ సిరీస్‌లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట. ఖర్చు ఎంతంటే.. మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉన్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్లతో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయి. హోం థియేటర్ కోసం ఇళ్లలో స్క్రీన్ తప్పనిసరి కాదు. కానీ థియేటర్ ఫీల్ కావాలంటే మాత్రం స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది. మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్ అయిన టైడల్ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్షల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్ కోసం వాడే మెటీరియల్నుబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యత కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్‌ను మించి హోం థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
సినిమా హాళ్లకు బయటి ఫుడ్ తీసుకెళ్లడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సినిమా హాళ్లకు ప్రేక్షకులు బయటి నుంచి ఆహారం, పానీయాలు తీసుకెళ్లవచ్చా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసిహతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. థియేటర్లు యజమానుల ప్రవేటు ఆస్తులు కాబట్టి ప్రేక్షకులు బయటి నుంచి తెచ్చుకున్న ఆహారం, పానీయాలు లోపలికి తీసుకెళ్లకుండా నియంత్రించే హక్కు సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్‌లకు ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా 2018 జూలై 18న సినిమా హాళ్లలోకి బయట ఆహారాన్ని తీసుకురాకుండా విధించిన నిషేధాన్ని జమ్మూ కశ్మీర్ హైకోర్టు తొలగించింది. నిషేధం కారణంగా థియేటర్లలో ఏది విక్రయిస్తే అది తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే కారణంతో హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సినిమా హాళ్లలో బయటి నుంచి తీసుకొచ్చే ఆహారాన్ని నిషేధించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి సినిమా హాళ్లు ఏం జిమ్‌లు కాదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రేక్షకులు వినోదం కోసం థియేటర్లకు వస్తారని తెలిపింది. ఇది ప్రైవేట్ యాజమాన్యంలో ఉంటుంది. కాబట్టి బయటి ఆహారాన్ని అనుమతించాలా.. వద్దా అనే దానిపై హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే పిల్లలకు ఉచిత ఆహారం, మంచి నీరు అందించాలని ఇప్పటికే సినిమా హాళ్లను ఆదేశించామని ధర్మాసనం ఈ సందర్బంగా గుర్తు చేసింది. సినిమా చూసేందుకు ఏ థియేటర్‌ను ఎంపిక చేసుకోవాలనేది ప్రేక్షకుడి హక్కు.. అలాగే నిబంధనలను విధించే హక్కు సినిమా హాల్ యాజమాన్యానికి కూడా ఉంది. అక్కడ ఉన్నవాటిని వినియోగించాలా వద్దా అనేది పూర్తిగా సినిమా ప్రేక్షకుడి ఎంపికపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ షరతులు ప్రజా ప్రయోజనాలకు, భద్రతకు విరుద్ధం కానంత వరకు యజమాని నిబంధనలను పెట్టడానికి పూర్తి అర్హత ఉంది’ అని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఈ సందర్భంగా పలు ఉదాహరణలు చెబుతూ న్యాయమూర్తులు సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. ‘సినిమా హాల్లోకి ఎవరైనా జిలేబీలు తీసుకెళితే అప్పుడు పరిస్థితి ఏంటి?. ఒకవేళ జిలేబీలు తిని ప్రేక్షకుడు తన చేతి వేళ్లను సీట్‌పై తుడిస్తే క్లీనింగ్‌కు ఎవరు డబ్బు ఇస్తారు. ఇక ప్రజలు సినిమా హాల్లోకి తందూరీ చికెన్ కూడా తీసుకెళ్తారు. మరి అప్పుడు హాల్లో తినేసిన ఎముకలు పడేశారని కంప్లైట్ రావొచ్చు. ఇది కూడా ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. చదవండి: కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. యువతి కుటుంబానికి రూ.10 లక్షలు.. -
National Cinema Day: మల్టీఫ్లెక్సుల్లో రూ.75కే టికెట్!
ముంబై: ఓటీటీల కాలంలో.. కరోనా తర్వాత సాధారణ థియేటర్లతో పోలిస్తే మల్టీఫ్లెక్స్‌లకే ప్రేక్షకుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా మల్టీ ఫ్లెక్స్ అసోసియేషన్ ఆసక్తికర నిర్ణయం ఒకటి తీసుకుంది. వంద రూపాయలలోపు టికెట్ రేటుతో ప్రేక్షకుడికి సినిమా అనుభూతిని అందించాలని నిర్ణయించుకుంది. అయితే ఇక్కడో విషయం ఉందండోయ్. సెప్టెంబర్ 16న నేషనల్ సినిమా డే. ఈ సందర్భంగా.. ప్రేక్షకులకి ఈ బంపరాఫర్ ప్రకటించింది మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MAI). కరోనా లాక్డౌన్ తర్వాత ఆదరిస్తున్న ప్రేక్షకుల గౌరవార్థం ఆ ఒక్కరోజు ఈ పని చేస్తున్నట్లు ప్రకటించింది ఎంఏఐ. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్, కార్నివాల్, మిరాజ్, ఏషియన్.. ఇలా పలు మల్టీఫ్లెక్స్ ఫ్రాంచైజీల్లో ఆరోజున కేవలం రూ.75కే సినిమా చూడొచ్చు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 4000 స్క్రీన్స్‌లో సినిమా చూడొచ్చని మల్టీఫ్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ డిస్కౌంట్ ద్వారా అయిన ఆడియొన్స్‌ను ఆ ఒక్కరోజు రప్పించ వచ్చనే ఆలోచనలో ఉంది. అయితే ఇప్పటికే బాయ్‌కాట్‌ట్రెండ్ మోజులో ఉన్న ఆడియెన్స్.. ఈ బంపరాఫర్‌ను స్వీకరిస్తారా? తిరస్కరిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. మల్టీఫ్లెక్స్ ఫ్రాంచైజీలు మాత్రం ఫ్యామిలీ ఆడియొన్స్ రావొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. Cinemas come together to celebrate ‘National Cinema Day’ on 16th Sep, to offer movies for just Rs.75. #NationalCinemaDay2022 #16thSep — Multiplex Association Of India (@MAofIndia) September 2, 2022 ఇదీ చదవండి: బీజేపీలో ఉంటూనే ‘ఆప్’ కోసం పని చేయండి -
ప్రతిభను ప్రోత్సహించేందుకే రెడ్డీస్ మల్టీప్లెక్స్
‘‘మహిళలకు అవకాశం ఇస్తే ఎంత ఎత్తుకు అయినా ఎదుగుతారు. జగన్‌గారిని సీఎం చేయడం కోసం మహిళలుగా మేమంతా కష్టపడ్డాం. శైలజ డేరింగ్ స్టెప్ వేస్తోంది. ఈ సంస్థ నుంచి మరింత ఎంటర్టైన్మెంట్ రావాలి.. ఇది సక్సెస్ కావాలి’’ అని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్.కె. రోజా అన్నారు. రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ లోగో, ఈ సంస్థకు చెందిన యూ ట్యూబ్ చానల్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘సినిమాలు, యూ ట్యూబ్, రియల్ ఎస్టేట్.. ఇలా అన్నింటినీ ఒక పద్ధతిలో చేస్తున్నారు. యువతరం తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు ఒక మంచి వేదిక అవుతుంది’’ అన్నారు. రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ చైర్మన్ విజయ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్‌ని ప్రారంభించాం. టాలీవుడ్ అనే చేపల చెరువును ఆన్లైన్ అనే మహాసముద్రం మింగేస్తోంది. రీల్‌పై ఎందరు హీరోలున్నా ప్రజల హృదయాల్లో రియల్ హీరో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిగారే.. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిగారు కూడా ఎన్నో మంచి పనులు చేశారు’’ అన్నారు. ‘‘ఇది కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ’’ అని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, రెడ్డీస్ మల్టీప్లెక్స్ చైర్ పర్సన్ శైలజా చరణ్ రెడ్డి అన్నారు. ‘మనస్సాక్షి, వాయిస్ ఆఫ్ ఉమెన్, టుడే పాలిటిక్స్, కామన్ మ్యాన్, వైయస్ఆర్ డ్రీమ్ వరల్డ్, యువతరం’ అనే యూట్యూబ్ చానల్స్‌తో పాటు ఆర్ ప్లెక్స్ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించారు. మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, నరసింహారెడ్డి, విద్యావతి, అవినాష్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, స్నేహ తదితరులు పాల్గొన్నారు. -
అన్‌లాక్ థియేటర్స్
థియేటర్లు రీ ఓపెన్ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నెల ప్రారంభంలోనే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో చాలా చోట్ల థియేటర్స్‌ను ఓపెన్ చేశారు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం థియేటర్స్ తెరవడానికి అనుమతి ఇవ్వలేదు. తాజాగా నవంబర్ 10 నుంచి మల్టీప్లెక్స్‌లు, థియేటర్స్ అన్నింటినీ అన్‌లాక్ చేయొచ్చని ప్రకటించింది. ఈ ప్రకటనతో థియేటర్స్ యజమానులు తాళాలు తీయడానికి రెడీ అవుతున్నారు. 50 శాతం సీటింగ్‌తో అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. -
రోజురోజుకీ నష్టం పెరుగుతోంది
దేశవ్యాప్తంగా నాన్ కంటైన్మెంట్ జోన్స్‌లోని థియేటర్స్‌ను రీ ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌ను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరింది. ఇందుకు సంబంధించి ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ఈ నోట్ సారాంశం ఇలా... ‘‘కేంద్రప్రభుత్వం అన్ లాకింగ్ 2.0 గైడ్‌లైన్స్‌లో కూడా థియేటర్స్‌ను రీ ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పించలేదు. నిజానికి సామాజిక దూరం, క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం వంటి అంశాలను థియేటర్స్ యాజమాన్యం సమర్థవంతంగా నిర్వహించగలదని మేం నమ్ముతున్నాం. దేశవ్యాప్తంగా మా ద్వారా దాదాపు రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా వేలల్లో ఉపాధి పొందుతున్నారు. థియేటర్స్ మూసివేయడం వల్ల మా నష్టం రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్న వారి ఇబ్బందులు కూడా పెరుగుతు న్నాయి. నిజానికి మేం థియేటర్స్‌ను ఓపెన్ చేసినప్పటికీ మునుపటి రోజులు రావటానికి సమయం పడుతుంది. మరోవైపు ప్రేక్షకులను థియేటర్స్‌కు ఆకర్షించే కంటెంట్‌పై దృష్టి పెట్టాలి. ఇటువంటి సవాళ్లు కూడా ఉన్నాయి. కానీ ఈ చాలెంజెస్‌ను ప్రభుత్వ ప్రోత్సాహంతో అధిగమిస్తామని నమ్ముతున్నాం. ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, హాంకాంగ్, ఇటీవల బెల్జియం, మలే షియా వంటి దేశాల్లో సినిమాల ప్రదర్శనలకు నియంత్రణలతో కూడిన అవకాశం కల్పించారు. ఇతర సెక్టార్స్‌లోని వాటికి అనుమతులు ఇచ్చిన మాదిరిగానే దేశవ్యాప్తంగా నాన్ కంటైన్మెంట్ జోన్స్‌లో సినిమాల ప్రదర్శనలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కోరు కుంటున్నాం’’ అని పేర్కొంది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. -
మల్టీప్లెక్స్‌లకు మొట్టికాయ
విజయవాడ లీగల్: మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలకు కూల్‌డ్రింక్స్ అమ్మకాలు సాగించడంపై కృష్ణా జిల్లా వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్లో ఒక ధరతో, మల్టీప్లెక్స్‌లో మరో ధరతో కూల్‌డ్రింక్స్ అమ్మినందుకు వాటి తయారీ సంస్థలకు భారీ జరిమానా విధించింది. రూ.ఐదేసి లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఐదు కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీలను ఆదేశించింది. అదే సమయంలో మల్టీప్లెక్స్‌లకు సైతం మొట్టికాయలు వేసింది. తినుబండారాలు, మంచి నీళ్ల బాటిళ్లను లోపలికి అనుమతించాలని.. వినియోగదారులకు మంచి నీరు అందుబాటులో ఉంచాలని మల్టీప్లె్లక్స్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కృష్ణా జిల్లా వినియోగదారుల ఫోరం–2 అధ్యక్షుడు సీహెచ్ మాధవరావు గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. తినుబండారాలు, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిళ్లను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని గతేడాది ఏప్రిల్ 2న విజయవాడకు చెందిన గరికపాటి ప్రభాకరరావు గాంధీనగర్‌లోని ఐనాక్స్ థియేటర్‌పై, వేమూరి వెంకట శ్రీరామ్‌కుమార్ పటమటలోని ఐనాక్స్ థియేటర్‌పై, లింగారెడ్డి విద్యాప్రకాష్.. ట్రెండ్సెట్పై, బి.నరసింహమూర్తి పీవీఆర్‌పై, చెన్నుపాటి మణినాగేందర్ పీవీపీ మాల్స్‌పై వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశారు. మల్టీప్లెక్స్‌లతో పాటు కోకోకోలా, పెప్సీ, కిన్లే, రెడ్ బుల్, పల్పీ ఆరెంజ్.. అలాగే తూనికలు, కొలతల శాఖ అధికారులను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఫిర్యాదును విచారించిన వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు.. కూల్‌డ్రింక్స్ కంపెనీలు, మల్టీప్లెక్స్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలు వసూలు చేసిన కోకోకోలా, పెప్సీ, కిన్లే, రెడ్‌బుల్, పల్పీ ఆరెంజ్ కంపెనీలకు రూ.ఐదేసి లక్షల చొప్పున మొత్తం రూ.25 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని స్పష్టం చేశారు. సెలెక్ట్ చానల్ పేరిట తినుబండారాలు, పానీయాలపై మార్కెట్ ధర కంటే అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని.. 9 శాతం వడ్డీతో సహా ఫిర్యాదుదారులకు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ధరల పట్టిక అందరికీ కనిపించాలని, వినియోగదారులు ఫిర్యాదు చేయడం కోసం అధికారుల నంబర్లు ఏర్పాటు చేయాలని.. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌కు స్పష్టం చేశారు. -
చట్టపరంగానే మల్టీప్లెక్స్‌లపై చర్యలు
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో వరుస దాడులకు సంబంధించి పూర్తిగా చట్ట నిబంధనలకు లోబడే వ్యవహరిస్తున్నామని తూనికలు, కొలతల శాఖ హైకోర్టుకు స్పష్టం చేసేందుకు సిద్ధమైంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం చట్టపరంగానే మల్టీప్లెక్స్‌ల్లో తనిఖీలు నిర్వహించామని, తనిఖీల సమయంలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించామని, దీనికి ఆధారాలు, వివరాలను తెలుపుతూ రెండ్రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ సమర్పించనుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై తూనికలు, కొలతల శాఖ గత కొన్ని రోజులుగా తనిఖీలు నిర్వహించి, వందకు పైగా కేసులు నమోదు చేసింది. మరోవైపు తూనికలు కొలతల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేసులు నమోదు చేస్తున్నా పదే పదే నిబంధనలు ఉల్లంఘించడంతో అధికారులు బిల్లింగ్ సిస్టంలను జప్తు చేశారు. ఈ తనిఖీలు నిలుపుదల చేయాలని పీవీఆర్ మల్టీప్లెక్స్, బిల్లింగ్ సిస్టంలను జప్తు చేయవద్దని, తనిఖీలు ఆపాలని ఐనాక్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఐనాక్స్ యాజమాన్యం వేసిన పిటిషన్‌పై తనిఖీల నిలుపుదలకు హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తూనికలు, కొలతల శాఖ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఒకటి రెండు రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయబోతున్నట్లు తెలిసింది. హైకోర్టులో స్టే వెకేషన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నట్లుగా తెలిసింది. -
‘ఎమ్మార్పీ’పై ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై వినియోగదారుల నుంచి భారీ ఎత్తున తూనికల కొలతల శాఖకు ఫిర్యాదులు అందుతున్నా యి. పాప్‌కార్న్, వాటర్‌బాటిల్, కూల్‌డ్రింక్స్, ఇతర తినబండారాల ఎమ్మార్పీ ధరలపై వినియోగదారులు ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదుల కోసం అందుబాటులో ఉంచిన టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333, వాట్సాప్ 7330774444లకు ఇప్పటికే 274 ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా పాప్‌కార్న్ చిన్న ప్యాక్ ధరను రూ.150 నుంచి రూ.200కు అమ్ముతు న్నారని, సమోసాలకు ఒక్కోదానిపై రూ.50 నుంచి రూ.75 వరకు ఎమ్మార్పీ పేరుతో వసూ లు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. ‘బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్ ఐనాక్స్‌లో తినుబండారాల ధరల్లో మార్పు లేదు. ఇక్కడ చిన్న సైజు పాప్‌కార్న్ కప్ రూ.210 వసూలు చేశారు. మేనేజ్మెంట్ నిర్ణయం మేరకే ధర నిర్ణయిస్తున్నామని చెబుతున్నారు’ అని ఒకరు ఫిర్యాదు చేశారు. ఉప్పల్‌లోని ఏసియన్ థియేటర్లో 750 ఎంఎల్ వాటర్ బాటిల్ రూ.25 ఎమ్మార్పీకి అమ్ముతున్నారని మరొకరు వాట్సా ప్ ద్వారా ఫిర్యాదు చేశారు. పీవీఆర్ పంజాగుట్టలోనూ బేకరి ఐటమ్‌ను టిక్కెట్‌తోపాటే విక్రయిస్తూ రూ.230 వసూలు చేస్తున్నారని మరో ఫిర్యాదు వచ్చింది. ముఖ్యంగా ఎమ్మార్పీ ధరలకే విక్రయిస్తున్నామంటూ అన్ని రకాల తినుబండారాలు, కూల్డ్రింక్స్పై ధరలు పెంచేస్తున్నారని, ఇది మరో దోపిడీ అంటూ వినియోగదారులు మొరపెట్టుకుంటున్నారు. కొరడా ఝళిపిస్తోన్న తూనికల శాఖ వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై తూనికలు కొలతల శాఖ కొరడా ఝళిపిస్తోంది. 17 మల్టీప్లెక్స్‌ల్లో ఆదివారం తూనికల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 12 మల్టీప్లెక్స్‌లపై 15 కేసులు నమోదు చేశారు. ఏసియన్ ముకుంద మేడ్చల్–1, సినిమా మంత్ర శంషాబాద్–2, పీవీఆర్ గెలీలియో–2, మహాలక్ష్మి కొత్తపేట–1, మిరాజ్ దిల్సుఖ్నగర్–1, జీవీకే వన్–1, సినిమా మంజీరామాల్ కూకట్పల్లి–1, బీవీఆర్ విజయలక్ష్మి ఎల్బీనగర్–1, రాధిక థియేటర్ ఎస్రావు నగర్–1, ఐనాక్స్ కాచిగూడ–2, ఏసియన్ సినిమా కూకట్పల్లి–1, ఏసియన్ షహీన్‌షా చింతల్–1 మల్టీప్లెక్స్‌లపై కేసులు నమోదు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి, వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న మల్టీప్లెక్స్‌లు, థియేటర్లపై ఇప్పటివరకు మొత్తం 107 కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
రెండవ రోజుకు మల్టీప్లెక్స్‌ల్లో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పలు మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లపై తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు రెండవ రోజు కూడా కొనసాగాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని పలు షాపింగ్, సినిమా మాల్స్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు తినుబండారాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 54 కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. -
మల్టీప్లెక్సుల్లో ఆగని దోపిడీ
-
మల్టీప్లెక్స్‌ల దోపిడీపై దాడులు షురూ
సాక్షి, హైదరాబాద్: సినిమా హాళ్లలో తినుబండారాల ధరల నియంత్రణ కోసం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై తూనికలు, కొలతల శాఖ దాడులు ముమ్మరం చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్న హైదరాబాద్‌లోని పలు మల్టీప్లెక్స్‌లలో తనిఖీలు చేసి కేసులు నమోదు చేసింది. 20 మల్టీప్లెక్స్‌లలో తనిఖీలు నిర్వహించిన బృందాలు.. తినుబండారాలనుఅధిక ధరలకు విక్రయిస్తున్న 18 మల్టీప్లెక్స్‌లపై 54 కేసులు నమోదు చేశాయి. బంజారాహిల్స్‌లోని జీవీకే–1పై 6, కాచిగూడలోని బిగ్ సినిమాపై 6, ప్రసాద్ ఐమాక్స్‌పై 2, పీవీఆర్ గెలీలియోపై 3, మాదాపూర్‌లోని పీవీఆర్ ఐకాన్‌పై 3, కొత్తపేట మహాలక్ష్మిపై 3, మల్కాజ్గిరి సీనీపోలీస్‌పై 5, సుజానాఫోరం మాల్‌పై 2, కూకట్పల్లి ఆసియాన్‌పై 4, జేఎన్టీయూ మంజీరా మాల్‌పై 3, కొంపల్లిలోని ఆసియాన్ సినీప్లానెట్, మేడ్చల్‌లోని ఆసియాన్ ముకుందాపై 3 కేసుల చొప్పున నమోదయ్యాయి. అధిక ధరలపై టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444కు వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు. -
లేని అధికారం చూపొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో అమ్మే నాన్ ప్యాకేజ్డ్ ఫుడ్ (ప్యాకెట్లో కాకుండా విడిగా అమ్మే తినుబండారాలు) విషయంలో పలు నిబంధనలు విధిస్తూ తూనికలు, కొలతల శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. నాన్ ప్యాకేజ్డ్ ఫుడ్ విషయంలో అలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం తూనికలు, కొలతల శాఖ అధికారులకు లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా అధికారులు తమకు లేని అధికారాన్ని ప్రదర్శించినట్లయిందని స్పష్టం చేసింది. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ప్యాకెట్లలో కాకుండా పేపర్ ప్లేట్లో పెట్టి అమ్మే సమోసాలకు సైతం టోల్ ఫ్రీ నంబర్ ఉండి తీరాలన్న నిబంధనపై విస్మయం వ్యక్తం చేసింది. అధికారుల తీరు చూస్తుంటే రోడ్లపై అమ్మే టీ, కాఫీ, సోడాలకు సైతం టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వాలని అడిగే ఉన్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. నాన్ ప్యాకేజ్డ్ ఫుడ్ విషయంలో తూనికలు, కొలతల అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు ఏ మాత్రం నిబంధనలకు లోబడి లేవని, ఈ విషయంపై సోమవారం పూర్తిస్థాయిలో తగిన ఆదేశాలు జారీ చేస్తానని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ప్రకటించారు. అంతిమంగా నష్టపోయేది ప్రేక్షకులే.. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో విక్రయించే నాన్ ప్యాకేజ్డ్ ఫుడ్ విషయంలో పలు నిబంధనలు విధిస్తూ రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ అధికారులు గతనెల 18న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, పీవీఆర్ లిమిటెడ్‌లు హైకోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్యాకేజ్డ్ ఫుడ్‌కు సంబంధించి విధించిన నిబంధనల విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే నాన్ ప్యాకేజ్డ్ ఫుడ్ విషయంలో విధించిన నిబంధనలు మాత్రం సహేతుకంగా లేవని తెలిపారు. ప్యాకెట్లలో కాకుండా విడిగా అమ్మే ఆహార పదార్థాల విషయంలో తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధన పెట్టారని, ఆచరణలో ఇది ఎంత మాత్రం సాధ్యం కాదన్నారు. విడిగా అమ్మే ఆహార పదార్థం బరువు, నాణ్యత తదితరాలను డిక్లరేషన్‌లో చెప్పాలని అధికారులు అంటున్నారని ఆయన వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘ఉదాహరణకు మనం రెండు సమోసాలు కొంటే వాటిని పేపర్ ప్లేట్లో పెట్టి ఇస్తారు. అధికారులు చెబుతున్న ప్రకారం ఆ పేపర్ ప్లేట్‌పై స్టిక్కర్ రూపంలో డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది ఎలా సాధ్యం? దీన్ని అమలు చేస్తే స్టిక్కర్ల ముద్రణకు అయ్యే వ్యయాన్ని కూడా ప్రేక్షకుల నుంచే వసూలు చేస్తారు. దీంతో సమోసాల రేటు కూడా పెరుగుతుంది. అంతిమంగా నష్టపోయేది ప్రేక్షకులే. అయినా మనం ఎన్ని సమోసాలు కొన్నామో వాటికి బిల్లు ఇస్తారు కదా. బోర్డులో ఒక్కో సమోసా ధర ఎంతో ఉంటుంది. కొన్న ప్రతీ పదార్థానికి బిల్లు తప్పనిసరి చేయడంలో తప్పులేదు. కానీ ఇలా సహేతుకంగా లేని, ఆచరణ సాధ్యం కాని నిబంధనలు విధించడం సరికాదు’’అని అన్నారు. దోపిడీ నుంచి కాపాడేందుకే.. ఇలాంటి నిబంధన విధించే అధికారం తూనికలు, కొలతల శాఖకు ఎక్కడ ఉందో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి కోరారు. దీంతో ప్రభుత్వ న్యాయవాది జ్యోతికిరణ్ నిబంధనలను చదివి వినిపించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తూనికలు, కొలతల అధికారులు ఈ నిబంధనలు రూపొందించారని, తాము కొత్తగా దీన్ని తీసుకురాలేదని, చట్టంలో ఉన్న వాటిని అమలు చేయాలని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల యాజమాన్యాలను కోరామని చెప్పారు. అంతేకాక సినిమా హాళ్లలో అధిక ధరల వసూలుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, ఈ నేపథ్యంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారన్నారు. అడ్డగోలు దోపిడీ నుంచి ప్రజలను కాపాడేందుకే వీటిని అమలు చేస్తున్నామన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో అధిక ధరల వసూలు ప్రస్తావన ఎక్కడుందని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఏ బ్రాండ్ అమ్మాలో కూడా మీరే నిర్ణయిస్తారా? నిబంధనల్లో సినిమా హాళ్లలో కేవలం ఒక బ్రాండే కాక ప్రేక్షకులకు నచ్చిన బ్రాండ్లను అమ్మాలని పేర్కొనడంపై కూడా న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. ‘‘ఏ బ్రాండ్లు అమ్మాలో.. ఎన్ని బ్రాండ్లు అమ్మాలో కూడా అధికారులే నిర్ణయిస్తారా? ఒక ప్రేక్షకుడు నాకు బిస్లరీ వాటర్ కావాలంటాడు.. మరొకరు కిన్లే కావాలంటారు.. మరొకరు ఆక్వా ఫినా అడుగుతారు.. ఇవన్నీ అందుబాటులో ఉంచాలా? వద్దా? అన్నది సినిమా థియేటర్ల వాళ్ల ఇష్టం. అందులో అధికారుల జోక్యం ఏంటి? మరీ టూమచ్‌గా వ్యవహరిస్తున్నారు. లేని అధికారాన్ని ప్రదర్శిస్తామంటే కుదరదు. ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ, ఏది ఎప్పుడు, ఎలా చేయాలో కూడా నిర్ణయిస్తామంటే ఎలా? ప్రభుత్వం ఎప్పుడూ న్యానీ స్టేట్ (పౌరుల ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకోవడం)గా వ్యవహరించరాదు. నాన్ ప్యాకేజ్డ్ ఫుడ్ విషయంలో అధికారులు విధించిన నిబంధనలన్నీ దాదాపు చట్ట విరుద్ధంగా ఉన్నాయి. చట్టం అనుమతించని వాటిని అమలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు’’అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. -
నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో అధికారులు తనిఖీలు
-
నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లపై తూనికలు కొలతల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయిన కూడా వారు నిబంధనలకు పాటించడంలేదని వార్తలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ పరిధిలోని ప్రసాద్ మల్టీప్లెక్స్, ఉప్పల్ ఏషియన్, ఏఎస్ రావు నగర్‌లోని రాధిక, జీవీకే మాల్, కాచిగూడ ఐనాక్స్‌తో పాటు ఇతర మల్టీప్లెక్స్‌ల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం ఏడు టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ కంట్రోలర్ అకూన్ సబర్వాల్ తెలిపారు. ఇప్పటి వరకు అధికారులు 20 కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కాచిగూడ ఐనాక్స్కు నోటీసులు ఈ రోజు ఉదయం తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో కాచిగూడలోని ఐనాక్స్ ధియేటర్లో అధికారులు దాడులు నిర్వహించారు. ప్రమాణాలు పాటించకుండా వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించిన అధికారులు యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. ఐనాక్స్ నిర్వహకులు నెట్ క్వాంటిటి, ఎమ్మార్పీ ధరలు లేకుండా అమ్మకాలు చేపట్టడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.పలు శ్యాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ ఏషియన్, కొత్తపేట మహాలక్ష్మీ థియేటర్‌పై మూడు కేసులు నమోదు చేసినట్టు ఏసీసీ జగన్మోహన్ తెలిపారు. చాలా వరకు థియేటర్లలో నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు తేలిందన్నారు. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా కొంతకాలంగా ప్రేక్షకుల నుంచి తూనికల శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో అధిక ధరలకు అడ్డుకట్ట వేయడానికి తూనికలు కొలతల శాఖ చర్యలు చేపట్టింది. -
సినిమా హాళ్లలో పక్కాగా ఎంఆర్పీ అమలు
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో వస్తువుల ఎంఆర్పీ, పరిమాణం పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ శుక్రవారం ఆదే శాలు జారీ చేశారు. వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తే సంస్థలపై కేసులు నమోదు చేసి, అధిక మొత్తం లో జరిమానాలు విధిస్తామ న్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు పంపారు. 23, 24 తేదీల్లో జిల్లాలో తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్లు మల్టీప్లెక్స్, సినిమాహాళ్ల యజమానులతో సమావేశమవ్వాలని ఆదేశించారు. తినుబండారాలు, శీతల పానీయాలు, ప్యాకింగ్ చేయని ఇతర ఉత్పత్తులధర, పరిమాణం తెలుపుతూ డిస్ప్లే బోర్డుల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విక్రయానికి వినియోగదారులకు బిల్లు ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 24 వరకు ధర, పరిమాణానికి సంబంధించి స్టిక్కర్ అంటించేందుకు అనుమతించామని, సెప్టెంబర్ 1 నుంచి కచ్చితంగా ధరలను ముద్రించుకోవాలన్నారు. అధిక ధరలు వసూ లు చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1967, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
వినియోగదారులను మోసం చేస్తే కేసు: అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో ప్యాకేజ్డ్ వస్తువులపై వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తే ఆ సంస్థలపై కేసులు నమోదు చేస్తామని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. మంగళవారం పౌరసరఫరాల భవన్లో సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అకున్ సబర్వాల్‌తో సమావేశ మయ్యారు. ప్రతి దానిపై బరువు, పరిమాణం కచ్చితంగా కనిపించాలని సూచించారు. బోర్డుపై కూడా స్పష్టంగా ధరలు కనిపించేలా ఉండాలని, వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి కచ్చితంగా బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేస్తే 1967, వాట్సప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
సినిమా హాళ్లకు ఇంటిఫుడ్ తీసుకెళ్లొచ్చు..
ముంబై : మల్టీప్లెక్స్‌ల్లోని సినిమా హాళ్లకు ఇంటి ఆహారాన్ని తీసుకెళ్లొచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. మల్టీప్లెక్స్ సిబ్బంది ఇలా ఇంటి ఆహారాన్ని తెచ్చుకునే వారిని అడ్డిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మహారాష్ట్రలోని మల్టీప్లెక్స్‌లలో తినుబండారాలను భారీగా అధిక ధరలకు అమ్ముతున్నారు. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో తినుబండారాల రేట్లపై కూడా ఓ పాలసీని తయారు చేయనున్నట్లు మహారాష్ట్ర మంత్రి రవీంద్ర చవాన్ తెలిపారు. ఆరు వారాల్లోగా పాలసీని తయారు చేస్తామని చెప్పారు. కొద్దిరోజుల క్రితం మల్టీప్లెక్స్‌లలో తినుబండారాలపై బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా చర్యలకు ఉపక్రమించింది. -
నేటి నుంచే ఫ్రీ పార్కింగ్
సాక్షి, హైదరాబాద్ : షాపింగ్ మాల్స్.. మల్టీప్లెక్స్‌లు.. ఇతరత్రా వాణిజ్య ప్రదేశాల్లో పార్కింగ్ దోపిడీకి ఇకపై చెక్ పడనుంది. గంటల లెక్కన ఇష్టారీతిన సాగుతున్న పార్కింగ్ ఫీజుల వసూలు నుంచి నగర ప్రజలకు ఉపశమనం లభించనుంది. ఇకపై మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో తొలి అరగంట వరకు పార్కింగ్ ఉచితం. ఆ తర్వాత పార్కింగ్ చేసే సమయం.. నిబంధనలను బట్టి పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నారు. వాణిజ్య ప్రాంతాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్ ఫీజుల్ని క్రమబద్ధీకరిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆదివారం నుంచి నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పార్కింగ్ ఫీజుల్ని వసూలు చేయాలి. అలా కాక ఇష్టానుసారం వసూలు చేసే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకునే అధికారం జీహెచ్ఎంసీకి ఉంది. ఈ మేరకు మాల్స్, మల్టీప్లెక్స్‌ల యజమానులతో జీహెచ్ఎంసీ సమావేశం నిర్వహించి స్పష్టం చేసింది. ఈ భేటీలో వారు వ్యక్తపరచిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ప్రకటించింది. అయితే పార్కింగ్ పాలసీని మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని వారికి స్పష్టం చేసింది. తొలి అరగంట ఉచితం.. మార్చి 20న ప్రభుత్వం జారీ చేసిన జీవో మేరకు వాణిజ్య ప్రదేశాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో తొలి అరగంట వరకు సరుకులు కొన్నా, కొనకపోయినా ఉచితం. ఆ తర్వాత పార్కింగ్ చేసే సమయాన్ని బట్టి పార్కింగ్ ఫీజు ఎలా వసూలు చేయవచ్చో స్పష్టం చేసి.. వాటిని తప్పక పాటించాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. ఈ వివరాలు ప్రజలకు తెలిసేలా పార్కింగ్ ప్రదేశాల్లో డిజిటల్‌గా ప్రదర్శించడం, జీవో ప్రతిని అంటించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. వాహనం పార్కింగ్ చేసిన సమయాన్ని తప్పకుండా నమోదు చేయాలని, ఇందుకుగానూ స్టాంప్ వేయడమో, లేక తగిన డివైజ్‌ను వినియోగించడమో చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి సూచించారు. పార్కింగ్ ఫ్రీ ఇలా.. పార్కింగ్ ప్రదేశంలో ఉంచిన వాహనానికి 30 నిమి షాల వరకు ఎలాంటి ఫీజు వసూలు చేయరు. కొను గోలు చేసినా, చేయకపోయినా పార్కింగ్ ఫీజు అడగరాదు. అంటే బేషరతుగా పార్కింగ్ పూర్తి ఉచితం. అరగంట దాటితే మాత్రం సంబంధిత మాల్, వాణిజ్య ప్రదేశంలో ఏమైనా కొనుగోలు చేసినట్లు బిల్లు చూపించాలి. ఎంతో కొంత కొనుగోలు చేసిన వారైనా సరే ఈ సదుపాయం ద్వారా గంట సేపటి వరకు తమ వాహనానికి ఎలాంటి పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. కొనుగోలు బిల్లు చూపించకపోతే మాత్రం నిర్ణీత పార్కింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. గంట కంటే ఎక్కువ సేపు వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచే వారు కొనుగోలు చేసిన బిల్లును కానీ, మూవీ టికెట్‌ను కానీ చూపించాలి. ఈ బిల్లు, మూవీ టికెట్ ధర పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయరు. పార్కింగ్ ఫీజు కంటే తక్కువుండే పక్షంలో నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందే. ఫిర్యాదులు.. కోర్టు ఆదేశాలతోనే.. జీహెచ్ఎంసీలో దాదాపు 25 మల్టీప్లెక్స్‌లతోపాటు పలు షాపింగ్ మాల్స్, వాణిజ్య ప్రదేశాలు ఉన్నాయి. నగరంలోని వివిధ మాల్స్, మల్లీప్లెక్స్‌ల్లో పార్కింగ్ ఫీజులు భారీగా ఉండటంపై ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు, భవన నిర్మాణ నిబంధనలు, పార్కింగ్ ఫీజుల విషయంలో హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పార్కింగ్ ఫీజుల క్రమబద్ధీకరణకు జీవో తెచ్చింది. గ్రేటర్లో ప్రస్తుతం పార్కింగ్ ఫీజులు ద్విచక్ర వాహనాలకు తొలి రెండు గంటల వరకు రూ.20, కార్లకు రూ.30గా ఉన్నాయి. రెండు గంటలు దాటాక ప్రతి గంటకు ద్విచక్ర వాహనాలకు రూ.10, కార్లకు రూ.20గా ఉంది. ఐదు నిమిషాలే పార్కింగ్ చేసినా తొలి రెండు గంటల చార్జీని వసూలు చేస్తుండటంతో ప్రజల నుంచి విమర్శలున్నాయి. -
మాల్స్‌లో ఫ్రీ పార్కింగ్
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజుల దోపిడీకి ప్రభుత్వం కళ్లెం వేసింది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర నగర, పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ ఫీజుల వసూళ్లపై నియంత్రణలు విధిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం.. ఎవరికైనా తొలి అర్ధగంట పాటు వాహనాల పార్కింగ్ బేషరతుగా ఉచితం. ఏవైనా కొనుగోళ్లు జరిపినట్లు బిల్లు చూపిస్తే అర్ధ గంట నుంచి గంట వ్యవధిలోపు పార్కింగ్ ఉచితమే. అయితే ఎలాంటి కొనుగోళ్లు జరపకపోతే నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పార్కింగ్ సమయం గంటకు మించితే ఆ వ్యవధికి చెల్లించాల్సిన పార్కింగ్ ఫీజు కంటే అధిక వ్యయం కొనుగోళ్లు జరిపినట్లు బిల్లు లేదా సినిమా టికెట్ చూపి ఉచిత పార్కింగ్ సదుపాయం పొందొచ్చు. ఈ కేటగిరీ కింద పార్కింగ్ ఫీజు కంటే షాపింగ్ వ్యయం తక్కువగా ఉంటే మాత్రం మొత్తం పార్కింగ్ సమయానికి నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ ఉత్తర్వులను వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని, లేకపోతే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదాహరణకు ఒక మాల్లో పార్కింగ్ ఫీజు తొలి రెండు గంటలు రూ.30, ఆ తర్వాత గంటకు రూ.20 అయితే మూడు గంటలకు వెరసి రూ.50 అవుతుంది. రూ.50లకు మించి వస్తువులు కొనుగోలు చేసినా, సినిమా టికెట్ రూ.50 కంటే ఎక్కువున్నా పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో పార్కింగ్ ఫీజుల నియంత్రణ విషయంలో ఉల్లంఘనలు జరిగితే చర్యలు తీసుకునే అధికారం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఉంటుందని పేర్కొంది. పార్కింగ్ నియంత్రణకు ఎస్పీవీ! హైదరాబాద్‌లో అస్తవ్యస్తంగా మారిన వాహనాల పార్కింగ్‌ను నియంత్రించడంతో పాటు విడివిడిగా పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పార్కింగ్ పాలసీ అమలు బాధ్యతలను ప్రభుత్వం ఎస్పీవీకి అప్పగించనుందని రాష్ట్ర పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. -
మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్ చార్జీలు లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని థియేటర్లు, మల్టీప్లెక్స్ కాంప్లెక్సులు, మల్టీప్లెక్స్ థియేటర్లలోని పార్కింగ్ చార్జీల వసూళ్లకు చెక్ పడింది. పార్కింగ్ చార్జీలు వసూలు చేయరాదని గతంలో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినా యాజమాన్యాలు పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ కాంప్లెక్సుల్లో వస్తువుల కొనుగోలుకు వెళ్లిన వాహనదారుల నుంచి యాజమాన్యాలు ముక్కుపిండి మరీ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇక మల్టీప్లెక్స్ థియేటర్లు, సాధారణ థియేటర్లు ఇష్టం వచ్చిన రీతిలో పార్కింగ్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇవి మరింత భారంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధియేటర్ల యాజమాన్యాలు మోటారు సైకిళ్లకు రూ. 20, కార్లకు రూ. 40, ఆటోలకు రూ. 30, సైకిళ్లకు రూ.10 చొప్పున పార్కింగ్ చార్జీలుగా వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 16 మల్టీప్లెక్స్‌ల్లో 58 స్క్రీన్లు, 2,809 థియేటర్లు ఉన్నాయి. పార్కింగ్ చార్జీలు వసూలు చేయరాదనే కోర్టు తీర్పులున్న విషయం వాహనదారులకు తెలియకపోవడం, చార్జీల బాదుడును నియంత్రించాల్సిన స్థానిక సంస్థలు పట్టించుకోకపోవడంతో పార్కింగ్ వసూళ్ల దందా కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన న్యాయవాది వి.హరనాథ్‌బాబు సమాచార హక్కు చట్టం కింద పార్కింగ్ చార్జీల వివరాలు కోరుతూ రాష్ట్ర పట్టణ, ప్రణాళికశాఖ సంచాలకులకు ఈ నెల 10న అర్జీ పెట్టారు. దీనిపై ఆ శాఖకు చెందిన ప్రజా సమాచార అధికారి స్పందిస్తూ, పార్కింగ్ ఫీజులు వసూలు చేసేలా ఎటువంటి నియమ నిబంధనలు, ఉత్తర్వులు లేవంటూ హరనాథ్‌బాబుకు వివరణ ఇచ్చారు. పార్కింగ్ చార్జీలను వసూలు చేస్తున్న మల్టీప్లెక్సులు, థియేటర్లపై స్థానిక సంస్థలకు వాహనదారులు ఫిర్యాదు చేయవచ్చని ఆ లేఖలో స్పష్టం చేశారు. కాగా, పార్కింగ్ చార్జీలు వసూలు చేయరాదని 2003 మే నెలలో హైకోర్టు తీర్పు నిచ్చిందని, సీహెచ్ మదన్ మోహన్ అండ్ అదర్స్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కేసులో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు, మల్టీప్లెక్స్ థియేటర్లు, సాధారణ థియేటర్లు పార్కింగ్ చార్జీలు వసూలు చేయకూడదనే తీర్పు ఉందని హరనాథ్‌బాబు స్పష్టం చేశారు.