సాక్షి, హైదరాబాద్ : సామాన్యుడు సినిమా హాల్‌కు వెళ్లే పరిస్థితి కనబడటం లేదు. ఇక సినిమాకు వెళ్దామని అనుకుంటే అదెంత ఖర్చుతో కూడుకున్న పనో తెలిసిన విషయమే. థియేటర్‌లో ఆకలేస్తే తినుబండారాలు కొంటే మోతమోగిపోతుంది. వాటిపై ఉండే ధరలు వేరు.. యాజమాన్యం అమ్మే ధరలు వేరు. ఇలాంటి విక్రయాలు నేరం అంటూ హెచ్చరికలు జారీ చేసినా.. ఫలితం మాత్రం శూన్యమంటూ సినీ ప్రేమికులు వాపోతున్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా, నిబంధనలు ఉన్నా.. ధరల్లో మార్పులేదని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి థియేటర్ల లో ఎంఆర్పీ ధరలకే విక్రయాలు జరపాలని తూనికలు, కొలతలశాఖ ఆదేశాలు జారీ చేశారు.ఆగస్టు రెండు, మూడు తేదీల్లో సినిమా హాల్స్ పై దాడులు చేయనున్నట్లు తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు.
ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరపాలని ఆదేశం
Published Wed, Aug 1 2018 7:30 PM | Last Updated on Wed, Aug 1 2018 8:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment