లైవ్‌లో న్యూస్ అందిస్తున్న సమయంలో రిపోర్టర్‌కి యాక్సిడెంట్ అయిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...అమెరికాకు చెందిన వెస్ట్ వర్జీనియా టెలివిజన్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారంలో రిపోర్ట్‌ంగ్ అందిస్తున్న ఒక మహిళకి లైవ్‌లోనే యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం జరిగిన మహిళ టోరీ యోర్గీగా గుర్తించారు. అయితే ఆమె లైవ్ టెలీకాస్టింగ్‌లో రోపోర్టింగ్ చేస్తోంది. ఇంతలో ఒక ఎస్‌యూవీ కారు ఆమెను వెనుక నుంచి ఢీ కొడుతుంది. అయితే ఆ లైవ్ న్యూస్‌లోనే ఆమె గట్టిగా అరవడం, ఆ తర్వాత సదరు ఆ వాహనదారుడితో మాట్లాడటం వినిపిస్తుంది. అయినప్పటికీ ఆమె మళ్లీ కాసేపటికి తేరుకుని తన రిపోర్టింగ్‌ని యథావిధిగా కొనసాగించడం విశేషం.
ఈ మేరకు టీవీ యాంకర్ టిమ్ మీరు బాగానే ఉన్నారా! అని టోరీని ప్రశ్నిస్తాడు. దీంతో టోరీ తాను బాగానే ఉన్నా, కానీ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెబుతుంది. అంతేకాదు టిమ్ కూడా తాను రిపొర్టర్ అదృశ్యమవ్వడమే చూశాను తప్ప ప్రమాదం ఎలా జరిగిందో గమనించలేదని చెప్పారు. లైవ్‌లో న్యూస్ అందిస్తుండగా జరిగిన తొలిప్రమాదం కదా అని యాంకర్ టిమ్ రిపోర్టర్ టోరీని అడిగాడు. దీంతో ఆమె ఇలాంటి ప్రమాదాలు చాలా ఎదుర్కొన్నాను కానీ తనకు ఎటువంటి గాయాలు కాలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. అంతేకాదు లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.
"We're good, Tim." pic.twitter.com/9kn2YElDLK
— Timothy Burke (@bubbaprog) January 20, 2022
(చదవండి: ఎక్స్ రే అమ్మకానికి పెట్టిన డాక్టర్... ఎందుకో తెలుసా)
Comments
Please login to add a commentAdd a comment