live telecast
-
ఇంట్లో నుంచే ‘దేవ్ దిపావళి’ని చూడండిలా..
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆరోజు దశాశ్వమేధ ఘాట్‌లో అత్యంత వైభవంగా జరిగే గంగా హారతిని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలిరానున్నారు.ఈసారి దేవ్ దీపావళికి కాశీకి వెళ్లలేనివారు ఇంట్లో కూర్చొని గంగాహారతిని, దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. తొలిసారిగా దేవ్ దీపావళి నాడు జరిగే గంగా హారతి వేడుకలు ‘గంగా సేవా నిధి’ వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఢిల్లీ నుంచి ఈ వేడుకలను వీక్షించనున్నారు.గంగా సేవా నిధి వెబ్‌సైట్‌ను నవంబర్ 15న ప్రారంభిస్తున్నామని గంగా సేవా నిధి అధ్యక్షుడు సుశాంత్ మిశ్రా తెలిపారు. విదేశాలలోని వారు కూడా gangasevanidhi.in వెబ్సైట్ ద్వారా దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. గంగా హారతి సందర్భంగా ‘ఏక్ సంకల్ప్ గంగా కినారే’ పేరుతో కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది తాము గంగా నదిని పరిశుభ్రంగా ఉంచుతామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేయనున్నారు.నవంబర్ 15న దశాశ్వమేధ ఘాట్‌లో 21 మంది పండితులు వైదిక ఆచారాల ప్రకారం భగవతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. దేవ్ దీపావళి వేళ వారణాసిలోని 84 ఘాట్లను దీపాలతో అందంగా అలంకరించనున్నారు. పురాణాల ప్రకారం త్రిపురాసురుని దౌర్జన్యాల నుంచి దేవతలు విముక్తి పొందిన సందర్భంలో, వారు శివుని నివాసమైన కాశీ నగరానికి వచ్చి దీపాల పండుగను జరుపుకున్నారు. నాటి నుంచి ప్రతియేటా ఇక్కడ దేవ్ దీపావళి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం రామాలయంలో నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు అనుమతినిచ్చింది. ప్రత్యక్ష ప్రసారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తొలుత కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు బీజేపీ కూడా శ్రీరామ కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో ఈసీ తన నిర్ణయాన్ని మార్చుకుని అనుమతివ్వడం గమనార్హం. కాగా, భద్రాచల శ్రీరాముని కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం సీఈవో వికాస్‌రాజ్‌కు లక్ష్మణ్ నేతృత్వంలో వినతిపత్రం సమర్పించారు. -
Tamil Nadu: అయోధ్య లైవ్ టెలికాస్ట్ అడ్డుకోవద్దు.. సుప్రీంకోర్టు ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తమిళనాడులో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట లైవ్ టెలికాస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు రాముడికి సంబంధించిన వేడుకల ప్రసారాలను తిరస్కరించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, సుప్రీంకోర్టులో స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వివరాల ప్రకారం.. అయోధ్యలో రామ్‌లల్లా ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలనే అభ్యర్థనలను తిరస్కరించవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే తిరస్కరించిన వాటికి సంబంధించి.. పక్కా కారణాలను చూపాలని, డేటాను సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. సమాజంలో ఇతర వర్గాలు కూడా నివసిస్తున్నాయనే ఏకైక కారణంతో.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ అనుమతిని తిరస్కరించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు, రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, భజనల నిర్వహణపై నిషేధం లేదని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. On a plea in Supreme Court against Tamil Nadu govt’s oral order to ban the live telecast of the "Pran Prathishta" of Lord Ram at Ayodhya in the temples across Tamil Nadu, Solicitor General Tushar Mehta said nobody can be prevented from performing the religious rituals. Solicitor… pic.twitter.com/vqgbvmSkWh — ANI (@ANI) January 22, 2024 ఇదిలా ఉండగా.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేందుకు.. వివిధ రాష్ట్రాలు ఏర్పాట్లు చేశాయి. అయితే.. తమిళనాడు ప్రభుత్వం మాత్రం.. హిందువులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. లైవ్ టెలికాస్ట్‌ను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. తమిళనాడులోని రామాలయాల్లో పూజలు, భజనలను కూడా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆదివారం రాజకీయ దుమారం రేగింది. దీంతో, ఈ విషయంపై బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పీ సెల్వం తరఫున న్యాయవాది జి.బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం, కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. #WATCH | Union Finance Minister Nirmala Sitharaman says, "...Tamil Nadu Police is being misused by the Government of Tamil Nadu...They are being misused by Hindu-hating DMK...Can any citizen be denied to watch the Prime Minister? The DMK is showing its personal hatred for the… https://t.co/xTgTHmLBED pic.twitter.com/K2s9eFUh1A — ANI (@ANI) January 22, 2024 -
Ayodhya Ram mandir: కార్పొరేట్ల జై శ్రీరామ్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర ప్రారంభ వేడుకల్లో కార్పొరేట్ సంస్థలు కూడా సందడిగా పాల్గొంటున్నాయి. కార్యక్రమాన్ని మలీ్టప్లెక్సుల్లో లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలుకుని లాభాల్లో కొంత వాటాను అయోధ్యలో ప్రసాద వితరణ కోసం విరాళాలు ఇవ్వడం వరకు వివిధ రకాలుగా పాలు పంచుకుంటున్నాయి. వినియోగ ఉత్పత్తులను తయారు చేసే పలు కంపెనీలు పెద్ద సంఖ్యలో హోర్డింగ్‌లు, గేట్ బ్రాండింగ్, షాప్ బోర్డులు, కియోస్‌్కలు మొదలైనవి ఏర్పాటు చేసి, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నేడు (జనవరి 22న) రామ మందిర ప్రారంభ వేడుకలను 70 నగరాల్లోని 160 స్క్రీన్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మలీ్టప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. జనవరి 17 నుంచి జనవరి 31 వరకు తమ ఉత్పత్తుల విక్రయాలపై వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా ఇవ్వనున్నట్లు డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. భక్తుల రాకతో అయోధ్యలో నిత్యావసరాలకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో తమ ఉత్పత్తుల సరఫరాను డాబర్ మరింతగా పెంచింది. వెయ్యేళ్లైనా చెక్కుచెదరని నిర్మాణం: ఎల్అండ్టీ శ్రీ రామ మందిరాన్ని వెయ్యేళ్లైనా చెక్కు చెదరనంత పటిష్టంగా నిర్మించామని దిగ్గజ నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో సీఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఈ విషయంలో కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తదితర వర్గాలు అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదొక ఆలయంగా మాత్రమే కాకుండా ఇంజినీరింగ్ అద్భుతంగా కూడా నిలి్చపోతుందని కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ ఎంవీ సతీష్ పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ► ఐటీసీలో భాగమైన మంగళదీప్ అగరబత్తీ బ్రాండ్ ఆరు నెలల పాటు ధూపాన్ని విరాళంగా అందించింది. అలాగే ‘రామ్ కీ ఫేడీ’ వద్ద రెండు అగరబత్తీ స్టాండ్లను ఏర్పాటు చేసింది. నదీ ఘాట్లలో పూజా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పూజారులకు వేదికలను, మార్కెట్లో నీడకు గొడుగులు మొదలైనవి నెలకొలి్పంది. భారీ భక్త సందోహాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రధాన ఆలయం దగ్గర 300 బ్యారికేడ్లు, ఆలయ ముఖ ద్వారం దగ్గర 100 పైచిలుకు బాకేడ్లను కూడా ఐటీసీ అందిస్తోంది. ► అయోధ్యలో ఎలక్ట్రిక్ ఆటోల సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తెలిపింది. త్వరలో ఉబెర్‌గో, ఇంటర్సిటీ ఉబెర్ సేవలను కూడా అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. ► రామ మందిరంలో లైటింగ్ ఉత్పత్తుల సరఫరా, ఇన్స్టాలేషన్ పనులను నిర్వహించడం తమకు గర్వకారణమని హ్యావెల్స్ తెలిపింది. ► తాము భారత్‌లో ఎన్నో ప్రాజెక్టులు చేసినప్పటికీ రామ మందిరం వాటన్నింటిలోకెల్లా విశిష్టమైనదని యూఏఈకి చెందిన ఆర్ఏకే సెరామిక్స్ అభివరి్ణంచింది. కొత్త ఆభరణాల కలెక్షన్లు.. సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ‘సియారామ్’ పేరిట, కల్యాణ్ జ్యుయలర్స్ ‘నిమహ్’ పేరిట హెరిటేజ్ జ్యుయలరీ కలెక్షన్‌ను ఆవిష్కరించాయి. మందిర వైభవాన్ని, సీతారాముల పట్టాభిõÙక ఘట్టాన్ని అవిష్కృతం చేసేలా డిజైన్లను తీర్చిదిద్దినట్లు సెన్కో గోల్డ్ ఎండీ సేన్ తెలిపారు. సుసంపన్న వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్స్‌తో నిమహ్ కలెక్షన్‌ను రూపొందించినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణరామన్ పేర్కొన్నారు. -
ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా?
ఈనెల 22న యూపీలోని అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. దీనిని తిలకించేందుకు దేశంలోని రామభక్తులు తహతహలాడుతున్నారు. అయితే 22న అతిథులకు మాత్రమే రామాలయంలో ప్రవేశానికి ఆహ్వానం ఉంది. మిగిలినవారుకూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలిగే అవకాశం ఉంది. మీడియా సెంటర్ ఏర్పాటు ఇప్పటికే అయోధ్య ధామ్‌లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామ్ కథా సంగ్రహాలయ్ వద్ద మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం తెలిపిన వివరాల ప్రకారం జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దూరదర్శన్ (డీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దూరదర్శన్ అయోధ్యలోని రామ మందిరం చుట్టుపక్కల 40 కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం డీడీ నేషనల్, డీడీ న్యూస్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి వివిధ రైల్వేస్టేషన్లలో.. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను దేశవ్యాప్తంగా వివిధ రైల్వేస్టేషన్లలో భారతీయ రైల్వే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఆయా రైల్వే స్టేషన్లలో తొమ్మది వేల స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని, ఆ స్క్రీన్లపై ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. న్యూయార్క్ నగరంలో.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ప్రసిద్ధ టైమ్ స్క్వేర్‌లోనూ ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కూడా ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కానున్నది. 2020 ఆగస్ట్ 5న అయోధ్యలోని శ్రీరామ మందిరానికి భూమి పూజ చేసినప్పుడు ఈ కార్యక్రమం టైమ్స్ స్క్వేర్‌లోని డిజిటల్ బిల్‌బోర్డ్‌పై డిస్ప్లేపై చేశారు. 23న కూడా ప్రత్యక్ష ప్రసారం జనవరి 23న కూడా దూరదర్శన్‌లో రామ్‌లల్లా ప్రత్యేక హారతితో పాటు సాధారణ పౌరుల కోసం ఆలయం తెరవడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధాన ఆలయ సముదాయం మాత్రమే కాకుండా, సరయూ ఘాట్ సమీపంలోని రామ్‌కి పైడి, కుబేర్ తిల దగ్గరున్న జఠాయువు విగ్రహం, ఇతర ప్రదేశాల నుంచి కూడా దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది. ఇది కూడా చదవండి: నేటి అనుష్ఠానాల ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేక యూట్యూబ్ లింక్ మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసేందుకు ప్రత్యేక యూట్యూబ్ లింక్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనిద్వారా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. 4కె టెక్నాలజీతో.. దూరదర్శన్‌తో పాటు పలు ప్రైవేట్ ఛానెళ్లు కూడా దూరదర్శన్ నుంచి ఫీడ్‌ను అందుకుంటాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. దూరదర్శన్ ఈ కార్యక్రమాలను 4కె టెక్నాలజీ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనుందని, ఫలితంగా ప్రేక్షకులు హైక్వాలిటీ పిక్చర్‌ను చూడగలుగుతారని అపూర్వ చంద్ర తెలిపారు. -
చంద్రయాన్-3 ల్యాండింగ్: ఏపీ ప్రభుత్వ బడుల్లో ప్రత్యక్ష ప్రసారాలు
సాక్షి, విజయవాడ: నేడు చంద్రయాన్-3 ల్యాండింగ్ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ప్రత్యక్ష ప్రసారాలు అందించనున్నారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు పాఠశాలల్లో వీక్షించే ఏర్పాట్లు చేయాలని జిల్లాల డీఈవోలకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్యాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాటు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో చంద్రుడిపై చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ నేడు(బుధవారం) చంద్రుడిపై అడుగుపెట్టనుంది. సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్ పాదమోపనుంది. 11 నిమిషాల పాటు రఫ్ బ్రేకింగ్ దశ కొనసాగనుంది. ల్యాండింగ్ కోసం ల్యాండర్ స్వయంగా అన్వేషించనుంది. అన్నీ అనుకూలిస్తే రెండు ఇంజిన్ల సాయంతో ల్యాండింగ్ కానుంది. సాయంత్రం 5.20 గంటల నుంచి ఇస్రో లైవ్ ఇవ్వనుంది. ల్యాండర్ సేఫ్‌గా దిగితే.. చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ ఖ్యాతిని గడించనుంది. ఈ కీలక ఘట్టానికి మరికొన్ని గంటలే ఉండటంతో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చదవండి: చంద్రయాన్–3 ల్యాండింగ్ లైవ్ అప్డేట్స్ -
‘ప్రత్యక్ష ప్రసారాలతో కోర్టు ఇళ్లలోకి.. జనం మనసుల్లోకి వెళ్లింది’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యక్ష ప్రసారాల ద్వారా సర్వోన్నత న్యాయస్థానం ప్రజల నివాసాల్లో, వారి మనసుల్లో స్థానం సంపాదించుకుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన కేసులపై వాదనలను వరసగా ఎనిమిదో రోజు ఆలకించిన సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు సీజే జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘కోర్టు ప్రత్యక్ష ప్రసారాలపై జనంలో చర్చ నడుస్తోంది. లైవ్ స్ట్రీమింగ్ అనేది సరైన దిశలో ముందడుగు. అయితే ఇంగ్లిష్‌లో సాగే వాదనలను గ్రామాల్లోని చాలా మంది జనం అర్థంచేసుకోలేకపోతున్నారు’ అని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది కోర్టులో వ్యాఖ్యానించారు. దీంతో సీజేఐ ‘ నిజమే. లైవ్ స్ట్రీమింగ్‌తో సుప్రీంకోర్టు సాధారణ ప్రజల ఇళ్లలోకి, మనసుల్లోకి చేరింది. ఇదొక నిరంతర ప్రక్రియ. జనం మాట్లాడే భాషల్లో వాదనలు అందుబాటులో ఉండేలా సాంకేతికతను వాడేందుకు మావైపు నుంచీ ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు. 2018లో కోర్టు కార్యకలాపాల ప్రత్యక్షప్రసారానికి సూత్రప్రాయంగా అనుమతించిన సుప్రీంకోర్టు.. 2022 నుంచి ప్రసారం మొదలుపెట్టింది. 2023 ఫిబ్రవరి నుంచి ప్రత్యక్ష ప్రసారాలకు కృత్రిమ మేధ సాయంతో ఇతర భాషల్లో ట్రాన్స్‌స్క్రిప్ట్ (రాసిన లేదా ముద్రించిన కాపీలు) అయ్యేలా చూస్తోంది. చదవండి: బొగ్గుపై సుంకం స్కామ్‌లో ఈడీ దూకుడు -
ప్రత్యక్ష ప్రసారం ప్రజాస్వామ్యానికి బలం
రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన కేసుల విచారణను భారత ప్రజలు ప్రత్యక్షంగా చూడటానికి సుప్రీంకోర్టు గత నెలలో అనుమతించింది. న్యాయ, సామాజిక వ్యవస్థల్లో సమూల మార్పు జరిగే గొప్ప ప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకున్నందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభినందించాలి. ఇది భారత న్యాయ, రాజ్యాంగపరమైన చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరును ఎలాంటి అవరోధాలూ లేకుండా దేశ సగటు పౌరులు చూసే వీలు కల్పించడం వల్ల మన న్యాయవ్యవస్థపై విశ్వాసం బలపడుతుంది. న్యాయవ్యవస్థ పనితీరు గురించి విమర్శనాత్మకమైన చర్చను ఇది పెంచి పోషిస్తుంది. న్యాయ ప్రక్రియలోని పారదర్శకత దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రక్రియను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న ప్రారంభించింది. అయితే ముఖ్యమైన విచారణలను లైవ్ టెలికాస్ట్‌కి అనుమతిస్తూ సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ 27నే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కీలకమైన కేసుల విచారణను పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా ప్రసారం చేయాలని తీసుకున్న నిర్ణయానికి అదే నాంది అయింది. అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ కోర్టుల్లో జరిగే విచారణలను ప్రజాప్రయోజనం రీత్యా ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని నిర్ణయం తీసుకున్నారు. వారు సూచించినట్లుగానే ప్రత్యక్ష ప్రసారాలు ప్రజల్లో రాజ్యాంగ విలువ లను, ప్రజాస్వామ్యాన్ని, పౌరసత్వాన్ని బలోపేతం చేయడంలో న్యాయపరమైన కృషికి జీవం పోస్తాయి. ఆనాడు వారు ప్రదర్శించిన ఆ దార్శనికతకు తదనంతర ప్రధాన న్యాయమూర్తులు ఎన్వీ రమణ, యుయు లలిత్‌ల పూర్తి మద్దతు లభించింది. నాలుగేళ్ల అనంతరం రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన విచారణలను ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీకోర్టు విస్తృత ధర్మాసనం ఈ సెప్టెంబర్ 20న ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఈ–కమిటీ చైర్పర్సన్, ప్రత్యక్ష ప్రసారాలు మొదలెట్టడానికి వెనుక చోదక శక్తిగా ఉన్న జస్టిస్ చంద్రచూడ్, ఆ రోజు తన కోర్టులో విచా రణను మొదలు పెడుతూ ‘మేం ఇప్పుడు వర్చువల్’ అని ప్రకటిం చారు. ఒక్కమాటలో చెప్పాలంటే భారత సర్వోన్నత న్యాయస్థానం మనసా వాచా ఒక గొప్ప పనికి పూనుకుంది. ‘ఇంతకు ముందు ఎన్నడూ చేయలేని పనిని మనం చేయలేకపోతే మనం ఏదీ సాధిం చలేం. తక్కిన ప్రపంచం ముందుకెళుతుంటే న్యాయం మాత్రం యథా తథంగా స్తంభించిపోయి ఉంటుంది. ఇది ప్రపంచానికీ, న్యాయానికీ కూడా మంచిది కాదు’ అని దశాబ్దాల క్రితమే సుప్రసిద్ధ బ్రిటన్ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ చెప్పిన గొప్పమాటలను భారత సుప్రీంకోర్టు స్ఫూర్తిగా తీసుకుని ఆచరణను ప్రారంభించింది. రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కేసుల విచారణను భారత ప్రజలు ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించడం ద్వారా... కీలక మలుపు తిప్పగలిగే గొప్ప ప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకున్నందుకు గత, ప్రస్తుత చీఫ్ జస్టిస్లను, సుప్రీంకోర్టు జడ్జీలను అభినందించాల్సి ఉంటుంది. దానికి వారు అర్హులు కూడా అని చెప్పాలి. ఇది భారత న్యాయ, రాజ్యాంగపరమైన చరిత్రలో అత్యంత ముఖ్యమైన, ప్రభావ శీలమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దీనికి కింది కారణా లను మనం చూపించవచ్చు. ఒకటి: దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరును ఎలాంటి అవరోధాలు లేకుండా దేశ సగటు పౌరులు చూసే వీలు కల్పించడం వల్ల మన న్యాయవ్యవస్థపై విశ్వాసం బలపడుతుంది. అలాగే న్యాయవ్యవస్థ పనితీరు గురించి విమర్శనాత్మకమైన చర్చను ఇది పెంచి పోషిస్తుంది. ప్రజలకు అందుతున్న న్యాయ ప్రక్రియలోని పారదర్శకత, సౌలభ్యత దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలను పౌరులకు అందు బాటులోకి తేవడం అనేది సమాచారాన్ని ఎల్లెడలా నింపుకున్న పౌరు లను అభివృద్ధి చేయడంలో అతి ముఖ్యమైన దశగా చెప్పాలి. రెండు: ఈ నిర్ణయం చట్టపాలన ప్రాధాన్యతను ప్రజలు అర్థం చేసుకునేలా చేస్తుంది. దరిద్ర నారాయణుల, చారిత్రకంగా వెనుక బడిపోయిన, సాధికారతకు దూరమైపోయిన వర్గాల హక్కులను న్యాయవ్యవస్థ గట్టిగా పరిరక్షిస్తుందని ప్రజలు విశ్వసించడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. సత్యాన్ని శక్తిమంతంగా మాట్లాడడం కంటే మించిన ఉత్తమ మార్గం మరొకటి లేదు. దీని ప్రత్యక్ష ప్రభావం వెంటనే బయటపడక పోవచ్చు కానీ చట్టబద్ధపాలనను గౌరవించే సంస్కృతిని నిర్మించే శక్తి ఈ నిర్ణయానికి ఉందని చెప్పితీరాలి. మూడు: న్యాయ నిర్ణయ విధానంలో పారదర్శకతను ఇది ప్రోత్సహిస్తుంది. న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయాలను సాధారణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోవడం అరుదుగానే జరుగుతుంటుంది. చట్టం, న్యాయం అనేవి న్యాయవాదులకూ, న్యాయమూర్తులకూ మాత్రమే వదిలివేయాల్సిన ముఖ్యమైన విషయాలుగా మాత్రమే ఉండేవి. ఇప్పుడు కోర్టు విచారణలను ప్రత్యక్షంగా చూడడం వల్ల లక్షలాది సామాన్య భారతీయులు తాము శిక్షణ పొందిన న్యాయ వాదులు కాకున్నప్పటికీ, న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయాలలోని నేపథ్యాన్నీ, సందర్భాన్నీ అర్థం చేసుకోవడమే కాదు... న్యాయనిర్ణయ క్రమంలో తటస్థించే... పోటీ పడే విలువలు, ఘర్షించే హక్కులను కూడా వారు ప్రశంసించగలుగుతారు. కోర్టు విచారణల ప్రక్రియను పారదర్శకంగా ఉంచడం ద్వారా సుప్రీంకోర్టు బలీయమైన విశ్వాసాన్ని పాదుకొల్పింది. నాలుగు: ఈ నిర్ణయం న్యాయవాద వృత్తి నాణ్యతను, ప్రమా ణాలను పెంచగలుగుతుంది. లాయర్లు కోర్టుముందు కనిపించడానికి చక్కగా సిద్ధమవుతారు. బాధ్యతారహితమైన వ్యాఖ్యలను చేయ కూడదనే వివేచనతో ఉంటారు. ఇప్పుడు తమ వాదనలను ప్రజలు నేరుగా చూడటం పట్ల లాయర్లలో సానుకూల వైఖరి పెరుగుతుంది. న్యాయాన్ని అందించే యంత్రాంగాలను న్యాయవాదులు గతంలో కంటే మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. యువ న్యాయవాదుల సన్నద్ధత, మేధో కుశలత కూడా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది కాబట్టి వారి న్యాయవాద వృత్తికి అది ఉన్నత స్థాయిని కట్టబెడుతుంది. భారతదేశంలో న్యాయవాద విద్యలో నెలకొన్న సంక్షోభాన్ని న్యాయవాద కళాశాలల్లో నాణ్యమైన బోధనను, పరిశోధనను పెంచడం ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చు. న్యాయవాద వృత్తిలోని వ్యాజ్యాలకు సంబంధించిన అంశంలో ప్రవేశించడానికి చాలామంది న్యాయవాద పట్టభద్రులు ఆసక్తి చూపని ధోరణి చాలా సంవత్స రాలుగా కలవరపెడుతోంది. కార్పొరేట్ లావాదేవీల ప్రపంచానికి వ్యతిరేకంగా... కఠిన షరతులు, ఉదాసీనత కారణంగా మన యువ న్యాయవాదులు లావాదేవీల బార్లో చేరడానికి సంసిద్ధత తెలుపడం లేదు. లాయర్ల వాస్తవ వాదనలను తిలకించడం, న్యాయమూర్తులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం వంటి విచారణలను తిలకించడం వల్ల, సాపేక్షంగా నిర్లక్ష్యానికి గురైన ఈ క్షేత్రంలోకి న్యాయవాద విద్యార్థులు వచ్చేలా ప్రభావితం చేయవచ్చు. జ్యుడీషి యరీ, న్యాయవాద వృత్తి పనితీరుకు సంబంధించిన నూతన స్కాలర్ షిప్, పరిశోధనా రంగాలపై పనిచేసేలా లా ఫ్యాకల్టీ సభ్యులు, న్యాయ పరిశోధకులు ప్రేరణ పొందవచ్చు. టెక్నాలజీ అనేది సంఘీభావాన్ని బలోపేతం చేసి, దూరానికి సంబంధించిన అవరోధాలను అధిగమించడంలో గొప్ప ఉపకరణంగా ఉంటుంది. కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని ఆశిద్దాము. పైగా చట్టబద్ధమైన న్యాయాన్ని ప్రజల వద్దకు, వారి రోజువారీ చర్చల వరకు తీసుకెళ్లడంలో కూడా ఇది తోడ్పడుతుందని ఆశిద్దాము. అమెరికా సుప్రీంకోర్టు విశిష్ట న్యాయమూర్తి జస్టిస్ అలివర్ వెండెల్ హోమ్స్ గతంలో ఒక అద్భుత వ్యాఖ్య చేశారు. ‘ప్రపంచంలో అతిగొప్ప విషయం ఏమిటంటే, మనం ఎక్కడ నిలిచామన్నది కాదు; మనం ఏ దిశగా వెళుతున్నామన్నదే ప్రధానమైనది.’ మనం నిజంగానే సరైన దిశలో పయనిస్తున్నామని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇప్పుడు హామీ ఇచ్చారు. సి. రాజ్ కుమార్ వ్యాసకర్త వ్యవస్థాపక వైస్ చాన్స్‌లర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
ఆ ప్రేమోన్మాది మరణశిక్ష టీవీల్లో లైవ్ ప్రసారం!
ప్రేమ, పెళ్లికి నిరాకరించడంతో ప్రేమోన్మాదులు.. పాశవికంగా దాడులకు పాల్పడుతున్నట్లు ఘటనలు చూస్తుంటాం. కానీ, చట్ట ప్రకారం కఠిన శిక్షలు లేకపోవడం, ఇలాంటివి పెరిగిపోవడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. యువతుల జీవితాలను చిదిమేయాలని ప్రయత్నించే వాళ్లకు గుణపాఠం చెప్పాలని, భావితరాలకు గట్టి సందేశం ఇవ్వాలని ఈజిప్ట్ కోర్టు ఒకటి నిర్ణయించుకుంది. ఉత్తర ఈజిప్ట్‌లోని మాన్సోరా యూనివర్సిటీలో చదువుతున్న మోహమద్ అడెల్.. తనతో పాటు చదువుకునే నయెరా అష్రాఫ్‌ను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించాడనే కోపంలోనే అతను ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. జూన్ నెలలోనే ఈ ఘటన జరగ్గా. జూన్ 28వ తేదీన అతనికి మరణశిక్ష విధించింది మాన్సోరా కోర్టు. అయితే.. అతని మరణ శిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఈజిప్ట్ పార్లమెంట్‌కు ఓ లేఖ కూడా రాసింది. పూర్తిగా ఉరి తీయడం వీలు లేకున్నా.. కనీసం అతని ఉరి ఏర్పాట్లనైనా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆ లేఖలో కోర్టు పేర్కొంది. ఆ దుర్మార్గుడు ఆమెను అతికిరాతకంగా చంపాడు. అందుకే దేశం మొత్తం అతని శిక్షను చూడాలి. ఈ శిక్ష ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడాలనుకునేవాళ్లు వణికిపోవాలి. దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే.. చట్టసభ అందుకు అనుమతించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. తీర్పు కిందటి నెలనే ఇచ్చినప్పటికీ.. జులై 24న తీర్పు కాపీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ అలం చేతిలో ఉంది. అయితే న్యాయపరంగా పోరాడేందుకు అడెల్కు ఇంకా అవకాశం ఉంది. రెండు నెలల పాటు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకునేందుకు హక్కు ఉందని అతని తరపు న్యాయవాది చెప్తున్నారు. ఇప్పటికే శిక్ష విధించి నెలరోజులు పూర్తైంది. ఇంకా నెలరోజులే మిగిలి ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నయెరా అష్రాఫ్ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమెను ఘోరాతి ఘోరంగా చంపిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో.. ఇలాగే ఓ శిక్షను ప్రజలు చూసేలా ప్రసారం చేశారు అక్క్డడి అధికారులు. 1998లో రాజధాని కైరోలో ఓ మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను దారుణంగా చంపిన ముగ్గురు నిందితులను.. ఉరి తీసే కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు అక్కడి టీవీ ఛానెళ్లలో. The killing of Egyptian student Nayera Ashraf has been met with condemnation and ignited a debate about violence against women. The suspect is a man who reportedly harassed her for months before the killing. Read more: https://t.co/nLFZHE2vqC pic.twitter.com/RXraAtTpH0 — Al Jazeera English (@AJEnglish) June 23, 2022 -
లైవ్‌లో న్యూస్ అందిస్తున్న రిపోర్టర్‌కి యాక్సిడెంట్ : వైరల్ వీడియో
లైవ్‌లో న్యూస్ అందిస్తున్న సమయంలో రిపోర్టర్‌కి యాక్సిడెంట్ అయిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...అమెరికాకు చెందిన వెస్ట్ వర్జీనియా టెలివిజన్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారంలో రిపోర్ట్ంగ్ అందిస్తున్న ఒక మహిళకి లైవ్‌లోనే యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం జరిగిన మహిళ టోరీ యోర్గీగా గుర్తించారు. అయితే ఆమె లైవ్ టెలీకాస్టింగ్‌లో రోపోర్టింగ్ చేస్తోంది. ఇంతలో ఒక ఎస్యూవీ కారు ఆమెను వెనుక నుంచి ఢీ కొడుతుంది. అయితే ఆ లైవ్ న్యూస్‌లోనే ఆమె గట్టిగా అరవడం, ఆ తర్వాత సదరు ఆ వాహనదారుడితో మాట్లాడటం వినిపిస్తుంది. అయినప్పటికీ ఆమె మళ్లీ కాసేపటికి తేరుకుని తన రిపోర్టింగ్‌ని యథావిధిగా కొనసాగించడం విశేషం. ఈ మేరకు టీవీ యాంకర్ టిమ్ మీరు బాగానే ఉన్నారా! అని టోరీని ప్రశ్నిస్తాడు. దీంతో టోరీ తాను బాగానే ఉన్నా, కానీ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెబుతుంది. అంతేకాదు టిమ్ కూడా తాను రిపొర్టర్ అదృశ్యమవ్వడమే చూశాను తప్ప ప్రమాదం ఎలా జరిగిందో గమనించలేదని చెప్పారు. లైవ్‌లో న్యూస్ అందిస్తుండగా జరిగిన తొలిప్రమాదం కదా అని యాంకర్ టిమ్ రిపోర్టర్ టోరీని అడిగాడు. దీంతో ఆమె ఇలాంటి ప్రమాదాలు చాలా ఎదుర్కొన్నాను కానీ తనకు ఎటువంటి గాయాలు కాలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. అంతేకాదు లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. "We're good, Tim." pic.twitter.com/9kn2YElDLK — Timothy Burke (@bubbaprog) January 20, 2022 (చదవండి: ఎక్స్ రే అమ్మకానికి పెట్టిన డాక్టర్... ఎందుకో తెలుసా) -
కనీవినీ ఎరుగని రీతిలో పెళ్లి..ఆపై విందు భోజనం! ఎక్కడో తెలుసా?
ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించుకోవడానికి వీలులేదు. పైగా అధికారులు కూడా ఎలాంటి వేడుకలు నిర్వహించుకోవడానికి వీల్లేదంటూ కఠినమైన కరోనా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఒక జంట విన్నూతనమైన ఆలోచనతో తమ పెళ్లిని జరుపుకోవాలనుకున్నారు. అంతేకాదు తమ పెళ్లిని తమవారంతా చూసేలా సరికొత్త ఆలోచన చేశారు. అసలు విషయంలోకెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కి చెందిన సందీపన్ సర్కార్, అదితి దాస్ అనే జంట జనవరి 24న వివాహం చేసుకోనున్నారు. అయితే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పెళ్లికి అతిథులు హాజరయ్యేందుకు ‘గూగుల్ మీట్’ని, భోజనాల కోసం జొమాటో యాప్‌ను( ఫుడ్ ఆర్డర్లు) వినియోగించనున్నారు. పైగా ప్రత్యక్షంగా పెళ్లిని చూసేలా లైవ్ టెలికాస్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ ఉపయోగిస్తున్నారు. అయితే కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ విధించిన నిబంధనలకు లోబడి 120 మంది అతిధులు నేరుగా పెళ్లికి హాజరవుతారు. కాగా మిగతా 300 మంది డిజిటల్ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తారు. ఆహ్వానితులందరికీ వేడుకకు ఒక రోజు ముందు పాస్‌వర్డ్‌లతో పాటు వివాహాన్ని చూడటానికి లింక్‌ను కూడా అందిస్తారు. ఈ క్రమంలో ఆ జంట మాట్లాడుతూ.. ‘మేము గతేడాది వివాహం చేసుకోవాలనుకున్నాం. కానీ కరోనా అడ్డంకిగా మారింది. అందుకే మా కుటుంబ భద్రత, అతిధుల భద్రత దృష్ట్యా డిజిటల్ వివాహాన్ని నిర్వహించాలనే ఆలోచన చేశాము’ అని తెలిపారు. ఈ మేరకు జొమాటో అధికారి మాట్లాడుతూ.. ‘ఈ ఆలోచన చాలా ప్రసంశించదగ్గది. పైగా మాకు ఈ కొత్త ఆలోచన బాగా నచ్చింది. ఈ వివాహాలను స్వాగతిస్తున్నాం. అంతేకాదు ఇలాంటి వివాహాలను పర్యవేక్షించేందుకు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. (చదవండి: ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!) -
లైవ్ టెలికాస్టింగ్‌లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..
కైరో: ఇటీవల కాలంలో సోషల్ మీడియా క్రేజ్ పెరిగిపోవడంతో లైవ్ ఈవెంట్లు కూడా వీటిద్వారానే ప్రసారం కావడంతో వార్తాప్రపంచం అనేది ప్రజలకు మరింత చేరువైంది.. ఇది కాలక్రమంలో టెక్నాలజీ పరంగా వచ్చిన మార్పుగానే చెప్పవచ్చు. ఎక్కువ న్యూస్ టెలికాస్ట్ చేయాలన్న ఉద్దేశంతో చాలా సరికొత్త ఈవెంట్స్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. అందలో భాగంగా ఈజిప్ట్‌లోని ఒక న్యూస్ చానల్ ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తుంటే ఒక విచిత్రం చోటు చేసుకుంది. (చదవండి: అందుకే ఇంగ్లండ్ నుంచి వస్తున్నారు) అసలేం జరింగిందంటే....ఈ జిప్ట్‌లోని యూమ్ 7 న్యూస్ చానల్ రియల్ టైమ్ ఈవెంట్ అనే సరికొత్త కార్యక్రమంతో ప్రేక్షకులకు మరింత చేరవ కావడానికీ ప్రయత్నిస్తోంది. ఆ తరుణంలో కొన్ని భయంకరమైనవి, ఆసక్తి కలిగించే రియల్‌టైం ఈవెంట్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అయితే ఇటీవల ఈజిప్ట్‌లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రియల్‌టైం ఈవెంట్లో భాగంగా భూకంపం తర్వాత ప్రజల పరిస్థితి ఎలా ఉంది అనే న్యూస్‌ని ఫోన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు అనూహ్యంగా ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ రోజు న్యూస్ చానల్ ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్షప్రసారంలో న్యూస్‌ని జర్నలిస్ట్ మహమూద్ రాఘేబ్ నివేదిస్తుండగా బైక్‌పై వచ్చిన దొంగ అతని ఫోన్ కొట్టేశాడు. ఫోన్‌ను కొట్టేసిందే తడువు బైక్‌పై వేగంగా జారుకుంటాడు. ఆ ఫోన్‌ను చేతిలోనే ఉంచుకుని సిగరెట్ కాలుస్తూ బైక్‌ను దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతాడు. కాగా, ఆ ఫోన్ కెమెరా రోలింగ్లోనే ఉందని విషయం దొంగ గ్రహించకపోవడంతో అది ప్రత్యక్ష ప్రసారంలోనే రికార్డు అయ్యింది. తనను ఎవరైనా ఫాలో చేస్తున్నారా అనే అనుమానంతో మధ్యమధ్యలో వెనక్కి చూసుకుంటూ ఉండటం లైవ్ చూసేవారికి నవ్వులు తెప్పించింది. ‘నీ వెనకాల ఎవరూ రావడం లేదు.. కానీ ప్రపంచం మొత్తం నీ దొంగతనం చూస్తుంది’ అని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవ్వడంతో ప్రజలు ఆ దొంగను పట్టుకోవటానికి కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి ఆ విషయం నన్ను బాధిస్తోంది) -
రేపు ఒకే సమయానికి రెండు మ్యాచ్‌లు.. ప్రసారమయ్యే ఛానళ్లు ఇవే
Where to Watch Final Two Matches of Indian Premier League: ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్ లీగ్ మ్యాచ్‌లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకోగా.. మిగిలిఉన్న ఒక్కస్థానానికి ఎవరు క్వాలిఫై అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు కేకేఆర్‌తో పాటు ముంబై ఇండియన్స్‌కు ఉంది. కాగా ఐపీఎల్ చరిత్రలో రెండు మ్యాచ్‌లు రేపు (శనివారం) ఒకే సమయానికి ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌తో మధ్యాహ్నం 3:30 కి తలపడాల్సి ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సాయంత్రం 7:30 కి జరగాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఈ రెండు మ్యాచ్‌లు సాయంత్రం 7:30 కి జరుగుతాయి. మ్యాచ్ లు ప్రసారమయ్యే ఛానళ్లు ఇవే.. RCB Vs DC : స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ - 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ -1, స్టార్ స్పోర్ట్స్ - 1 తెలుగు/ తమిళ్/ కన్నడ. MI Vs SRH : స్టార్ స్పోర్ట్స్ -2, స్టార్ స్పోర్ట్స్ -3, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ గోల్డ్ -2 చదవండి: RCB Vs SRH : ఆర్సీబీ బౌలర్ ఖాతాలో అరుదైన రికార్డు.. బుమ్రా రికార్డు బద్దలు -
సుప్రీం విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని పరిశీలిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో జరిగే విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ముందుగా, సుప్రీంకోర్టులోని ఇతర జడ్జీల అభిప్రాయాన్ని తెలుసుకుంటానన్నారు. సుప్రీంకోర్టు వర్చువల్ హియరింగ్స్‌కు హాజరు కావడానికి జర్నలిస్టులకు మొబైల్ యాప్‌లో లింకులు అందించడం ద్వారా సేవలు అందించే ప్రక్రియను జస్టిస్ ఎన్వీ రమణ గురువారమిక్కడ ప్రారంభించారు. కోర్టు వార్తలు కవర్ చేయడానికి న్యాయవాదులపై మీడియా ఆధారపడి ఉందని తెలిసిందని, ఈ నేపథ్యంలో మీడియా విచారణలకు హాజరు కావడానికి ఓ యంత్రాంగం రూపొందించాలని అభ్యర్థన వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. రిపోర్టింగ్ సమయంలో మీడియా అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, జర్నలిస్టుగా తాను కూడా కొంతకాలం పనిచేశానని, ఆ సమయంలో కార్లు, బైకులు లేవని ఆయన గుర్తు చేసుకున్నారు. వార్తలు సేకరించే క్రమంలో బస్సుల్లో ప్రయాణిస్తూ జర్నలిస్టుగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. సుప్రీంకోర్టు, మీడియాకు మధ్య ఓ సీనియర్ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా రూపొందించిన మొబైల్ యాప్‌తో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వవచ్చన్నారు. సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు మొబైల్ అప్లికేషన్లో ‘ఇండికేటివ్ నోట్స్’అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు. దీని ద్వారా చారిత్రక తీర్పుల సారాంశాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. 106 మంది హైకోర్టు జడ్జీలకు కరోనా దేశవ్యాప్తంగా 106 మంది హైకోర్టు జడ్జీలు కరోనా బారిన పడ్డారని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. రెండు ప్రధాన హైకోర్టులు మినహా సమాచారం మేరకు 2,768 మంది జ్యుడిషియల్ అధికారులకు కరోనా సోకిందన్నారు. ముగ్గురు హైకోర్టు జడ్జీలు, 34 మంది జ్యుడిషియల్ అధికారులు ఈమహమ్మారికి బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 800 మంది రిజిస్ట్రీ సిబ్బంది కరోనా బారినపడగా వీరిలో సుప్రీంకోర్టులో ఆరుగురు రిజిస్ట్రార్లు, 10మంది అదనపు రిజిస్ట్రార్లు ఉన్నారన్నారు. కార్యక్రమంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ హేమంత్ గుప్తా పాల్గొన్నారు. -
అరబ్ వ్యక్తిపై మూక దాడి.. టీవీలో లైవ్..
జెరూసలేం : గత కొద్దిరోజులుగా ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాలు పరస్పరం రాకెట్ బాంబు దాడులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గాజా లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన రాకెట్ దాడుల్లో ఇప్పటివరకు 83 మంది మరణించారు. వీరిలో 17 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దాదాపు 487 మంది గాయపడ్డారు. పాలస్తీనా కూడా ఇజ్రాయెల్‌పై బాంబు దాడులు చేస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఓ అరబ్ వ్యక్తిపై మూక దాడి చేయటం, ఆ దాడి దృశ్యాలు ఓ టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కావటం చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని తెల్ అవివ్‌లోని బ్యాట్ యమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో వెళుతున్న అరబ్ వ్యక్తిని డజన్ కంటే ఎక్కువ మంది ఉన్న ఓ మూక అడ్డగించింది. అతడ్ని బయటకు లాగి విచక్షణా రహితంగా దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలు అక్కడి పబ్లిక్ ఛానల్ కాన్ టీవీలో ప్రసారం అయ్యాయి. దాడిలో అరబ్ వ్యక్తి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. ఘటన జరిగిన 15 నిమిషాల తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. నడి వీధిలో స్పృహ లేకుండా పడి ఉన్న అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ చీఫ్ రబ్బీ యిట్జాక్ యోసేఫ్ ఈ దాడిని ఖండించారు. ‘‘ ఉగ్రవాద సంస్థలు అమాయక ప్రజలపై దాడులు చేస్తున్నాయి. అది తల్చుకుంటే గుండె బరువెక్కుతోంది.. బాధేస్తుంది. అలాగని మనం రెచ్చిపోకూడదు.. హింసకు పాల్పడకూడదు’’ అని హితవు పలికారు. ‘రిలీజియస్ జియోనిజమ్’ పార్టీ అధ్యక్షుడు బెట్జలెల్ స్మార్ట్‌రిచ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘‘ జివిస్ సోదరులారా.. ఆపండి! ఎట్టిపరిస్థితుల్లోనూ అహింసకు పాల్పడవద్దు’’ అని అన్నారు. -
సిగరెట్ కాల్చిన కాజల్.. అభిమానులు షాక్
పెళ్లి అనంతరం హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేకుండా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ భామ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తోన్న ‘ఆచార్య’తో పాటు మంచు విష్ణు మోసగాళ్లులో నటిస్తోంది. అలాగే తమిళ్లో కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తున్న విషయం తెలసిందే. అలాగే హిందీలో ముంబయి సాగలో కూడా కనిపించనుంది. చేతిలో బోలెడు సినిమాలు పెట్టుకున్న చందమామ కెరీర్ పరంగా ఎలాంటి అవకాశాన్ని వదులుకోడానికి సిద్ధంగా లేదు. ఈ క్రమంలోనే తొలిసారి ఓ వెబ్ సిరీస్‌తో అభిమానులను పలకరించడానికి రెడీ అవుతోంది. ‘లైవ్ టెలికాస్ట్’ పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్‌లో కాజల్ నటిస్తోంది. దీనిని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. ఈ వెబ్ సిరీస్‌లో కాజల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. అయితే ఇందులో దెయ్యం తరహా పాత్రలో ఈ భామ అలరించనున్నట్టు తెలుస్తోంది. లైవ్ టెలికాస్ట్ ఫిబ్రవరి 12న (శుక్రవారం) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో కాజల్ నటన అద్భుతంగా ఉందంటూ పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటుంది. కాగా ఇప్పటి వరకు అన్ని జానర్స్‌లో నటించిన ఈ భామ హార్రర్ జానర్లో మాత్రం చేయలేవు. ఈ వెబ్ సిరీస్‌తో ఆ లోటు తీరబోతుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా కాజల్.. చేతిలో సిగరెట్ పట్టుకున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ముద్దుగుమ్మ సిగరెట్ కాల్చడం ఏంటని అభిప్రాయపడుతున్నారు. కానీ వాస్తవానికి కాజల్ నిజంగా ధుమపానం చేసినప్పటికీ అది వెబ్ సిరీస్‌లో భాగంగానే అలా చేసింది. సిరీస్‌లో కొన్ని మాస్ సీన్స్‌లో కాజల్ సిగరెట్ కాల్చే సందర్భాలు ఉన్నాయి. అందుకే అకా కనిపించింది. అసలు విషయం తెలుసుకున్న కొంతమంది హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంటే మరికొంతమంది నెటిజన్లు సిరీస్‌లో అయినా మన మిత్రవింద ఇలా చేయడం ఏమాత్రం బాలేదని పెదవి విరుస్తున్నారు. చదవండి: పెళ్లికీ వృత్తికీ సంబంధం ఏంటి? అది పర్సనల్ కేబుల్ వైర్లతో కట్టేసి కొరడాతో కొట్టేవాడు.. -
పెళ్లికీ వృత్తికీ సంబంధం ఏంటి? అది పర్సనల్
‘‘పెళ్లికీ వృత్తికీ సంబంధం ఏంటి? అది పర్సనల్, ఇది ప్రొఫెషనల్’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. గత ఏడాది అక్టోబర్‌లో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు కాజల్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారామె. ‘ఆచార్య, భారతీయుడు 2, రెండు తమిళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తాజాగా ‘లైవ్ టెలికాస్ట్’ అనే సిరీస్‌తో వెబ్‌లోకి అడుగుపెడుతున్నారామె. ‘లైవ్ టెలికాస్ట్’ ప్రమోషన్స్‌లో కాజల్ మాట్లాడుతూ – ‘‘ఇందులో టీవీ షోస్ డైరెక్టర్ పాత్ర చేశాను. నటులకు ఆ రోజు షూటింగ్ అయిపోతే పని అయిపోతుంది. కానీ దర్శకుల పని ఎంత కష్టమో ఈ పాత్ర చేస్తున్నప్పుడు బాగా అర్థమయింది. అలానే ‘పెళ్లయిన యాక్టర్‌ను పెళ్లి తర్వాత కూడా పని చేస్తారా?’ అని అదే పనిగా అడుగుతుంటారు. పెళ్లయితే పని చేయకూడదా? పెళ్లికీ వృత్తికీ సంబంధం ఏంటి? ఆ ప్రశ్న అడిగినప్పుడల్లా ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల లిస్ట్ చెప్పాలనిపిస్తుంటుంది. ఈ ఏడాది నావి నాలుగైదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి’’ అన్నారు. -
ఫిబ్రవరి 12న కాజల్ ‘ప్రత్యక్ష ప్రసారం’
వెండితెరపై స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు కాజల్ అగర్వాల్. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 16ఏళ్లు దాటినా ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్నారామె. ఇప్పటివరకూ బిగ్ స్క్రీన్ ప్రేక్షకుల్ని అలరించిన ఆమె తాజాగా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాజల్ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘లైవ్ టెలికాస్ట్’ (ప్రత్యక్ష ప్రసారం) ఫిబ్రవరి 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీలో ప్రీమియర్ కానుంది. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సిరీస్‌లో వైభవ్, ఆనంది కీలక పాత్రలు చేశారు. సస్పెన్స్, హారర్ థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. థ్రిల్లర్ జోనర్లో కాజల్ నటించడం ఇదే తొలిసారి. -
వెబ్‌కి వెల్కమ్
స్టార్స్ అందరూ వెబ్‌లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్, తమన్నా కూడా వెబ్ మీడియమ్‌లోకి ఎంటర్ అయ్యారు. త్వరలో విడుదల చేయబోయే ప్రాజెక్ట్‌లను డిస్నీ హాట్‌స్టార్ శుక్రవారం ప్రకటించింది. అందులో కాజల్ లీడ్ రోల్ చేస్తున్న ‘లైవ్ టెలీకాస్ట్’, తమన్నా ‘నవంబర్ స్టోరీ’ కూడా ఉన్నాయి. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘లైవ్ టెలీకాస్ట్’. ఒక భూత్ బంగ్లాలో చిక్కుకుపోయిన ఓ టీవీ బృందానికి ఎదురయిన సమస్యలతో ఈ సిరీస్ ఉంటుంది. చేయని నేరానికి శిక్ష అనుభవించబోతున్న తండ్రిని కాపాడే కూతురు కథాంశంతో తమన్నా ‘నవంబర్ స్టోరీ’ రూపొందింది. రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. ఈ రెండూ తమిళంలో రూపొందినప్పటికీ తెలుగులో అనువాదం కానున్నాయి. ఈ సిరీస్‌లు ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతాయనేది హాట్‌స్టార్ ప్రకటించలేదు. -
లైవ్‌లో యాంకర్.. వెనకాల డ్యాన్సర్
-
లైవ్‌లో యాంకర్.. వెనకాల డ్యాన్సర్
లండన్: టీవీలో కనపడాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఏదైనా సంఘటన జరిగి.. మీడియా వాళ్లు వస్తే చాలు.. జనాలు ఎగబడిపోతుంటారు. యాంకర్ల తమ పని తాము చేసుకుని పోతుంటే.. టీవీలో కనపడాలనే ఔత్సాహికులు తమ పని తాము చేసుకు పోతుంటారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ యాంకర్ బీచ్ నుంచి రిపోర్టింగ్ చేస్తుండగా.. ఆమె వెనకే ఓ పిల్లాడు డ్యాన్స్ చేస్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ పిల్లాడి చేష్టల గురించి యాంకర్‌కు ఏ మాత్రం తెలియదు. ఈ సంఘటన యూకేలోని సౌత్ షీల్డ్స్‌లోని ఓ బీచ్‌లో చోటు చేసుకుంది. (రాజీవ్ గుప్తాకు యూకే ప్రధాని ప్రశంస) వివరాలు.. బీబీసీ ప్రజెంటర్ జెన్ బార్ట్రామ్ లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్నారు. ఇది గమనించి లియోగా అనే ఓ పిల్లాడు లైవ్ టెలికాస్ట్ జరుగుతుండగా.. యాంకర్ వెనక చేరి.. పిల్ల చేష్టలు చేయడం ప్రారంభించాడు. షర్ట్ పైకి లేపి.. డ్యాన్స్ కూడా చేశాడు. అయితే దీని గురించి జెన్‌కు ఏ మాత్రం తెలియదు. యాంకర్ రిపోర్టింగ్‌తో పాటు లియోగా చిలిపి చేష్టలు కూడా రికార్డయ్యాయి. ఆ తర్వాత వీడియో చూసి ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు లియోగా చిలిపి చేష్టలకు తెగ నవ్వుకుంటున్నారు. -
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి
ముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించాడు. ఎవరి హయాంలోనైనా చీఫ్ సెలక్టర్ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే మేలు కలుగు తుందని విమర్శించాడు. సెలక్షన్ కమిటీ వైఫల్యం వల్లే గతేడాది వరల్డ్‌కప్‌లో భారత్ ఓడిపోయిందన్న తివారీ... నాలుగేళ్ల సమయం దొరికినప్పటికీ జట్టులో నాలుగో నంబర్ స్థానాన్ని భర్తీ చేయలేకపోయిందని అసహనం వ్యక్తం చేశాడు. సిరీస్‌ల కోసం టీమిండియాను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ సమావేశాలను టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేశాడు. ఆటగాళ్లను ఏ పద్ధతి ప్రకారం కమిటీ ఎంపిక చేస్తుందో తెలుసుకోవడానికి ఇదొక్కటే మార్గమని అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడిని జట్టు నుంచి తప్పించినప్పుడు కనీసం అతనికైనా కారణం చెప్పాలని కోరాడు. ఎమ్మెస్కే ప్రసాద్ ఆంధ్ర వ్యక్తి కాబట్టి హనుమ విహారికి, వెస్ట్‌జోన్‌కి చెందిన వ్యక్తి అధికారంలో ఉండగా వసీమ్ జాఫర్‌కు, నార్త్‌జోన్ వ్యక్తి సెలెక్టర్‌గా ఉన్న కాలంలో గురుకీరత్ సింగ్, రిషీ ధావన్‌లకు అవకాశాలు వచ్చాయని భారత్ తరఫున 12 వన్డేలు, 3 టి20లు ఆడిన తివారీ ఆరోపించాడు. -
అయోధ్య విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయండి..
సాక్షి, ఢిల్లీ : అయోధ్య కేసులో రోజువారీ చేపడుతున్న విచారణను ప్రత్యక్షప్రసారం చేయాలంటూ బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 16న విచారించనుంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త కె.ఎన్ గోవిందాచార్య తరపున మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ వికాస్ సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా, అయోధ్యలోని రామ జన్మభూమి వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని మధ్యవర్తిత్వం వహించేందుకు నియమించింది. ఆ కమిటీ పరిష్కార మార్గాలను సూచించడంలో విఫలమవడంతో సుప్రీం కోర్టే రోజువారీ విచారణను చేపడతానని ప్రకటించింది. ఇందుకోసం జస్టిస్ ఎస్ఎ బోబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ఎ అబ్దుల్ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. -
లైవ్ టెలికాస్ట్‌లోనే కుప్పకూలి, సెకన్లలో మృతి
శ్రీనగర్ : ఓ టీవీ షో లైవ్ టెస్ట్‌కాస్ట్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ విద్యావేత్త, రచయిత రీటా జతిందర్ లైవ్ టెలికాస్ట్‌లోనే కుప్పకూలిపోయారు. ఆ అనంతరం సెకన్ల వ్యవధిలోనే ఆమె కన్నుమూశారు. సోమవారం రీజనల్ దూరదర్శన్ టీవీలో పాపులర్ లైవ్ షో ‘గుడ్ మార్నింగ్ జమ్మూకశ్మీర్’ పాల్గొన్న జతిందర్.. ఆమె జీవితం గురించి, ఆమె సాధించిన విజయాల గురించి యూజర్ల అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమిస్తూ కుప్పకూలిపోయారు. ఆమె అలా కుప్పకూలిపోవడం చూసిన యాంకర్లు, ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏం జరుగుతుందో ఒక్క నిమిషం ఊహించుకోలేకపోయారు. వెంటనే తేరుకుని ఆమెను పైకి లేపి చూడగా.. జతిందర్ మరణించినట్టు తెలిసింది. ఆ టీవీ షోను నడుపుతున్న ప్రొడ్యూషర్లు కూడా ఆ పరిస్థితిల్లో ఏం చేయలేకపోయారు. జతిందర్ మరణించడంపై ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
తన పెళ్లిలో కూడా డ్యూటీ చేసిన జర్నలిస్టు
కరాచీ : ఉద్యోగంపై అంకితభావం, నిబద్ధత అంటే ఇదేనేమో.. పెళ్లిరోజు సైతం సెలవుపెట్టకుండా ఉద్యోగం చేశాడు.. ఓ పాకిస్థాన్ జర్నలిస్టు. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా బ్రేకింగ్ న్యూస్ అంటూ పెళ్లికొడుకు కాస్త రిపోర్టర్ అవతారమెత్తాడు. సిటీ 41 చానెల్లో పనిచేసే హనాన్ బుకారీ తన పెళ్లినే రిపోర్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కాడు. ఏకంగా తనకు కాబోయే భార్యను, తన తల్లితండ్రులు, అత్తమామలను ఇంటర్వ్యూ చేశాడు. తన తల్లినే ఇంటర్వ్యూ చేస్తూ మీ అబ్బాయి పెళ్లి అవుతోంది.. మీ అభిప్రాయం ఏంటని అడిగాడు. తనది ప్రేమ పెళ్లని కూడా తెలియజేశాడు. ఈ జర్నలిస్టు మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక ఈ ఇంటర్వ్యూపై ట్విటర్ వేదికగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పెళ్లిరోజు సైతం విధులు నిర్వర్తించడాన్ని కొందరు సమర్ధిస్తే మరికొందరు ఇది విలువలు కలిగిన జర్నలిజమా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే దేవుడా.. జర్నలిజం ఎటుపోతుంది.. రిపోర్టర్లు కుటుంబ విషయాలను సైతం కవర్ చేయాలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.