![Kajal Agarwal Live Telecast and Tamannaah November Story Posters Release - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/24/Untitled-1.jpg.webp?itok=3ooa4WPv)
స్టార్స్ అందరూ వెబ్‌లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్, తమన్నా కూడా వెబ్ మీడియమ్‌లోకి ఎంటర్ అయ్యారు. త్వరలో విడుదల చేయబోయే ప్రాజెక్ట్‌లను డిస్నీ హాట్‌స్టార్ శుక్రవారం ప్రకటించింది. అందులో కాజల్ లీడ్ రోల్ చేస్తున్న ‘లైవ్ టెలీకాస్ట్’, తమన్నా ‘నవంబర్ స్టోరీ’ కూడా ఉన్నాయి. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘లైవ్ టెలీకాస్ట్’. ఒక భూత్ బంగ్లాలో చిక్కుకుపోయిన ఓ టీవీ బృందానికి ఎదురయిన సమస్యలతో ఈ సిరీస్ ఉంటుంది. చేయని నేరానికి శిక్ష అనుభవించబోతున్న తండ్రిని కాపాడే కూతురు కథాంశంతో తమన్నా ‘నవంబర్ స్టోరీ’ రూపొందింది. రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. ఈ రెండూ తమిళంలో రూపొందినప్పటికీ తెలుగులో అనువాదం కానున్నాయి. ఈ సిరీస్‌లు ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతాయనేది హాట్‌స్టార్ ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment