
శ్రీనగర్ : ఓ టీవీ షో లైవ్ టెస్ట్‌కాస్ట్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ విద్యావేత్త, రచయిత రీటా జతిందర్ లైవ్ టెలికాస్ట్‌లోనే కుప్పకూలిపోయారు. ఆ అనంతరం సెకన్ల వ్యవధిలోనే ఆమె కన్నుమూశారు. సోమవారం రీజనల్ దూరదర్శన్ టీవీలో పాపులర్ లైవ్ షో ‘గుడ్ మార్నింగ్ జమ్మూకశ్మీర్’ పాల్గొన్న జతిందర్.. ఆమె జీవితం గురించి, ఆమె సాధించిన విజయాల గురించి యూజర్ల అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమిస్తూ కుప్పకూలిపోయారు.
ఆమె అలా కుప్పకూలిపోవడం చూసిన యాంకర్లు, ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏం జరుగుతుందో ఒక్క నిమిషం ఊహించుకోలేకపోయారు. వెంటనే తేరుకుని ఆమెను పైకి లేపి చూడగా.. జతిందర్ మరణించినట్టు తెలిసింది. ఆ టీవీ షోను నడుపుతున్న ప్రొడ్యూషర్లు కూడా ఆ పరిస్థితిల్లో ఏం చేయలేకపోయారు. జతిందర్ మరణించడంపై ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment