reporting
-
ఆర్బీకేల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) వైఎస్ జగన్ ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన ఉన్న ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన హేతుబద్దీకరణ (రేషనలైజేషన్)కు నిర్ణయించింది. అవసరానికి మించి ఉన్న మండలాల్లోని ఆర్బీకేల సిబ్బందిని తక్కువ ఉన్న మండలాలకు సర్దుబాటు చేయనుంది. అక్టోబర్ కల్లా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి, ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాత నవంబర్‌లో తాజా పోస్టింగుల ఉత్తర్వులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల గుమ్మం వద్దకు పౌర సేవలందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాలకు అనుబంధంగా రైతు సేవల కోసం ప్రత్యేకంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్వపు జిల్లా ప్రాతిపదికన జరిగిన నియామకాల ద్వారా వీటిలో 6,218 మంది వ్యవసాయ, 2,352 మంది ఉద్యాన, 374 మంది పట్టు సహాయకులతో పాటు 4,652 మంది పశుసంవర్ధక, 731 మంది మత్స్య సహాయకులు ఆర్బీకేల్లో సేవలందిస్తున్నారు. వీరికి అదనంగా 904 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో), 1,396 మంది వ్యవసాయ మలీ్టపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈవో), 77 మంది ఉద్యాన ఎంపీఈవోలు పని చేస్తున్నారు. ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఒక్కో ఆర్బీకేకు స్థానికంగా సాగయ్యే పంటలనుబట్టి గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను ఇన్చార్జిలుగా నియమించారు. సిబ్బందిపై పనిఒత్తిడి తగ్గించడమే లక్ష్యం కొన్ని మండలాల్లో ఒక సచివాలయం పరిధిలో రెండు, అంతకు మించి ఆర్బీకేలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా ఒకే మండలంలో కొన్ని ఆర్బీకేల పరిధిలో సాగు విస్తీర్ణం పదుల ఎకరాల్లో ఉంటే, కొన్నింటిలో వందల ఎకరాలు, మరికొన్నింటిలో 7 వేలు, 8 వేల ఎకరాల్లో ఉంది. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఆర్బీకేల్లో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. సర్టీఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ, పంటల వివరాలను ఈ క్రాప్ యాప్‌లో నమోదు చేయడం, పొలాలకు వెళ్లి ఫొటోలతో పాటు రైతుల ఈ కేవైసీ నమోదు చేయడం, వైపరీత్యాల వేళ నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేయడం, పంట కోత ప్రయోగాలు, పంటల బీమా అమలు.. ఇలా రైతుల కోసం ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములవ్వాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీకే వ్యవస్థలో హేతుబద్ధీకరణకు ప్రభుత్వం సంకల్పించింది. విస్తీర్ణం ప్రాతిపదికన సిబ్బంది సర్దుబాటు హేతుబద్ధీకరణలో భాగంగా పంటల విస్తీర్ణం ప్రాతిపదికన మండలం యూనిట్‌గా సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో 600 నుంచి 800 ఎకరాలకు, మైదాన ప్రాంతాల్లో 1000 నుంచి 1500 ఎకరాలకు ఒకరు చొప్పున సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేస్తోంది. అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర మండలాల్లో సర్దుబాటు చేస్తారు. స్థానికంగా సాగయ్యే ఉద్యాన, పట్టు పంటలను బట్టి వీఎస్ఏ, వీహెచ్ఎలకు తొలి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న చోట ఉద్యాన ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. వ్యవసాయ పంటలు సాగు ఎక్కువగా ఉంటే ఏఈవో, వ్యవసాయ ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఏఈవో, ఏంపీఈవోలను నియమిస్తారు. ఏఈవోలను జిల్లా పరిధిలో సర్దుబాటు చేస్తుండగా, ఎంపీఈవోలను అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల పరిధిలో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించారు. ఖరీఫ్ తర్వాతే రిపోర్టింగ్ ప్రస్తుతం ఖరీఫ్–2023 సీజన్ ఈ క్రాప్ బుకింగ్ జోరుగా సాగుతోంది. మరో వైపు కోతలు ప్రారంభమైన తర్వాత ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాతే సర్దుబాటు చేసిన సిబ్బంది వారికి కేటాయించిన స్థానాల్లో రిపోర్టింగ్ చేయాలి. జిల్లాల పరిధిలో స్థానిక అవసరాలనుబట్టి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
21 నుంచి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, రద్దయిన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 24వ తేదీలోగా రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దోస్త్ ద్వారా మిగిలిపోయిన వివిధ కాలేజీల్లోని సీట్లకు 21 నుంచి 25 వరకూ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 29న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. వచ్చే నెల 3, 4 తేదీల్లో అన్ని ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని మండలి పేర్కొంది. కాగా, సీటు పొందిన కాలేజీలో వేరే బ్రాంచీకి మారాలనుకునే అభ్యర్థులు ఈ నెల 19, 20 తేదీల్లో ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 21న ఇంట్రా కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. -
కంప్యూటర్ కోర్సులు ‘కేక’
సాక్షి, హైదరాబాద్: తొలి విడత ఇంజనీరింగ్ సీట్లను ఆదివారం కేటాయించారు. మొత్తం 82,666 సీట్లు అందుబాటులో ఉంటే, 70,665 భర్తీ చేసినట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ వెల్లడించారు. 12,001 సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 1,56,879 మంది అర్హత సాధించారు. 76,821 మంది ఎంసెట్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 75,708 మంది వివిధ కాలేజీలు, వివిధ బ్రాంచీలకు ఆప్షన్లు ఇచ్చారు. మొత్తం 50,44,634 ఆప్షన్లు అందాయి. 5,043 మంది ఎలాంటి ఆప్షన్లు ఇవ్వలేదు. 5,576 మందికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాలో సీట్లు వచ్చాయి. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 173 పాల్గొన్నాయి. 28 కాలేజీల్లో వందశాతం సీట్ల కేటాయింపు మూడు యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో వందశాతం సీట్ల కేటాయింపు జరిగినట్టు సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22లోగా సెల్ఫ్ రిపోరి్టంగ్ చేయాలని ఎంసెట్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఆగస్టు 9 నుంచి 11 వరకూ కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. సగానికిపైగా కంప్యూటర్ కోర్సులే మొదటి దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఎక్కువగా కంప్యూటర్ కోర్సులనే విద్యార్థులు కోరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్రాంచీల్లో కలిపి 82,666 సీట్లుంటే, కంప్యూటర్ కోర్సుల్లోనే 55,876 సీట్లున్నాయి. వీటిల్లో భర్తీ అయిన సీట్లు 52,637. అన్ని బ్రాంచీలకు కలిపి ఉన్న సీట్లలో 67.5 శాతం కంప్యూటర్ కోర్సులవైతే, 32.5 శాతం ఇతర బ్రాంచీలకు చెందినవి ఉన్నాయి. కంప్యూటర్ కోర్సుల్లో సీఎస్సీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటాసైన్స్, ఐటీతో కలుపుకుని మొత్తం 18 రకాల కోర్సులున్నాయి. ఎక్కువ మంది ఈ కోర్సులకే ఆప్షన్లు ఇవ్వడంతో 94.20 శాతం సీట్లు భర్తీ చేశారు. మిగిలిపోయిన సీట్లు 3,239 ఉన్నాయి. ఇవి కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినవే. ఈ కోర్సుల్లో వందశాతం భర్తీ ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్ కోర్సులో 137సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయ్యాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో 91, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టంలో 318, సీఎస్సీ (సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ)లో 133, సీఎస్సీ (నెట్వర్క్)లో 91, సీఎస్సీ (ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్)లో 870 సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయినట్టు అధికారులు వెల్లడించారు. భారీగా సీట్లు మిగిలిన సివిల్, మెకానికల్, ఈఈఈ కౌన్సెలింగ్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. గత ఏడాది కూడా ఇదే విధంగా ఉండటంతో చాలా కాలేజీలు ఈ బ్రాంచీల్లో సీట్లు రద్దు చేసుకోవడంతో 7 వేల సీట్లు తగ్గాయి. అయినప్పటికీ ఈ కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాటి అనుబంధ బ్రాంచీల్లో 17,274 సీట్లు అందుబాటులో ఉంటే, 13,595 సీట్లు మాత్రమే కేటాయించారు. 3,679 సీట్లు మిగిలిపోయాయి. మెకానికల్, సివిల్ సహా వాటి అనుబంధ బ్రాంచీల్లోనూ 3,642 సీట్లు మిగిలిపోయాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 44.76 శాతం, మెకానికల్ 38.50 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ఈఈఈలోనూ 58.38 శాతం సీట్లు భర్తీ చేశారు. -
నిరసనలు, ముట్టడి ఇకపై కష్టమే!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రూ.1,581.62 కోట్లతో 26 కొత్త సమీకృత జిల్లా కలెక్టరేట్, కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అన్ని కలెక్టరేట్లకు ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచి నివేదికల ఆధారంగా భద్రత చర్యలు చేపడుతున్నారు. ప్రధాన ద్వారం ఎదు రుగా, ప్రహరీపైన, చుట్టూ ప్రత్యేక ఇనుప ముళ్లకంచెలను అధికారులు ఏర్పాటు చేస్తుండడంతో సమై క్యాంధ్రలో తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కార్యాలయంలోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలను అడ్డుకునేందుకేనా..? ప్రభుత్వ విధానాలపై కొన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవడం సర్వసాధారణం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలనో, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలనో, ఏకపక్షంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనో బాధితులు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. ఒక్కోసారి కలెక్టరేట్‌ను ముట్టడించి.. లోపలికి చొరబడి సమస్య తీవ్రతను చాటి చెప్పాలనుకుంటారు. దీంతో ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టేందుకు హనుమకొండ, జనగామలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎత్తయిన ప్రత్యేక ఇనుప కంచెలను నిర్మిస్తుండడం ప్రతిపక్షాలు, ఆందోళనకారుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కలెక్టర్ కార్యాలయాలకు ఇనుప ముళ్లకంచెలు.. మూడంచెల భద్రత జనవరి 5న మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల రైతులు తమ కుటుంబ సభ్యులతో సహా భారీ ఎత్తున తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. వారంతా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయతి్నంచడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జనవరి 30న నందిపేట గ్రామ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతితో కలసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. బిల్లులపై ఉప సర్పంచ్సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్లకుపైగా ఆగిపోయాయని వారు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం కలెక్టరేట్లో కలకలం రేపింది. ఫిబ్రవరి 13న జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి నిమ్మల నర్సింగరావు, ఆయన భార్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యతి్నంచారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన ఈ దంపతులు.. తమ భూమిని తహసీల్దార్ ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టగా, పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. -
సోనూసూద్ గొప్ప మనసు.. స్టూడెంట్ రిపోర్టింగ్‌కు ఫిదా.. సాయం చేస్తానంటూ
సోనూసూద్.. దేశంలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరేమో.. తన సినిమాల కంటే చేసిన సేవలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి.. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా మారిన మంచి మనసున్న మహారాజు. లాక్డౌన్ కాలంలో వేలాది మందికి నేనున్నానంటూ అండగా నిలిచాడు. కష్టం వచ్చిందని సోనూసూద్ దృష్టికి తీసుకొస్తే చాలు.. తనకు చేతనైనంత సాయం చేస్తుంటారు. నేటికి తన సేవలను కొనసాగిస్తున్నాడు. తాజాగా జార్ఖండ్లోనిని ఓ విద్యార్థి సమస్యకు పరిష్కారం చూపి మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఓ బాలుడు తన ప్రభుత్వ పాఠశాల దుస్థితిని వివరిస్తూ రిపోర్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. సర్ఫరాజ్ అనే విద్యార్థి అచ్చం రిపోర్టర్లా నటిస్తూ పాఠశాల అంతా తిరుగుతూ తరగతి గదిలో అధ్వానమైన పరిస్థితులు, సరైన టాయిలెట్స్ లేకపోవడాన్ని రిపోర్టింగ్ చేశాడు. దీన్నంతటినీ మరో స్నేహితుడు వీడియో చిత్రీకరించాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ బాలుడి నైపుణ్యాలను ప్రశంసించారు. शायद आपने ऐसा पत्रकार नहीं देखा हो ये विडीओ है झारखंड की जहां एक छोटा बच्चा जर्नालिस्ट बन कर अपने स्कूल के बदहाली को एक्ष्पोस करता है बच्चे का नाम सरफराज है और विडीओ ज़िला गोड्डा से है। 1/2@zoo_bear @AshrafFem @khanumarfa @khan_zafarul @meerfaisal01 @alishan_jafri @IamYasmeeny pic.twitter.com/14Uw53iIRn — Mohammad Sunasara (@MdSunasara5) August 4, 2022 అయితే ఈ వీడియోపై తాజాగా సోనూసూద్ స్పందించాడు. బాలుడి వీడియోను రీట్వీట్ చేస్తూ.. ‘సర్ఫరాజ్.. ఇకపై నువ్వు కొత్త స్కూల్ నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కొత్త పాఠశాల, హాస్టల్ తమ కోసం ఎదురుచూస్తున్నాయి’ అని తెలిపారు. ఇక సోనూసూద్ గొప్ప మనసును నెటిజన్లు మరోసారి కొనియాడుతున్నారు. -
లైవ్‌లో న్యూస్ అందిస్తున్న రిపోర్టర్‌కి యాక్సిడెంట్ : వైరల్ వీడియో
లైవ్‌లో న్యూస్ అందిస్తున్న సమయంలో రిపోర్టర్‌కి యాక్సిడెంట్ అయిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...అమెరికాకు చెందిన వెస్ట్ వర్జీనియా టెలివిజన్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారంలో రిపోర్ట్ంగ్ అందిస్తున్న ఒక మహిళకి లైవ్‌లోనే యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం జరిగిన మహిళ టోరీ యోర్గీగా గుర్తించారు. అయితే ఆమె లైవ్ టెలీకాస్టింగ్‌లో రోపోర్టింగ్ చేస్తోంది. ఇంతలో ఒక ఎస్యూవీ కారు ఆమెను వెనుక నుంచి ఢీ కొడుతుంది. అయితే ఆ లైవ్ న్యూస్‌లోనే ఆమె గట్టిగా అరవడం, ఆ తర్వాత సదరు ఆ వాహనదారుడితో మాట్లాడటం వినిపిస్తుంది. అయినప్పటికీ ఆమె మళ్లీ కాసేపటికి తేరుకుని తన రిపోర్టింగ్‌ని యథావిధిగా కొనసాగించడం విశేషం. ఈ మేరకు టీవీ యాంకర్ టిమ్ మీరు బాగానే ఉన్నారా! అని టోరీని ప్రశ్నిస్తాడు. దీంతో టోరీ తాను బాగానే ఉన్నా, కానీ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెబుతుంది. అంతేకాదు టిమ్ కూడా తాను రిపొర్టర్ అదృశ్యమవ్వడమే చూశాను తప్ప ప్రమాదం ఎలా జరిగిందో గమనించలేదని చెప్పారు. లైవ్‌లో న్యూస్ అందిస్తుండగా జరిగిన తొలిప్రమాదం కదా అని యాంకర్ టిమ్ రిపోర్టర్ టోరీని అడిగాడు. దీంతో ఆమె ఇలాంటి ప్రమాదాలు చాలా ఎదుర్కొన్నాను కానీ తనకు ఎటువంటి గాయాలు కాలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. అంతేకాదు లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. "We're good, Tim." pic.twitter.com/9kn2YElDLK — Timothy Burke (@bubbaprog) January 20, 2022 (చదవండి: ఎక్స్ రే అమ్మకానికి పెట్టిన డాక్టర్... ఎందుకో తెలుసా) -
ఈ పాకిస్తాన్ జర్నలిస్ట్ గుర్తున్నాడా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జర్నలిస్ట్ అమిన్ హఫీజ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. గతంలో గేదెను ఇంటర్వ్యూ చేసిన అతను ఇప్పుడు మరో వినూత్న పద్ధతిలో రిపోర్టింగ్ చేశాడు. అమిన్ హఫీజ్ పాకిస్తాన్‌లోని జియో న్యూస్ చానల్లో ఓ జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. అతను చక్రవర్తి వేషం ధరించి చేతిలో కత్తి, మెడపై కిరీటంతో న్యూస్ రిపోర్ట్ చేశాడు. అతని వెనకాల ఇద్దరు భటులు నిలబడగా తన చేతిలోని కత్తిని తిప్పుతూ ముఖ్యాంశాలను వివరించాడు. ఈ తతంగాన్ని మరో జర్నలిస్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లో ఇది వైరల్‌గా మారింది. పైగా అతని వినూత్న రిపోర్టింగ్ యధాతథంగా టీవీ బులిటెన్‌లో ప్రత్యక్షమైంది. దీన్ని వీక్షించిన నెటిజన్లు ‘బాబోయ్ ఈ జర్నలిస్ట్ మళ్లీ వచ్చేశాడ్రా బాబూ’ అని తలలు పట్టుకుంటూనే ఈ వీడియోలను చూసి సరదాగా నవ్వుకుంటున్నారు. తన వృత్తిలో కొత్తదనం చూపించాలనుకుంటాడో ఏమో కానీ అతను ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లోకి నిలుస్తూనే ఉంటాడు. గతంలో అతను గేదెలను ఇంటర్వ్యూ చేస్తూ వాటిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ తర్వాత కూడా అతను మరోసారి విచిత్రంగా వ్యవహరించాడు. ఓ గాడిదపై స్వారీ చేస్తూ అక్కడి ప్రేక్షకులతో సంభాషించాడు. ఇది చూసిన జనాలు ‘పిచ్చి పట్టినట్లుంది, అతన్ని ఎవరికైనా చూపించండ్రా’, ‘నీలా రిపోర్టింగ్ ఎవరూ చేయలేరు మహాప్రభో’ అంటూ రకరకాలుగా సెటైర్లు వేశారు. -
ప్రపంచ మీడియాకు హెడ్‌లైన్స్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని భారత మీడియా ఆకాశానికెత్తేస్తూ సోమవారం రోజంతా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఆర్టికల్ 370 రద్దుతో పరోక్షంగా ప్రభావం పడే పాకిస్తాన్ మీడియా మోదీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేక కథనాలు వండి వారుస్తోంది. ఈ అంశంపై ప్రపంచ మీడియా సంస్థలు ఎలా రిపోర్ట్ చేశాయో ఓసారి చూద్దాం. ది గార్డియన్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుందని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ది గార్డియన్ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌ను విభజించాలన్న నిర్ణయం కూడా నాటకీయ మైన ఎత్తుగడ అని తెలిపింది. ఈ నిర్ణయం తో పాకిస్తాన్ వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందంది. బీబీసీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం అత్యంత ముఖ్యమైన చర్యగా ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ అభివర్ణించింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఉద్రిక్తతలు రాజేసే అవకాశం ఉందంది. సీఎన్ఎన్: ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ చర్య కశ్మీరీలకు మానసికంగా పెద్ద షాక్ కలిగించిందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సీఎన్ఎన్ సంస్థ పేర్కొంది. భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆ రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపింది. ది వాషింగ్టన్ పోస్ట్: ‘కలహాలకు కొత్త వేదిక’అంటూ భారత ప్రభుత్వ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. భారత్‌లో కశ్మీర్ విలీనమవ్వడానికి ఆర్టికల్ 370 మూలమైందని పేర్కొంది. -
సర్వం శక్తిమయం
అఖిలానికి ‘అయ్య’ అయిన శంకరుని గురించి అలవోకగా శ్లోకాన్ని చెప్పబోతూ ఆది శంకరులవారు గలగలా నవ్వేశారట. దానిక్కారణం ఎక్కడెక్కడ అయ్య గురించి అలోచించినా అక్కడక్కడ అమ్మ మాత్రమే కనిపించడం! అందుకే ఆయన అమ్మ గురించి చెప్పదలచిన సౌందర్యలహరి ప్రారంభ శ్లోకంలో ‘శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చే దేవం దేవో న ఖలుః కుశలః స్పందితు మపి‘ అనేశాడు. (అమ్మతో కూడి ఉంటేనే అయ్య దేన్నైనా చేయ సమర్థుడౌతాడు. ఆమె లేకుంటే అసలాయన దేన్నీ చేయలేడు అని అర్థం). పోనీ ఆది శంకరులవారు అలా రాసారు అనుకున్నా, ‘నేను నేనే’ అని అయ్య ఏమైనా అన్నాడేమోనని వెతికి వెతికి చూస్తే ఆయనంతట ఆయన అననే అనేశాడు– ‘అంతా నిన్ను పెళ్లాడాకే సుమా! లేకపోతే నా మహిమేముంది?’ (భవాని! త్వత్పాణి గ్రహణ పరిపాటీ ఫలమిదమ్) అని. సరే బ్రహ్మగారేమైనా తన భార్య లేకుండా శక్తిమంతుడా అని అలోచిస్తే, ఆయన తన నాలుగు ముఖాల నుండీ నిరంతరం వేద గానాన్ని చేస్తూండడాన్ని బట్టి ఆయనంటూ ఒకరున్నారని లోకానికి తెలుస్తోంది కానీ అసలు బ్రహ్మ ఉనికికి కూడా కారణం ఆయనకున్న శక్తి (భార్య అయిన సరస్వతి) అనే అర్థమౌతోంది. ఇక శ్రీహరి మాట చెప్పేదేముంది? విష్ణుశక్తి మొత్తం లక్ష్మిదే కదా! ఆ శక్తి లేని పక్షంలో విష్ణుదర్శనానికి ఎవరొస్తారు? నిత్య కల్యాణమెక్కడ? పచ్చతోరణమెక్కడ? కాబట్టి ఏ బ్రహ్మకి శక్తి సరస్వతి ఔతోందో, ఏ విష్ణువుకి శక్తి లక్ష్మిగా కనిపిస్తోందో, ఏ శంకరునికి శక్తి పార్వతి మాత్రమే అని రుజువయిందో ఆ కారణంగా ‘శక్తి’ అంటే పురుషునికి సహకరించే భార్య అనీ, శక్తిపూజ (అమ్మవారి పూజ) చేయడం అంటే దంపతుల అన్యోన్యత కోసం చేయబడే పూజ అనీ, ఈ త్రిశక్తుల పూజ ఆశ్వయుజ మాసంలో నెలరోజుల పొడుగునా జరుగుతోందనీ గ్రహించాలి. అయితే ఈ త్రిశక్తుల్లో కూడా ఎవరు అత్యంత ముఖ్యం? అని ఆలోచించారు రుషులు. నెల మొదట్లో పది రోజులు పార్వతీదేవికి ఉత్సవాలు జరుగుతాయి. మూలా నక్షత్రం రోజున సరస్వతీ పూజ జరుగుతుంది. తర్వాత దీపావళి అమావాస్యనాడు లక్ష్మీపూజ. పౌరుషంలో శక్తి శక్తి అంటే అమ్మవారే అనుకున్నాం కదా. అమ్మ భండుడనే రాక్షసుణ్ణి వధించడానికి గజసైన్యం, అశ్వసైన్యం, రథబలం, పదాతి బలంతో బయల్దేరడమే కాకుండా తనకు సహాయకునిగా వచ్చిన వినాయకునితోపాటు, విఘ్నయంత్రాన్ని కూడా తీసుకెళ్లింది. ఇతర దేవతాయుధాలన్నింటినీ తనే ఒక్కొక్క చేతిలోనూ (మొత్తం ఇరవై చేతులు) ఉంచుకుని యుద్ధానికి తలపడింది. ఆమె రాక, ఆమె యుద్ధ ప్రణాళిక చూసి అందరూ కూడా దుర్గ (ఆమెను సమీపించలేం సుమా! గంతుం దుర్గమా) అన్నారు. గమనించవలసిన విషయం ఏమిటంటే అమ్మ తానింత పౌరుషంతో (పురుష లక్షణంతో) ఉన్నా కూడా తన భర్తని తక్కువ చేయకుండా భర్త అయిన కామేశ్వరుని పేరిట ఉన్న అస్త్రాన్ని ప్రయోగించి భండాసురుని రాజధానిని నాశనం చేసింది. తన విజయంలో ఆయన్ని కూడా భాగస్వామిగా ప్రకటించి లోకంలో స్త్రీలందరికీ మార్గదర్శకురాలయింది. ఆలోచనలో శక్తి ఏ రాక్షసుణ్ణి ఎలా వధించాలో అలా ఆలోచన చేయగలిగిన తల్లి ఆమె. ఒక్క బొట్టు రక్తం తన నుండి నేల పడినా తనలాంటి లక్షణాలున్న దుర్మార్గులు వేల సంఖ్యలో పుట్టాలనే వరాన్ని పొందిన రక్తబీజుణ్ణి వధించడానికి తన నాలుకని పృ«థివితో సమానంగా పెంచి దాని మీద వాణ్ని వధించింది. అలాగే సుందోపసుందుల్ని వధించేందుకు– మీలో ఎవరు బలిష్టులు? అని ప్రశ్నించి పరస్పరం చంపుకునేలా పథకం రచించింది. అలాగే హయగ్రీవుడనే రాక్షసుడు కోరిన వరానికి అనుగుణంగా శ్రీహరికి హయముఖం వచ్చేందుకై శ్రీహరి శిరస్సును ఖండింపజేసింది పరమ సాహసంతో. ఇలా సాహసోపేత విధానంతో రాక్షసవధని చేపట్టి మళ్లీ ఆ రాక్షస జాతితోనే శక్తి పూజలు చేయించుకున్న నేర్పరి అమ్మ. చక్రాల్లో శక్తి ప్రతి వ్యక్తికీ ఉండే సప్త చక్రాల్లోనూ, సప్త రూపాల్లోనే అమ్మ ఉంటుంది. లోకమంతా ఆమెని నాలుగు చేతులున్న రూపంతో ఊహిస్తుంది కానీ, ఆమె ప్రతి వ్యక్తి శరీరంలోని భాగంలోనూ ఉంటుంది. లోకంలో ప్రజలకు 1000 విధాల కష్టాలుంటాయని గ్రహించి, ఏ కష్టానికి ఏ నామం పఠిస్తే కష్ట నివారకమో చెప్తూ, అలాంటి వెయ్యి కష్టాలకీ వెయ్యి నామాలని కూర్పించి, ఆ నామాలకి శక్తి పెరిగేందుకై వాటన్నిటినీ ఒకేచోట ‘లలితా సహస్ర నామాలు’ అంటూ చేర్చి మననం చేసుకుంటూ ఉండవలసిందని చెప్తోంది అమ్మ. మహిషాసుర మర్ధిని కథ మహిషాసురుడు గొప్ప బలవంతుడు. అతనికున్న వరమహిమ అతన్ని మరింత బలవంతునిగా చేసింది. ఆ బలగర్వంతో మూడు లోకాలను జయించి విజయ గర్వంతో తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించసాగాడు. దేవతలను, ఋషులను, మానవులను క్రూరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక, భయంతో – బాధతో, మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను ( బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ) రక్షణ కల్పించమని వేడుకున్నారు. దేవతల, మునుల, మానవుల వేడుకోలుకు త్రిమూర్తులు కరిగిపోయారు. మహిషాసురుని మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఓ తేజస్సు ( అంటే ఒక వెలుగు – ఒక శక్తి అని అర్ధం ) పుట్టింది. దానికి ఒక రూపం ఏర్పడింది. ఆ తరువాత మూడుకోట్ల దేవతల కోపం, ఆవేశం ఈ తేజో రూపంతో కలిసి మరింత శక్తిమంతమైన ఆదిశక్తి అయింది. ఈ రూపాన్నే సర్వదేవతా స్వరూపం అంటారు. దేవతలందరూ తమతమ శక్తిని, ఆయుధాలను అమ్మకు యిచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని, శ్రీమహావిష్ణువు తన చక్రాన్ని, విశ్వకర్మ పరశువుని అంటే పదునైన గొడ్డలిని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను ఆ ఆదిపరాశక్తి కి ఆయుధాలుగా యిచ్చారు. హిమవంతుడు సింహాన్ని వాహనంగా సమర్పించాడు. సింహాన్ని వాహనంగా చేసుకొని పైన చెప్పిన ఆయుధాలను తీసుకొని వరుణుడు యిచ్చిన శంఖాన్ని వూదింది. ఆ శంఖ నాదశక్తికి తట్టుకోలేక రాక్షసులు తలకిందులయ్యారు మహిషాసురుడును అణిమాది అష్టసిద్ధుల సహాయంతో సింహరూపంలో దేవితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఖడ్గం, కత్తి చేపట్టి మానవ రూపంలోనూ యుద్ధం చేశాడు. మత్తగజంలా మారి ముట్టడించబోయాడు. చివరకు తన సహజ రూపమైన దున్నపోతు రూపంలో వాడి కొమ్ములతో దాడి చేశాడు. అమ్మ ఇక తన ఆగ్రహాన్ని అణచుకోలేక త్రిశూలంతో మహిషాసురుడి గుండెలు చీల్చి పారేసింది. రాక్షసుడు చచ్చిపోయాడు. ఆమె రౌద్ర రూపాన్ని చూసి దేవతలు అందరూ భయపడిపోయి, ఆమె ఆగ్రహాన్ని చల్లబరిచేందుకు అమెను అనేకవిధాలుగా స్తుతించారు. అలానే శంకరాచార్యులవారు మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని పాడారు అది మంచిగా గుర్తింపు ఉన్న పాట. నవరాత్రుల తరువాత ఈ రోజు మహిషాసుర మర్ధిని స్తోత్రం చదువుతారు. అమ్మ వారి ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే మహార్నవమిగా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించి, అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తిగా ఈ రోజు దర్శనం ఇస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి హోమం చెయ్యాలి. అమ్మవారికి ‘‘ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా’’ అనే మంత్రాన్ని జపించాలి. పూజానంతరం చిత్రాన్నం (పులిహోర), గారెలు, వడపప్పు, పానకం నివేదనం చెయ్యాలి. -
మహా మార్పు
జీవీఎంసీ కమిషనర్సత్యనారాయణను తప్పించిన సర్కారు పేరుకుపోయిన ఆరోపణల చిట్టా జేసీకి తాత్కాలిక బాధ్యతలు వుడా ఇన్చార్జిగా ఈపీడీసీఎల్ సీఎండీ సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ కమిషనర్ పోస్టు నుంచి సత్యనారాయణ ప్రభుత్వం తప్పిం చింది. ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి పోస్టింగ్ ఇచ్చేంత వరకు సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్టింగ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయన ఇప్పటి వరకు జీవీఎంసీ కమిషనర్‌తోపాటు, వుడా వీసీగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ రెండు స్థానాలూ ఖాళీ అయ్యాయి. కమిషనర్‌గా జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎం.జానకి ఫేజ్-3 మిడ్ కెరీర్ శిక్షణలో ఉన్నారు. ఆమె అక్టోబర్ 8న తిరిగి విధుల్లో చేరనున్నారు. ఆమె విధుల్లో చేరాక జేసీ ప్రవీణ్ కుమార్ నుంచి జీవీఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టేలా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వుడా వీసీగా ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఆరోపణలే కారణమా? 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎం.వి.సత్యనారాయణను 2012 ఆగస్టు 27న జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆరంభంలో పాలనాపరంగా కాస్త కఠినంగానే వ్యవహరించినప్పటికీ రాన్రానూ స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు లోనై పక్కదారిపట్టారన్న ఆరోపణలున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా పూర్తిగా ఓ మంత్రికే అనుకూలంగా వ్యవహరించడం కూడా మిగిలిన వారిలో ఆగ్రహానికి కారణమయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ వైఖరి మరింత పెరిగింది. మున్సిపల్ మంత్రితో జరిగిన సమీక్షా సమావేశంలో ఇదే విషయంపై టీడీపీకే చెందిన కొందరు ఎమ్మేల్యేలు బాహాటంగానే ఆరోపణలు గుప్పించారు. గాజువాక ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్లు కమిషనర్ తీరును ఎండగట్టారు. జీవీఎంసీ నీటి సరఫరా విభాగానికి చెందిన పర్యవే క్షక ఇంజినీరు(ఎస్ఈ) మరియన్న ఆరోపణలు కల్లోలం రేపాయి. కమిషనర్ రెండేళ్ల పాలనలో రూ.వందల కోట్ల బిల్లులు ప్రాధాన్యతతో పనిలేకుండా కమీషన్ల కోసం అడ్డగోలుగా చెల్లించినట్టు సమాచారహక్కు చట్టం(ఆర్టీఏ) ద్వారా సేకరించిన సమాచారాన్ని బయటపెట్టారు. కొన్నాళ్లుగా వివిధ విభాగాల్లో అవినీతి, అక్రమాలపై పత్రికల్లో వచ్చిన కథనాల్ని జోడించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. జీవీఎంసీ కాంట్రాక్టర్లు కొందరు కమిషనర్ అవినీతికి పాల్పడుతున్నారంటూ కోర్టులో కేసు దాఖలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమయింది. వీటితోపాటు ఓ మంత్రికే అనుకూలంగా వ్యవహరించడంతో టీడీపీకి చెందిన మరో మంత్రి ముఖ్యమంత్రి వద్ద ఈయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ ఫిర్యాదుల కారణంగానే ఆయన్ని బదిలీ చేసినా ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదని సమాచారం. ‘ప్రత్యూష’ కమిటీతో కొత్త నియామకాలు! ఐఏఎస్‌ల కేటాయింపుపై ప్రత్యూష సిన్హా కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ కమిటీ నివేదిక అమలైతే రాష్ట్రానికి ఐదుగురు ఐఏఎస్‌లను కేటాయించే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ కేటాయింపులు పూర్తయ్యాకే జీవీఎంసీకి, వుడాకు పూర్తి స్థాయి అధికారుల్ని కేటాయించనున్నట్టు తెలిసింది. జీవీఎంసీ కమిషనర్‌గా వచ్చేందుకు ఇప్పటికే కొందరు ప్రయత్నిస్తున్నారు. పంచాయితీరాజ్ కమిషనర్ వరప్రసాద్, అనంతపురం జేసీ సత్యనారాయణ, గతంలో విశాఖ జేసీగా పనిచేసిన గిరిజాశంకర్ పోటీలో ఉన్నట్టు సమాచారం. గతంలో ఈ స్థానానికి విజయనగరం కలెక్టర్‌గా పనిచేసిన వీరబ్రహ్మయ్య పేరు దాదాపు ఖరారైనప్పటికీ ఆయన్ని తెలంగాణాకు కేటాయించడంతో కొత్తవారు ప్రయత్నాలు మొదలెట్టారు. -
ముదురు పోలీసులు !
ఎస్పీనే బదిలీ చేయించేందుకు పూనుకున్న సీఐలు ‘ఎర్ర’ అక్రమాలు బట్టబయలవుతాయనే భయంతోనే.... సీఐల బదిలీల్లోనూ చక్రం తిప్పుతున్న వైనం... క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖ దారి తప్పింది. తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని దొర(ఎస్పీ)నే బదిలీ చేయించేందుకు కంకణం క ట్టున్నారు ‘అయ్య’గార్లు!. ఎర్రచందనం కేసుల వ్యవహారం కీలక దశలో ఉన్న తరుణంలో ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ బదిలీ వ్యవహారమే ఇందుకు సంబంధించిన కథాంశం. సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టులకు సంబంధించిన కేసులు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయి. 178మంది దాకా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 12మంది అంతర్జాతీయ దొంగ లు ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రధాన పాత్రధారులు వీరే. అరుుతే వీరిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ ప్రకటించినా, అందులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా అరె స్ట్ చేయాల్సిన దొంగలు 800 మంది దాకా ఉన్నారు. ఎర్రస్మగ్లర్ల నెట్వర్క్ ఎలా ఉంది ? దొంగలెవరు ? వారికి సహకరించిన పోలీసు అధికారులు ఎవ రు? అటవీశాఖ అధికారులు ఎంతమం ది ? వారి వెనుక ఉన్న రాజకీయనేతలు ఎవరు ? అనే వివరాలను ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ సాక్ష్యాలతో సేకరించి రిపోర్ట్ తయారు చేశారు. ఇందులో ఇద్దరు డీఎస్పీలతో పాటు సీఐలు, ఎస్ఐల పాత్ర కూడా ఉన్నట్లు ఎస్పీ తేల్చినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి చేరవేస్తారనే సమయంలో ఎస్పీ రామకృష్ణ బదిలీ ‘వార్త’ వినాల్సి వచ్చింది. బదిలీకి వీరే కారణమా? ఎస్పీ రామకృష్ణ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తే అందులో తమ పేర్లు కచ్చితంగా ఉంటాయని, ఉన్నాయని కొంతమంది సీఐలు తెలుసుకున్నారు. ఇదే జరిగితే సస్పెన్షన్, ప్రమోషన్లపై ప్రభావంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని బెంబేలెత్తిపోయారు. దీంతో ‘ఎర్ర’ వ్యవహారంలో హస్తమున్న కొంతమంది సీఐలు ఓ గ్రూపుగా ఏర్పడి తాము ఎలా భయటపడాలని చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో నేరుగా పరిచయమున్న ఓ సామాజిక వర్గానికి చెందిన సీఐలు చొరవ తీసుని నేరుగా సీఎంతోనే ఈ అంశాన్ని చర్చించినట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము పార్టీ కోసం, పార్టీ నేతలు, కార్యకర్తలను రక్షించామని, ఇప్పుడు తాము కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడాలని వేడుకున్నట్లు తెలిసింది. దీంతో సీఎం చంద్రబాబు కూడా సీఐల మాటలు ఆలకించి, వారిని కాపాడే చర్యల్లో భాగంగానే ఎస్పీపై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. దీని వెనుక చంద్రగిరి, కార్వేటినగరం, పాకాలలో పనిచేసి ప్రస్తుతం వేరేచోట కొనసాగుతున్నవారు ఉన్నట్లు తెలిసింది. వీరితో పాటు చిత్తూరు ఎస్పీ పరిధిలో పనిచేసి ప్రస్తుతం బయట ఉన్న మరో నలుగురు సీఐలు కూడా ఉన్నట్లు సమాచారం. సీఐల బదిలీల్లోనూ.... త్వరలో జరగబోయే సీఐల బదిలీల్లోనూ ఈ సీఐలే చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. వారు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు తమ అస్మదీయులకు కూడా ఆశించిన సర్కిల్ దక్కేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీలోని మంత్రుల అండతో వీరు డీవోల జారీలో తమదైన ‘ముద్ర’ వేయనున్నారని పోలీసులు జోరుగా చర్చించుకుంటున్నారు. దీంతో నే ఈ నెల 23న రావాల్సిన డీవోలు నెలాఖరుకు వాయిదా పడ్డాయని కూడా తెలుస్తోంది. చివరలో కొంత ఉత్కంఠ.. ఎస్పీ రామకృష్ణ బదిలీ ఆగిపోనుందని ప్రచారం జరిగింది. దీంతో ఆయన బదిలీ కోసం శ్రమించిన సీఐల వెన్నులో వణుకుపుట్టింది. అదే జరిగితే తమ పరి స్థితి ఏంటని మధనపడుతుండగా సోమవారం రాత్రి రామకృష్ణ రిలీవ్ అయ్యారు. దీంతో సీఐలదే పైచేయి అయ్యింది.