‘‘పెళ్లికీ వృత్తికీ సంబంధం ఏంటి? అది పర్సనల్, ఇది ప్రొఫెషనల్’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. గత ఏడాది అక్టోబర్‌లో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు కాజల్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారామె. ‘ఆచార్య, భారతీయుడు 2, రెండు తమిళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తాజాగా ‘లైవ్ టెలికాస్ట్’ అనే సిరీస్‌తో వెబ్‌లోకి అడుగుపెడుతున్నారామె. ‘లైవ్ టెలికాస్ట్’ ప్రమోషన్స్‌లో కాజల్ మాట్లాడుతూ – ‘‘ఇందులో టీవీ షోస్ డైరెక్టర్ పాత్ర చేశాను.
నటులకు ఆ రోజు షూటింగ్ అయిపోతే పని అయిపోతుంది. కానీ దర్శకుల పని ఎంత కష్టమో ఈ పాత్ర చేస్తున్నప్పుడు బాగా అర్థమయింది. అలానే ‘పెళ్లయిన యాక్టర్‌ను పెళ్లి తర్వాత కూడా పని చేస్తారా?’ అని అదే పనిగా అడుగుతుంటారు. పెళ్లయితే పని చేయకూడదా? పెళ్లికీ వృత్తికీ సంబంధం ఏంటి? ఆ ప్రశ్న అడిగినప్పుడల్లా ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల లిస్ట్ చెప్పాలనిపిస్తుంటుంది. ఈ ఏడాది నావి నాలుగైదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment