సాక్షి, హైదరాబాద్: సినిమా హాళ్లలో తినుబండారాల ధరల నియంత్రణ కోసం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై తూనికలు, కొలతల శాఖ దాడులు ముమ్మరం చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్న హైదరాబాద్‌లోని పలు మల్టీప్లెక్స్‌లలో తనిఖీలు చేసి కేసులు నమోదు చేసింది. 20 మల్టీప్లెక్స్‌లలో తనిఖీలు నిర్వహించిన బృందాలు.. తినుబండారాలనుఅధిక ధరలకు విక్రయిస్తున్న 18 మల్టీప్లెక్స్‌లపై 54 కేసులు నమోదు చేశాయి.
బంజారాహిల్స్‌లోని జీవీకే–1పై 6, కాచిగూడలోని బిగ్ సినిమాపై 6, ప్రసాద్ ఐమాక్స్‌పై 2, పీవీఆర్ గెలీలియోపై 3, మాదాపూర్‌లోని పీవీఆర్ ఐకాన్‌పై 3, కొత్తపేట మహాలక్ష్మిపై 3, మల్కాజ్‌గిరి సీనీపోలీస్‌పై 5, సుజానాఫోరం మాల్‌పై 2, కూకట్‌పల్లి ఆసియాన్‌పై 4, జేఎన్‌టీయూ మంజీరా మాల్‌పై 3, కొంపల్లిలోని ఆసియాన్ సినీప్లానెట్, మేడ్చల్‌లోని ఆసియాన్ ముకుందాపై 3 కేసుల చొప్పున నమోదయ్యాయి. అధిక ధరలపై టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444కు వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment