ప్రభాస్ లేకుండానే జరిగింది.. లేకపోతే నేను బలి: జగపతి బాబు ఫన్నీ వీడియో | Jagapathi Babu Shares Funny Video On Prabhas Send him Full Meals | Sakshi
Sakshi News home page

బకాసురుడిలా తినేసి.. కుంభకర్ణుడిలా నిద్రపోతున్నా: జగపతి బాబు

Published Tue, Dec 10 2024 4:22 PM | Last Updated on Tue, Dec 10 2024 5:05 PM

Jagapathi Babu Shares Funny Video On Prabhas Send him Full Meals

టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు.  ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా మరో క్రేజీ వీడియోను ట్విటర్‌ ద్వారా షేర్ చేశారు. ఓ మూవీ షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో తాను ఆరగించే భోజనం గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు.

(ఇది చదవండి: చిరంజీవి కోసం ప్రభాస్‌ కాంప్రమైజ్‌ కానున్నాడా..?)

అయితే ఆ భోజనాన్ని జగపతిబాబుకు పంపంది మరెవరో కాదు.. సినిమా సెట్స్‌లో అందరి ఆకలి తీర్చే రెబల్ స్టార్ ప్రభాస్. భీమవరం రాజుల ప్రేమ అంటూ విందు భోజనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇదంతా ప్రభాస్ ప్రమేయం లేకుండానే జరిగింది.. ఎవరికీ చెప్పొద్దు.. తాను పెట్టే ఫుడ్ తింటే ఈ బాబు బలి.. అది బాహుబలి స్థాయి అంటూ చాలా ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. జగపతి బాబు ఈ ఏడాది సూర్య కంగువా చిత్రంలో నటించారు. అల్లు అర్జున్ పుష్ప-2లోనూ కీలక పాత్రలో కనిపించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement