వెనక్కు తగ్గిన ఫడ్నవిస్ ప్రభుత్వం
ముంబై: మహారాష్ట్రలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో మరాఠీ సినిమాల ప్రదర్శనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మరాఠీ సినిమాల ప్రదర్శన నిబంధన సడలించింది. ప్రైమ్టైమ్ లో (సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు) మరాఠీ సినిమాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని, లేని పక్షంలో థియేటర్ లైసెన్సులను రద్దు చేయాల్సి వస్తుందని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది.
ప్రభుత్వ నిర్ణయంపై బాలీవుడ్ ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. ఫడ్నవిస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. అన్నివైపుల ఒత్తిడి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది.