న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర ప్రారంభ వేడుకల్లో కార్పొరేట్ సంస్థలు కూడా సందడిగా పాల్గొంటున్నాయి. కార్యక్రమాన్ని మలీ్టప్లెక్సుల్లో లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలుకుని లాభాల్లో కొంత వాటాను అయోధ్యలో ప్రసాద వితరణ కోసం విరాళాలు ఇవ్వడం వరకు వివిధ రకాలుగా పాలు పంచుకుంటున్నాయి. వినియోగ ఉత్పత్తులను తయారు చేసే పలు కంపెనీలు పెద్ద సంఖ్యలో హోర్డింగ్‌లు, గేట్ బ్రాండింగ్, షాప్ బోర్డులు, కియోస్‌్కలు మొదలైనవి ఏర్పాటు చేసి, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
నేడు (జనవరి 22న) రామ మందిర ప్రారంభ వేడుకలను 70 నగరాల్లోని 160 స్క్రీన్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మలీ్టప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. జనవరి 17 నుంచి జనవరి 31 వరకు తమ ఉత్పత్తుల విక్రయాలపై వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా ఇవ్వనున్నట్లు డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. భక్తుల రాకతో అయోధ్యలో నిత్యావసరాలకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో తమ ఉత్పత్తుల సరఫరాను డాబర్ మరింతగా పెంచింది.
వెయ్యేళ్లైనా చెక్కుచెదరని నిర్మాణం: ఎల్‌అండ్‌టీ
శ్రీ రామ మందిరాన్ని వెయ్యేళ్లైనా చెక్కు చెదరనంత పటిష్టంగా నిర్మించామని దిగ్గజ నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో సీఎండీ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఈ విషయంలో కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తదితర వర్గాలు అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదొక ఆలయంగా మాత్రమే కాకుండా ఇంజినీరింగ్ అద్భుతంగా కూడా నిలి్చపోతుందని కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ ఎంవీ సతీష్ పేర్కొన్నారు.
మరిన్ని విశేషాలు..
► ఐటీసీలో భాగమైన మంగళదీప్ అగరబత్తీ బ్రాండ్ ఆరు నెలల పాటు ధూపాన్ని విరాళంగా అందించింది. అలాగే ‘రామ్ కీ ఫేడీ’ వద్ద రెండు అగరబత్తీ స్టాండ్లను ఏర్పాటు చేసింది. నదీ ఘాట్‌లలో పూజా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పూజారులకు వేదికలను, మార్కెట్లో నీడకు గొడుగులు మొదలైనవి నెలకొలి్పంది. భారీ భక్త సందోహాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రధాన ఆలయం దగ్గర 300 బ్యారికేడ్లు, ఆలయ ముఖ ద్వారం దగ్గర 100 పైచిలుకు బాకేడ్లను కూడా ఐటీసీ అందిస్తోంది.
► అయోధ్యలో ఎలక్ట్రిక్ ఆటోల సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తెలిపింది. త్వరలో ఉబెర్‌గో, ఇంటర్‌సిటీ ఉబెర్ సేవలను కూడా అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది.
► రామ మందిరంలో లైటింగ్ ఉత్పత్తుల సరఫరా, ఇన్‌స్టాలేషన్ పనులను నిర్వహించడం తమకు గర్వకారణమని హ్యావెల్స్ తెలిపింది.
► తాము భారత్‌లో ఎన్నో ప్రాజెక్టులు చేసినప్పటికీ రామ మందిరం వాటన్నింటిలోకెల్లా విశిష్టమైనదని యూఏఈకి చెందిన ఆర్‌ఏకే సెరామిక్స్ అభివరి్ణంచింది.
కొత్త ఆభరణాల కలెక్షన్లు..
సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ‘సియారామ్’ పేరిట, కల్యాణ్ జ్యుయలర్స్ ‘నిమహ్’ పేరిట హెరిటేజ్ జ్యుయలరీ కలెక్షన్‌ను ఆవిష్కరించాయి. మందిర వైభవాన్ని, సీతారాముల పట్టాభిõÙక ఘట్టాన్ని అవిష్కృతం చేసేలా డిజైన్లను తీర్చిదిద్దినట్లు సెన్కో గోల్డ్ ఎండీ సేన్ తెలిపారు. సుసంపన్న వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్స్‌తో నిమహ్ కలెక్షన్‌ను రూపొందించినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణరామన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment