ముంబై : మల్టీప్లెక్స్‌ల్లోని సినిమా హాళ్లకు ఇంటి ఆహారాన్ని తీసుకెళ్లొచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. మల్టీప్లెక్స్ సిబ్బంది ఇలా ఇంటి ఆహారాన్ని తెచ్చుకునే వారిని అడ్డిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మహారాష్ట్రలోని మల్టీప్లెక్స్‌లలో తినుబండారాలను భారీగా అధిక ధరలకు అమ్ముతున్నారు. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో తినుబండారాల రేట్లపై కూడా ఓ పాలసీని తయారు చేయనున్నట్లు మహారాష్ట్ర మంత్రి రవీంద్ర చవాన్ తెలిపారు. ఆరు వారాల్లోగా పాలసీని తయారు చేస్తామని చెప్పారు. కొద్దిరోజుల క్రితం మల్టీప్లెక్స్‌లలో తినుబండారాలపై బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా చర్యలకు ఉపక్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment