టాలీవుడ్ నటుడు జగపతి బాబు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాదు తన చిలిపి పనులతో ఆడియన్స్‌ను అలరిస్తుంటారు. చాలా సరదా, ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. తాజాగా మరో వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
భీమవరం ఫుడ్ ఫెస్టివల్‌లో రోడ్డు పక్కనే ఉన్న బండి వద్ద ఫుడ్ ఆరగించారు జగపతిబాబు. మరికొందరు నటులతో కలిసి రోడ్ సైడ్ ఫుడ్‌ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. భీమవరం ఫుడ్ ఫెస్టివల్ కంటిన్యూటికీ ఈ మనిషి రోడ్డున పడ్డాడు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. జగపతి బాబు ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలో నటించారు.
Bhimavaram food festival continuity ki ee manishi road na paddadu… Bandi food Bandi foodey… pic.twitter.com/h2KkK09Y0Z
— Jaggu Bhai (@IamJagguBhai) December 25, 2024
Comments
Please login to add a commentAdd a comment