మూడు గులాబీలకు కాజల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ | kajal Green Signal To Another Web Series | Sakshi
Sakshi News home page

మూడు గులాబీలకు కాజల్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Published Sun, Feb 14 2021 7:51 AM | Last Updated on Sun, Feb 14 2021 8:52 AM

kajal Green Signal To Another Web Series - Sakshi

‘లైవ్‌ టెలీకాస్ట్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో వెబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు కాజల్‌ అగర్వాల్‌. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ఈ సిరీస్‌ అన్ని భాషల్లో విడుదలయింది. ఇప్పుడు మరో వెబ్‌ సిరీస్‌ కమిటయ్యారట కాజల్‌ అగర్వాల్‌. మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ వెబ్‌ సిరీస్‌లో కాజల్‌ లీడ్‌ రోల్‌లో నటించనున్నారని సమాచారం. ఈ సిరీస్‌కి ‘త్రీ రోజెస్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’, తమిళంలో ఓ రెండు సినిమాలు చేస్తున్నారు కాజల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement