
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రూ.1,581.62 కోట్లతో 26 కొత్త సమీకృత జిల్లా కలెక్టరేట్, కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ఈ మేరకు అన్ని కలెక్టరేట్‌లకు ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచి నివేదికల ఆధారంగా భద్రత చర్యలు చేపడుతున్నారు. ప్రధాన ద్వారం ఎదు రుగా, ప్రహరీపైన, చుట్టూ ప్రత్యేక ఇనుప ముళ్లకంచెలను అధికారులు ఏర్పాటు చేస్తుండడంతో సమై క్యాంధ్రలో తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కార్యాలయంలోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
నిరసనలను అడ్డుకునేందుకేనా..?
ప్రభుత్వ విధానాలపై కొన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవడం సర్వసాధారణం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలనో, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలనో, ఏకపక్షంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనో బాధితులు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలకు పాల్పడుతుంటారు.
ఒక్కోసారి కలెక్టరేట్‌ను ముట్టడించి.. లోపలికి చొరబడి సమస్య తీవ్రతను చాటి చెప్పాలనుకుంటారు. దీంతో ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టేందుకు హనుమకొండ, జనగామలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎత్తయిన ప్రత్యేక ఇనుప కంచెలను నిర్మిస్తుండడం ప్రతిపక్షాలు, ఆందోళనకారుల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
కలెక్టర్ కార్యాలయాలకు ఇనుప ముళ్లకంచెలు.. మూడంచెల భద్రత
జనవరి 5న మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల రైతులు తమ కుటుంబ సభ్యులతో సహా భారీ ఎత్తున తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. వారంతా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయతి్నంచడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
నిజామాబాద్ కలెక్టరేట్‌లో జనవరి 30న నందిపేట గ్రామ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతితో కలసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. బిల్లులపై ఉప సర్పంచ్‌సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్లకుపైగా ఆగిపోయాయని వారు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం కలెక్టరేట్‌లో కలకలం రేపింది.
ఫిబ్రవరి 13న జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి నిమ్మల నర్సింగరావు, ఆయన భార్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యతి్నంచారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన ఈ దంపతులు.. తమ భూమిని తహసీల్దార్ ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టగా, పోలీసులు చాకచక్యంగా
అడ్డుకున్నారు.