కాంబో ఆఫర్లు, ఎంట్రీ పాస్‌ల పేరిట ప్రేక్షకుల జేబుకు చిల్లు పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా మల్టీప్లెక్స్‌లు సిద్ధమయ్యాయి. ‘బాహుబలి–ది కన్‌క్లూజన్’పై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కార్పొరేట్ దందాకు తెరతీశాయి. టికెట్‌తో పాటు బలవంతంగా తినుబండారాలను ప్రేక్షకుల చేతుల్లో పెట్టేలా కాంబో ఆఫర్లు రూపొం దించాయి.