
– సుమతి, ఐజీ, ఇంటెలిజెన్స్
ఎందుకంటే..
‘ఒక పొజిషన్ అచీవ్ చేయమనెప్పుడూ చెప్పలేదు మా నానమ్మ. అయితే ఒక పొజిషన్‌లో ఉంటే చేయగలమో చెప్పింది. మన పనులతో ఎంతమందిని ప్రభావితం చేయగలమో చెప్పింది. మా పేరెంట్స్, మా నాన్నమ్మ ఎప్పుడూ మమ్మల్ని అబ్బాయిలకు డిఫరెంట్ అని పెంచలేదు. అందుకే మేం వాళ్లతో ఈక్వల్ కాదనే భావన మాకెప్పుడూ రాలేదు. అమ్మ కానీ, నానమ్మ కానీ మాకు ఎక్కడ తగ్గాలో నేర్పారు.
అది మహిళలకున్న సహజగుణమని మేం గ్రహించేలా చేశారు. నిజానికి మనకు ఎక్కడ నెగ్గాలో తెలుస్తుంది. కానీ ఎక్కడ తగ్గాలో తెలియదు. అది తెలుసుకోవాలి. సహనం మనకున్న సహజమైన లక్షణం. దాన్నెందుకు కోల్పోవాలి మనం! అది మనకున్న ఆరా! దాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ నేను మా నానమ్మ, అమ్మ ద్వారే తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. సో నాకు వాళ్లే స్ఫూర్తి!’