
సాక్షి, ఢిల్లీ : అయోధ్య కేసులో రోజువారీ చేపడుతున్న విచారణను ప్రత్యక్షప్రసారం చేయాలంటూ బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 16న విచారించనుంది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కె.ఎన్ గోవిందాచార్య తరపున మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ వికాస్ సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా, అయోధ్యలోని రామ జన్మభూమి వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని మధ్యవర్తిత్వం వహించేందుకు నియమించింది. ఆ కమిటీ పరిష్కార మార్గాలను సూచించడంలో విఫలమవడంతో సుప్రీం కోర్టే రోజువారీ విచారణను చేపడతానని ప్రకటించింది. ఇందుకోసం జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఎ అబ్దుల్ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment