బిర్యానీ, ఫ్రైడ్ రైస్‌ల పక్కన రైతా ఉండాల్సిందే. అది లేకుండా బిర్యానీ తినడం పూర్తి కాదు అన్నంతగా ఆహారప్రియులు ఇష్టంగా ఆస్వాదిస్తారు. అలా కాకపోయినా పెరుగులో ఉల్లిపాయ నొంచుకుని తింటుంటారు చాలమంది. పెరుగులో లేదా మజ్జిగలో ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఉంటది ఆ రుచి..నా సామిరంగా అంటూ ఆనందంగా లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. కడుపు కూడా హాయిగా చల్లగా ఉంటుంది. అలాంటి రైతా గురించి షాకింగ్ విషయాలు చెబుతున్నారు నిపుణులు. రైతాలో ఉల్లిపాయలు ఎట్టి పరిస్థిత్తుల్లోనూ జోడించొద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకని ఇలా చెబుతున్నారంటే..
భారతీయలు ఎక్కువగా ఉల్లిపాయను మజ్జిగ/పెరుగులో లేదా రైతా రూపంలో తీసుకుంటుంటారు. అయితే ఇలా పెరుగుకి ఉల్లిపాయను జోడించొద్దని చెబుతున్నారు. ఈ కలయిక నాలుకకు మంచి రుచిని ఇచ్చినప్పటికీ..ఆరోగ్యానికి ఇలాంటి కాంబినేషన్ అస్సలు మంచిది కాదని వారిస్తున్నారు. పెరుగు కేవలం తరిగిన పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలతో మంచి ప్రయోజనాలను ఇస్తుంది. అంతేగాదు జీర్ణక్రియను మెరుగుపరచడం, బరువు నిర్వహణకు, ఎముకలను బలోపేతం చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలు అందించినప్పటికీ..ఇలా ఉల్లిపాయతో కలగలిసిన రైతా మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు.
ఆయుర్వేదం ప్రకారం..పెరుగు, ఉల్లిపాయలు వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటుంది. పెరుగు శీతలీకరణ స్వభావం, ఉల్లిపాయ ఉత్పత్తిచేసే అధికవేడి శరీరంలో టాక్సిన్ స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. ఫలితంగా శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల ఉల్లిపాయను పెరుగుతో జోడించడాన్ని విరుధమైన అన్నంగా పరగణించటం జరుగుతుంది. ఇది అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, వంటి సమస్యలనే పెంచుతుంది. ఒక్కోసారి ఇది తీవ్రమై ఫుడ్ పాయిజన్‌కి దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
ఇక్కడ ఉల్లిపాయను పచ్చిగా తీసుకోవడం వల్ల వేడి అనుభూతి కలుగుతుంది. దీని వేడి, ఆక్సీకరణకు సున్నితంగా ఉంటుంది. అందువల్ల అధికంగా రియాక్షన్ చెంది పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. అలాగే శరీరంలో వాత పిత్తా కఫాలాల తోసహా అమసతుల్యతను సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఉల్లిపాయను పెరుగులో తినడం చాలా ఇష్టమనుకుంటే..పచ్చిగా కాకుండా పెరుగు చట్నీ మాదిరిగా కాస్త ఆయిల్‌లో ఉల్లిపాయాలు వేయించి తాలింపు మాదిరిగా పెట్టుకుని తింటే దానిలో సల్ఫర్ శక్తి, రియాక్షన్ చెందడం తగ్గుతుంది. పైగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు అని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: కూరగాయల షాపింగ్ గైడ్!)
Comments
Please login to add a commentAdd a comment