Rita
-
రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!
బిర్యానీ, ఫ్రైడ్ రైస్‌ల పక్కన రైతా ఉండాల్సిందే. అది లేకుండా బిర్యానీ తినడం పూర్తి కాదు అన్నంతగా ఆహారప్రియులు ఇష్టంగా ఆస్వాదిస్తారు. అలా కాకపోయినా పెరుగులో ఉల్లిపాయ నొంచుకుని తింటుంటారు చాలమంది. పెరుగులో లేదా మజ్జిగలో ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఉంటది ఆ రుచి..నా సామిరంగా అంటూ ఆనందంగా లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. కడుపు కూడా హాయిగా చల్లగా ఉంటుంది. అలాంటి రైతా గురించి షాకింగ్ విషయాలు చెబుతున్నారు నిపుణులు. రైతాలో ఉల్లిపాయలు ఎట్టి పరిస్థిత్తుల్లోనూ జోడించొద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకని ఇలా చెబుతున్నారంటే..భారతీయలు ఎక్కువగా ఉల్లిపాయను మజ్జిగ/పెరుగులో లేదా రైతా రూపంలో తీసుకుంటుంటారు. అయితే ఇలా పెరుగుకి ఉల్లిపాయను జోడించొద్దని చెబుతున్నారు. ఈ కలయిక నాలుకకు మంచి రుచిని ఇచ్చినప్పటికీ..ఆరోగ్యానికి ఇలాంటి కాంబినేషన్ అస్సలు మంచిది కాదని వారిస్తున్నారు. పెరుగు కేవలం తరిగిన పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలతో మంచి ప్రయోజనాలను ఇస్తుంది. అంతేగాదు జీర్ణక్రియను మెరుగుపరచడం, బరువు నిర్వహణకు, ఎముకలను బలోపేతం చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలు అందించినప్పటికీ..ఇలా ఉల్లిపాయతో కలగలిసిన రైతా మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం..పెరుగు, ఉల్లిపాయలు వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటుంది. పెరుగు శీతలీకరణ స్వభావం, ఉల్లిపాయ ఉత్పత్తిచేసే అధికవేడి శరీరంలో టాక్సిన్ స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. ఫలితంగా శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల ఉల్లిపాయను పెరుగుతో జోడించడాన్ని విరుధమైన అన్నంగా పరగణించటం జరుగుతుంది. ఇది అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, వంటి సమస్యలనే పెంచుతుంది. ఒక్కోసారి ఇది తీవ్రమై ఫుడ్ పాయిజన్కి దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ ఉల్లిపాయను పచ్చిగా తీసుకోవడం వల్ల వేడి అనుభూతి కలుగుతుంది. దీని వేడి, ఆక్సీకరణకు సున్నితంగా ఉంటుంది. అందువల్ల అధికంగా రియాక్షన్ చెంది పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. అలాగే శరీరంలో వాత పిత్తా కఫాలాల తోసహా అమసతుల్యతను సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఉల్లిపాయను పెరుగులో తినడం చాలా ఇష్టమనుకుంటే..పచ్చిగా కాకుండా పెరుగు చట్నీ మాదిరిగా కాస్త ఆయిల్లో ఉల్లిపాయాలు వేయించి తాలింపు మాదిరిగా పెట్టుకుని తింటే దానిలో సల్ఫర్ శక్తి, రియాక్షన్ చెందడం తగ్గుతుంది. పైగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: కూరగాయల షాపింగ్ గైడ్!) -
29వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించిన కమీ రీటా షెర్పా
నేపాల్‌కు చెందిన 10 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో విజయం సాధించారు. ఈ సీజన్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన తొలి యాత్ర బృందం ఇదే. డెండి షెర్పా నేతృత్వంలోని పర్వాతారోహకుల బృందం శుక్రవారం రాత్రి 8.15 గంటలకు 8,848.86 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది. ఈ విషయాన్ని ఈ పర్వతారోహణ యాత్ర నిర్వహణ సంస్థ ‘సెవెన్ సమ్మిట్ ట్రాక్’ ప్రతినిధి థాని గుర్గైన్ మీడియాకు తెలిపారు.ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ సాధించని ఘనతను పర్వతారోహకురాలు కమీ రీటా షెర్పా చేసి చూపారు. ఆమె 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. షెర్పా తన 28వ ఎవరెస్ట్ అధిరోహణ రికార్డును తానే బద్దలు కొట్టారు. కమీ రీటా షెర్పాకు 54 ఏళ్లు. ఆమె 1994 నుండి పర్వతాలను అధిరోహిస్తున్నారు.ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే ముందు కమీ రీటా షెర్పా మీడియాతో మాట్లాడుతూ తనకు మరో వ్యాపకం లేదని, పర్వతారోహణే తన లక్ష్యమని అన్నారు. 29వ సారి కూడా ఎవరెస్ట్ అధిరోహిస్తానని తెలిపారు. కాగా కమీ రీటా షెర్పాతో పాటు టెన్జింగ్ గ్యాల్జెన్ షెర్పా, పెంబా తాషి షెర్పా, లక్పా షెర్పా, దావా రింజి షెర్పా, పామ్ సోర్జీ షెర్పా, సుక్ బహదూర్ తమాంగ్, నామ్‌గ్యాల్ డోర్జే తమాంగ్, లక్పా రింజీ షెర్పా తదిరులు పర్వతాన్ని అధిరోహించారు. మొత్తం 414 మంది అధిరోహకులు ఈ సీజన్లో ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు అనుమతి పొందారు. Nepali Sherpa climber Kami Rita Sherpa climbs Everest for record 29th time breaking his own previous record of 28 ascends. He is the sole person to climb the World’s tallest peak for a record 29 times: Government officials(file pic) pic.twitter.com/6gp6QaKWdz— ANI (@ANI) May 12, 2024 -
రివాల్వర్ రీటా’గా వస్తోన్న కీర్తి సురేశ్.. అప్డేట్ వచ్చేసింది!
మాలీవుడ్‌లో బాలనటిగా రంగప్రవేశం చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకుంది. కోలీవుడ్‌లో ఇదు ఎన్న మాయం చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌పుల్ హీరోయిన్గా పేరు తె చ్చుకుంది. హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేశ్ టాలీవుడ్లో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన తెలుగు చిత్రం మహానటి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. అలా ఒక్కో అడుగేస్తూ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ వరుణ్ ధావన్‌కు జంటగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్న బేబీజాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో హిట్ అయిన తెరి చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే తమిళంలో జయంరవికి జంటగా నటించిన సైరన్ చిత్రం కీర్తిసురేశ్‌ను నిరాశపరిచింది.ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాల్లో రివాల్వర్ రీటా ఒకటి. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు రెడిన్ కింగ్స్లీ, మైమ్‌గోపీ, సెండ్రాయిన్, స్టంట్ మాస్టర్ సూపర్‌సుబ్బరాయన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని నటి కీర్తిసురేశ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో చివరి షూటింగ్లో కేక్ కట్ చేసిన వీడియోను విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా ఈ చిత్రం ఆడియో, ట్రైలర్లను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కీర్తిసురేశ్ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. -
ఆ స్టార్ జంటకు కరోనా సోకింది!
హాలీవుడ్ జంట టామ్ హాంక్స్(63), రీటా విల్సన్(63)... కోవిడ్-19(కరోనా వైరస్) బారిన పడ్డారు. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వీరు వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని టామ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఓ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నామని పేర్కొన్నారు. ‘‘స్నేహితులందరికీ హలో.. రీటా, నేను ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాం. కాస్త అలసటగా అనిపించడంతో పాటుగా.. జలుబు, జ్వరం ఒళ్లు నొప్పుల కారణంగా పరీక్షలు చేయించుకున్నాం. కరోనా పాజిటివ్‌గా తేలింది. కాబట్టి ఇప్పటినుంచి వైద్య అధికారుల సూచనలు పాటిస్తూ ఇక్కడే ఉండాలి. మాకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. అబ్జర్వేషన్లో పెడతారు. ఆరోగ్యం కుదుటపడేంతవరకు ఇక్కడే ఉంటాం. మాకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరంతా జాగ్రత్తగా ఉండండి’’అని టామ్ ట్వీట్ చేశారు.(కోవిడ్ ప్రపంచవ్యాప్త మహమ్మారి: డబ్ల్యూహెచ్ఓ) ఈ క్రమంలో టామ్, రీటాలు త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. స్టార్ కపుల్ తమకు వినోదాన్ని పంచుతూనే ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా కాలిఫోర్నియాలో జన్మించిన టామ్ స్ప్లాష్, బ్యాచిలర్ పార్టీ, బిగ్, ఫారెస్ట్ గంప్, ది టెర్మిమినల్, అపోలో 13 తదితర చిత్రాల ద్వారా నటుడిగా గుర్తింపు పొందాడు. మొదటి భార్య సమంతా లూయీస్ నుంచి విడిపోయిన తర్వాత 1998లో నటి రీటాను పెళ్లి చేసుకున్నారు. కాగా తాను కరోనా పాజిటివ్ అని ప్రపంచాన్ని వెల్లడించిన తొలి హాలీవుడ్ స్టార్‌గా టామ్ నిలిచాడు. ఇక హ్యారీపోటర్ నటుడు డేనియల్ ర్యాడ్‌క్లిఫ్‌కు కరోనా సోకిందంటూ రూమర్లు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ర్యాడ్‌క్లిఫ్‌కు ఎటువంటి వైరస్ సోకలేదని ఆయన ప్రతినిధి మీడియాలకు వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దాదాపు 107కు పైగా దేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా వైరస్ (కోవిడ్-19)ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బుధవారం ప్రకటించింది. ఇక దీని కారణంగా ఇప్పటివరకు 4250 మందికి పైగా మృత్యువాత పడగా.. ఇంచుమించు లక్షా 18 వేల మంది కరోనా అనుమానితులుగా ఉన్నారు. pic.twitter.com/pgybgIYJdG — Tom Hanks (@tomhanks) March 12, 2020 -
లైవ్ టెలికాస్ట్‌లోనే కుప్పకూలి, సెకన్లలో మృతి
శ్రీనగర్ : ఓ టీవీ షో లైవ్ టెస్ట్‌కాస్ట్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ విద్యావేత్త, రచయిత రీటా జతిందర్ లైవ్ టెలికాస్ట్‌లోనే కుప్పకూలిపోయారు. ఆ అనంతరం సెకన్ల వ్యవధిలోనే ఆమె కన్నుమూశారు. సోమవారం రీజనల్ దూరదర్శన్ టీవీలో పాపులర్ లైవ్ షో ‘గుడ్ మార్నింగ్ జమ్మూకశ్మీర్’ పాల్గొన్న జతిందర్.. ఆమె జీవితం గురించి, ఆమె సాధించిన విజయాల గురించి యూజర్ల అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమిస్తూ కుప్పకూలిపోయారు. ఆమె అలా కుప్పకూలిపోవడం చూసిన యాంకర్లు, ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏం జరుగుతుందో ఒక్క నిమిషం ఊహించుకోలేకపోయారు. వెంటనే తేరుకుని ఆమెను పైకి లేపి చూడగా.. జతిందర్ మరణించినట్టు తెలిసింది. ఆ టీవీ షోను నడుపుతున్న ప్రొడ్యూషర్లు కూడా ఆ పరిస్థితిల్లో ఏం చేయలేకపోయారు. జతిందర్ మరణించడంపై ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.